
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (ఫిబ్రవరి 21) బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరిగితే.. మరికొన్ని ప్రాంతాల్లో తగ్గాయి. గోల్డ్ రేటు ఎక్కడ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే..
➤హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,100 వద్ద ఉన్నాయి. భాగ్యనగరంలో నేడు 22 క్యారెట్ గోల్డ్ రేటు తగ్గింది. 24 క్యారెట్ బంగారం ధర పెరిగింది.
➤విజయవాడలో బంగారం ధరలు తగ్గాయి. దీంతో ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 8,7750 వద్ద ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ రేటు వరుసగా రూ. 450, రూ. 290 తగ్గింది. ముంబైలో కూడా ఇదే ధరలు కొనసాగుతాయి.
➤చెన్నైలో కూడా పసిడి రేటు తగ్గుముఖం పట్టింది. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,250 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 8,7550 వద్దకు చేరింది.
➤బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 80,250 వద్ద, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 8,7550 వద్ద ఉంది.
➤దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే ఢిల్లీలో ఈ రోజు గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 550 తగ్గి రూ. 80300 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 640 తగ్గి రూ. 87550 వద్ద ఉంది.
వెండి ధరలు
బంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ ఉన్నప్పటికీ.. వెండి ధర మాత్రం గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉండి, నేడు (శుక్రవారం) రూ. 100 తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,900 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,00,400 వద్ద ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment