స్వాప్‌తో 25 బిలియన్ డాలర్లు
ముంబై: స్వాప్ విండో ద్వారా బ్యాంకులు ఇప్పటి వరకూ 25 బిలియన్ డాలర్లను సమీకరించినట్లు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ హెచ్‌ఆర్ ఖాన్ సోమవారం తెలిపారు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ), విదేశీ కరెన్సీ రుణాల ద్వారా ఈ మొత్తాన్ని బ్యాంకులు సమీకరించినట్లు తెలిపారు. రూపాయి బలోపేతానికి ప్రవేశపెట్టిన ఈ పథకం నవంబర్‌తో ముగియాల్సి ఉంది. అయితే దీనిని ఇటీవలే ఆర్‌బీఐ డిసెంబర్ వరకూ పొడిగించింది. డిసెంబర్ చివరికల్లా వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ఇండెక్స్‌డ్ బాండ్లను ఆర్‌బీఐ ఆవిష్కరిస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.