సౌదీ అరేబియా నిర్ణయం.. డాలర్‌ ఆధిపత్యానికి ఎసరు! | Saudi Arabia not to renew 50 year petro dollar deal with US implications are | Sakshi
Sakshi News home page

సౌదీ అరేబియా నిర్ణయం.. డాలర్‌ ఆధిపత్యానికి ఎసరు!

Published Thu, Jun 13 2024 9:51 PM | Last Updated on Thu, Jun 13 2024 9:59 PM

Saudi Arabia not to renew 50 year petro dollar deal with US implications are

యూనైటెడ్ స్టేట్స్‌తో సౌదీ అరేబియా 50 సంవత్సరాల పెట్రో-డాలర్ ఒప్పందం ఈ ఏడాది జూన్ 9తో ముగిసింది. ఈ ఒప్పందాన్ని ఇక పునరుద్ధరించరాదని సౌదీ అరేబియా నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాలను చూపుతోంది.

1974 జూన్ 8న యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియా సంతకం చేసిన ఈ భద్రతా ఒప్పందం రెండు ఉమ్మడి కమిషన్లను ఏర్పాటు చేసింది. ఒకటి ఆర్థిక సహకారం మరొకటి సౌదీ అరేబియా సైనిక అవసరాల కోసం ఏర్పాటు చేశారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య మరింత సన్నిహిత సహకార శకానికి నాంది పలికింది. ఇది సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని పెంచడానికి ప్రేరేపిస్తుందని అప్పట్లో అమెరికా అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. వాషింగ్టన్, ఇతర అరబ్ దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి దీన్ని ఒక బ్లూప్రింట్ గా  భావించారు.

సౌదీ అరేబియా నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక నమూనా మార్పును సూచిస్తుంది. పెట్రోడాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తుంది. ప్రత్యామ్నాయ కరెన్సీలకు తలుపులు తెరుస్తుంది. 

పెట్రోడాలర్‌ ఒప్పందం ముగింపు ప్రభావాలు ఇవే..

  • యూఎస్‌ డాలర్‌ కాకుండా చైనీస్ ఆర్ఎంబీ, యూరోస్, యెన్, యువాన్ వంటి ఇతర  కరెన్సీలలో చమురు అమ్మకాలను అనుమతించడం ద్వారా సౌదీ అరేబియా పెట్రోడోలార్ వ్యవస్థ నుంచి దూరంగా వెళుతోంది. 1972లో ఏర్పాటైన ఈ వ్యవస్థ చమురు లావాదేవీలను ప్రత్యేకంగా అమెరికా డాలర్ తో ముడిపెట్టింది. ఇప్పుడు చమురు వాణిజ్యంలో ఇతర కరెన్సీలు ప్రాముఖ్యతను పొందుతాయి.

  • పెట్రోడాలర్ వ్యవస్థ చాలాకాలంగా యూఎస్ డాలర్ ప్రపంచంలో ప్రాథమిక రిజర్వ్ కరెన్సీ హోదాకు మద్దతు ఇస్తోంది. సౌదీ అరేబియా వైవిధ్యీకరణ యూఎస్‌ డాలర్‌ స్థానాన్ని బలహీనపరుస్తుంది. ఇది ప్రపంచ వాణిజ్యం, నిల్వల కోసం ఇతర కరెన్సీల వాడకాన్ని పెంచడానికి దారితీస్తుంది.  

  • సౌదీ అరేబియా ప్రత్యేక డాలర్ లావాదేవీలకు దూరంగా ఉండటంతో డాలర్ కు డిమాండ్ తగ్గవచ్చు. ఇది దాని మారకం రేటు, ప్రపంచ కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తుంది

  • సౌదీ అరేబియా "పెట్రోయువాన్" వైపు అడుగులు వేస్తే, అది డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీస్తుంది అంతర్జాతీయ వాణిజ్యంలో యువాన్ పాత్రను పెంచుతుంది.

  • సౌదీ అరేబియా బిట్ కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలను ప్రోత్సహించడం చెల్లింపు పద్ధతులను మరింత వైవిధ్యపరుస్తుంది. ఇది సాంప్రదాయ కరెన్సీలను ప్రభావితం చేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement