కేజీ బేసిన్‌లో ఉత్పత్తి చేసే ముడిచమురుకు ప్రీమియం ధరను డిమాండ్ చేస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance) బిడ్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన టెండర్ ప్రకారం బిడ్డర్లు అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌కన్నా కనీసం 3.5 డాలర్లు (Barrel) అధికంగా కోట్ చేయాల్సి ఉంటుంది. 2025 జనవరి 24 నాటికి బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని గాడిమొగ నుంచి ఈ ఆయిల్‌ను రిలయన్స్ సరఫరా చేస్తుంది. ప్రధానంగా గ్యాస్ క్షేత్రమైన కేజీ–డీ6(KG Basin) బ్లాక్‌లో రిలయన్స్‌కు 66.67 శాతం, బీపీ ఎక్స్‌ప్లొరేషన్‌కు (ఆల్ఫా) 33.33 శాతం వాటాలు ఉన్నాయి. ఇందులో కొంత మొత్తం ముడి చమురు కూడా ఉత్పత్తి అవుతుంది. 2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు ప్రతి నెలా ఉత్పత్తి చేసే 17,600 బ్యారెళ్ల ఆయిల్ విక్రయం కోసం తాజాగా బిడ్లను ఆహ్వానించారు. ప్రస్తుతం ప్రామాణికంగా తీసుకుంటున్న నైజీరియన్ బోనీ లైట్ గ్రేడ్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 73.5 డాలర్లుగా ఉంది. టెండరు ప్రకటన ప్రకారం దీనికి 1.5 డాలర్ల ప్రీమియంతో పాటు బ్యారెల్‌కు కనీసం 2 డాలర్లు అధికంగా బిడ్డర్లు కోట్ చేయాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీల పొరపాట్లకు చెక్
పెట్రోల్, డీజిల్‌పై రూ.5 వరకు తగ్గింపు: నయారా
ప్రైవేటు రంగ చమురు సంస్థ నయారా ఎనర్జీ పండుగల సందర్భంగా వాహన యజమానుల కోసం ఆఫర్ ప్రకటించింది. డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఇంధనం నింపుకుంటే లీటర్ పెట్రోల్(Petrol), డీజిల్‌పై రూ.5 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. ‘సబ్ కీ జీత్ గ్యారంటీడ్ 2024’ పథకం కింద పట్టణ, గ్రామీణ ప్రాంత బంకుల్లోనూ పెట్రోల్, డీజిల్‌పై ఈ ఆఫర్ అమలవుతుందని పేర్కొంది. ‘కస్టమర్లు కేవలం డబ్బును ఆదా చేసుకోవడమే కాకుండా డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించాము’ అని నయారా ఎనర్జీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మాధుర్ తనేజా వెల్లడించారు. జనవరి 31 వరకు ఆఫర్ అమల్లో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment