దేశీయ టెక్ దిగ్గజాలకు రూపీ షాక్
డాలర్ కు వ్యతిరేకంగా రూపాయి విలువ ఈ ఏడాది ఇప్పటివరకు 5.6 శాతం జంప్ అయింది. ఇది ద్రవ్యోల్బణం దిగిరావడానికి సహకరిస్తోంది. కానీ ఎక్స్ పోర్టు సర్వీసు కంపెనీల ఆదాయాలకు ఛాలెంజింగ్ గా మారిందన్నారు. ఒక్క టెక్నాలజీ కంపెనీలకే కాక, డ్రగ్ కంపెనీలకు భారీగానే దెబ్బతీస్తుందట. ఇటీవలే టెక్, ఫార్మా దిగ్గజాలు హెచ్-1బీ వీసా, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ దాడులతో సతమతమవుతూ వచ్చాయి. కానీ ప్రస్తుతం ఇది మరో సమస్యలా వాటికి పరిణమిస్తోంది.
అయితే ఈ క్వార్టర్ వరకు వెల్లడించిన కంపెనీ ఆదాయాలపై రూపాయి విలువ పెంపు ప్రభావం చూపిందని తాము భావించడం లేదని రాకేశ్ చెప్పారు. కానీ రూపాయి విలువ 1 శాతం పెరుగతున్న ప్రతిసారి, ఐటీ ఎక్స్ పోర్టు కంపెనీల మార్జిన్లు 25-30 బేసిస్ పాయింట్లు తుడిచిపెట్టుకుపోతాయన్నారు. వచ్చే క్వార్టర్లో ఫార్మా కంపెనీల ఆదాయాలు 4 శాతం నుంచి 6 శాతం, సాప్ట్ వేర్ సంస్థల ఆదాయాలు 2 శాతం నుంచి 3 శాతం పడిపోతాయని ముంబాయికి చెందిన టీసీజీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ చక్రీ లోకప్రియ చెప్పారు.