barrel
-
రిలయన్స్ ‘కేజీ’ చమురుకు ప్రీమియం ధర
కేజీ బేసిన్లో ఉత్పత్తి చేసే ముడిచమురుకు ప్రీమియం ధరను డిమాండ్ చేస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance) బిడ్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన టెండర్ ప్రకారం బిడ్డర్లు అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌కన్నా కనీసం 3.5 డాలర్లు (Barrel) అధికంగా కోట్ చేయాల్సి ఉంటుంది. 2025 జనవరి 24 నాటికి బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని గాడిమొగ నుంచి ఈ ఆయిల్‌ను రిలయన్స్ సరఫరా చేస్తుంది. ప్రధానంగా గ్యాస్ క్షేత్రమైన కేజీ–డీ6(KG Basin) బ్లాక్‌లో రిలయన్స్‌కు 66.67 శాతం, బీపీ ఎక్స్‌ప్లొరేషన్‌కు (ఆల్ఫా) 33.33 శాతం వాటాలు ఉన్నాయి. ఇందులో కొంత మొత్తం ముడి చమురు కూడా ఉత్పత్తి అవుతుంది. 2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు ప్రతి నెలా ఉత్పత్తి చేసే 17,600 బ్యారెళ్ల ఆయిల్ విక్రయం కోసం తాజాగా బిడ్లను ఆహ్వానించారు. ప్రస్తుతం ప్రామాణికంగా తీసుకుంటున్న నైజీరియన్ బోనీ లైట్ గ్రేడ్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 73.5 డాలర్లుగా ఉంది. టెండరు ప్రకటన ప్రకారం దీనికి 1.5 డాలర్ల ప్రీమియంతో పాటు బ్యారెల్‌కు కనీసం 2 డాలర్లు అధికంగా బిడ్డర్లు కోట్ చేయాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీల పొరపాట్లకు చెక్పెట్రోల్, డీజిల్‌పై రూ.5 వరకు తగ్గింపు: నయారాప్రైవేటు రంగ చమురు సంస్థ నయారా ఎనర్జీ పండుగల సందర్భంగా వాహన యజమానుల కోసం ఆఫర్ ప్రకటించింది. డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఇంధనం నింపుకుంటే లీటర్ పెట్రోల్(Petrol), డీజిల్‌పై రూ.5 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. ‘సబ్ కీ జీత్ గ్యారంటీడ్ 2024’ పథకం కింద పట్టణ, గ్రామీణ ప్రాంత బంకుల్లోనూ పెట్రోల్, డీజిల్‌పై ఈ ఆఫర్ అమలవుతుందని పేర్కొంది. ‘కస్టమర్లు కేవలం డబ్బును ఆదా చేసుకోవడమే కాకుండా డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించాము’ అని నయారా ఎనర్జీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మాధుర్ తనేజా వెల్లడించారు. జనవరి 31 వరకు ఆఫర్ అమల్లో ఉంటుంది. -
ఒక్క బ్యారెల్ = 60 కుండీలు!
వర్టికల్ టవర్ గార్డెన్‌ను మీరే తయారు చేసుకోవచ్చు.. వర్టికల్ టవర్ గార్డెన్ ఇంటిపంటల సాగుదారులకు చాలా ఉపయోగకరం. మేడ మీద లేదా బాల్కనీలో, ఇంటి పెరట్లో అతి తక్కువ స్థలంలో (కనీసం 4 గంటలు ఎండ తగిలే చోట) ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కో బారెల్లో 60 రకాల ఆకుకూరలు, కూరగాయలు, కషాయాల కోసం ఔషధ మొక్కలను పెంచుకోవచ్చు. బారెల్ మధ్యలో ఉండే పీవీసీ పైపులో వంటింటి వ్యర్థాలు వేస్తూ.. వర్మీ కంపోస్టును కూడా తయారు చేసుకోవచ్చు. ఈ టవర్ గార్డెన్లను సేంద్రియ ఇంటిపంటలపై ఆసక్తి, ఓపిక ఉన్న వారు తమంతట తాము తయారు చేసుకోవచ్చు. అదెలాగో వర్టికల్ టవర్ గార్డెన్ నిపుణులు రవి చంద్రకుమార్ వివరిస్తున్నారు. మార్కెట్లో దొరికే 300 లీటర్ల లేదా 250 లీటర్ల హెచ్.డి.పి.ఇ. బారెల్ తీసుకోవాలి. బారెల్ పొడవు 36 అంగుళాలు. బారెల్‌కు చుట్టూతా 5 అంగుళాలకు ఒక చోట కత్తిరిస్తే (దీన్నే పాకెట్ అని పిలుస్తున్నాం).. 7 వరుసల్లో పాకెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అడ్డంగా ఒక్కొక్క పాకెట్ వెడల్పు 5 అంగుళాలు ఉండేలా కొలత స్కేల్‌తో మార్క్ చేసుకోవాలి. రెండు పాకెట్ల మధ్య 4 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. ఒక వరుసలో 8 పాకెట్లు వస్తాయి. 7 వరుసల్లో మొత్తం 56 పాకెట్లు వస్తాయి. బారెల్ పై భాగాన 4 మొక్కలు పెట్టవచ్చు. అన్నీ కలిపి 60 మొక్కలు పెట్టుకోవచ్చు. అంటే ఒక బారెల్ 60 కుండీలతో సమానం అన్నమాట! పాకెట్లు ఎక్కడ పెట్టుకోవాలో మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసిన చోట బారెల్ను డ్రిల్ మెషిన్‌తో కత్తిరించి చిల్లు పెట్టాలి, జిగ్సా రంపం పట్టడం కోసం. జిగ్సా తో వరుసల్లో మార్క్ చేసిన చోట్ల 5 అంగుళాల వెడల్పున కట్ చేయాలి. పాకెట్ మౌల్డింగ్ చేసే విధానం.. హీట్ గన్‌తో కట్ చేసిన ప్రదేశంలో హీట్ చేయాలి. తగిన హీట్ అయిన తరువాత ఆ ప్రదేశంలో చిత్రంలో చూపిన విధంగా సిమెంటు దిమ్మె అమర్చాలి. అలా అన్ని పాకెట్లను తయారు చేయాలి. బారెల్ అడుగు భాగంలో మధ్యన 4 అంగుళాల రంధ్రం చేయాలి. పక్కన అర అంగుళం రంధ్రం చేయాలి. అధిక నీరు బయటకు వెళ్లడానికి అక్కడ గ్రోమేట్ పెటి టేకాహ్ అమర్చాలి. మధ్యలో 4 అంగుళాల పీవీసీ గొట్టం అమర్చాలి. గొట్టం చుట్టూ చిల్లులు పెట్టాలి. గొట్టం అమర్చే విధానం.. ఆ గొట్టాన్ని క్రింది భాగాన 6 అంగుళాలు బయటకు ఉండేలా అమర్చి.. అక్కడ ఎంసీల్‌తో అతకాలి. పై భాగాన జీయే వైరుతో కట్టాలి. 4 అంగుళాల గొట్టానికి పైన, కింద మూతలు అమర్చాలి. ఈ బారెల్ను నిలబెట్టడానికి ఇనుప స్టాండ్‌ను తయారు చేసుకోవాలి. స్టాండ్ 18 అంగుళాల పొడవు, 18 అంగుళాల వెడల్పు, 10 అంగుళాల ఎత్తు ఉండాలి. వర్టికల్ గార్డెన్లో కంపోస్టు తయారు చేసే విధానం– వర్మీ కంపోస్టు 30%, రంపపు పొట్టు 30%, పశువుల ఎరువు 30%, వేప గింజల చెక్క 10%.. ఇవన్నీ కలిపి బారెల్లో సరిపడినంత నింపుకోవాలి. బారెల్ మధ్యలో అమర్చిన గొట్టంలో వంటింటి వ్యర్థాలు వేయాలి. అందులో చక్కటి వర్మీకంపోస్టు తయారవుతుంది. స్టాండ్ మీద వర్టికల్ గార్డెన్‌ను అమర్చుకున్న తర్వాత.. అందులో కంపోస్టు మిశ్రమాన్ని నింపుకోవాలి. బారెల్ చుట్టూ ఉన్న అరలలో విత్తనాలు నాటుకోవాలి. ఒక్కో వర్టికల్ గార్డెన్ టవర్‌ను తయారు చేసుకోవడానికి (బారెల్, స్టాండ్, టవర్, కంపోస్టు, విత్తనాలు.. అన్నీ కలిపి) రూ. 5 వేలు ఖర్చవుతుంది. వర్టికల్ టవర్‌కు రోజుకు కనీసం 4 గంటలు ఎండ తగిలే చోట పెట్టుకోవాలి. ఇందులో అన్ని రకాల ఆకుకూరలు, ఔషధ మొక్కలు చక్కగా పండించవచ్చని రవిచంద్ర కుమార్ (95812 42255) తెలిపారు. -
పుంజుకున్నచమురు ధరలు
లండన్: ఒపెక్ డీల్ కు పెట్టుబడిదారుల మద్దతు లభించినట్టు కనిపిస్తోంది. అల్జీరియా నాన్ ఒపెక్, ఒపెక్ దేశాల సమావేశం నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు బలపడుతున్నాయి. బ్రెంట్ చమురు బ్యారల్ ధర 50 డాలర్లను అధిగమించింది. ఆగస్ట్ తరువాత ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా చమురు ధరలు ర్యాలీ అయ్యాయి. యూరోప్, ఆసియా మార్కెట్లు పెద్ద మార్కెట్లు గా ఉండగా, జర్మనీ, చైనా మార్కెట్లకు సోమవారం సెలవు. గత వారం అల్జీరియాలో జరిగిన రష్యా వంటి నాన్ ఒపెక్ దేశాలతో ఒపెక్ దేశాలు నిర్వహించిన సమావేశంలో ఉత్పత్తిలో కోత విధించేందుకు సౌదీ అరేబియా తదితర దేశాలు అంగీకరించాయి. గతరెండేళ్లుగా క్షీణిస్తున్న ధరలను ఊతం దిచ్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. రోజుకి 7.5 లక్షల బ్యారళ్ల మేర చమురు ఉత్పత్తిలో కోత పెట్టేందుకు సౌదీ అరేబియా తదితర దేశాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో లండన్ మార్కెట్లో 1 శాతం పెరిగి 50.69 డాలర్ల వద్ద ఉండగా, న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు కూడా బ్యారల్ దాదాపు 1 శాతం ఎగసి 48.70 డాలర్లకు చేరింది. -
ఒపెక్ దేశాల బిగ్ సర్ప్రైజ్
ముడి చమురు ఉత్పత్తిలో కోత విధించాలని పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరపతనం కాకుండా చూసేందుకు ప్రయత్నిస్తు సంస్థ అల్జీరియాలోని ఓరాన్ ఒపెక్ కూటమి సమావేశం నిర్ణయం తీసుకుంది. 42 లక్షల బ్యారళ్ల క్రూడ్ ఉత్పత్తికి కోత పెట్టాలని, ఇది జనవరి ఒకటినుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. 33.24 మిలియన్ బ్యారెళ్ల నుండి 32.5 మిలియన్ బ్యారెళ్లకు ఉత్పత్తి తగ్గిస్తామని ఒపెక్ కూటమి ప్రకటించింది. అలాగే మార్కెట్లో వేలాది సంఖ్యలో ఉన్న అదనపు బ్యారెల్స్ క్రూడ్‌ను తక్షణమే తొలిగిస్తామని రష్యా ఇతర దేశాలు ప్రకటించాయి. ఉత్పత్తి కోతపై ఇప్పటికే తాము ఏకాభిప్రాయానికి వచ్చామని ఒపెక్‌లో ముఖ్య నేత సౌదీ అరేబియా చమురు మంత్రి అలీ నయిమి తెలిపారు. రోజుకు 700,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని మాత్రమే తగ్గిస్తారు. ప్రస్తుత ఉత్పత్తి అంచనా 33.24 మిలియన్ బ్యారెళ్లతో పోల్చితే ఈ తగ్గింపు చాలా తక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి నిర్ణయించిన కోత పరిమాణం స్వల్పమే అయినప్పటికీ ఉత్పత్తి తగ్గించేందుకు ఇన్నాళ్లు సౌదీ అరేబియా నిరాకరించిన నేపథ్యంలో ఈ చర్య తదుపరి చర్యలకు ప్రారంభం అవుతుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి.ఈ కోత స్వల్ప కాలికంగా ధర మద్దతుకు దోహదం చేస్తుందని గోల్డ్ మన్ వ్యాఖ్యానించింది. ఈ రోజు ప్రకటించిన ఉత్పత్తి కోత 2017ఆర్థికసంవత్సరం మొదటి భాగంలో కఠినంగా అమలుచే స్తే బ్యారల్ చమురు విలువ 10 డాలర్లు పెరగనుందని గోల్డ్ అంచనా వేసింది. అయితే అధిక సప్లయ్ సమస్యకు ఈ కోత ఇప్పటికిపుడు పరిష్కారం చూపదని మోర్గాన్ స్టాన్లీ పెదవి విరిచింది. ఈ డీల్ పట్ల బిగ్ సర్ ప్రైజ్ అంటూ మరికొంతమంది ఎనలిస్టులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయిల్ మార్కెట్ల పట్ల మదుపర్ల అయిష్టత పెరుగుతుందనీ, మరిన్ని షార్ట్ పొజిషన్లు కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు. తాము రోజుకు 6 లక్షల పైగా క్రూడ్ ఉత్పత్తిని తగ్గిస్తామని రష్యా ఉపప్రధాని ఇగోర్, అజర్ బైజాన్ ఇంధనమంత్రి అలీవ్ ప్రకటించారు. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పడిపోకుండా చూడాలని వీరు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒపెక్ ఎగుమతి చేసే ముడిచమురు ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 40.74 డాలర్లు ఉంది. కాగా గత రెండేళ్లుగా చమురు ధరలు దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే.