US dollar
-
సుంకం విధిస్తే దాన్ని మళ్లీ డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీలోనే చెలిస్తారట సార్!
-
జారుడుబల్లపై రూపాయి
వరుసగా రెండో రోజు దేశీ కరెన్సీ పతనమైంది. డాలరుతో మారకంలో తాజాగా 12 పైసలు నీరసించింది. 84.72 వద్ద ముగిసింది. వెరసి రెండో రోజూ సరికొత్త కనిష్టం వద్ద స్థిరపడింది. గత వారాంతాన సైతం 13 పైసలు నష్టపోయి 84.60 వద్ద నిలిచింది. జూలై–సెపె్టంబర్లో దేశ జీడీపీ వృద్ధి 5.4 శాతానికి మందగించడం, బ్రిక్ దేశాలపై యూఎస్ టారిఫ్‌ల విధింపు అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ప్రభావం చూపినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి.ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో కొద్ది రోజులుగా డాలరు బలపడుతున్న నేపథ్యంలో రూపాయి విలువ కోల్పోతూ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 84.59 వద్ద ప్రారంభమైంది. తదుపరి 84.73వరకూ క్షీణించింది. అంతర్జాతీయంగా డాలరు ఇండెక్స్ 0.5 శాతం పుంజుకొని 106.27 వద్ద కదులుతోంది. -
హమాస్ చీఫ్ బంకర్ చూస్తే షాక్ అవాల్సిందే.. భారీగా డబ్బు..
హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో మృతి చెందారు. తాజాగా ఆయనకు సంబంధించిన రహస్య బంకర్ వీడియోను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గాజాలోని ఖాన్ యూనిస్ ఉన్న ఈ బంకర్లో వంటగది సామాగ్రి, పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ పంపిణీ చేసిన సహాయక సమాగ్రి, మిలియన్ డాలర్ల భారీ నగదు, పెర్ఫ్యూమ్, వ్యక్తిగత షవర్ ఉన్నాయి. ఈ వీడియో ఫిబ్రవరి నెలకు సంబంధించినదిగా తెలుస్తోంది.ఇక.. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడికి సిన్వార్ సూత్రధారి. ఆయన రఫాకు పారిపోయే ముందు ఈ బంకర్లోనే కొన్నిరోజులు గడిపినట్లు తెలుసోంది. ఇస్మైల్ హనియే హత్య అనంతరం ఇజ్రాయెల్ సైన్యం సిన్వార్‌ను అంతం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే అక్టోబర్ 16న జరిపని దాడుల్లో సిన్వార్ మృతి చెందారు.Hamas' eliminated leader Yahya Sinwar was hiding in this underground tunnel months ago:Surrounded by UNRWA bags of humanitarian aid, weapons and millions of dollars in cash.He hid like a coward underground, using the civilians of Gaza as human shields. pic.twitter.com/0ylVjTCv7H— Israel ישראל (@Israel) October 20, 2024 ‘‘హమాస్ నుంచి తొలగించబడిన నేత యాహ్యా సిన్వార్ కొన్ని నెలల క్రితం ఈ భూగర్భ సొరంగంలో దాక్కున్నారు. మానవతా సహాయం, ఆయుధాలు, మిలియన్ల డాలర్ల నగదుతో ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) బ్యాగులు ఉన్నాయి. ఆయన గాజా పౌరులను కవచాలుగా ఉపయోగించుకొని, పిరికివాడిలా భూగర్భంలో దాక్కున్నారు’’ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఎక్స్‌లో వీడియోను విడుదల చేసింది.Hamas leader Yahya Sinwar’s wife reportedly spotted with $32,000 Birkin bag as she went into hiding https://t.co/Dwqf0h7nTQ pic.twitter.com/JHZ5eMrYiZ— New York Post (@nypost) October 20, 2024 ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం అక్టోబర్ 7 దాడికి ఒక రోజు ముందు యాహ్యా సిన్వార్ బంకర్ గుండా వెళుతున్నట్లు చూపించే వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఫుటేజీలో.. హమాస్ నాయకుడు సిన్వార్ తన కుటుంబంతో కలిసి బ్యాగులు, సామాగ్రిని చేతిలో పట్టుకుని నడుస్తున్నట్లు దృష్యాలు కనిపించాయి. సిన్వార్ భార్య సొరంగంలోకి పారిపోతున్నప్పుడు 32వేల అమెరికన్ డాలర్ల(సుమారు రూ. 27 లక్షలు) విలువైన ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌ని తీసుకువెళ్లిన దృష్యం కనిపించింది.చదవండి: అక్టోబర్‌లో దాడులకు ముందు సిన్వర్ ఇలా.. -
రూపాయి భారీ పతనానికి కారణాలు
రూపాయి రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోతుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారక విలువ 84.07 వద్ద ట్రేడవుతుంది. అందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా డాలర్లను విక్రయించే అవకాశం ఉందని సమాచారం.ఎకానమీలోని అస్థిరతను నిరోధించడానికి సెంట్రల్ బ్యాంకులు ఎప్పటికప్పుడు కరెన్సీ మార్కెట్లో జోక్యం చేసుకుంటాయని పలుమార్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఉద్ఘాటించారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ కనిష్ఠ స్థాయులను చేరుతుంది. దాంతో దేశీయంగా ఉన్న డాలర్ రిజర్వ్‌లను విక్రయించి రూపాయి విలువను స్థిరపరిచేలా చర్యలు తీసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ వద్ద భారీ స్థాయిలో డాలరు నిల్వలుండడం ఊరటనిచ్చే అంశమే. కానీ చైనా మార్కెట్లపై ఆసక్తి పెరగడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుని అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు పెరగడంతో ఇటీవల 70 డాలర్లకు చేరిన బ్రెంట్ ముడి చమురు ధర క్రమంగా పెరిగింది. ప్రస్తుతం అది 80 డాలర్లకు దగ్గర్లో ఉంది. నవంబర్‌లో అమెరికా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తర్వాత వచ్చే ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందోననే అనుమానంతో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు అధికమవుతున్నట్లు కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో చమురు ధరలు ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ప్రభావం ఇలా..రూపాయి బలహీనతల వల్ల దేశ దిగుమతి బిల్లులు (ముఖ్యంగా చమురు) పెరుగుతాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేందుకూ ఇది కారణంగా నిలవవచ్చు. అయితే ఆర్బీఐ జోక్యం వల్ల రూపాయి ట్రేడింగ్‌లో ఊగిసలాటలు తగ్గే అవకాశం ఉంది. అంతే తప్ప రూపాయి విలువను నిర్ణయించలేరని అభిప్రాయం ఉంది.కారణాలివే..1. మన రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్ అధికం. భారత ‘కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు.2. ముడిచమురు ధర 79 డాలర్లకు చేరింది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది.3. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై భిన్న అభిప్రాయాలు ఉంటుండడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి. దానికితోడు చైనా మార్కెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తుండడం కూడా ప్రధాన కారణంగా ఉంది.4. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఇప్పటి వరకు వడ్డీరేట్లను పెంచిన సెంట్రల్ బ్యాంకులు ఇటీవల వాటిని తగ్గించాయి. భారత్‌లో మాత్రం ఆర్బీఐ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది కొంత కలొసొచ్చే అంశమే అయినా జపాన్, చైనా మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణగా తోస్తున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లోని మదుపులను ఉపసంహరించి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..ఏం చేయాలంటే..దేశీయంగా ఉత్పాదకతను పెంచి భారీగా ఎగుమతి చేసే దశకు చేరితే తప్ప ఈ పరిస్థితులు మారవని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తాత్కాలికంగా అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలిస్తే రూపాయి విలువ కొంత పెరిగే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలికంగా రూపాయికి ప్రపంచంలో ప్రత్యేక స్థానం కలిగించాలంటే మాత్రం దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. -
సౌదీ అరేబియా నిర్ణయం.. డాలర్ ఆధిపత్యానికి ఎసరు!
యూనైటెడ్ స్టేట్స్తో సౌదీ అరేబియా 50 సంవత్సరాల పెట్రో-డాలర్ ఒప్పందం ఈ ఏడాది జూన్ 9తో ముగిసింది. ఈ ఒప్పందాన్ని ఇక పునరుద్ధరించరాదని సౌదీ అరేబియా నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాలను చూపుతోంది.1974 జూన్ 8న యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియా సంతకం చేసిన ఈ భద్రతా ఒప్పందం రెండు ఉమ్మడి కమిషన్లను ఏర్పాటు చేసింది. ఒకటి ఆర్థిక సహకారం మరొకటి సౌదీ అరేబియా సైనిక అవసరాల కోసం ఏర్పాటు చేశారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య మరింత సన్నిహిత సహకార శకానికి నాంది పలికింది. ఇది సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని పెంచడానికి ప్రేరేపిస్తుందని అప్పట్లో అమెరికా అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. వాషింగ్టన్, ఇతర అరబ్ దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి దీన్ని ఒక బ్లూప్రింట్ గా భావించారు.సౌదీ అరేబియా నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక నమూనా మార్పును సూచిస్తుంది. పెట్రోడాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తుంది. ప్రత్యామ్నాయ కరెన్సీలకు తలుపులు తెరుస్తుంది. పెట్రోడాలర్ ఒప్పందం ముగింపు ప్రభావాలు ఇవే..యూఎస్ డాలర్ కాకుండా చైనీస్ ఆర్ఎంబీ, యూరోస్, యెన్, యువాన్ వంటి ఇతర కరెన్సీలలో చమురు అమ్మకాలను అనుమతించడం ద్వారా సౌదీ అరేబియా పెట్రోడోలార్ వ్యవస్థ నుంచి దూరంగా వెళుతోంది. 1972లో ఏర్పాటైన ఈ వ్యవస్థ చమురు లావాదేవీలను ప్రత్యేకంగా అమెరికా డాలర్ తో ముడిపెట్టింది. ఇప్పుడు చమురు వాణిజ్యంలో ఇతర కరెన్సీలు ప్రాముఖ్యతను పొందుతాయి.పెట్రోడాలర్ వ్యవస్థ చాలాకాలంగా యూఎస్ డాలర్ ప్రపంచంలో ప్రాథమిక రిజర్వ్ కరెన్సీ హోదాకు మద్దతు ఇస్తోంది. సౌదీ అరేబియా వైవిధ్యీకరణ యూఎస్ డాలర్ స్థానాన్ని బలహీనపరుస్తుంది. ఇది ప్రపంచ వాణిజ్యం, నిల్వల కోసం ఇతర కరెన్సీల వాడకాన్ని పెంచడానికి దారితీస్తుంది. సౌదీ అరేబియా ప్రత్యేక డాలర్ లావాదేవీలకు దూరంగా ఉండటంతో డాలర్ కు డిమాండ్ తగ్గవచ్చు. ఇది దాని మారకం రేటు, ప్రపంచ కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తుందిసౌదీ అరేబియా "పెట్రోయువాన్" వైపు అడుగులు వేస్తే, అది డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీస్తుంది అంతర్జాతీయ వాణిజ్యంలో యువాన్ పాత్రను పెంచుతుంది.సౌదీ అరేబియా బిట్ కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలను ప్రోత్సహించడం చెల్లింపు పద్ధతులను మరింత వైవిధ్యపరుస్తుంది. ఇది సాంప్రదాయ కరెన్సీలను ప్రభావితం చేస్తుంది. -
కొత్త సంవత్సరంలో రూపాయి దారెటు?
ఇండియన్ రూపాయి సుమారు పదేళ్లపాటు అంతర్జాతీయ మార్కెట్లో ప్రజలను, పాలకులను ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చింది. గ్లోబల్, దేశీయ పరిస్థితులు 2013లో రూపాయి పతనానికి దారితీశాయి. నాటి నుంచి ఇంచుమించు స్థిరంగా కొనసాగిన భారత కరెన్సీ- ఈసారి అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తీవ్ర ఆటుపోట్లకు గురైంది. 2021 నుంచి దాదాపు 12 శాతం నష్టపోయింది. అయితే 2023లో దాదాపు కన్సాలిడేషన్‌లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి కొంతకాలంగా పతనమవుతూ వచ్చింది. డాలరు బలపడటం, ముడిచమురు ధరలు విపరీతంగా పెరగడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి తరలిపోవడమే ఇందుకు ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వు 2023లో వడ్డీరేట్లను మొదట్లో కొంతమేర పెంచినా తదుపరి వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని సానుకూలంగా స్పందించింది. భారత దిగుమతుల్లో అత్యధికం ముడిచమురే కావడంతో, పెరిగిన ధరల కారణంగా వాణిజ్యలోటు ఏర్పడింది. మదుపరులు ఈక్విటీ, రుణాల రూపంలో ఉన్న విదేశీ ప్రైవేటు పెట్టుబడులను డాలర్లలోకి మార్చుకోవడంతో రూపాయి విలువ పడిపోయింది. దాంతో తీవ్ర ఒత్తిడికి గురైంది. నవంబర్ చివరి నుంచి డిసెంబర్ నెలలో మార్కెట్లు జీవితకాల గరిష్ఠాల్లోకి చేరుకోవడంతో తిరిగి ఎఫ్ఐఐలు మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా నెల రోజుల నుంచి రూపాయి కన్సాలిడేషన్‌లో ఉంది. రూపాయి పతనానికి ఈ ఏడాదిలో కొంత విరామం లభిస్తుందన్నది ఆర్థిక నిపుణుల అంచనా. గతంలో మన కరెన్సీ పతనానికి దారితీసిన పరిస్థితుల తీవ్రత 2024లో అంతగా ఉండకపోవచ్చు. భారత్ తన చమురు అవసరాలకు సుమారు 85శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. నిజానికి ముడిచమురు వినియోగం దేశ ఆర్థికప్రగతికి చిహ్నం. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టడం దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. మన చమురు దిగుమతులు దేశ మొత్తం దిగుమతుల్లో 30శాతం వరకు ఉన్నాయి. తగ్గనున్న కరెంటు ఖాతా లోటు.. భారత కరెంటు ఖాతాలో సింహభాగం సాఫ్ట్వేర్ ఎగుమతులు, ప్రైవేటు బదలాయింపులదే. భవిష్యత్తులో ఈ రెండింటి వాటా ఇంకా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. దిగివస్తున్న ముడిచమురు ధరలతో వస్తు వాణిజ్యలోటు తగ్గుముఖం పట్టడం; సాఫ్ట్వేర్, ప్రైవేటు బదలాయింపులు పెరగడం- కరెంటు ఖాతా లోటును కొంతవరకు పరిష్కరించగలుగుతాయి. కొత్త ఏడాదిలో ముఖ్యంగా ముడిచమురు వాణిజ్య లోటు తగ్గడం, కరెంటు ఖాతా లోటు సన్నగిల్లడం, విదేశీ పెట్టుబడుల రాక వంటి బలమైన ఆర్థిక పరిస్థితులు రూపాయిని బలోపేతం చేస్తాయని చెప్పవచ్చు. మాంద్యం ప్రభావం ఇలా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మాంద్యం పరిస్థితులతో కొన్ని దేశాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాదిలో మాంద్యం మరింత తీవ్రంగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2023లో ప్రపంచ వృద్ధిరేటు 3 శాతం. 2024లో ఇది 2.9 శాతానికి పడిపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) గతంలో వెల్లడించింది. ఈలోగా డాలరు సాధారణంగానే బలపడుతుంది. 2001 మాంద్యం సమయంలో డాలరు సూచీ ఆ ఏడాది జనవరిలో 108గా ఉండగా జులై నాటికి 121కు పెరిగి, ఆ తరవాత తగ్గింది. అలాగే 2008-09 మాంద్యం కాలంలో డాలరు సూచీ 71 నుంచి 89కు ఎగబాకి ఆ తరవాత కిందికి వచ్చింది. అంటే సాధారణంగా మాంద్యం సమయంలో డాలరు తొలుత బలపడి, తరవాత బలహీనపడుతుంది. ఇదీ చదవండి: ఏడాదిలో రూ.81.90 లక్షల కోట్ల సంపద.. ఎక్కడంటే.. మిగతా దేశాలపై ఉన్నట్లే ఒకవేళ భారత్‌పైనా మాంద్యం ప్రభావం ఉంటుందని భావించినా- మాంద్యం మధ్యకాలం నుంచి విదేశీ పెట్టుబడులు భారత్‌లో విశేషంగా ప్రవహించి ఆ ప్రవాహం కొన్నాళ్లు కొనసాగుతుందని చరిత్ర చెబుతోంది. 2008-09 సంక్షోభ సమయంలో భారత్ నుంచి 1200 కోట్ల డాలర్ల మేర ఈక్విటీ వెనక్కి తరలిపోయింది. 2009లో మార్చి-జూన్ మధ్య మాంద్యం తిరోగమనం పట్టడంతో తిరిగి ఈక్విటీ రూపంలో పెట్టుబడులు భారత్‌లోకి రావడం మొదలయ్యాయి. అదే ఏడాది మార్చి- డిసెంబరు కాలంలో 1800 కోట్ల డాలర్ల మేర విదేశీ పెట్టుబడులు భారత్‌లోకి వచ్చాయి. దీన్ని బట్టి మాంద్యం తీవ్రరూపం దాల్చినా స్వల్పకాలమే ఉంటుందని చెప్పవచ్చు. -
అమ్మకాల ఒత్తిడి కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ అమ్మకాల ఒత్తిడి కొనసాగొచ్చని నిపుణులు భావిస్తున్నారు. క్రూడాయిల్ ధరల పెరుగుదల, యూఎస్ డాలర్ ఇండెక్స్ బలపడటం, బాండ్లపై అధిక దిగుబడులతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచవచ్చంటున్నారు. ఫ్యూచర్ ఆప్షన్ డెరివేటివ్‌ల ముగింపు గురువారం కావడంతో ఒడుదుడుకులు కొనసాగొచ్చు. ఎఫ్అండ్ఓ ముగింపు మినహా దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేనందున ప్రపంచ మార్కెట్ల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదిలికలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలింవచ్చంటున్నారు. ‘‘అమెరికా ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను మరింత కాలం గరిష్ట స్థాయిలో కొనసాగించే అవకాశం ఉన్నందున ఈక్విటీలపై రిస్క్ తీసుకొనే సామర్ధ్యం తగ్గింది. మార్కెట్లో బలహీనతలున్నందున, ఇన్వెస్టర్లు రక్షణాత్మక రంగాలు, లార్జ్ క్యాప్ షేర్లలో పెట్టుబడులు ఉత్తమం. నిఫ్టీ గతవారం కీలక మద్దతు 19,850–19,900 శ్రేణిని కోల్పోయి, 19,674 స్థాయి వద్ద స్థిరపడింది. తదుపరి మద్దతు 19,500–19,400 పాయింట్ల పరిధిలో ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ఫెడ్ రిజర్వ్ కఠిన ద్రవ్య విధాన వైఖరి అమలు వ్యాఖ్యలు, ఎఫ్ఐఐల నిరంతర విక్రయాలు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర అధిక వెయిటేజీ షేర్లలో దిద్దుబాటు, బలహీన ప్రపంచ సంకేతాల పరిణామాల నేపథ్యంలో గతవారం స్టాక్ సూచీలు దాదాపు 3% క్షీణించాయి. సెన్సెక్స్ 1830 పాయింట్లు, నిఫ్టీ 518 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ప్రపంచ పరిణామాలు అమెరికా గృహ అమ్మకాల డేటా మంగళవారం విడుదల కానున్నాయి. యూరోజోన్ ఈసీబీ పాలసీ మినిట్స్ బుధవారం, అదే రోజున చైనా పారిశ్రామికోత్పత్తి, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య పాలసీ సమావేశం జరగనుంది. అమెరికా రెండో త్రైమాసిక వృద్ధి గణాంకాలు, ఈసీజీ సర్వసభ్య సమావేశం, చైనా కరెంట్ ఖాతా గురువారం వెల్లడి కానున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం ఫెడ్ చైర్మన్ పావెల్ ప్రసంగం ఉంది. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం సెపె్టంబర్ సీరీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్(ఎఫ్అండ్ఓ) డెరివేటివ్‌ల ముగింపు జరగనుంది. ఒకవేళ నిఫ్టీ ఈ సిరీస్‌ను నష్టాలతో ముగిస్తే వరుసగా రెండో వారమూ నష్టాల ముగింపు అవుతుంది. ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో ఎఫ్ఐఐల లాంగ్ ఎక్స్పోజర్ 47% తగ్గింది. పుట్–కాల్ రేషియో 0.93 ఓవర్‌సోల్డ్ జోన్ వైపు కదలుతోంది. మూడు వారాల్లో రూ.10 వేల కోట్లు వెనక్కి భారత ఈక్విటీలను విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. మన మార్కెట్ల నుంచి ఈ సెప్టెంబర్ తొలి మూడు వారాల్లో ఎఫ్ఐఐలు రూ. 10,000 కోట్లకు పైగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అమెరికాలో ఈసారి వడ్డీ రేట్ల పెంపు ఆందోళనలు, మాంద్యం భయాలు, దేశీయంగా కంపెనీల షేర్లు ప్రీమియంలో ఉండటం వంటి అంశాలు అమ్మకాలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా బాండ్లపై అధిక దిగుబడులు, డాలర్ ఇండెక్స్ బలపడటంతో రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల కొనసాగొచ్చంటున్నారు. గడిచిన ఆరు నెలల్లో మార్చి నుంచి ఆగష్టు మధ్య ఎఫ్‌పీఐలు వరుసగా కొనుగోళ్లను కొనసాగించారు. ఈ మధ్యకాలంలో మొత్తం రూ. 1.74 లక్షల కోట్లను విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారు. ‘‘భారత ఆర్థిక వృద్ధిలో అవకాశాలు, షేర్లు ఆకర్షణీయంగా ఉండటం, ప్రభుత్వ సంస్కరణలు విదేశీ పెట్టుబడులకు మద్దతిస్తున్నాయి. ఇటీవల కొంత అమ్మకాల ధోరణి కనిపించినప్పటికీ వచ్చే నెలలో విదేశీ పెట్టుబడులు తిరిగి ఈక్విటీల్లోకి వస్తాయి’’ క్రేవింగ్ ఆల్ఫా మేనేజర్ మయాంక్ మెహ్రా విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వారంలో మూడు ఐపీఓలు సెకండరీ మార్కెట్ అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్న తరుణంలో ప్రాథమిక స్ట్రీట్ జోరు కనబరుస్తుంది. జేఎస్‌డబ్ల్యూ ఇ్రన్ఫాస్ట్రక్చర్, అప్డేటర్ సరీ్వసెస్ ఐపీఓలు ఈ నెల 25–27 తేదీల మధ్య జరగనున్నాయి. వాలియంట్ ల్యాబొరేటరీస్ పబ్లిక్ ఇష్యూ సెపె్టంబర్ 27న మొదలవుతుంది. కాగా గతవారంలో ప్రారంభమైన వైభవ్ జువెలర్స్ సెప్టెంబర్ 26న ముగిస్తుంది. వీటితో పాటు మరో 13 చిన్న, మధ్య తరహా కంపెనీలు మొత్తం రూ.4,000 కోట్లు సమీకరించనున్నాయి. -
ఏం పిల్లలండీ బాబు..! స్కూల్ జైల్ అట! ఏకంగా అమ్మేసేందుకు ప్లాన్
స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేకపోతే.. ఏదో ఓ కారణం చెప్పి పిల్లలు బడి ఎగ్గొట్టేస్తారు. పోనీ టీచర్ చదువులు చెప్పకపోతే కంప్లైంట్ చేస్తారు. అదీ కాకపోతే మౌళిక సదుపాయాలు సరిగా లేకపోతే అమ్మనాన్నలకు చెబుతారు. కానీ అమెరికాలో ఓ స్కూల్ పిల్లలు చేసిన పనికి అందరూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఈ పిల్లలు చేసిన పనేంటంటే..! అమెరికాలోని మేరీలాండ్‌లో మీడే సీనియర్ హై స్కూల్ అనే పేరు గల పాఠశాల ఉంది. ఇందులో పిల్లలకు ఏం అనిపించిందో తెలియదు కానీ స్కూల్‌నే అమ్మకానికి పెట్టారు. స్థానిక రియల్ ఎస్టేట్ వెబ్సైట్ 'జిల్లో'లో రూ.34.7లక్షలకు బేరం పెట్టారు. 12,458 గజాల స్కూల్ బిల్డింగ్ 'సగం పని చేసే జైల్' గా పేర్కొని లిస్టింగ్ చేశారు. ఈ జైళ్లో 15 బాత్రూమ్లు, ప్రత్యేకమైన కిచెన్, ప్రైవేట్ బాస్కెట్ బాల్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంతేకాదు అక్కడక్కడ సగం నిర్మాణంలో ఉన్న గోడలు ప్రాణాలను తీస్తాయని తెలిపారు. ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాతపూర్వకంగా వెబ్సైట్లో తెలిపారు. ఈ వినూత్నమైన లిస్టింగ్‌ను చూసి తాము ఆశ్చర్యపోయినట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలిపారు. ఇంత మంచి ఆస్తిని ఇంత తక్కువకు అమ్ముతున్నారేంటని ఆశ్చర్యపోయినట్లు వెల్లడించారు. కొనుగోలుదారులు ఇలాంటి అవకాశాలను వదలుకోబోరని తెలిపారు. పిల్లలు చేసిన కొంటె పనితో స్కూల్ యాజమాన్యానికి చెమటలు పట్టినంత పనైంది. లిస్టింగ్ చేసిన కొద్ది గంటల్లోనే వెబ్సైట్ నుంచి ఆ లిస్టింగ్‌ను తొలగించినట్లు తెలిపింది. తమ పిల్లలు క్రియేటివిటీకి ఆశ్చర్యపోయినప్పటికీ.. మరీ ఇంత తక్కువ డబ్బులకు లిస్టింగ్ చేయడం వింత కలిగించిందని ఓ ఉపాధ్యాయుడు చిరునవ్వుతో తెలిపారు. ఇదీ చదవండి:ఓడిపోయాడని ముందు మందు బాటిళ్లు.. ప్రాణాలు తీసిన ఆన్లైన్ గేమ్.. ఎంత తాగాడో తెలుసా? -
డాలర్ కోటకు బీటలు! బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి....
బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ! సైనిక, ఆర్థిక దండోపాయాలతో ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్న అమెరికా ప్రస్తుత పరిస్థితి ఇది. తన మాట వినని దేశాలపై ఆంక్షల కొరడాతో, డాలర్ అనే ఆయుధంతో, లేదంటే మిస్సైళ్ల మోతతో చెలరేగుతున్న అమెరికా కోరలు పీకేందుకు దండయాత్ర మొదలైంది. ఇదేదో మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయిందనుకుంటున్నారా? అదేమీ లేదు కాని, ఇన్నాళ్లూ ఏ డాలర్ అండ చూసుకొని అమెరికా విర్రవీగిందో, సరిగ్గా ఆ కుంభస్థలంపై కొట్టేందుకు అనేక దేశాలు చీమలదండులా కదం తొక్కుతున్నాయి. దాదాపు 80 ఏళ్లుగా ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా రాజ్యమేలుతున్న డాలర్ కోటను బద్దలుగొట్టేందుకు కరెన్సీ వార్‌కు తెరతీశాయి. రష్యాపై ఎడాపెడా ఆంక్షలు విధించి, వేల కోట్ల డాలర్ల ఆస్తులను సీజ్ చేసిన అమెరికా, అలాగే పశ్చిమ దేశాలు భవిష్యత్తులో తమపైనా ఇలాంటి అస్త్రాన్ని ప్రయోగిస్తే దిక్కేంటంటూ మేల్కొంటున్నాయి. డాలర్ కరెన్సీ నిల్వలతో పాటు డాలర్లలో వాణిజ్యానికి నో చెబుతున్నాయి. రష్యా, చైనాతో సహా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని పలు దేశాలు అంతర్జాతీయ వాణిజ్యంలో తమ సొంత కరెన్సీలను మాత్రమే ఉపయోగిస్తామని ఇప్పటికే ప్రకటించాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే సమీప భవిష్యత్తులోనే డాలర్‌తోపాటు అమెరికా ఆధిపత్యానికి చెల్లుచీటీ తప్పదంటున్నారు విశ్లేషకులు. అసలు డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఎందుకు చలామణీలో ఉంది? డాలర్‌ను వదిలించుకోవడానికి ప్రపంచమంతా పరుగులు తీయడానికి కారణమేంటి? నిజంగా డాలర్ కుప్పకూలుతుందా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతుందో తెలియాలంటే ఈ కథ చదవాల్సిందే! డాలర్‌కు లోకం దాసోహం! అన్ని దేశాలకూ తమ సొంత కరెన్సీలు ఉన్నా, లోకమంతా డాలర్ల వెంటే పరిగెడుతోంది. కేవలం అంతర్జాతీయ వాణిజ్యంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ లావాదేవీల్లో అత్యధిక శాతం డాలర్లలోనే జరుగుతాయి. ప్రపంచంలోని ఏ మారుమూలకెళ్లినా డాలర్ చెల్లుతుంది. డాలర్‌కు అత్యధికంగా స్టోర్ వేల్యూ ఉండటం వల్ల అన్ని సెంట్రల్ బ్యాంకులు తమ మెజారిటీ విదేశీ కరెన్సీ (ఫారెక్స్) నిల్వలను డాలర్లలోనే కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్ వెలుగొందుతోంది. (ఎయిర్‌లాండర్ ఎగిరితే.. పెద్ద ఓడ గాల్లో తేలిపోతున్నట్లే!) అంతర్జాతీయంగా డాలర్లు కుప్పలుతెప్పలుగా చలామణీలో ఉండటం వల్ల అమెరికాలో వడ్డీరేట్లు కృత్రిమంగా ఎప్పుడూ కనిష్ఠ స్థాయిల్లోనే కొనసాగేందుకు తోడ్పడింది. ఈ చౌక డబ్బుతో అక్కడి ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, ఇళ్లు, కార్లు, ఇలా సకల సౌకర్యాలను ఆ దేశ పౌరులు అనుభవిస్తూ వచ్చారు. అంతేకాదు, అక్కడి ఎకానమీ పరుగులకు; సూపర్ పవర్‌గా అవతరించి, ప్రపంచ పోలీసుగా వ్యవహరించడానికి ఈ డాలర్ దన్నే కారణం. అమెరికా ప్రభుత్వాలు భవిష్యత్తు పరిణామాలను పట్టించుకోకుండా లక్షల కోట్ల డాలర్లను ప్రింట్ చేయడం ద్వారానే ఇదంతా సాకారమైంది. ప్రపంచ రిజర్వ్ కరెన్సీ అవ్వడం వల్ల డాలర్‌ను కంట్రోల్ చేయగలమన్న ధీమాతో ఎడాపెడా డాలర్ ప్రింటింగ్ చేసిన అమెరికా అప్పులకుప్పగా మారింది. 2022 నాటికి మొత్తం యూఎస్ అప్పు 31.5 ట్రిలియన్ డాలర్లు (జీడీపీతో పోలిస్తే 120 శాతం పైనే). ఈ డాలర్ అండతోనే వియత్నాం, ఇరాక్, అఫ్గానిస్తాన్, లిబియా, సిరియా ఇలా అనేక దేశాలను యుద్ధాలతో నేలమట్టం చేసిన అమెరికాకు చివరికి అప్పులతిప్పలు మిగిలాయి. 25 ఏళ్ల క్రితం ప్రపంచ రిజర్వ్ కరెన్సీలో 72 శాతంగా ఉన్న డాలర్ వాటా ప్రస్తుతం 59 శాతానికి దిగొచ్చింది. ఇప్పుడు రష్యా, చైనాతో నేరుగా కయ్యానికి కాలుదువ్వుతున్న అగ్రరాజ్యానికి గూబ గుయ్యిమంటోంది. యుద్ధభూమిలోనే కాదు ఆర్థిక చదరంగంలోనూ తామేంటో రుచి చూపిస్తున్నాయి ఈ రెండు దేశాలు. ఏకంగా డాలర్‌కే ఎసరు పెట్టేలా పావులు కదుపుతూ శ్వేతసౌధానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తాను తవ్వుకున్న గోతిలోనే... తమ గుమ్మం ముందుకు నాటో విస్తరణను ఆపాలన్న రష్యా మాటను పెడచెవిన పెట్టిన అమెరికా, దాని మిత్ర దేశాలు... ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించాయి. డాలర్ పతనానికి ఆజ్యం పోసింది ఇదే! రష్యాపై ఆర్థిక ఆంక్షలతో పాటు ఆ దేశానికి చెందిన దాదాపు 300 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ నిల్వలను అమెరికా ఇంకా పశ్చిమ దేశాలు సీజ్ చేశాయి. ఇలా ఒక సార్వభౌమ దేశ ఆస్తులను స్తంభింపజేయడం చరిత్రలో ఇదే తొలిసారి. రష్యాను ఆర్థికంగా దివాలా తీయించేందుకు అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ (స్విఫ్ట్) నుండి తొలగించాయి. ఈ చర్యలతో అమెరికా, యూరప్ దేశాలు తమ గొయ్యి తామే తవ్వుకున్నట్లయింది. ఇదీ చదవండి: దోమల దాడి తట్టుకోలేకపోతున్నారా..? ఇది చేతికి తొడుక్కుంటే... క్రూడ్‌తో సహా అనేక కమోడిటీల ధరలు ఆకాశాన్నంటి జనాలు గగ్గోలు పెట్టడంతో సెంట్రల్ బ్యాంకులు విపరీతంగా వడ్డీరేట్లను పెంచాల్సిన పరిస్థితి తెలెత్తింది. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సహా నాలుగు బ్యాంకులు కుప్పకూలాయి. ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. డాలర్ రూపంలో విదేశీ కరెన్సీ నిల్వలు కలిగిన ఏ దేశమైనా తనకు ఎదురుతిరిగితే రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా డాలర్‌ను వాడుకుంటుందన్న విషయం రష్యాపై ఏకపక్ష ఆంక్షల ఉదంతంతో తేటతెల్లమైంది. అమెరికా ఆధిపత్య ధోరణితో విసిగి పోయిన దేశాలన్నీ డాలర్‌ను వదిలించుకునే దిశగా చకచకా అడుగులు వేస్తున్నాయి. ఫలితంగా డీ–డాలరైజేషన్ ఊహించని రీతిలో జోరందుకుంటోంది. ‘కింగ్ డాలర్’ ఎప్పుడు ఆవిర్భవించింది? వాస్తవానికి, 105 ఏళ్ల క్రితం డాలర్లలో ప్రపంచ దేశాల ఫారెక్స్ నిల్వలు సున్నా! 1900–1918 వరకు ప్రపంచంలో మూడు ప్రధాన కరెన్సీలు రాజ్యమేలాయి. అవి బ్రిటన్ పౌండ్, జర్మనీ మార్క్, ఫ్రెంచ్ ఫ్రాంక్. ఈ మూడు యూరోపియన్ దిగ్గజాలు అనేక దేశాలను తమ కాలనీలుగా చేసుకొని కొల్లగొట్టిన అసాధారణ సంపదే దీనికి కారణం. 1918 వరకు అసలు అమెరికా డాలర్ సోదిలోనే లేదు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ పూర్తిగా చితికిపోవడంతో డాలర్ ప్రాభవం మొదలైంది. యూరోపియన్ల యుద్ధకాంక్ష యూఎస్‌కు వరమైంది. రెండో ప్రపంచ యుద్ధంతో యూరప్ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం కావడంతో డాలర్ దశ తిరిగింది. హిట్లర్ అధీనంలో ఉన్న ఫ్రాన్స్‌లో అమెరికా మిత్రదేశ బలగాలు విజయవంతంగా సముద్రదాడి చేయడంతో యూరప్‌పై శ్వేతసౌధం పట్టు బిగించింది. ఈ పరిస్థితులను అనుకూలంగా మలచుకున్న అమెరికా, ‘బ్రెటన్ వుడ్స్’ సంప్రదింపుల్లో బ్రిటన్, ఫ్రాన్స్‌ను గుప్పిట్లో పెట్టుకుంది. ఆ సందర్భంగానే ప్రఖ్యాత ఆర్థికవేత్త కీన్స్ ప్రపంచ తటస్థ రిజర్వ్ కరెన్సీగా డాలర్‌ను ప్రతిపాదించారు. దీనికి ఆమోదం లభించడంతో, డాలర్ ఆధిపత్యానికి పునాది పడింది. అయితే, 1947లో ప్రపంచ రిజర్వ్ కరెన్సీల్లో బ్రిటిష్ పౌండ్ వాటా 70 శాతం పైనే. మన రూపాయి కూడా పౌండ్తోనే ముడిపడి ఉండేది. బ్రిటిష్ సామ్రాజ్యం కుప్పకూలడం, భారత్ సహా అనేక దేశాలు స్వాతంత్య్రం పొందడంతో పౌండ్ వాటా క్రమంగా తగ్గుతూ వచ్చింది. 1954లో తొలిసారి అమెరికా డాలర్ 40 శాతం పైగా వాటాతో పౌండ్‌ను వెనక్కినెట్టి కింగ్‌గా అవతరించింది. 1980 నాటికి పౌండ్ వాటా 3 శాతానికి పడిపోవడం విశేషం! రిజర్వ్ కరెన్సీ హోదా అంటే..? ప్రపంచ దేశాల విదేశీ కరెన్సీ రిజర్వ్‌ల (ఫారెక్స్ నిల్వలు) ఆధారంగా రిజర్వ్ కరెన్సీని పేర్కొంటారు. ఎక్కువ నిల్వలు ఏ కరెన్సీలో ఉంటే అది ప్రపంచ రిజర్వ్ కరెన్సీ కింగ్‌గా నిలుస్తుంది. ఉదాహరణకు, భారత్‌కు ఉన్న దాదాపు 580 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వల్లో అత్యధిక మొత్తం అమెరికా డాలర్లలోనే ఉంటాయి. వీటిలో ఎక్కువ భాగం అమెరికా బాండ్లలో పెట్టుబడుల రూపంలో, మరికొంత వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు, విదేశీ వాణిజ్య బ్యాంకులు, అంతర్జాతీయ సెటిల్మెంట్స్ బ్యాంకులో డిపాజిట్ల రూపంలో ఉంటాయి. చాలా తక్కువ మొత్తంలో యూరో, జపాన్ యెన్, చైనా యువాన్ వంటి ఇతర కరెన్సీల్లో నిల్వ చేస్తుంది. ఇక బంగారం రూపంలో కూడా కొన్ని ఫారెక్స్ నిల్వలను కొనసాగిస్తుంది. అంటే టాప్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఉన్న డాలర్‌లోనే దాదాపు ప్రపంచ దేశాలన్నీ తమ ఫారెక్స్ నిల్వలను ఉంచుతాయి. దీనికి కారణం విదేశీ ఎగుమతి–దిగుమతులు, విదేశీ రుణాలకు సంబంధించిన చెల్లింపులు, ఇతరత్రా కరెన్సీ లావాదేవీలన్నీ డాలర్ల రూపంలో జరగడమే. డాలర్ ఆధిపత్యంతో పాటు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలనూ తమ గుప్పిట్లో పెట్టుకున్న అమెరికా, పశ్చిమ దేశాలు... రుణాల ఎరతో అనే దేశాల ప్రభుత్వాలను కీలుబొమ్మలుగా ఆడిస్తున్నాయి కూడా. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు డాలర్‌పై తిరుగుబాటు చేయడానికి ఇదీ కారణమే! మరోపక్క, అంతర్జాతీయంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య ఫైనాన్షియల్ లావాదేవీలు, చెల్లింపులను నిర్వహించేందుకు ఏర్పాటైన స్విఫ్ట్ (సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్‌బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్)పై అమెరికా, యూరప్ దేశాలు పెత్తనం చలాయిస్తున్నాయి. రష్యాను ఈ పేమెంట్ వ్యవస్థ నుంచి ఏకపక్షంగా వెలివేయడం దీనికి నిదర్శనం. స్విఫ్ట్‌లో డాలర్, యూరో కరెన్సీ లావాదేవీలే అత్యధికంగా ఉండటంతో పశ్చిమ దేశాలు దీన్ని ఆయుధంగా ప్రయోగిస్తున్నాయి. డాలర్ రిజర్వ్ హోదా కోల్పేతే... డీ–డాలరైజేషన్.. అంటే అమెరికా అలాగే పశ్చిమ దేశాల ఫైనాన్షియల్ వ్యవస్థ నుంచి ప్రపంచ దేశాలు విడిపోవడం అనేది ఏడాదో రెండేళ్లలోనే జరిగే ప్రక్రియ కాదు. రష్యాపై ఆంక్షల తర్వాత ఇప్పుడిప్పుడే మొదలైన ఈ చర్యలు రాబోయే కొన్నేళ్లలో డాలర్ రిజర్వ్ కరెన్సీ హోదాకు కచ్చితంగా చరమగీతం పలుకుతాయనేది మెజారిటీ ఆర్థికవేత్తల మాట. వచ్చే ఐదేళ్లలో డీ–డాలరైజేషన్ కారణంగా ఇతర దేశాలపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించే సామర్థ్యాన్ని అమెరికా కోల్పోతుందంటూ స్వయంగా యూఎస్ సెనేటర్ మార్కో రూబియో అంచనా వేయడం గమనార్హం. రష్యా విషయంలో ఆంక్షలు బ్యాక్‌ఫైర్ అవ్వడమే దీనికి సంకేంతం. అంతేకాదు వచ్చే కొన్నేళ్లలో ప్రధాన దేశాలన్నీ తమ సొంత కరెన్సీల్లో (ప్రతిపాదిత బ్రిక్స్ కూటమి ఉమ్మడి కరెన్సీతో సహా) వాణిజ్య, ఇతరత్రా లావాదేవీలు నిర్వహించుకోవడం వల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ వాటా క్రమంగా తగ్గిపోతుంది. దీంతో డాలర్‌కు డిమాండ్ పడిపోయే అవకాశం ఉంది. అమెరికా బాండ్లలో పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, ఇతర సెంట్రల్ బ్యాంకుల వద్దనున్న డాలర్ నిల్వలను తగ్గించుకోవడాన్ని చాలా దేశాలు వేగవంతం చేస్తాయి. దీనివల్ల డాలర్ స్టోర్ విలువ మరింత పడిపోతుంది. వడ్డీరేట్లు భారీగా ఎగబాకే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. అమెరికా ట్రెజరీ బ్రాండ్స్‌ను కొనే దేశాలు కరువవ్వడంతో ఇప్పటిలాగే డాలర్లను ఇష్టానుసారం ప్రింట్ చేసే అవకాశం ఉండదు. బడ్జెట్ లోటు విపరీతంగా పెరిగిపోతుంది. ధరలు అంతకంతకూ కొండెక్కి అతి ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు. అంతి మంగా దిగుమతులు గుదిబండగా మారడంతో పాటు అమెరికా ప్రభుత్వ రుణ చెల్లింపులు కష్టతరంగా మారతాయి. నిధుల కోసం పన్నులు పెంచాల్సి వస్తుంది. అంతేకాదు, మనీ ప్రింటింగ్‌కు గండిపడటంతో, సైనిక వ్యయం పడిపోయి మిలిటరీ పరంగా కూడా ఆధిపత్యాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. మొత్తం మీద తాజా పరిణామాలు వేగం పుంజుకుంటే డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీ హోదాతో పాటు రాజకీయంగా అమెరికా ‘సూపర్ పవర్’ ప్రాభవం కూడా మసకబారుతుందనేది నిపుణుల విశ్లేషణ! చైనా–రష్యా–భారత్ భాయీ భాయీ.. ‘100 ఏళ్లలో జరగని మార్పులను ఇప్పుడు ప్రపంచం చూస్తోంది. మనం కలసి ముందుకు సాగితే ఈ మార్పులు సాక్షాత్కరిస్తాయి’ అంటూ పుతిన్‌తో జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యల అంతరార్థం డాలర్ కోటను బద్దలు కొట్టడమే! రష్యా ఇప్పటికే యూరప్‌తో పాటు పలు దేశాలకు రూబుల్స్‌లో మాత్రమే చమురు, గ్యాస్ ఇతరత్రా ఉత్పత్తులను విక్రయిస్తోంది. సౌదీ, ఇరాన్ సైతం తమ సొంత కరెన్సీల్లో క్రూడ్, గ్యాస్ ఎగుమతులకు సై అంటున్నాయి. తద్వారా పెట్రో డాలర్‌కు షాక్ తగిలింది. ఎందుకంటే ప్రపంచ వాణిజ్యంలో ఈ రెండు కమోడిటీలదే అత్యధిక వాటా. ఇక ఇప్పుడు ఏకంగా డాలర్ రిజర్వ్ కరెన్సీ హోదాకు గురిపెట్టి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలతో వాణిజ్యాన్ని చైనా కరెన్సీ యువాన్లతో జరుపుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. మరోపక్క, రష్యాపై అమెరికా ఆంక్షలకు చెక్ చెప్పేందుకు భారత్, చైనా రంగంలోకి దిగాయి. రష్యా నుంచి యథేచ్ఛగా క్రూడ్ ఇతరత్రా కమోడిటీలను కొనుగోలు చేస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుండి భారత్ క్రూడ్ దిగుమతులు ఏకంగా 22 రెట్లు ఎగబాకాయి (రోజుకు 1.6 మిలియన్ బ్యారెల్స్). రష్యాతో పెనవేసుకున్న భారత్ మైత్రికి ఇది తర్కాణం. చైనా సైతం రష్యాతో వాణిజ్యాన్ని 30 శాతం పెంచుకుంది. గత ఏడాది రష్యా నుంచి చైనాకు 80 బిలియన్ డాలర్లకు పైగా ఎగుమతులు జరగగా, రష్యా నుంచి చైనాకు ఏకంగా 110 బిలియన్ డాలర్లకు పైగా దిగుమతులు జరిగాయి. ఈ మొత్తం వాణిజ్యం లో మూడు దేశాలు తమ సొంత కరెన్సీలనే ఉపయోగిస్తుండం డాలర్‌కు మరో బిగ్ షాక్! అమెరికా పక్కలో ‘బ్రిక్స్’ బల్లెం.. ప్రపంచ భౌగోళిక రాజకీయాలనే కాదు ఆర్థిక వ్యవస్థను సైతం శాసించేలా బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) కూటమి అంతకంతకూ బలోపేతం అవుతోంది. ప్రపంచ పెత్తనం చేస్తున్న జీ7 దేశాల (అమెరికా, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, బ్రిటన్, జపాన్, ఇటలీ, యూరోపియన్ యూనియన్‌తో సహా) జీడీపీని 5 బ్రిక్స్ దేశాల జీడీపీ (కొనుగోలు శక్తి సమానత్వం ఆధారంగా) అధిగమించడం విశేషం. ప్రపంచ జీడీపీలో జీ7 దేశాల వాటా ప్రస్తుతం 30 శాతానికి పడిపోగా, బ్రిక్స్ దేశాల జీడీపీ వాటా 31.5 శాతానికి చేరింది. అంతేకాదు, సాధారణ జీడీపీలో సైతం ఇప్పటికే బ్రిక్స్ కూటమి అమెరికా జీడీపీని మించిపోయింది. 2035 నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థను అధిగమించి చైనా నంబర్ వన్ అవుతుందని బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ అంచానా వేసింది. భారత్ సైతం 2075కల్లా అమెరికాను మించిపోతుందని జోస్యం చెప్పింది. మరోపక్క, బ్రిక్స్ కూటమి విస్తరణతో బ్రిక్స్ ప్లస్‌గా అవతరించే చర్యలు పుంజుకున్నాయి. కీలకమైన సౌదీ అరేబియాతో పాటు ఇరాన్, అర్జెంటీనా, నైజీరియా, యూఏఈ, ఈజిప్ట్, అల్జీరియా, మెక్సికో, వెనెజులా ఇలా మొత్తం 12 దేశాలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. ఇదిలాఉంటే, బ్రిక్స్ కూటమి తమ సొంత కరెన్సీ దిశగా అడుగులేస్తోంది. స్విఫ్ట్ స్థానంలో సొంత పేమెంట్ వ్యవస్థను నెలకొల్పనుంది. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులకు పోటీగా బ్రిక్స్ బ్యాంక్ కార్యకలాపాలను పెంచుకుంటోంది. చైనా పర్యటనలో బ్రెజిల్ అధ్యక్షుడు లులా.. డాలర్ బదులు సొంత కరెన్సీలలో వాణిజ్యానికి పిలుపునిచ్చారు. బ్రిక్స్ కూటమి మరింత విస్తరించి.. కరెన్సీ, పేమెంట్ వ్యవస్థ సాకారమైతే డాలర్‌కు నిజంగా మరణ శాసనమేనని విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. గల్ఫ్.. గుడ్‌బై! చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ మూడోసారి పగ్గాలు చేపట్టాక రష్యాతో మరింత సన్నిహితం కావడంతో పాటు దౌత్యపరంగానూ సత్తా చాటుతున్నారు. దశాబ్దాలుగా వైరం ఉన్న సౌదీ, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చి అమెరికాకు షాకిచ్చారు. టర్కీ–సిరియా మధ్య సంధి కుదిర్చేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారు. సౌదీ సైతం యెమెన్‌తో యుద్ధానికి ముగింపు పలికేలా అడుగులేస్తోంది. మధ్యప్రాచ్యంలో అమెరికా ఇన్నాళ్లూ అడిస్తున్న యుద్ధతంత్రానికి ఈ పరిణామాలు చెల్లు చెప్పే అవకాశం ఉంది. మరోపక్క ఇరాన్, సౌదీ నుంచి ఇకపై చైనా యువాన్‌లోనే క్రూడ్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. యూఏఈ సైతం తమ సొంత కరెన్సీలో ట్రేడింగ్‌కు సై అంది. సౌదీ, రష్యాలు సైతం తమ వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. 12 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో పలు రిఫైనరీలను చైనాలో సౌదీ ఆరామ్కో నిర్మించనుంది. ఇందుకు యువాన్లలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. తొలిసారిగా చైనా బ్యాంకుల నుంచి సౌదీ యువాన్లలో రుణాల కోసం డీల్ కుదుర్చుకుంది కూడా. క్రూడ్ ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్‌తో పాటు అరబ్ దేశాల్లో కీలకమైన సౌదీ అరేబియా యువరాజు సల్మాన్ ఇప్పుడు అమెరికాకు పూర్తిగా ముఖం చాటేస్తుండటం విశేషం. గ్లోబల్ సౌత్.. డాలర్ టార్గెట్! బ్రిక్స్ దేశాలకు తోడు ఇప్పుడు ఇతర ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు సైతం డాలర్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాయి. డాలర్ అవసరం లేకుండా ఇకపై నేరుగా తమ సొంత కరెన్సీలోనో లేదంటే చైనా యువాన్లోనో వాణిజ్య లావాదేవీలు జరిపేందుకు పలు దేశాలు ఓకే అంటున్నాయి. ముఖ్యంగా భారత్ మలేషియా, టాంజానియాతో రూపాయిల్లో వాణిజ్యానికి డీల్ కుదుర్చుకుంది. మరో 18 దేశాలతో కూడా ఇదేవిధమైన ఒప్పందాలకు రెడీ అవుతోంది. మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, థాయ్‌లాండ్ తమ సొంత డిజిటల్ పేమెంట్ వ్యవస్థతో స్థానిక కరెన్సీలో సెటిల్మెంట్కు తెరతీశాయి. ఇప్పుడు 10 దేశాల ఆసియాన్ కూటమి తమ మధ్య వాణిజ్యానికి ఇదే వ్యవస్థను వాడుకోవాలని చూస్తోంది. చైనా పర్యటన సందర్భంగా మలేషియా ప్రధాని ఇబ్రహీమ్, ఐఎంఎఫ్ ఆధిపత్యానికి చెక్ చెప్పేందుకు ఆసియా మానిటరీ ఫండ్ (ఏఎంఎఫ్)ను ప్రతిపాదించడం గమనార్హం. తొలిసారిగా యూఏఈ నుంచి చైనా యువాన్లలో గ్యాస్ (ఎల్ఎన్జీ)ను కొనుగోలు చేస్తోంది. ఇక ఆఫ్రికా దేశాలూ డాలర్‌ను డంప్ చేసేందుకు పోటీ పడుతున్నాయి. కెన్యా ఇకపై సౌదీ, యూఏఈ నుంచి తమ సొంత కరెన్సీలో క్రూడ్ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈజిప్ట్ బ్రిక్స్ బ్యాంకుతో చేతులు కలిపింది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకోవీ అయితే వీసా, మాస్టర్‌కార్డ్‌ల వినియోగాన్ని దేశంలో ఆపేయాలని పిలుపునివ్వడం విశేషం. ఇక లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రెజిల్ తమ ఎగుమతిదారులకు యువాన్ చెల్లింపుల వ్యవస్థను అమల్లోకి తీసుకొ స్తోంది. బ్రెజిల్, అర్జెంటీనా లాటిన్ అమెరికా ఉమ్మడి కరెన్సీ ప్రయత్నాల్లో ఉన్నాయి. అమెరికా ఆర్థిక ఆంక్షలు, కుట్రలు, ప్రభుత్వ కూల్చివేతలకు గురైన ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలన్నీ డాలర్‌పై మూకుమ్మడి ఎటాక్ మొదలెట్టాయి. దీంతో డాలర్, మిలిటరీ, విభజించు–పాలించు... ఈ మూల స్తంభాలపై నిలబడిన శ్వేత సౌధం పునాదులు ఇప్పుడు ఒక్కసారిగా కదిలిపోతున్నాయి. శరవేగంగా మారిపోతున్న తాజా భౌగోళిక, ఆర్థిక ముఖచిత్రాన్ని చూస్తుంటే.. డాలర్‌తో పాటు అమెరికా ఆధిపత్యానికి తెరదించేందుకు మరెంతో కాలం పట్టదనే విషయం కళ్లకు కడుతోంది. - శివరామకృష్ణ మిర్తిపాటి -
డాలర్ డౌన్ ఫాల్!
దొడ్డ శ్రీనివాసరెడ్డి : గ్లోబల్ కరెన్సీగా అమెరికన్ డాలర్‌కు ఉన్న పట్టు క్రమంగా సడలిపోతోంది. డాలర్‌కు వ్యతిరేకంగా సొంత కరెన్సీలను బలోపేతం చేసుకోవాలనుకుంటున్న దేశాల సంఖ్య పెరిగిపోయింది. ఈ దేశాల జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది. ప్రస్తుతం దాదాపు అన్ని దేశాల విదేశీ మారకద్రవ్య నిల్వల్లో అమెరికన్ డాలర్లే 60 శాతానికి పైగా ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం, రుణాలు, సెక్యూరిటీల లావాదేవీల్లో సగానికి పైగా డాలర్లలోనే సాగుతున్నాయి. ఇక విదేశీ కరెన్సీల ఎక్సే్ఛంజ్ మార్కెట్లలో మొత్తం అన్ని కరెన్సీలను కలుపుకొన్నా 90 శాతం ట్రేడింగ్ అమెరికన్ డాలర్ల ద్వారానే జరుగుతోంది. ఇక ముందు ఈ పరిస్థితి మారబోతోంది. డాలర్‌పై ఆధారపడటం మాని సొంత కరెన్సీలను బలోపేతం చేసుకోవాలనే కోరికతో అనేక దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటున్నాయి. సమీప భవిష్యత్‌లోనే గ్లోబల్ కరెన్సీ స్థానాన్ని అమెరికన్ డాలర్ కోల్పోయే ప్రమాదం వచ్చింది. ఇలా మొదలైంది.. బ్రెట్టన్‌వుడ్ ఒప్పందంతో అమెరికన్ డాలర్ పెత్తనం మొదలైంది.రెండో ప్రపంచ యుద్ధకాలంలో కుదేలైన అనేక దేశాలు ముఖ్యంగా యూరప్ దేశాలు అనేకానేక ఉత్పత్తుల కోసం అమెరికాపై ఆధారపడాల్సి వచ్చింది. వాణిజ్య ఒప్పందాల్లో డాలర్ విలువ ఎలా ఉండాలనే విషయమై ఐక్యరాజ్యసమితి ద్రవ్య, ఆర్థిక సదస్సు అమెరికా న్యూ హాంప్‌షైర్‌లోని బ్రెట్ట్టన్వుడ్లో జరిగింది. 44 దేశాలు పాల్గొన్న ఈ సమావేశంలో అంతర్జాతీయంగా బంగారు ధరలను డాలర్ విలువకు జతచేస్తూ ఒప్పందం చేసుకున్నా యి. దాంతో ఇతర కరెన్సీల విలువను డాలర్ మారక విలువ కోసం ఈ ఒప్పందం ప్రాతిపదికైంది. ఒక డాలర్ విలువ ఒక ఔన్స్ (31.1034768 గ్రాములు) బంగారంతో సమానమైంది. 1970లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ డాలర్ విలువను బంగారు ధరకు జత చేయడాన్ని రద్దు చేసినప్పటికీ అప్పటికే డాలర్ నిల్వలు అన్ని దేశాల్లో పెరిగిపోయి గ్లోబల్ కరెన్సీగా అవతరించింది. పనామా, ఎల్ సాల్వడార్, జింబాబ్వే లాంటి 11 దేశాలు ఇప్పటికీ అమెరికన్ డాలర్‌నే తమ దేశాల్లో అధికారిక కరెన్సీగా చెలామణి చేస్తున్నాయి. డాలర్ శక్తిసామర్థ్య ంతో రెచ్చి పోయిన అమెరికా అనేక సందర్భాల్లో ఆ డాలర్‌నే ఆయుధంగా వాడుకుంది. ఉక్రెయిన్‌లో భాగమైన క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నప్పుడు వివిధ బ్యాంకుల్లో రష్యా నిల్వ చేసిన 64,000 కోట్ల డాలర్లను అమెరికా జప్తు చేసింది. రష్యా విదేశీ మారక నిల్వల్లో ఇది సగానికి పైగా ఉంది. ఇలాంటి ప్రయోగమే వివిధ సందర్భాల్లో అఫ్గానిస్తాన్, ఇరాన్, వెనెజులా వంటి దేశా లపై అమెరికా ప్రయోగించింది. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించిన బ్యాంకులపై పెద్ద మొత్తంలో జరిమానాలు కూడా విధించింది. తొలుత రష్యాలో.. క్రిమియా ఆక్రమణ నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలను ఎదుర్కొనడానికి 2014లో రష్యా చైనాతో చేతులు కలిపి డాలర్‌కు వ్యతిరేకంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. దీంతో గ్లోబల్ కరెన్సీగా చెలామణి అవుతున్న అమెరికన్ డాలర్‌కు పెద్ద సవాల్ మొదలైంది. రష్యా, చైనా మధ్య జరిగే అన్ని వ్యాపార లావాదేవీల్లో మారక ద్రవ్యంగా రూబుల్–యువాన్లు వినియోగించాలని ఈ రెండు దేశాలు నిర్ణయించా యి. అంతేకాదు రష్యా తన విదేశీ మారకద్రవ్య నిల్వల్లో అధికశాతం చైనా యువాన్ కరెన్సీని సమకూర్చుకోవాలని కూడా నిర్ణయించింది. దాంతో గత ఏడాదికి రష్యా విదేశీ మారక నిల్వ ల్లో యువాన్ 60 శాతానికి పెరిగినట్లు రష్యా ఆర్థిక శాఖ ప్రకటించింది. అలాగే డాలర్ స్థానంలో తమ సొంత కరెన్సీల్లోనే వ్యాపారం నిర్వహించాలని ఇటీవల చైనా, బ్రెజిల్ నిర్ణయించాయి. లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థికశక్తి అయిన బ్రెజిల్‌తో చైనా చేసుకున్న ఒప్పందం కారణంగా డాలర్ పెత్తనానికి మరో పెద్ద సవాల్ ఏర్పడింది. బ్రెజిల్ రీస్ చైనా యువాన్ బంధం డాలర్ ఆధిపత్యాన్ని నిలువరించింది. గత ఏడాది ఈ రెండు దేశాల మధ్య 15,000 కోట్ల డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. డాలర్, యూరో, యెన్, పౌండ్లకు బదులు తమ దేశాల కరెన్సీలతోనే వ్యాపారం సాగించాలనే ఏకైక ఎజెండాతో ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక మంత్రిత్వ శాఖలు, ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇటీవల అధికారిక సమావేశం నిర్వహించాయి. 70 శాతం నుంచి 59 శాతానికి.. గత జనవరిలో దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి నలెది పాండోర్ ఒక ఇంటర్వ్యూలో ‘బ్రిక్, (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయ మారకాన్ని ఆవిష్కరించాలని కోరుకుంటున్నాయి’అని వెల్లడించారు. సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహమ్మద్ అల్–జదాన్ ఇటీవల మరో బాంబు పేల్చారు. చమురు వ్యాపారంలో డాలర్‌కు ఇతర కరెన్సీల వినియోగంపై చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా నుంచి ఇలాంటి ప్రకటన రావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. అంతర్జాతీయంగా చమురు వాణిజ్యం దాదాపుగా అమెరికన్ డాలర్లలోనే జరుగుతుంది. అందుకే దాన్ని పెట్రోడాలర్గా పిలుస్తారు. చమురు ఎగుమతుల్లో ఒపెక్ (చమురు ఉత్పత్తి చేసే దేశాలు) దేశాల్లో అగ్రస్థానంలో నిలిచే సౌదీ అరేబియా ఇతర కరెన్సీల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే అమెరికన్ డాలర్ ఆధిపత్యానికి చరమగీతం పాడినట్లేనని అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం. భారత్–రష్యా మధ్య కూడా వాణిజ్యం అమెరికన్ డాలర్లో కాకుండా ఇతర కరెన్సీల్లో జరుగుతోంది. భారతీయ సంస్థలు రష్యా నుంచి చేసుకున్న దిగుమతులకు అరబ్ ఎమిరేట్స్ కరెన్సీ దినార్‌ను వినియోగించేవి. ఇప్పుడు రూబుల్లో చెల్లింపులు చేస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభానికి వివిధ దేశాల విదేశీ మారక నిల్వల్లో అమెరికన్ డాలర్ వంతు 59 శాతానికి తగ్గిపోయింది. ఇది 1999 నాటికి 70 శాతం ఉండేదని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. ఇక భారత్ వంతు.. భారత్ కూడా తన రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా ఆవిష్కరించే దిశలో చర్యలు మొదలుపెట్టింది. అనేక దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్న తరుణంలో డాలర్, యూరో, యెన్, పౌండ్లతో దీటుగా రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చెలామణి చేసేందుకు తొలి అడుగులు వేసింది. రూపాయిని మారక విలువగా వినియోగించేందుకు వీలుగా ఆర్బీఐ రష్యా, శ్రీలంకతోపాటు మొత్తం 18 దేశాల్లోని 60 బ్యాంకుల్లో వోస్ట్రో అకౌంట్లను ప్రారంభించింది. అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలను రూపాయి ద్వారా నిర్వహించడానికి వీలుగా ఆర్బీఐ ఈ అకౌంట్లను ప్రారంభించిందని భారత ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాడ్ ప్రకటించారు. రూపాయితో వ్యాపారం చేయడానికి ఒప్పుకున్న దేశాల్లో బ్రిటన్, మలేషియా, రష్యా, సింగపూర్, న్యూజిలాండ్, శ్రీలంక, మయన్మార్, బోట్స్వానా, ఇజ్రాయెల్, ఫిజి, ఒమన్, జర్మనీ, కెన్యా, గయానా, మారిషస్, టాంజానియా, ఉగాండా దేశాలున్నాయి. అమెరికా వాల్‌స్ట్రీట్‌లో ‘డాక్టర్ డూమ్’గా పేరుపడ్డ ఆర్థికవేత్త నౌరియల్ రుబిని ‘రానున్న రోజుల్లో భారత రూపాయి అంతర్జాతీయ విపణిలో అతి ముఖ్యమైన విదేశీ మారకద్రవ్యంగా అవతరించబోతోంది’ అన్నారు. -
50 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం: పాతాళానికి పాక్ కరెన్సీ
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోంది. తాజాగా దేశంలో ద్రవ్యోల్బణం తారా స్తాయికి చేరి 50 ఏళ్ల గరిష్టం వద్ద కొత్త రికార్డు సృష్టించింది. తొలిసారి పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం 31.5 శాతానికి చేరింది. జూలై 1965లో డేటా-కీపింగ్ మొదలైనప్పటినుంచి ఏప్రిల్ 1975లో ఒకసారి ద్రవ్యోల్బణం భారీగా పెరిగినప్పటికీ, 29 శాతంగా ఉండట గమనార్హం. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) తాజాగా గణాంకాల ప్రకారం ఫిబ్రవరిలో వినియోగదారుల ధరల సూచీ 31.5 శాతం వద్ద మునుపటి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.అటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (SBP) ప్రకారం, అమెరికా డాలర్‌తో పోలిస్తే పాక్ రూపీ గణనీయంగా పడిపోయింది.ఈ ఏడాది 20 శాతం క్షీణించి డాలర్ మారకంలో 284 వద్ద రికార్డు స్థాయికి క్షీణించింది. దీంతో దక్షిణాసియా దేశం ఇప్పుడు ప్రపంచంలో 17వ అత్యంత ఖరీదైన దేశంగా అవతరించింది.పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ విదేశీమారకద్రవ్య నిల్వలు మూడు వారాల దిగుమతులకు సరిపడా స్థాయికి పడిపోయాయి. ఇది ఇలా ఉంటే గత నెల ప్రారంభం నుండి చర్చలు జరుపుతున్నప్పటికీ ఐఎంఎఫ్ నిధుల అంశం ఒక కొలిక్కి రావడం లేదు. ఈ ఆలస్యం కరెన్సీ మార్కెట్లో అనిశ్చితిని సృష్టిస్తోందని కరాచీకి చెందిన బ్రోకరేజ్ హౌస్ టాప్‌లైన్ సెక్యూరిటీస్‌కు చెందిన మహ్మద్ సోహైల్ అన్నారు. మరోవైపు వచ్చే వారం నాటికి ఐఎంఎఫ్ ప్రాథమిక డీల్‌పై ఆర్థిక మంత్రి దార్ భారీ ఆశలు పెట్టుకున్నారు. -
రూపీ 50 పైసలు డౌన్.. కారణాలు ఇవే!
ముంబై: రూపాయి విలువ సోమవారం 50 పైసలు క్షీణించి 81.28 స్థాయి వద్ద నిలిచింది. మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు అండతో ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 80.53 స్థాయి వద్ద మొదలైంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనైన రూపాయి ఏ దశలోనూ కోలుకోలేక ఇంట్రాడే కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. ‘‘దేశీయ కార్పొరేట్, ఆయిల్ కంపెనీల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరిగింది. ఈక్విటీ మార్కెట్ స్తబ్ధుగా ట్రేడైంది. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ బలపడింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగింది. ఈ అంశాలు మన కరెన్సీపై ఒత్తిడిని పెంచాయి’’ అని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
భారీగా పతనమైన రూపాయి
-
ఆల్ టైం కనిష్ట స్థాయికి రూపాయి పతనం
-
రూపాయి క్షీణతను నివారించాలంటే..
ఇటీవల కాలంలో రూపాయి విలువ బాగా క్షీణిస్తోంది. ఇందువల్ల ఐటీ, ఫార్మా రంగాల్లో ఉన్న ఎగుమతిదార్లు విపరీతమైన లాభాలు గడిస్తున్నారు. అదేసమయంలో పెట్రోల్, వంటనూనెలు వంటి నిత్యావసరాలను దిగుమతి చేసుకోవడం వల్ల సామాన్య, మధ్య తరగతి జనాలు నానా యాతనా పడుతున్నారు. ద్రవ్యం విలువ పడిపోవడం దేశ కరెంట్ ఖాతా లోటు పెరిగిపోవడానికి దారితీస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగి అధిక శాతం జనాభా కనీసావసరాలను తీర్చుకోలేక ఇబ్బందుల పాలవుతారు. ఇంత ఇబ్బందికరమైన రూపాయి విలువలో వచ్చే హెచ్చు తగ్గులకు అనేక అంతర్గత, బాహ్య పరిస్థితులు కారణాలుగా ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని భారతీయ కరెన్సీ క్షీణతను ఆర్బీఐ అదుపు చేయడానికి చర్యలు తీసుకోవాలి. గత కొన్ని నెలలుగా రూపాయి విలువ హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఇది 2022 జూలై 20 నాటికి డాలర్‌తో పోలిస్తే 80.05 రూపాయల కనిష్ఠానికి చేరుకుంది. 2022 ఆగస్టు 2కు 78.72 రూపాయలకు బలపడింది. ఇలా ఎందుకు జరుగుతోంది? రూపాయి విలువ పడిపోవడాన్ని రెండు రకాలుగా చెప్పు కోవచ్చు. రూపాయి విలువ తగ్గింపు వల్ల... అంటే ఇతర కరెన్సీలతో అధికారిక మారకపు రేటులో ఉద్దేశ పూర్వకంగా మన రూపాయిని తగ్గించడం (మూల్య హీనీకరణ) ఒకటి. ఇది 1949, 1966, 1991 సంవత్సరాలలో జరిగింది. డాలర్‌తో రూపాయి విలువ తగ్గడాన్ని సూచించే రూపాయి విలువ క్షీణత మరొ కటి. ఇది ఆర్థిక ఒడిదుడుకులవల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనంగా మారిందని సూచిస్తుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, ఈక్విటీ అమ్మకాలు, డాలర్ తిరుగు ప్రవాహం, ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడానికి ఆర్బీఐ తీసు కున్న చర్యలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల కఠినతరం వంటి కారకాలు ఇప్పుడు రూపాయి విలువ పడిపోవడానికి ప్రధాన కారణాలు. బలహీన రూపాయి వల్ల సైద్ధాంతికంగా భారతదేశ ఎగుమతు లకు ప్రోత్సాహం లభిస్తుంది. భారతదేశానికి ప్రయాణం చౌకగా ఉంటుంది. స్థానిక పరిశ్రమ లాభపడవచ్చు, విదేశాలలో పని చేసే వారు తమ స్వదేశానికి డబ్బు పంపడం ద్వారా ఎక్కువ లాభం పొంద వచ్చు. కరెంట్ ఖాతా లోటు తగ్గే అవకాశం ఉంది. ఇక నష్టాల సంగతి కొస్తే... ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను రికార్డు స్థాయిలో ఎక్కువ కాలం కొనసాగించడాన్ని కష్టతరం చేస్తుంది. భారత్ తన దేశీయ చమురు అవసరాలలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. బలహీనమైన కరెన్సీ వల్ల దిగుమతి చేసుకున్న వంట నూనెల ధరలు మరింతగా పెరుగుతాయి. ఫలితంగా ఆహార ద్రవ్యోల్బణం పెరుగు తుంది. రూపాయి కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల దేశం కరెంట్ ఖాతా లోటు విస్తరిస్తుంది. విదేశీ ప్రయాణాలకూ, విదేశీ విద్యార్జనకూ ఎక్కువ ఖర్చు అవుతుంది. విదేశీ రుణంపై వడ్డీ భారం పెరుగుతుంది. ఇప్పటి వరకు సంవత్సరానికి అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి దాదాపు 7 శాతం పడిపోయింది. ఓవర్–ది–కౌంటర్, డెరి వేటివ్స్ మార్కెట్లలో రూ. 80 మార్క్‌ను దాటింది. ఈ క్యాలెండర్ సంవత్సరం మూడో త్రైమాసికంలో డాలర్‌తో పోలిస్తే రూ. 82కి తగ్గుతుందని నోమురా సంస్థ అంచనా వేస్తోంది. ముడి చమురు ధరలు పుంజుకోవడం, డాలర్ తక్షణ కాలంలో సాపేక్షంగా బలంగా ఉంటుందనే అంచనాల మధ్య, 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూపాయి 81కి బలహీనపడవచ్చని భావిస్తున్నారు. సమీప కాలంలో రూపాయి ఒత్తిడికి లోనవుతుందని క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీ సెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (క్రిసిల్) అంచనా వేసింది. అంతే కాకుండా వాణిజ్య లోటు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు వెనక్కి పోవడం, అమెరికా డాలర్ ఇండెక్స్ బలపడటం వంటి కారణాల వల్ల సమీప కాలంలో రూపాయి–డాలర్ మారకం అస్థిరంగా ఉంటుందని అంచనా వేసింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రేట్ల పెంపుదల, భౌగోళిక రాజకీయ అస్థిరతల మధ్య డాలర్‌కు డిమాండ్ పెరిగి రూపాయి బలహీనపడవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం రూపాయి విలువ బాగా పడిపోవడం ఆర్థిక వ్యవస్థలో కొన్ని పరిణామాలకు దారితీసింది. భారతదేశ ఫార్మసీ రంగం 2022 సంవత్సరంలో 22.5 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. ఈ కంపెనీలు అమెరికా నుండి అత్యధిక ఆదాయాన్ని పొందుతున్నాయి. నికర ఎగుమతిదారు అయిన వస్త్ర (టెక్స్ టైల్) పరిశ్రమ బలహీనమైన రూపాయి నుండి ప్రయోజనం పొందుతోంది. రత్నాలు, ఆభరణాల రంగం విషయానికొస్తే రూపాయి క్షీణత దాని యూనిట్లకు వ్యయ ప్రయోజనాన్ని ఇస్తోంది. ఐటీ సేవలు, సాంకేతిక పరిశ్రమ అమెరికా ఆదాయాలలో 50 శాతం వాటా కలిగి ఉన్నాయి కాబట్టి... క్షీణిస్తున్న రూపాయి అతిపెద్ద లాభాల్లో ఒకటిగా ఉంటుంది. రూపాయిలో ప్రతి 1 శాతం పతనానికీ వస్త్ర ఎగుమతులకు 0.25–0.5 శాతం లాభం పెరుగుతుంది. భారతదేశం తేయాకు(టీ) లాభాల ఎగుమతులు 5–10 శాతం పెరుగుతాయని అంచనా. సరఫరా కొరత కారణంగా పెరుగుతున్న వస్తువుల ధరలతో, ఎగుమతిదారులకు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఇది వారి లాభాన్ని ప్రభావితం చేస్తుంది. ఇదిలావుండగా, విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటివరకు భారతీయ మార్కెట్ల నుండి 19 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. ముడి చమురు ఫ్యూచర్స్ ధరలో ఒక డాలర్ పెరుగుదలతో... భారత్ ముడి చమురు దిగుమతులు 1.703 మిలియన్ టన్నులు పెరిగాయని అంచనా. ప్రతి ఒక మిలియన్ టన్ను ముడి చమురు దిగుమతి... డాలర్‌ను మన రూపాయితో పోలిస్తే 0.266 బలపరుస్తుంది. జూలై 15తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు 7.5 బిలియన్లు తగ్గి 572.71 బిలియన్లకు పడిపోయాయి. ఇది 20 నెలల కనిష్ఠ స్థాయి. భారతదేశ కరెంట్ ఖాతా లోటు 2022లో జీడీపీలో 1.5 శాతం నుండి 3 శాతం వరకు పెరుగు తుందని అంచనా. అమెరికా డాలర్‌తో పోలిస్తే అనేక కరెన్సీలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఫలితంగా, భారతదేశంతో సహా వివిధ వర్ధమాన ఆర్థిక వ్యవస్థల నుండి విదేశీ మూలధన ప్రవాహం జరుగుతోంది. వారి దేశీయ కరెన్సీలపై ఒత్తిడి పెరిగింది. అమెరికా డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం.. ఇతర ప్రధాన ప్రపంచ కరెన్సీలైన యూరో, బ్రిటిష్ పౌండ్, జపనీస్ ఎన్ల కంటే తక్కువగా ఉందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. ప్రధాన కరెన్సీలకు వ్యతిరేకంగా అమెరికా యూనిట్ ఈ ఏడాది 11 శాతం ర్యాలీ చేసి రెండు దశాబ్దాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కరెన్సీల స్థిరమైన తరుగుదలకి కారణమైంది. ఫలితంగా, భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే 80 మార్క్‌ను దాటి రికార్డు కనిష్ఠ స్థాయికి చేరుకుంది. 2022లో రూపాయి దాదాపు 7 శాతం నష్టపోయినప్పటికీ, కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కరెన్సీలు మన రూపాయి కన్నా చాలా దారుణంగా క్షీణించాయి. యూరో 13 శాతం, బ్రిటిష్ పౌండ్ 11 శాతం, జపనీస్ ఎన్ 16 శాతం తగ్గాయి. ఫలితంగా ఈ కరెన్సీలతో రూపాయి విలువ పెరిగింది. దక్షిణ కొరియా వాన్, ఫిలిప్పైన్ పెసో, థాయ్‌లాండ్ బాట్, తైవాన్ డాలర్లు... అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి కంటే ఎక్కువగా పడిపోయాయి. అందువల్ల ఆయా దేశాల నుంచి మనం చేసుకునే దిగుమతులు మనకు లాభదాయకంగా ఉంటాయి. ఇప్పుడు భారతీయ కరెన్సీ క్షీణతను ఆర్బీఐ ఎలా అదుపు చేయగలదో చూద్దాం. ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకోవాలి. నాన్ రెసిడెంట్ ఇండియన్ బాండ్లను విక్రయించాలి. సావరిన్ బాండ్ల జారీని నిర్వహించాలి. భారతదేశం తన మొత్తం కరెంట్ ఖాతా లోటును తగ్గించుకోవడంపై దృష్టి సారించి, రష్యా వంటి స్నేహ పూర్వక దేశాలతో రూపాయి చెల్లింపు విధానాన్ని లాంఛనప్రాయంగా పరిగణించాలి. ఇది అమెరికా డాలర్‌పై రూపాయి ఆధారపడటాన్ని తగ్గించడానికి మార్గం సుగమం చేస్తుంది. పారిశ్రామిక వృద్ధికి ప్రాధా న్యత ఇవ్వాలి. తద్వారా వస్తువుల విక్రయానికి రూపాయి మార్పిడి అవసరం అవుతుంది. ఇది చివరికి అంతర్జాతీయ మార్కెట్లలో సంస్థా గతీకరణకు దారి తీస్తుంది. రూపాయిలో నల్లధనం లావాదేవీలను అరికట్టడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను లాంఛనప్రాయంగా మార్చడం కూడా చాలా అవసరం. రూపాయి బహు పాక్షిక స్వభావాన్ని పునరుద్ధరించడానికి, అంతర్జాతీయ మార్కెట్లలో రూపాయి వినియోగాన్ని పెంచాలి. ఎలా చూసినా కరెన్సీ విలువ పడి పోకుండా రక్షించేది ఆర్థికాభివృద్ధి మాత్రమే. కాబట్టి ప్రభుత్వం ఆ దిశలో మరిన్ని చర్యలు తీసుకోవాలి. (క్లిక్: వారి విడుదల దేనికి సంకేతం?) - డాక్టర్ పీఎస్ చారి మేనేజ్మెంట్ స్టడీస్ నిపుణులు -
డాలర్.. రన్ రాజా రన్!
మంథా రమణమూర్తి ‘డాలర్ మాకు కరెన్సీ. మీకు సమస్య.’ 51 ఏళ్ల కిందట అమెరికా ఆర్థిక మంత్రి జాన్ కొనల్లీ చేసిన ఈ వ్యాఖ్యల్ని... ప్రపంచ మానవాళిపై వేసిన పచ్చబొట్టుగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ డాలర్ అమెరికాకు కరెన్సీనే. ప్రపంచానికి మాత్రం అన్నీ డాలరే. డాలర్ విలువ పెరిగినా... తగ్గినా... ప్రపంచంలోని ప్రతి కుటుంబంపైనా దాని ప్రభావం పడక తప్పదు. అలాంటి డాలర్ ఇçప్పుడు అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతోంది. ప్రపంచంలో ప్రధాన కరెన్సీలుగా భావించే యూరప్ యూరో, యూకే పౌండ్, జపాన్ యెన్, చైనీస్ యువాన్... ఇవన్నీ డాలర్‌తో పోలిస్తే దారుణంగా క్షీణిస్తున్నాయి. అన్నిటికన్నా ఘోరంగా జపాన్ యెన్ గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 20.57 శాతం మేర క్షీణించింది. ఏడాది కిందట డాలర్‌కు 110 యెన్లు కాగా... ఇప్పుడు 138.5 యెన్లు పెడితే తప్ప ఒక డాలర్ రావటం లేదు. యూకే పౌండ్ కూడా అంతే. ఏడాది కాలంలో ఏకంగా 15.5 శాతం పతనం కాగా... యూరో అదే స్థాయిలో 14 శాతం క్షీణించింది. ఆసియా దిగ్గజాలు చైనా, భారత్ మరీ అంత క్షీణించకుండా తమ కరెన్సీలను కాపాడుకున్నాయి. యువాన్ 4.5 శాతం, రూపాయి 6.25 శాతం మాత్రమే పతనమయ్యాయి. కరెన్సీలెందుకు పతనమవుతున్నాయి? అందరూ చెప్పే ప్రధాన కారణాలు రెండు. మొదటిది కోవిడ్ సంక్షోభం. దాదాపు రెండున్నరేళ్లు ప్రపంచపటంలో ఒక్కదేశాన్నీ వదలకుండా చుట్టేసిన ఈ మహమ్మారి ఇంకా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఫలితంగా ప్రపంచం మొత్తం మునుపెన్నడూ చూడని వైపరీత్యాల్ని చూసింది. లాక్డౌన్లతో జీవితం అస్తవ్యస్తమయింది. కొనుగోలు శక్తి సన్నగిల్లి... ఉత్పాదకత ఘోరంగా పడిపోయింది. దీన్ని పెంచడానికి... అమెరికా లక్షల కోట్ల కరెన్సీని ముద్రించి బ్యాంకింగ్‌లోకి ప్రవేశపెట్టింది. వినియోగం పెంచడానికి నేరుగా జనం ఖాతాల్లోకీ నగదు వేసింది. మిగిలిన దేశాలు కూడా బ్యాంకింగ్ వ్యవస్థలోకి నగదు ప్రవాహాన్ని పెంచాయి. అది జనం చేతుల్లోకి రావటం కోసం వడ్డీ రేట్లు తగ్గించాయి. అలా... ప్రపంచమంతా వినియోగాన్ని పెంచే పనిలో పడింది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... నగదు లభ్యత పెరగటంతో అసలే తక్కువగా ఉన్న వస్తువులకు డిమాండు... ఆ వెనకే ధరలూ పెరిగాయి. దిగుమతులపై ఆధారపడ్డ దేశాలు మరింత ఇబ్బందికి గురయ్యాయి. ఫలితంగా... ద్రవ్యోల్బణం రయ్యిమంది. కాకపోతే చాలా దేశాలు కొంతవరకూ దీన్ని తట్టుకుని మనగలిగాయి. అందుకే కరెన్సీలు కూడా ఆరేడు నెలల కిందటిదాకా కాస్తంత స్థిరంగానే కనిపించాయి. ఇదిగో... అప్పుడు మొదలయింది ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం. ఐదు నెలల కిందట మొదలయిన ఈ యుద్ధానికి ముగింపు దొరక్కపోవటం... ఎప్పటికి ముగుస్తుందో కూడా తెలియకపోవటంతో అసలే దెబ్బతిని ఉన్న సప్లయ్ వ్యవస్థలు మరింత కునారిల్లాయి. ముడిచమురు ఉత్పత్తిలో ప్రధాన వాటాదారైన రష్యాపై ఆంక్షల కారణంగా ముడి చమురు ఉత్పత్తి తగ్గి... ధర విపరీతంగా పెరిగింది. అన్ని దేశాల్లోనూ ద్రవ్యోల్బణం రికార్డులు తిరగ రాస్తోంది. దీన్ని కట్టడి చేయటానికి అమెరికాతో సహా... ప్రభుత్వాలన్నీ మళ్లీ వడ్డీ రేట్లు పెంచటం మొదలు పెట్టాయి. అమెరికా సైతం వడ్డీ రేట్లు పెంచుతూ అంతకు ముందు వ్యవస్థలోకి వదిలిన నగదును వెనక్కి తీసుకోవటం మొదలెట్టింది. వడ్డీ రేట్లు పెరిగితే... కరెన్సీ విలువ పతనం కావటమన్నది సహజం. డాలర్... ఎప్పుడూ పెరగటమేనా? కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. వడ్డీరేట్లు తగ్గుతున్నపుడు కూడా డాలర్‌తో పోల్చినప్పుడు మన కరెన్సీలు ఎంతో కొంత క్షీణిస్తూనూ వచ్చాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పుడు ఈ క్షీణత ఇంకాస్త ఎక్కువగా ఉంది. రెండు సందర్భాల్లోనూ డాలర్ మాత్రం పెరుగుతూనే వచ్చింది. ఎందుకలా? ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పుడు ప్రపంచమంతా సంక్షోభ పరిస్థితుల్లో ఉంది. అన్నిచోట్లా డిమాండ్ పడిపోయింది. దీంతో ఏమవుతుందోనన్న భయం కొద్దీ ప్రపంచమంతా సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ మార్గాలవైపు పరుగులెత్తింది. ఫలితంగా డాలర్ పెరిగి... ఇతర కరెన్సీలు క్షీణత నమోదు చేశాయి. ఇప్పుడు కూడా అంతే. అన్నిచోట్లా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే మళ్లీ వ్యవస్థలో నగదు తగ్గి... మళ్లీ అది మందగమనానికి దారితీస్తుంది. మాంద్యమూ వచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనూ డాలర్ ఇన్వెస్ట్మెంట్లే సురక్షితం. కాబట్టి డాలర్‌కే డిమాండ్. అందుకే అది పెరుగుతోంది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఒకటే! జాన్ కొనల్లీ 51 ఏళ్ల కిందట జీ10 సదస్సులో చేసిన వ్యాఖ్యలు... అక్షర సత్యాలని!!. ఎవరికి లాభం... ఎవరికి నష్టం లాభనష్టాల విషయానికొస్తే డాలర్ బలోపేతమై స్థానిక కరెన్సీలు బలహీనమవున్నప్పుడు అది దేశ ప్రజలందరికీ నష్టమేనని చెప్పాలి. నేరుగా డాలర్‌తో అవసరం లేకున్నా... డాలర్ బలపడితే ఏ దేశమైనా దిగుమతులకు ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. భారత్ విషయానికొస్తే మన మొత్తం జీడీపీలో 21 శాతం వరకూ దిగుమతులే. అదే సమయంలో ఎగుమతులు 18.5 శాతం వరకూ ఉంటాయి. దిగుమతుల్లో అత్యధికం ముడిచమురు వాటాయే. ఈ రెండింటికీ మరీ దారుణమైన తేడా లేదు కనకే మన కరెన్సీ కొంతైనా ఈ పరిస్థితులను తట్టుకోగలుగుతోందన్నది వాస్తవం. అయితే అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతూ పోతే మాత్రం ఆ ప్రభావం మన రూపాయిపై కాస్త తీవ్రంగానే పడుతుంది. విదేశాల్లో తమ పిల్లల్ని చదివించేవారికి ప్రధానంగా ఇది ఇబ్బందే. అనుకున్న బడ్జెట్లు తారుమారవుతాయి. అయితే తమ వారు విదేశాల్లో పనిచేస్తూ డాలర్లలో సంపాదించేవారికి మాత్రం ఇది చాలావరకూ ఊరటే. ఐటీ కంపెనీల వంటి ఎగుమతి ఆధారిత సంస్థలకు, అత్యధికంగా విదేశీ రెమిటెన్సులు వచ్చే కేరళ లాంటి రాష్ట్రాలకు ఈ పరిణామం కలిసొచ్చేదే. దేశం మొత్తానికి ఏటా వచ్చే 86 బిలియన్ డాలర్లలో 19 శాతం వరకూ కేరళ వాటాయే. కోవిడ్‌తో ఇది దెబ్బతిన్నా... మళ్లీ యథా పూర్వ స్థితికి చేరుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రూపాయి... 32 ఏళ్లలో 15 నుంచి 80కి! 1990కి ముందు డాలర్ విలువ 15 రూపాయలే. కాకపోతే ఆ మాత్రం వెచ్చించాలన్నా సర్కారుకు చుక్కలు కనిపించేవి. దాంతో దిగుమతులపై ఆంక్షలు. కార్లు, స్కూటర్లు, ఫోన్లు, గ్యాస్.. ఏదైనా దిగుమతి చేసుకోవాల్సిందే. దిగుమతికి డాలర్ల కొరత కనక డబ్బులు పెట్టి కొనాలనుకున్నా ఏదీ దొరకని పరిస్థితి. అన్నింటికీ రేషనే. 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా వచ్చాక సరళీకరణ విధానాలతో కంపెనీలకు ద్వారాలు తెరిచారు. అలా తెరిచిన రెండేళ్లలోనే డాలర్ విలువ ఏకంగా 30 రూపాయలకు చేరింది. నాటి నుంచి.. డాలర్ల అవసరంతో పాటు విలువ కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పుడైతే ముడిచమురు, వజ్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, భారీ యంత్రాలు, ప్లాస్టిక్స్, రసాయనాలు, వంటనూనెలు, ఉక్కు భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది కనక డాలర్ మాదిరే వీటి ధరలూ పెరుగుతున్నాయి. ఆ మేరకు సామాన్యులపైనా ఈ ప్రభావం పడుతోంది. మున్ముందు పరిస్థితేంటి? కోవిడ్ తదనంతర పరిస్థితులు ఇంకా కొలిక్కి రాలేదు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయిన వారు, కుటుంబాలను కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిన్నవారు కుదుటపడలేదు. అప్పట్లో డిమాండ్ లేక, అయినా నిర్వహించలేక మూతపడ్డ వ్యాపారాల పరిస్థితి అలానే ఉంది. ఇంతలోనే వచ్చిన ఉక్రెయిన్ యుద్ధం... ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించటం లేదు. ఇవన్నీ చూస్తుంటే సరఫరా వ్యవస్థలు పూర్తిస్థాయిలో కుదుటపడటానికి మరికొంత సమయం పట్టేలానే ఉంది. అప్పటి దాకా అంతా సురక్షితమైన పెట్టుబడులవైపు వెళతారు కనక డాలర్ మరింత బలోపేతమయ్యే అవకాశాలే ఎక్కువన్నది నిపుణుల అంచనా. ఈ లెక్కన చూస్తే రూపాయితో సహా ఇతర దేశాల కరెన్సీలు ఇంకాస్త పెరిగినా ఆశ్చర్యం లేదు. ఇక దీనితో ముడిపడి ఉన్న స్టాక్ మార్కెట్లలోనూ ఆటుపోట్లు తప్పవు. కాబట్టి డాలర్‌తో అవసరాలున్న వారు ఇవన్నీ గమనంలోకి తీసుకున్నాకే తగిన నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఒక్కటి మాత్రం నిజం. ఏ సంక్షోభమూ ఎక్కువకాలం ఉండదు. -
రికార్డ్ స్థాయిలో రూపాయి విలువ పతనం!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలపడుతున్న నేపథ్యంలో దేశీ రూపాయి పతనం కొనసాగుతోంది. గురువారం డాలర్‌తో పోలిస్తే మరో 18 పైసలు క్షీణించి 79.9975 వద్ద క్లోజయ్యింది. కీలక స్థాయి అయిన 80కి పైసా కన్నా తక్కువ దూరంలో నిల్చింది. టోకు ద్రవ్యోల్బణం వరుసగా 15వ నెలల జూన్‌లోనూ రెండంకెల స్థాయిలోనే కొనసాగడం, కరెంటు అకౌంటు లోటు మరింత దిగజారవచ్చన్న అంచనాలు, విదేశీ మారక నిల్వలు తగ్గనుండటం తదితర అంశాలు రూపాయి పతనానికి కారణమయ్యాయి. గడిచిన కొద్ది రోజుల్లో క్రూడాయిల్ రేట్లు తగ్గడం .. దేశీ కరెన్సీ మరింతగా పడిపోకుండా కొంత ఊతమిచ్చినట్లు విశ్లేషకులు తెలిపారు. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పటిష్టంగా 79.71 వద్ద ప్రారంభమైంది. కానీ యూరప్ మార్కెట్లు ప్రారంభమయ్యాక మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలరు ఏకంగా 24 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎగియడంతో రూపాయి పడిపోయింది. క్రితం ముగింపు 79.81తో పోలిస్తే 18 పైసలు పతనమైంది. -
తగ్గుతున్న డాలరు ఆధిపత్యం
రష్యా ఆర్థిక వ్యవస్థను పతనం చేయాలనే వాంఛ అమెరికా మిత్ర దేశాలకు ఎప్పటి నుండో ఉండగా ఉక్రెయిన్ యుద్ధం కలిసొచ్చింది. విదేశీ బ్యాంకుల్లో 80,000 కోట్ల డాలర్లకు పైగా ఉన్న రష్యా నగదు నిల్వలపై ఆంక్షలు విధించి జప్తు చేయనారంభించి, ‘స్విఫ్ట్’ వ్యవస్థ నుండి రష్యాను బహిష్కరించటంతో కంపెనీల జమాఖర్చుల లావాదేవీలు నిలిచిపోతున్నాయి. రూబుల్ విలువ పడిపోతున్న సమ యంలో, పుతిన్ ఎత్తుగడతో, మార్చి 24న రష్యా రూబుల్ తోనే తమ చమురు, గ్యాస్‌కు చెల్లించాలని ప్రపంచ దేశాలకు అల్టిమేటం జారీ చేశాడు. దీంతో ముఖ్యంగా యూరప్ దేశా లైన జర్మనీ, ఫ్రాన్స్ ఇరకాటంలో పడ్డాయి. అమెరికా ఏకంగా తాను తీసుకొన్న గోతిలో తానే పడిపోయినంత వ్యథ చెందు తున్నది. ప్రపంచంలో 12 శాతం ముడి చమురును ఉత్పత్తి చేస్తూ యూరపు దేశాలకు అవసరమగు 40 శాతం పైగా ఇంధనాన్ని రష్యా ఎగుమతి చేస్తుంది. ఫ్రాన్స్ మాక్రోన్, జర్మన్ షోల్జ్లు రూబుల్ కరెన్సీ మారకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒప్పందాల ప్రకారం యూరోలో లేదా డాలరులో చెల్లిస్తామంటున్నారు. చెల్లిం పుల మొత్తం ఎలానూ స్విఫ్ట్ ద్వారా రష్యా ఖాతాల్లోకి జమ కాదు, అలా జరిగినా బ్యాంకుల్లోని నిల్వలను స్తంభింప జేస్తారు. పుతిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ ప్రెస్కోవ్ మాత్రం రూబుల్ చెల్లింపులతోనే గ్యాసు, ఆయిల్ పంపిస్తామనీ, చారిటబుల్ సంస్థను నడపటం లేదనీ నిర్మొహమాటంగా స్పందించాడు. యుద్ధం ముందు ఒక డాలరుకు 75 రూబుళ్లు ఉన్న మారకపు విలువ, ఆంక్షలతో 145కు చేరి, ప్రస్తుతానికి 95 రూబుళ్లతో స్థిరత్వం దిశగా పయనిస్తోంది. మరోవైపు సౌదీ అరేబియా, చైనాల మధ్య ముడి చమురు వాణిజ్యం యువాన్లతో జరపటానికి సౌదీ అంగీ కరించింది. చైనా ఇంధన అవసరాలను 25 శాతం వరకూ సౌదీ అరేబియా తీరుస్తుంది. యువాన్‌లో సౌదీ లావాదేవీలు జరిపితే చైనా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావటం, డాలరు ప్రాధాన్యత తగ్గటం ఒకేసారి జరుగుతుంది. ఇప్పటికే రష్యా, చైనా యువాన్ వాణిజ్యానికి ముందుకొచ్చాయి. సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ షేక్ మొహమ్మద్ నహ్వాన్ ఇద్దరూ వైట్‌హౌస్ నుండి వచ్చిన ఫోన్‌కాల్స్‌కు స్పందించలేదంటే మధ్య ప్రాచ్యంలో డాల రుతో పాటుగా అమెరికా ఎంత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కో నుందో అర్థమవుతుంది. డాలరు ఆధిపత్య వ్యతిరేక పోరులో నేను సైతం అంటూ భారత్ ముందుకు వస్తోంది. రష్యాతో లోగడ కుది రిన ఒప్పందం ప్రకారం తక్కువ ధరకు ముడి చమురును భారత్ దిగుమతి చేసుకొంటున్నది. రష్యా భారత్ మధ్య ఇకపై రూబుల్–రూపాయి వాణిజ్యం జరగనుందని వార్తలొస్తున్నాయి. వీరికి తోడు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని అనేక దేశాలు ఈ బాటనే అనుకరించటానికి సిద్ధంగా ఉన్నాయి. 1944లో న్యూహాంషైర్ బ్రెట్టన్ ఉడ్స్‌లో 44 సభ్యదేశాలు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను, ప్రపంచ బ్యాంకులను స్థాపించి బంగారు నిల్వల ఆధారంగా అమెరికా డాలరును అంతర్జాతీయ కరెన్సీగా ప్రకటించాయి. 1971లో బంగారు నిల్వలు అమెరికా దగ్గర లేకపోవటంతో అమెరికాకు ముడి చమురును ఎగుమతి చేయబోమని అరబ్ దేశాలు ప్రక టించాయి. అమెరికా ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది. మరలా నిక్సన్ షాక్ పేరిట ఫ్లోటింగ్ డాలరు రూపాంతరం చెంది, ఇప్పటివరకూ వాల్‌స్ట్రీట్‌లోని తన అనుకూల ఫారిన్ ఎక్స్ఛేంజ్ విభాగంతో ప్రపంచ కరెన్సీలతో తనకు అను కూలంగా కరెన్సీ మార్పిడులను చేస్తోంది. కృత్రిమ డాలరు మార్పిడీకి వ్యతిరేకంగా ఫ్రాన్స్, జర్మనీ 1970 ప్రాంతంలోనే బ్రెట్టెన్ ఉడ్ సిస్టమ్ నుండి తప్పుకొని బలపడ్డాయి. డాలరు మార్పిడీలతో అనేక దేశాలు బలవు తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలన్నిటితో (మెక్సికోతో తప్ప) అమెరికా వాణిజ్య లోటుతో, సుమారు 25 లక్షల కోట్ల డాలర్ల రుణంతో ఉన్నా, తన చేతిలోని వాల్‌స్ట్రీట్ ఊహాజనిత ద్రవ్య పెట్టుబడులతో, ఫోరెక్స్ మారకాన్ని కృత్రిమంగా నడుపుతూ, ఆయుధ అమ్మకాలతో, కృత్రిమ మేధో సంపత్తితో జూదమాడుతోంది. డాలరుకు ప్రత్యమ్నాయంగా వాణిజ్యం చేయగలిగిననాడు, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తున్న డాలరు ఆధిపత్యం పతనంగాక తప్పదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, కె.ఎల్. యూనివర్సిటీ ‘ 98494 91969 -
టాప్ ఎంఎన్సీల్లో సీఈవోలు.. కానీ జీతం ఒక డాలరే.. ఎందుకో తెలుసా?
కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే సీఈవోల వార్షిక వేతనం రూ. కోట్లలో ఉండటం సహజమే. దిగ్గజ సంస్థల్లో పనిచేసే కొందరైతే రూ. వందల కోట్లు కూడా ఆర్జిస్తుంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఎంఎన్సీల్లో పనిచేసే సీఈవోల్లో చాలా మంది కేవలం ఒక డాలర్ వేతనాన్నే ఎందుకు తీసుకుంటున్నారు? తమ తెలివితేటలతో ఆయా సంస్థలను అగ్రపథాన నడిపిస్తున్నప్పటికీ వారు ఇలా నామమాత్ర జీతాన్ని అందుకోవడానికి కారణమేంటి? ఇది నిజంగా వారు చేస్తున్న త్యాగమా? లేక దీని వెనక ఏమైనా గిమ్మిక్కు దాగి ఉందా? చరిత్రను పరిశీలిస్తే... ► బడా సంస్థల సీఈవోలు కేవలం ఒక డాలర్ వేతనాన్ని తీసుకొనే సంప్రదాయం రెండో ప్రపంచ యుద్ధం ముగియగానే మొదలైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి తొలి ప్రాధాన్యత ఇస్తూ అప్పట్లో చాలా మంది ఈ నిర్ణయం తీసుకున్నారు. ► చాలా మంది ఎగ్జిక్యూటివ్‌లు అమెరికా ప్రభుత్వానికి ఉచితంగా తమ సేవలు అందించేందుకు ముందుకొచ్చారు. అయితే జీతం ఇవ్వకుండా పనిచేయించుకోవడం చట్టప్రకారం నిషిద్ధం కావడంతో అలా ముందుకొచ్చిన వారికి ఒక డాలర్ వేతనాన్ని ఆఫర్ చేశారు. ► అలా నామమాత్ర జీతం అందుకున్న వారు ‘డాలర్–ఎ–ఇయర్–మెన్’గా పేరుగాంచారు. చదవండి: పంచంలోనే పొడవైన మెట్రో లైన్.. ప్రత్యేకతలు ఇవే! త్యాగధనులు అనిపించుకోవడానికి... ► అమెరికాలోని టాప్–3 ఆటోమొబైల్ తయారీ సంస్థల్లో ఒకటైన క్రిస్లర్ 1980లో కుప్పకూలే స్థితికి చేరుకున్నప్పుడు అప్పటి సీఈవో లీ ఇయాకోకా ప్రభుత్వం నుంచి 1.5 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ సాధించి సంస్థను గట్టెక్కించారు. అదే సమయంలో సంస్థలోని కార్మికులు, డీలర్లు, సరఫరాదారులు వారికి రావాల్సిన బకాయిలను స్వచ్ఛందంగా వదులుకొనేలా ఒప్పించారు. ► సంస్థను తిరిగి గాడినపెట్టేందుకు తాను కృషి చేస్తున్నట్లు చాటిచెప్పేందుకు తన వేతనాన్ని ఒక డాలర్‌కు తగ్గించుకున్నారు. వాటాదారులకు సంఘీభావం తెలిపేలా... ►ఏడాదికి కేవలం ఒక డాలర్ వేతనాన్ని అందుకుంటున్నట్లు చూపడం ఓ రకంగా ప్రతీకాత్మకమే.. సంస్థ గడ్డు పరిస్థితిలో ఉన్నప్పుడు వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నట్లు చెప్పడానికి సీఈవోలు ఇలా వ్యవహరిస్తుంటారు. ► ఏటా కేవలం ఒక డాలర్ వేతనాన్ని అందుకొనే సీఈవోలు నిజానికి సంస్థ స్టాక్‌లు, ఆప్షన్లు, బోనస్‌లను పనితీరు ఆధారిత పరిహారం కింద అందుకుంటుంటారు. చదవండి: సగం కొట్టేసిన బిల్డింగ్‌లా కనిపిస్తోందా.. అలా అనుకుంటే పొరపాటే! బయటకు కనిపించేంత నిస్వార్థపరులేం కాదు..! ► పనితీరు ఆధారిత చెల్లింపుల కింద సీఈవోలు పొందే భారీ మొత్తాలపై చాలా వరకు తక్కువ పన్ను రేటే వర్తిస్తుంది. ► సీఈవోలకు చేసే ఈ తరహా చెల్లింపులను సంస్థ పన్ను ఆదాయంలోంచి కోతపెట్టేందుకు 1993లో అమెరికా చేసిన చట్టం అనుమతిస్తుంది. అంటే ఓ రకంగా చూస్తే సీఈవోలు పొందే భారీ మొత్తాలకు పన్ను చెల్లింపుదారులు సబ్సిడీ ఇస్తున్నట్లే లెక్క. ► కేవలం ఒక డాలర్ వార్షిక వేతనం అందుకొనే టెస్లా సీఈవో ఎలన్ మస్క్ 2018లో ఫెడరల్ ఆదాయ పన్నుల కింద దమ్మిడీ కూడా చెల్లించలేదట! ఒక అధ్యయనంలో తేలింది ఏమిటంటే... ► 2011లో 50 మంది సీఈవో లపై చేపట్టిన ఓ సర్వే గణాంకాలను (2019 ద్రవ్యోల్బణ విలువలకు సరిదిద్దాక) పరిశీలిస్తే ఒక డాలర్ వార్షిక వేతనం అందుకొనే సీఈవోలు సగటున జీతం కింద 6.10 లక్షల డాలర్లను వదలుకుంటున్నట్లు వెల్లడైంది. కానీ అదే సమయంలో వారు బయటకు ఎవరికీ పెద్దగా కనపించని ఈక్విటీ ఆధారిత పరిహారం కింద 20 లక్షల డాలర్ల మేర లబ్ధి పొందుతున్నట్లు తేలింది! చదవండి: పిండి, కోడి గుడ్లు.. ఇలాంటి తమాషా యుద్ధం ఎప్పుడైనా చూశారా? 100 రెట్లకుపైగా... ► 2019లో జరిగిన మరో అధ్యయనం ప్రకారం... అమెరికాలోని 500 బడా కంపెనీల సీఈవోల్లో 80 శాతం మంది తమ సంస్థల్లో పనిచేసే ఓ మధ్యశ్రేణి ఉద్యోగి వేతనానికి 100 రెట్లకుపైగా ఆర్జిస్తున్నారు. అసమానతల దృష్టి మళ్లించేందుకే... ► గత కొన్ని దశాబ్దాలుగా సీఈవో–ఉద్యోగి మధ్య వేతన వ్యత్యాసం ఎన్నో రెట్లు పెరిగిపోయింది. ►ఆర్థిక అసమానతలపై ఉద్యోగ సంఘాల దృష్టి మళ్లించేందుకు సీఈవోల నామమాత్ర వేతనం ఒక మార్గంగా మారినట్లు ఓ పరిశోధన గుర్తించింది. ►బాగా శక్తిమంతమైన సీఈవోలు ఒక డాలర్ జీతం విధానాన్నే ఎంచుకుంటారని, తద్వారా సంస్థ నుంచి వారు పొందే మొత్తం పరిహారంపై ఎక్కడా గగ్గోలు చెలరేగకుండా చూసుకుంటారని ఆ పరిశోధనలో వెల్లడైంది. చదవండి: గాల్లో తాడుపై నడిచాడు.. ఇది మామూలు రికార్డు కాదు! తిరగబడ్డ తెలివి... ► ఒక డాలర్ వార్షిక వేతనంగా పొందే సీఈవోలు ప్రాతినిధ్యం వహించే సంస్థలు తమ ఆస్తులు, రాబడులపై నెలకు ఆర్జించే సొమ్ము... మార్కెట్ రేటు వేతనాలు పొందే సీఈవోలు ఉన్న కంపెనీలతో పోలిస్తే ఒక శాతం తక్కువని 2014లో జరిగిన ఓ అధ్యయనం పేర్కొంది. ► ఒక డాలర్ వేతనం పొందే సీఈవోల అతివిశ్వాసం లేదా తమ కొలువుకు ఢోకా ఉండదన్న వైఖరి వల్ల ఆయా సంస్థల్లో ఇలా ‘పనితీరు తగ్గుదల’కనిపించినట్లు సర్వే వివరించింది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
రూపాయి ‘రికార్డు’ పతనం! కారణం ఏంటంటే..
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ట పతనం దిశగా కదులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బుధవారం 44 పైసలు పతనమై, 76.32 వద్ద ముగిసింది. గడచిన 20 నెలల్లో (2020 ఏప్రిల్ తరువాత) రూపాయి ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి. అలాగే ఒకేరోజు రూపాయి ఈ స్థాయి పతనం కూడా గడచిన ఎనిమిది నెలల్లో ఇదే తొలిసారి. భారత్ కరెన్సీ మంగళవారం ముగింపు 75.88. డిసెంబర్లో గడచిన 11 ట్రేడింగ్ సెషన్లలో తొమ్మిది రోజుల్లో రూపాయి 119 పైసలు (1.58 శాతం) నష్టపోయింది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). కారణాలు ఏమిటి? ►అమెరికాసహా పలు దేశాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్ర రూపంలో ఉంది. అమెరికాలో అక్టోబర్, నవంబర్ నెలల్లో 31 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత రిటైల్ ద్రవ్యోల్బణం (వరుసగా 6.2 శాతం, 6.8 శాతం) నమోదయ్యింది. ఈ పరిస్థితుల్లో అమెరికా సెంట్రల్ బ్యాంక్ సరళతర విధానానికి త్వరలో ముగింపు పలకనున్నదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0–0.25 శాతం) పెంచే అవకాశం ఉందని అంచనా ఉంది. ►ఈ పరిస్థితుల్లో సరళతర ఆర్థిక విధానాలతో విదేశీ మార్కెట్లను ముంచెత్తిన డాలర్లు వెనక్కు మళ్లడం ప్రారంభమైంది. ఫలితంగా ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ గడచిన నెల రోజులుగా భారీగా బలపడుతోంది. తీవ్ర అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడులకు డాలర్ సురక్షిత ఇన్స్ట్రమెంట్గా కూడా కనబడుతోంది. ►దీనితో దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర అనిశ్చితికి గురవుతున్నాయి. మార్కెట్ల నుంచి విదేశీ నిధులు వెనక్కు మళ్లుతున్నాయి. ఈ ప్రభావం రూపాయి సెంటిమెంట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ►ఇక అంతర్జాతీయంగా క్రూడ్ ధర భయాలు, దేశంలో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు భయాలూ రూపాయిని వెంటాడుతున్నాయి. ►దీనికితోడు కరోనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్ భయాలు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ►ఈ వార్తా రాస్తున్న రాత్రి 8 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో రూపాయి విలువ నష్టాల్లో 76.31 వద్ద ట్రేడవుతుండగా, డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 96.50 వద్ద ట్రేడవుతోంది. -
రూపాయి డౌన్.. 16 నెలల తర్వాత కనిష్టానికి!
Indian Rupee Value Falling Reasons: డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో పడిపోయింది. ఏకంగా 10 పైసలు బలహీనపడి 75.60కి పడిపోయింది. గడచిన 16 నెలల నెలల్లో (2020 జూలై 1 తర్వాత) రూపాయి ఈ స్థాయికి పతనం కావడం ఇదే తొలిసారి. ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ నిధుల బయటకు వెళుతుండడం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ పటిష్టత వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. కోవిడ్ 19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలు గ్లోబల్ ఎకానమీని వెంటాడుతుండడం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడ్డం కూడా భారత్ కరెన్సీపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ట్రేడింగ్‌లో రూపాయి 75.45 వద్ద ప్రారంభమైంది. మొదట్లో వచ్చిన లాభాలను నిలబెట్టుకోలేక పోయింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితిపై భయాలు ఒకవైపు– వడ్డీరేట్లు పెరగవచ్చన్న అంచనాలు మరోవైపు నెలకొన్న నేనథ్యంలో డాలర్ ఇండెక్స్ కూడా పటిష్టంగా కొనసాగుతుండడం గమనార్హం. గత రాత్రి 11 గంటల సమయంలో.. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ నష్టాల్లో 75.65వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ భారీ లాభాల్లో 96 ఎగువన ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). కొత్త వేరియంట్ పరిణామాలు, దేశంలోకి విదేశీ నిధుల రాక వంటి అంశాలపై ఆధారపడి రూపాయి తదుపరి కదలికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చదవండి: మూడో రోజూ ముందుకే! -
డాలర్ల రాకపై రూపాయి భరోసా
ముంబై: దేశానికి మరింత భారీగా డాలర్లు వస్తా యన్న భరోసా రూపాయి సెంటిమెంట్‌ను బలపరుస్తోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ సోమవారం 40 పైసలు బలపడి 73.29కి చేరింది. గడచిన రెండు నెలల్లో (జూన్ 14 తర్వాత) రూపాయి ఈ స్థాయికి బలోపేతం కావడం ఇదే తొలిసారి. వడ్డీరేట్లు సమీపకాలంలో పెంచే అవకాశాలు లేవని అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్ సంకేతాలు డాలర్ బలహీనతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 73.20 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ స్వల్ప నష్టాలతో 92.29 వద్ద ట్రేడవుతోంది. భారత్ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం రూపాయి ముగింపు 73.69. సోమవారం 73.46 వద్ద ప్రారంభమైంది. 73.21 గరిష్ట–73.54 కనిష్ట శ్రేణిలో కదలింది. గడచిన మూడు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి లాభపడుతూ వస్తోంది. డాలర్‌పై ఈ రోజుల్లో 95 పైసలు లాభపడింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
మార్కెట్‌కు ‘ఫెడ్’ పోటు
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వెల్లడించిన విధాన పరపతి నిర్ణయాలు ఈక్విటీ మార్కెట్లను నిరాశపరిచాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 76 పైసల పతనం నుంచీ ప్రతికూల సంకేతాలు అందాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 179 పాయింట్లు క్షీణించి 52,323 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయి 15,691 వద్ద నిలిచింది. సూచీలకిది రెండోరోజూ నష్టాల ముగింపు. ఫెడ్ విధాన కమిటీ బుధవారం రాత్రి పాలసీ నిర్ణయాలు ప్రకటించింది. అందరూ ఊహించినట్లే కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. అయితే 2024 తొలినాళ్లలో పెంచుతారని భావించిన వడ్డీరేట్లను 2023లోనే పెంచే అవకాశం ఉందనే సంకేతాలను ఇచ్చింది. నెలకు 120 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను కొంటామని తెలిపింది. ఫెడ్ అనూహ్య నిర్ణయాలతో డాలర్, బాండ్ ఈల్డ్స్ పెరిగి ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం సెన్సెక్స్ 380 పాయింట్లు నష్టంతో 52,122 వద్ద, నిఫ్టీ 120 పాయింట్ల నష్టంతో 15,648 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఆరంభ నష్టాలను పూడ్చుకోగలింది. యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. చివర అరగంటలో అమ్మకాలు మరోసారి వెల్లువెత్తడంతో సూచీల నష్టాల ముగింపు ఖరారైంది. ఒక్క ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల్లో అమ్మకాలు జరిగాయి. రూపాయి పతనం ఐటీ షేర్లకు కలిసొచ్చింది. అత్యధికంగా బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.880 కోట్ల షేర్లను అమ్మారు. దేశీయ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ. 45 కోట్ల షేర్లను కొన్నారు. చదవండి: వేల కోట్ల నష్టం: అదానీ గ్రూప్ సీఎఫ్ఓ స్పందన -
రూపాయికి ‘విదేశీ’ బలం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఒకేరోజు 52 పైసలు పెరిగి, 74.32 వద్ద ముగిసింది. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి (మార్చి 18 తర్వాత). గడచిన ఒకటిన్నర నెలల్లో రూపాయి ఈ స్థాయిలో (52 పైసలు) పెరగడం ఇదే తొలిసారి. దేశంలోకి కొనసాగుతున్న విదేశీ నిధుల ప్రవాహం, ఈక్విటీల పెరుగుదల వంటి అంశాలు దీనికి కారణం. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లో ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ బలహీన ధోరణి కూడా రూపాయి సెంటిమెంట్‌కు దోహదపడింది. రూపాయి 74.91 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. అనంతరం మరింత బలపడింది. రోజంతా 74.31 గరిష్టం–74.91 కనిష్ట స్థాయిల మధ్య తిరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో అధికంగా ఉన్న లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) భారత్ వంటి వర్ధమాన మార్కెట్లలోకి వస్తోంది. ఆగస్టులో ఇప్పటి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు రూ.41,330 కోట్లను భారత్ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టారు. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
మూడో రోజూ రూపాయి పరుగు..
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా మూడవరోజూ లాభపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమ, మంగళ, బుధవారాల్లో రూపాయి 89 పైసలు లాభపడితే, ఒక్క బుధవారం 33 పైసలు పెరిగింది. 68.41 వద్ద ముగిసింది. ఇది ఎనిమిది నెలల గరిష్ట స్థాయి. సరఫరా ఆందోళనలతో చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ రూపాయి బలోపేత ధోరణి కొనసాగుతుండడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో ప్రధాన కరెన్సీలతో అమెరికా డాలర్ బలహీనత ఇక్కడ రూపాయికి ప్రధానంగా కలిసివస్తోంది. ఉదయం 68.72 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 68.37ను కూడా తాకింది. రూపాయికి నిరోధం 68.50 వద్ద ఉంటే, ఆ స్థాయిపైన రూపాయి ముగియడం గమనార్హం. ఇదే విధమైన ముగింపులు మరో రెండు రోజులు కొనసాగితే, రూపాయి తిరిగి 67ను చూస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. నేడు రేటు తగ్గిస్తే, మరింత బలోపేతం! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం) తగ్గిస్తే, రూపాయి మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో ఫెడ్ ఫండ్ రేటు పెంచలేని పరిస్థితి ఉంటేనే దేశంలోనూ ఆర్బీఐ మరో పావుశాతం రేటు కోతకు నిర్ణయం తీసుకుంటుంది. ఫెడ్ ఫండ్ రేటు పెరగలేదంటే అది అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనానికి నిదర్శనం. ఇది డాలర్ బలహీనతకు దారితీస్తుంది. రూపాయికి మరింత లాభం చేకూర్చే అంశం ఇది. రూపాయి పరుగుకు మరిన్ని కారణాలను విశ్లేషిస్తే... ► ఎన్నికల అనంతరం దేశ ప్రధానిగా మళ్లీ నరేంద్రమోదీనే పగ్గాలు చేపడతారన్న విశ్లేషణలు. ► ఈ అంచనాల నేపథ్యంలో డెట్, ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం. ► క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నా, ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందన్న అంచనాలు. ► వృద్ధి క్రియాశీలతకు రేటు తగ్గింపు ఉంటుందన్న అంచనాలు. ► డాలర్ ఇండెక్స్ కదలికలపై అనిశ్చితి. ► అమెరికా సెంట్రల్ బ్యాంక్– రేటు (ప్రస్తుత శ్రేణి 2.25–2.50) పెంపు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందన్న అభిప్రాయం. ► మూడేళ్ల ఫారిన్ ఎక్సే్చంజ్ స్వాప్ ఆక్షన్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పది బిలియన్ డాలర్ల లిక్విడిటీని (ద్రవ్య లభ్యత) వ్యవస్థలోకి పంప్ చేయడం. ► వెరసి ఆసియా దేశాల కరెన్సీలన్నింటిలోనూ ఉత్తమ పనితీరును రూపాయి కనబరిచింది. 74.39 కనిష్టం నుంచి... అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 18 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. గత రెండు నెలలుగా 72–70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమవుతోంది. అయితే క్రూడ్ ధరల కత్తి ఇప్పటికీ వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.