లండన్: ఒపెక్ డీల్ కు పెట్టుబడిదారుల మద్దతు లభించినట్టు కనిపిస్తోంది. అల్జీరియా నాన్ ఒపెక్, ఒపెక్ దేశాల సమావేశం నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు బలపడుతున్నాయి. బ్రెంట్ చమురు బ్యారల్ ధర 50 డాలర్లను అధిగమించింది. ఆగస్ట్ తరువాత ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా చమురు ధరలు ర్యాలీ అయ్యాయి. యూరోప్, ఆసియా మార్కెట్లు పెద్ద మార్కెట్లు గా ఉండగా, జర్మనీ, చైనా మార్కెట్లకు సోమవారం సెలవు.
గత వారం అల్జీరియాలో జరిగిన రష్యా వంటి నాన్ ఒపెక్ దేశాలతో ఒపెక్ దేశాలు నిర్వహించిన సమావేశంలో ఉత్పత్తిలో కోత విధించేందుకు సౌదీ అరేబియా తదితర దేశాలు అంగీకరించాయి. గతరెండేళ్లుగా క్షీణిస్తున్న ధరలను ఊతం దిచ్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. రోజుకి 7.5 లక్షల బ్యారళ్ల మేర చమురు ఉత్పత్తిలో కోత పెట్టేందుకు సౌదీ అరేబియా తదితర దేశాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో లండన్ మార్కెట్లో 1 శాతం పెరిగి 50.69 డాలర్ల వద్ద ఉండగా, న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు కూడా బ్యారల్ దాదాపు 1 శాతం ఎగసి 48.70 డాలర్లకు చేరింది.
పుంజుకున్నచమురు ధరలు
Published Mon, Oct 3 2016 6:28 PM | Last Updated on Fri, Aug 24 2018 4:15 PM
Advertisement