లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు | Nifty ends above 9,950, Sensex gains over 100 pts; RIL gains for 5th straight day | Sakshi
Sakshi News home page

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Published Tue, Sep 5 2017 3:50 PM | Last Updated on Tue, Sep 12 2017 1:57 AM

Nifty ends above 9,950, Sensex gains over 100 pts; RIL gains for 5th straight day

ముంబై : యూరోపియన్‌ మార్కెట్ల నుంచి పాజిటివ్‌ సంకేతాలు, షార్ట్‌ కవరింగ్‌తో స్టాక్‌ మార్కెట్లు నిన్నటి నష్టాల నుంచి కోలుకున్నాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభంలో 31,809.55 వద్ద క్లోజైంది. నిఫ్టీ కూడా 39.35 పాయింట్ల లాభంలో 9950 మార్కును పునరుద్ధరించుకుని 9,952.20 వద్ద ముగిసింది. నార్త్‌ కొరియా టెన్షన్లు కొనసాగుతున్నప్పటికీ, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో కొనుగోళ్లు, ప్రధానంగా బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతు బాగా లభించింది. దీంతో స్టాక్‌ మార్కెట్లు లాభాల్లోకి ఎగిశాయి.
 
వరుసగా ఐదో రోజుల పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభాల్లో నడిచింది. రిలయన్స్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ స్టాక్స్‌ కూడా లాభాలు కురిపించాయి. యూరోపియన్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభం కావడం మార్కెట్లకు సహకరించింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలహీనపడి 64.11గా ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 19 రూపాయల నష్టంలో 30,086 రూపాయలుగా నమోదయ్యాయి.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement