రూ.2 వేల నోట్లు (ఫైల్ పోటో)
సాక్షి, ముంబై: డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయ ఆరు నెలల కనిష్టానికి పడిపోయింది. ప్రారంభ లాభాలనుంచి కిందికి పడి రూపాయి 6పైసలు నష్టపోయింది. ప్రస్తుతం 11పైసలు క్షీణించి 65.60 వద్ద ట్రేడ్ అవుతోంది. వాణిజ్యలోటు పెరిగిపోతున్న నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి విలువ తగ్గుముఖం పట్టిందని డీలర్లు చెప్పారు. మరోవైపు దేశీయంగా ఏటీఎంలలో నగదు కొరత నేపథ్యంలో సెంటిమెంట్ దెబ్బతిందని మార్కెట్ వర్గాలు అంచనావేశాయి. అటు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో డాలర్‌కు డిమాండ్ పెరిగింది. సోమవారం రూపాయి 65.44 వద్ద ముగిసింది.
అటు దేశంలో నెలకొన్న నగదు కొరత సంక్షోభంపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. నగదుకొరత సమస్యను సమీక్షించామనీ, త్వరలోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చామని ట్విటర్ ద్వారా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment