
పెరిగిన బంగారం ధర
హాంగ్ కాంగ్: బంగారం ధర హాంగ్ కాంగ్ మార్కెట్ లో పెరిగింది. మంగళవారం మార్కెట్ ప్రారంభం కాగానే పసిడి ధర 140 హాంగ్ కాంగ్ డాలర్లు పెరిగింది. దీంతో టయల్ బంగారం ధర 11,190 హాంగ్ కాంగ్ డాలర్లకు చేరుకుందని చైనీస్ గోల్డ్ అండ్ సిల్వర్ ఎక్స్ఛేంజ్ సొసైటీ ప్రకటించింది.
ట్రాయ్ ఔన్స్ బంగారం ధర 1212.01 అమెరికన్ డాలర్లగా ఉందని తెలిపింది. అమెరికా డాలర్ పోలిస్తే హాంగ్ కాంగ్ డాలర్ మారకం విలువ 7.75గా ఉంది.