KG basin
-
రిలయన్స్ ‘కేజీ’ చమురుకు ప్రీమియం ధర
కేజీ బేసిన్లో ఉత్పత్తి చేసే ముడిచమురుకు ప్రీమియం ధరను డిమాండ్ చేస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance) బిడ్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన టెండర్ ప్రకారం బిడ్డర్లు అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌కన్నా కనీసం 3.5 డాలర్లు (Barrel) అధికంగా కోట్ చేయాల్సి ఉంటుంది. 2025 జనవరి 24 నాటికి బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని గాడిమొగ నుంచి ఈ ఆయిల్‌ను రిలయన్స్ సరఫరా చేస్తుంది. ప్రధానంగా గ్యాస్ క్షేత్రమైన కేజీ–డీ6(KG Basin) బ్లాక్‌లో రిలయన్స్‌కు 66.67 శాతం, బీపీ ఎక్స్‌ప్లొరేషన్‌కు (ఆల్ఫా) 33.33 శాతం వాటాలు ఉన్నాయి. ఇందులో కొంత మొత్తం ముడి చమురు కూడా ఉత్పత్తి అవుతుంది. 2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు ప్రతి నెలా ఉత్పత్తి చేసే 17,600 బ్యారెళ్ల ఆయిల్ విక్రయం కోసం తాజాగా బిడ్లను ఆహ్వానించారు. ప్రస్తుతం ప్రామాణికంగా తీసుకుంటున్న నైజీరియన్ బోనీ లైట్ గ్రేడ్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 73.5 డాలర్లుగా ఉంది. టెండరు ప్రకటన ప్రకారం దీనికి 1.5 డాలర్ల ప్రీమియంతో పాటు బ్యారెల్‌కు కనీసం 2 డాలర్లు అధికంగా బిడ్డర్లు కోట్ చేయాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీల పొరపాట్లకు చెక్పెట్రోల్, డీజిల్‌పై రూ.5 వరకు తగ్గింపు: నయారాప్రైవేటు రంగ చమురు సంస్థ నయారా ఎనర్జీ పండుగల సందర్భంగా వాహన యజమానుల కోసం ఆఫర్ ప్రకటించింది. డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఇంధనం నింపుకుంటే లీటర్ పెట్రోల్(Petrol), డీజిల్‌పై రూ.5 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. ‘సబ్ కీ జీత్ గ్యారంటీడ్ 2024’ పథకం కింద పట్టణ, గ్రామీణ ప్రాంత బంకుల్లోనూ పెట్రోల్, డీజిల్‌పై ఈ ఆఫర్ అమలవుతుందని పేర్కొంది. ‘కస్టమర్లు కేవలం డబ్బును ఆదా చేసుకోవడమే కాకుండా డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించాము’ అని నయారా ఎనర్జీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మాధుర్ తనేజా వెల్లడించారు. జనవరి 31 వరకు ఆఫర్ అమల్లో ఉంటుంది. -
బోర్లతో బ్లో అవుట్లు
సాక్షి అమలాపురం : గ్యాస్ పైప్లైన్ల లీకేజీలు.. తద్వారా వెదజల్లే చమురు.. అప్పుడప్పుడూ బ్లో అవుట్లు.. పచ్చని కోనసీమలో ఇవి సర్వసాధారణం. కృష్ణా–గోదావరి బేసిన్ (కేజీ బేసిన్)లో గ్యాస్, చమురు వెలికితీత కార్యకలాపాలు మొదలైన తరువాత ఈ ప్రాంత వాసులకు ఇది నిత్యకృత్యంగా మారిపోయింది. వీటికి ఇప్పుడు ఆక్వాసాగు తోడైంది.చప్పనీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఉప్పునీటి కోసం వందల అడుగుల లోతున బోర్లు వేస్తుండడం.. వాటి నుంచి గ్యాస్, చమురు వచ్చి మినీ బ్లో అవుట్లుగా మారడం కోనసీమ వాసుల కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా.. రాజోలు మండలం చింతపల్లిలో బోరుబావి నుంచి భారీగా గ్యాస్ ఎగదన్నిన విషయం తెలిసిందే. అసలు కేజీ బేసిన్లో చమురు, గ్యాస్ వెలికితీతల సమయంలో పలు దుర్ఘటనలు చోటుచేసుకోవడం.. కొన్ని విషాదకరమైన చేదు జ్ఞాపకాలను కూడా మిగిల్చిన విషయం తెలిసిందే. జిల్లాలో అల్లవరం గ్రామాన్ని ఆనుకుని దేవర్లంక, అమలాపురం మండలం తాండవపల్లి వద్ద భారీ బ్లో అవుట్ చోటుచేసుకున్నాయి. నగరం గ్యాస్ పైప్‌లైన్ లీకవ్వడంవల్ల 19 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఇవికాకుండా.. ఏదోక ప్రాంతంలో తరచూ గ్యాస్ పైప్లైన్ల లీకులు, చమురు లీకేజీలు జరుగుతూనే ఉన్నాయి. మినీ బ్లో అవుట్లుగా మారిన ఆక్వా బోర్లు..ఆక్వా చెరువుల కోసం తవ్వుతున్న బోర్లు ఇప్పుడు మినీ బ్లో అవుట్లుగా మారిపోయాయి. అధిక ఉప్పు సాంద్రత (సెలైనిటీ) ఉన్న నీటికోసం వందల అడుగుల లోతున బోర్లు వేస్తున్నారు. వీటి ద్వారా గ్యాస్, చమురు ఎగదన్నుకు వస్తున్నాయి. ఇక్కడ భూమిలోని మట్టి పొరల్లో గ్యాస్ నిక్షిప్తమై ఉంది. రైతులు చప్పనీటి సాగు పేరుతో గ్రామీణ నీటి సరఫరా శాఖ నుంచి అనుమతి పొందుతున్నారు. 30–40 అడుగులు లోతున బోరు బావి తవ్వకాలు చేస్తే సరిపోతుంది. కానీ, ఆక్వా రైతులు అధిక ఉప్పు శాతం ఉన్న నీటి కోసం ఏకంగా 250 నుంచి 300 అడుగుల లోతున తవ్వేస్తున్నారు. దీంతో చాలాచోట్ల దిగువనున్న గ్యాస్, చమురు ఎగదన్నుకు వస్తోంది. బోరు అనుమతిచ్చే సమయంలోనే ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు బోరు తవ్వకాలపై పక్కాగా నిఘా పెట్టాల్సి ఉంది. ఇటీవల రాజోలు మండలం శివకోడు వద్ద ఓ ఆక్వా రైతు ఏకంగా 270 అడుగుల లోతున ఉప్పునీటి తవ్వకాలు చేయడంతో గ్యాస్ ఎగదన్ని ప్రమాదానికి కారణమైంది. అక్కడున్న గ్యాస్ లభ్యతను బట్టి ఒకట్రెండు రోజులు గ్యాస్ ఎగిసిపడుతుంది. ఒకప్పుడు సముద్ర తీర ప్రాంతాలు.. గ్రామ శివారుల్లో ఉండే ఆక్వా చెరువులు ఇప్పుడు జనావాసాల మధ్యకు వస్తున్నాయి. ఇటువంటి చోట గనుక బోరుబావుల నుంచి గ్యాస్ ఎగదన్ని మంటలు వ్యాపిస్తే ప్రమాదం తీవ్రత అధికంగా ఉంటుంది. ఆక్వాసాగుతో పైపులైన్లకు దెబ్బ..నిజానికి.. ఆక్వాసాగు పెరగడంవల్ల ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలకు చెందిన పైప్లైన్లు తుప్పుపడుతున్నాయి. ఈ సాగువల్ల భూమిలో ఉప్పుశాతం పెరిగి 25 ఏళ్లు బలంగా ఉండాల్సిన ఈ గ్యాస్ పైప్లైన్లు 15 ఏళ్లకే దెబ్బతింటున్నాయి. అలాగే, సిస్మిక్ సర్వేల పేరుతో జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) వేలాదిచోట్ల భూమి పొరల్లో బాంబింగ్ చేస్తోంది. వీటిని నిబంధనల మేరకు పూడ్చకుండా వదిలేస్తున్నారు. ఇటువంటి చోట నిల్వ ఉన్న గ్యాస్ అప్పుడప్పుడు ఎగదన్నుకు వచ్చి మంటలు చెలరేగుతున్నాయి. -
కేజీ బేసీన్లో చమురు ఉత్పత్తి ప్రారంభం
న్యూఢిల్లీ: రాష్ట్రాల ఆధీనంలో ఉండే ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) డీప్ వాటర్ ప్రాజెక్టులో భాగంగా ఆదివారం చమురు ఉత్పత్తిని ప్రారంభించింది. తూర్పు తీరంలోని కృష్ణా గోదావరి బేసిన్లో ప్రధానమైన డీప్‌వాటర్ ప్రాజెక్ట్ నుంచి చమురు ఉత్పత్తిని ఓఎన్జీసీ మొదలుపెట్టింది. అయితే మొదటిసారి బంగాళాఖాతం సముద్ర తీరంలో కష్టతమరైన డీప్ వాటర్ KG-DWN-98/2 బ్లాక్ నుంచి చమురు ఉత్పత్తిని ప్రారంభించినట్లు కేంద్ర కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి మంత్రి హర్దీప్ సింగ్ పూరి ‘ఎక్స్’ ట్విటర్లో తెలిపారు. దీంతో దేశంలోని ఇంధన ఉత్పత్తి కృష్ణా గోదావరి బేసిన్ (KGB)లోని లోతైన సరిహద్దుల నుంచి పెరగటం ప్రారంభమైందని కేంద్ర మంత్రి తెలిపారు. बधाई भारत! #ONGCJeetegaToBharatJeetega! As India powers ahead as the fastest growing economy under leadership of PM @NarendraModi Ji, our energy production is also set to rise from the deepest frontiers of #KrishnaGodavari “First Oil” production commences from the complex &… pic.twitter.com/gN2iPSs0YZ — Hardeep Singh Puri (@HardeepSPuri) January 7, 2024 ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని తెలిపారు. చమురు ఉత్పత్తి కృష్ణగోదావరి బేసిన్లో లోతైన సరిహద్దుల నుంచి పెరగడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఉత్పత్తి రోజుకు 45,000 బ్యారెల్స్, 10 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత జాతీయ చమురు ఉత్పత్తికి 7 శాతం, జాతీయ సహజ వాయువు ఉత్పత్తికి 7 శాతం అదనంగా ఉత్పత్తిని సమకూర్చుతుందని తెలిపారు. చదవండి: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు -
కేజీ బేసిన్లో ఓఎన్జీసీ చమురు ఉత్పత్తి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) కృష్ణా గోదావరి బేసిన్ (కేజీ బేసిన్)లోని కేజీ డీ5 ప్రాజెక్ట్ పరిధిలో చమురు ఉత్పత్తిని ఈ ఏడాది మే నెలలో ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. సహజ వాయువు ఉత్పత్తిని ఏడాది తర్వాత ప్రారంభిస్తామని ఓఎన్జీసీ డైరెక్టర్ (ఉత్పత్తి విభాగం) పంకజ్ కుమార్ వెల్లడించారు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే కేజీ డీ5 పరిధిలోని డీడబ్ల్యూఎన్–98/2 క్లస్టర్–2 క్షేత్రాల నుంచి గ్యాస్ ఉత్పత్తిని 2019 జూన్‌లోనే మొదలు పెట్టాలి. అదే విధంగా ఆయిల్ ఉత్పత్తిని 2020 మార్చిలో ఆరంభించాల్సి ఉంది. కానీ, ఈ లక్ష్యాలను ఓఎన్జీసీ చేరుకోలేకపోయింది. కరోనా మహమ్మారితో కాంట్రాక్టు, సరఫరా చైన్ సమస్యలను కారణాలుగా పేర్కొంటూ చమురు ఉత్పత్తిని 2021 నవంబర్‌కు వాయిదా వేసింది. ఆ తర్వాత 2022 మూడో త్రైమాసికానికి, ఇప్పడు మే నెలకు వాయిదా వేసుకుంది. గ్యాస్ ఉత్పత్తిని 2021 మే నెలకు వాయిదా వేసుకోగా, అది కూడా సాధ్యపడలేదు. ఆ తర్వాత 2023 మే నెలకు వాయిదా వేయగా, ఇప్పుడు 2024 మేలోనే గ్యాస్ ఉత్పత్తి సాధ్యమవుతుందని ఓఎన్జీసీ చెబుతోంది. ఫ్లోటింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశాం ఇప్పటికే సముద్ర జలాల్లో ఫ్లోటింగ్ (నీటిపై తేలి ఉండే) ఉత్పత్తి యూనిట్‌ను (ఎఫ్‌పీఎస్‌వో) ఏర్పాటు చేసినట్టు ఓఎన్జీసీ డైరెక్టర్ పంకజ్ కుమార్ తెలిపారు. చమురు ఉత్పత్తి మే నుంచి ప్రారంభిస్తామని ప్రకటించారు. ‘‘రోజువారీ 10,000 నుంచి 12,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి మొదలు పెడతాం. రెండు నుంచి మూడు నెలల్లో రోజువారీ 45,000 బ్యారెళ్ల గరిష్ట ఉత్పత్తికి తీసుకెళతాం. చమురుతోపాటు 2 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్ కూడా బయటకు వస్తుంది. వాస్తవంగా గ్యాస్ ఉత్పత్తిని 2024 మే నెలలో మొదలు పెడతాం. అప్పుడు రోజువారీగా 7–8 ఎంఎంఎస్‌సీఎండీ ఉత్పత్తి సాధ్యపడుతుంది’’అని వివరించారు. వాస్తవంగా వేసుకున్న ఉత్పత్తి అంచనాల కంటే ఇవి తక్కువ కావడం గమనించాలి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చమురు ఉత్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకుంటామని, అదే సమయంలో సహజ వాయువు ఉత్పత్తి పెరుగుతుందని పంకజ్ కుమార్ తెలిపారు. -
తూర్పు తీరంపై ఓఎన్జీసీ పట్టు! ఈస్ట్రన్ ఆఫ్‌షోర్‌లో వేల కోట్ల పెట్టుబడి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కృష్ణా, గోదావరి బేసిన్‌లోని అతిపెద్ద ఆయిల్ బ్లాక్‌గా ఉన్న ‘ఈస్ట్రన్ ఆఫ్‌షోర్’(తూర్పు తీరం)పై పట్టు సాధించే దిశగా ఓఎన్జీసీ అడుగులు వేస్తోంది. రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ వంటి ప్రైవేటు చమురు సంస్థలతో పోటీపడి.. నిలిచే దిశగా అడుగులు వేస్తోంది. ఈస్ట్రన్ ఆఫ్ షోర్లో డ్రిల్లింగ్ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు రూ.కోట్లు కుమ్మరిస్తోంది. తొలి దశలో భాగంగా ఇక్కడ చమురు, సహజవాయువు అన్వేషణ కోసం రూ.53 వేల కోట్ల పెట్టుబడి పెట్టింది. కాకినాడలోని ఈస్ట్రన్ ఆఫ్‌షోర్ కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని అల్లవరం మండలం ఓడలరేవులో 300 ఎకరాల్లో భారీ టెరి్మనల్‌ను ఏర్పాటు చేసింది. ఈ టెరి్మనల్ ద్వారా రోజుకు 15 వేల మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజవాయువు, 78 వేల బ్యారెల్స్ క్రూడ్ వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఓడలరేవు టెర్మినల్‌తో పాటు యానాం సమీపంలోని గాడిమొగలో ఉన్న గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ టెరి్మనల్‌ను టేకోవర్ చేసి ఈస్ట్రన్ ఆఫ్‌షోర్‌లో విలీనం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సముద్ర గర్భంలో 425 కిలోమీటర్ల పైప్‌లైన్ చేపట్టాలి. ఇప్పటికే ఆఫ్‌షోర్‌లో డ్రిల్లింగ్ పూర్తయిన బావులను అనుసంధానిస్తూ 300 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేసినట్లు ఓఎన్జీసీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు డ్రిల్లింగ్ ప్రక్రియను పూర్తి చేసిన 45 బావులలో సహజవాయువును వెలికి తీస్తున్నారు. ఈ బావుల నుంచి రోజుకు 35 వేల బ్యారెల్స్ క్రూడ్, సహజవాయువు ఉత్పత్తిని ఓఎన్జీసీ ప్రారంభించింది. భారీ లక్ష్యంతో ముందుకు.. ఇప్పటివరకు కేజీ బేసిన్లో రాజమండ్రి అసెట్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ వచి్చంది. అక్కడ నిల్వలు నిండుకోవడంతో ఇదే బేసిన్‌లోని ఆఫ్‌షోర్‌లో రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ వంటి ప్రైవేటు చమురు సంస్థలతో పోటీపడుతోంది. ఆ సంస్థలకు ధీటుగా విదేశీ పరిజ్ఞానంతో రికార్డు స్థాయిలో 1,45,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో కార్యకలాపాలను ముమ్మరం చేసింది. సహజంగా తీరం నుంచి 80 మీటర్ల వరకు డ్రిల్లింగ్ నిర్వహిస్తారు. ఈ బ్లాక్‌లో నార్తరన్ డిస్కవరీ ఏరియాలో 1,800 మీటర్లు, సదరన్ డిస్కవరీ ఏరియాలో 3,100 మీటర్ల లోతున డ్రిల్లింగ్ చేయాల్సి ఉంది. డ్రిల్లింగ్ పూర్తయిన 45 బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభించేందుకు వీలుగా ఫ్లోటింగ్ ప్రొడక్షన్ స్టోరేజ్, లోడింగ్ ఫ్లాట్ఫార్మ్లను అభివృద్ధి చేసింది. ఈ బేసిన్లో నిర్వహిస్తోన్న డ్రిల్లింగ్‌తో 2024 నాటికి 1.22 లక్షల మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఓఎన్జీసీ ముందుకెళ్తోంది. -
కేజీ బేసిన్‌కు నాలుగు కొత్త రిగ్గులు..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్ పరిధిలో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోని చమురు నిక్షేపాల వెలికితీతకు ప్రభుత్వ ఆయిల్ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) లిమిటెడ్ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా గుర్తించిన బావుల నుంచి గ్యాస్, చమురు వెలికితీయడానికి ఇటలీ టెక్నాలజీ రిగ్గులను వినియోగిస్తోంది. దేశం వ్యాప్తంగా ఉపయోగించడానికి 47 రిగ్గులను ఇటలీ నుంచి కొనుగోలు చేసిన ఓఎన్జీసీ అందులో నాలుగింటిని నరసాపురం, రాజమహేంద్రవరం కేంద్రాలుగా కార్యకలాపాలు సాగుతున్న కేజీ బేసిన్‌కు కేటాయించింది. తొలివిడతగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దెయ్యాలతిప్ప వద్ద ఇటలీ టెక్నాలజీ రిగ్గును ఇటీవల ప్రవేశపెట్టారు. మరో రిగ్గును కొద్ది రోజుల్లో భీమవరం సమీపంలోని వేండ్రలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా కేజీ బేసిన్లో ఓఎన్జీసీ చమురు నిక్షేపాల కోసం తవ్వకాలను పాత యంత్రాలతోనే కొనసాగిస్తోంది. డ్రిల్లింగ్ సమయంలో బాంబింగ్ కూడా చేస్తారు. దీంతో ప్రమాదాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. పైప్లైన్లలో లీకేజీలతో బ్లోఅవుట్లు సంభవిస్తున్నాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టడానికి ఓఎన్జీసీ ఇటలీ టెక్నాలజీ రిగ్గులను వినియోగంలోకి తెచ్చింది. నాలుగు దశాబ్దాలుగా కార్యకలాపాలు.. నాలుగు దశాబ్దాలుగా నరసాపురం టెంపుల్ ల్యాండ్ కేంద్రంగా ఓఎన్జీసీ కార్యకలాపాలు సాగుతున్నాయి. తరువాత కాలంలో రాజమహేంద్రవరంలో ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. చమురు నిక్షేపాల వెలికితీతకు సంబంధించిన యంత్రసామగ్రి మొత్తం నరసాపురం టెంపుల్ ల్యాండ్‌లోనే ఉంటుంది. నరసాపురం ప్రాంతంలో 40 ఏళ్లుగా అపారంగా గ్యాస్ నిక్షేపాలు ఇస్తున్న బావులు ఖాళీ అవ్వడంతో ఓఎన్జీసీ రెండేళ్ల నుంచి జిల్లాలో గ్యాస్ నిక్షేపాల కోసం పలు ప్రాంతాల్లో విస్తృతంగా సర్వే చేసింది. మార్టేరు, పెనుగొండ, మొగల్తూరు మండలం ఆకెనవారితోట, భీమవరం సమీపంలోని దెయ్యాలతిప్ప, మహదేవపట్నం, వేండ్ర ప్రాంతాల్లో కొత్త బావులను గుర్తించింది. కొత్తగా గుర్తించిన బావుల్లో వినియోగించేందుకు ఇటలీ టెక్నాలజీ రిగ్గులు కొనుగోలు చేసింది. చమురు, గ్యాస్ ఉత్పత్తిలో పశ్చిమదే అగ్రస్థానం కేజీ బేసిన్లో ఓఎన్జీసీ రోజుకు 33 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 900 టన్నుల ఆయిల్‌ను వెలికితీస్తోంది. ఇందులో పశ్చిమగోదావరి జిల్లా నుంచే 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 600 టన్నుల ఆయిల్ వస్తోంది. సంస్థ ఉత్పత్తిలో ఇప్పటివరకు జిల్లాదే అగ్రస్థానం. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని కవిటం, నాగిడిపాలెం, ఎస్–1 విశిష్ట బ్లాక్, 98–2 ప్రాజెక్ట్‌లోను, తూర్పుగోదావరి జిల్లా కేసనపల్లి, కృష్ణాజిల్లా బంటుమిల్లి, నాగాయలంక ప్రాంతాల్లోను కొత్తగా చేపట్టిన అన్వేషణ పూర్తయింది. ఈ కొత్త బావుల నుంచి త్వరలో ఉత్పత్తి ప్రారంభించనుంది. కొత్త బావుల్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ఎక్కువ ఉత్పత్తి రాబోతోంది. వచ్చే ఏడాది నుంచి కేజీ బేసిన్లో రోజుకు 40 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 1,400 టన్నుల ఆయిల్ ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే దాదాపు 25 శాతం ఉత్పత్తి పెంచాలన్నది లక్ష్యం. సముద్రగర్భం నుంచి గ్యాస్.. 1974లో మొదటిసారిగా నరసాపురంలో ఓఎన్జీసీ చమురు నిక్షేపాలను గుర్తించింది. అప్పటి నుంచి కేవలం ఆన్ షోర్పైనే సంస్థ దృష్టి పెట్టింది. 10 ఏళ్ల కిందట నుంచి రిలయన్స్, గెయిల్ వంటి సంస్థలు రంగప్రవేశం చేసి ఆఫ్ షోర్ (సముద్రగర్భం)లో డ్రిల్లింగ్ ముమ్మరం చేయడంతో ఆ దిశగా కూడా ఓఎన్జీసీ దూకుడు పెంచింది. 2006 నుంచి సముద్రగర్భంలో అన్వేషణ ప్రారంభించింది. ప్రస్తుతం నరసాపురం నుంచి కాకినాడ వరకు సముద్రగర్భంలో అన్వేషిస్తోంది. నరసాపురం మండలం చినమైనవానిలంక తీరానికి సమీపంలో ఆఫ్ షోర్లో గ్యాస్ వెలికితీత ఇప్పటికే ప్రారంభమైంది. గ్యాస్ వెలికితీతలో మూడేళ్ల నుంచి ఓఎన్జీసీ దేశంలో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. -
వేదాంత చేతికి వీడియోకాన్
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వీడియోకాన్ ఇండస్ట్రీస్‌ను వేలంలో దక్కించుకునేందుకు ట్విన్‌స్టార్ టెక్నాలజీస్ వేసిన రూ. 3,000 కోట్ల బిడ్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర వేసింది. మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూప్‌లో భాగమైన ట్విన్‌స్టార్ సంస్థ 90 రోజుల్లోగా దాదాపు రూ. 500 కోట్లు, ఆ తర్వాత మిగతా మొత్తాన్ని క్రమంగా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో చెల్లించనుంది.ఎన్సీఎల్టీ ఈ మేరకు మౌఖికంగా ఉత్తర్వులు వెలువరించిందని, తీర్పు కాపీ రావాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కారణం కేజీ బేసిన్ బ్యాంకులకు వీడియోకాన్ ఇండస్ట్రీస్ వడ్డీతో సహా సుమారు రూ. 31,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీడియోకాన్ కొనుగోలు ద్వారా కేజీ బేసిన్‌లోని రవ్వ చమురు క్షేత్రంలో వేదాంతాకు పట్టు చిక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రవ్వ క్షేత్రంలో వీడియోకాన్కున్న 25 శాతం వాటాయే కంపెనీ కొనుగోలుకి ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. -
కేజీ బేసిన్లో తొలి అగ్రిసోలార్ ప్లాంట్
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కృష్ణా, గోదావరి(కేజీ) బేసిన్లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) విద్యుత్ స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోంది. స్వీయ అవసరాలతోపాటు కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాల్లో స్థానికులకు విద్యుత్తు సరఫరాలో భాగస్వామ్యం వహించే దిశగా చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాటిపాక ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్‌లో ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. మన రాష్ట్రంలో తొలి ప్రయోగాన్ని ఇది వరకే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చేసింది. అదీ కూడా కేవలం విద్యుత్ సరఫరా మాత్రమే. నగరం గ్రామంలో రెండో ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. కేరళలో ఇదివరకే ఏర్పాటైన అగ్రిసోలార్ ప్లాంట్(పైన సోలార్ ప్యానల్స్, భూమిపై వ్యవసాయం) మాదిరిగానే ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటవుతోంది. 23.50 ఎకరాలు.. రూ.24 కోట్లు విద్యుత్ ప్లాంట్ కోసం ఓఎన్జీసీ సుమారు రూ.24 కోట్లు వెచ్చిస్తోంది. 23.50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను ఫోటాన్ ఎనర్జీ సిస్టమ్స్‌కు అప్పగించింది. ఈ ప్లాంట్‌కు అనుబంధంగా 33 కేవీ సబ్‌స్టేషన్, రెండు మెగావాట్ల సామర్థ్యం కలిగిన అత్యాధునికమైన మూడు పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 18,450 సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఆరు మెగావాట్స్ డీసీ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దానిని ఇన్వర్టర్ల ద్వారా ఐదు మెగావాట్స్ ఏసీ విద్యుత్‌గా మార్చే విధంగా డిజైన్ చేశారు. ఈ సోలార్ ప్లాంట్ ద్వారా రోజుకు 20 వేల నుంచి 25 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది ఓఎన్జీసీ లక్ష్యం. ఆ పల్లెల్లో ఇక సోలార్ వెలుగులు... రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లోని 12 గ్రామాల్లో సౌర వెలుగులు ప్రసరించనున్నాయి. తాటిపాక, పొదలాడ, మామిడికుదురు, గెద్దాడ, పెదపట్నంలంక, పెదపట్నం, నగరం, మొగలికుదురు, పాశర్లపూడి, పాశర్లపూడిలంక, అప్పనపల్లి, బి.దొడ్డవరం తదితర గ్రామాల్లో ఈ ప్లాంట్ వెలుగులు ప్రసరించనున్నాయి. ఆనందంగా ఉంది మా గ్రామంలో ప్లాంట్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఈ తరహా సమస్యలు తొలగనున్నాయి. – మట్టపర్తి రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగి, నగరం గ్రామం అభివృద్ధి చెందుతుంది ప్లాంట్ ఏర్పాటు వల్ల మా గ్రామం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది. మా విద్యుత్ అవసరాలు తీరడంతోపాటు నాణ్యమైన విద్యుత్‌ను పొందే అవకాశం దక్కుతుంది. – బత్తుల ప్రకాశం, నగరం, టీచర్ -
కేజీ బేసిన్లో అడుగంటిన క్రూడాయిల్
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కృష్ణా గోదావరి(కేజీ) బేసిన్లో గత మూడేళ్లుగా ముడిచమురు(క్రూడాయిల్) నిల్వలు పడిపోతుండడంతో ఓఎన్జీసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. క్రూడాయిల్ నిల్వల తగ్గుదలతో ఈ బేసిన్లో ఓఎన్జీసీ సగటున రోజుకు రూ.కోటి వరకూ ఆదాయం కోల్పోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇంతవరకూ కేజీ బేసిన్లో సుమారు 500 బావుల్ని గుర్తించగా.. కేవలం 112 బావుల్లో మాత్రమే ఉత్పత్తి కొనసాగుతోంది. వాటిలో అధికశాతం సహజ వాయువు ఉత్పత్తి చేస్తుండగా.. ఉన్న కొద్దిపాటి బావుల్లో చమురు ఉత్పత్తి మందగించింది. ఈ పరిస్థితుల్లో మరింత లోతుకు బావులు తవ్వాలని ఓఎన్జీసీ యోచిస్తున్నా.. ఖర్చు నాలుగు రెట్లకు పైగా అవుతుందనే అంచనాలతో వెనుకడుగు వేస్తోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పతనమవడంతో.. అంత ఖర్చుచేయడం గిట్టుబాటవుతుందా? అన్న ఆలోచనలోనూ ఉంది. ఒకప్పుడు రికార్డు స్థాయిలో ఉత్పత్తి రాష్ట్రంలోని ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల వరకూ విస్తరించిన కేజీ బేసిన్.. ముంబై హై తర్వాత ఓఎన్జీసీకి తలమానికంగా నిలిచింది. దీని పరిధి సుమారు 50 వేల చదరపు కిలోమీటర్లు విస్తరించింది. ఈ ప్రాంతంలో నాలుగు దశాబ్దాలుగా ఓఎన్జీసీ చమురు, సహజవాయువును వెలికితీస్తోంది. కేజీ బేసిన్లో కోనసీమలోనే చమురు బావులు ఎక్కువగా ఉన్నాయి. గత ఐదేళ్లుగా సాగిస్తున్న అన్వేషణలో భాగంగా కృష్ణా జిల్లా నాగాయలంక, బంటుమిల్లి, మల్లేశ్వరం తదితర ప్రాంతాలలో ఓఎన్జీసీ చమురు నిల్వల్ని కనుగొంది. దీంతో కొత్త ఆశలు చిగురించాయి. అయితే కోనసీమ స్థాయిలో అక్కడ చమురు ఉత్పత్తి లేకపోవడంతో డీలాపడింది. కొన్నేళ్ల క్రితం వరకూ కేజీ బేసిన్లో క్రూడాయిల్ ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరిగేది. ఆ సంస్థ మొత్తం ఉత్పత్తిలో ఈ బేసిన్ వాటా 15 శాతంగా ండేది. అయితే 2017 నుంచి 50 శాతం మేర క్రూడాయిల్ ఉత్పత్తి పడిపోయింది. ఈ లెక్కన ఓఎన్జీసీ కొన్నాళ్లుగా సుమారు రూ.1080 కోట్ల వరకూ ఆదాయాన్ని కోల్పోయిందని ప్రాథమిక అంచనా. 4 వేల మీటర్ల దిగువకు డ్రిల్లింగ్ చేస్తేనే.. కేజీ బేసిన్లో ప్రస్తుతం భూ ఉపరితలం నుంచి 3000 మీటర్ల లోతున మాత్రమే ఓఎన్జీసీ చమురు అన్వేషణ, ఉత్పత్తి సాగిస్తోంది. ఆ ప్రాంతంలో 2000 పీఎస్ఐ(పౌండ్ పర్ స్క్వేర్ ఇంచ్)ఒత్తిడి, 80 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని ఓఎన్జీసీ సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఈ బావుల ద్వారా సముద్రంలో 4000 మీటర్ల దిగువన డ్రిల్లింగ్ నిర్వహించి చమురు అన్వేషణ, ఉత్పత్తికి ఓఎన్జీసీ తటపటాయిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతలోతుకు వెళ్తేగానీ కొత్త చమురు నిల్వలు కనుగొనలేని పరిస్థితి. 4000 నుంచి 4200 మీటర్ల లోతున డ్రిల్లింగ్ చేయాలంటే అక్కడ భూమి పొరల్లో 5 వేల పీఎఫ్ఐ(పౌండ్ పర్ స్క్వేర్ ఇంచ్)ఒత్తిడి, 200 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చాలా ఖరీదుతో కూడుకున్నది. ఒక్కో బావిలో ప్రస్తుతం జరుగుతున్న డ్రిల్లింగ్కు రూ.కోటి నుంచి రూ.1.20 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మరింత లోతుకు వెళ్లి డ్రిల్లింగ్ చేయాలంటే ఒక్కో బావికి సుమారు రూ.5 కోట్ల నుంచి 5.50 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ఓఎన్జీసీ అంచనా వేస్తోంది. ఎక్కువ శాతం బావుల్లో సహజవాయువు ఉత్పత్తే.. తాటిపాక జీజీఎస్(గ్రూప్ గేదరింగ్ స్టేషన్) బావుల్లో క్రూడ్ ఉత్పత్తి తగ్గిపోయింది. ఒక్క కేశనపల్లిలో మాత్రమే కొంత ఆశావహ పరిస్థితి ఉంది. మోరి జీజీఎస్‌లో 58 బావులుంటే 40 బావుల్లో ఎక్కువ శాతం సహజవాయువు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. అడవిపాలెంలోను దాదాపు ఇదే పరిస్థితి. దీంతో కోనసీమ ప్రాంతంలో క్రూడ్ ఉత్పత్తి దాదాపు పడిపోయిందని చెబుతున్నారు. పొన్నమండ, మండపేట, నర్సాపురం జీజీఎస్‌లో కూడా క్రూడ్ ఉత్పత్తి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో విదేశీ చమురు అన్వేషణ సంస్థల సాయం తీసుకునే యోచనలో ఓఎన్జీసీ ఉంది. -
కేజీ బేసిన్లో కొత్త ఇంధనం...
బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కృష్ణా–గోదావరి (కేజీ) బేసిన్లో పరిశోధకులు కొత్త ఇంధనాన్ని కనుగొన్నారు. కేజీ బేసిన్లో మీథేన్ హైడ్రేట్స్‌ను కనుగొన్నట్లు జర్నల్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్ సైన్స్‌లో ప్రచురితమైన ఒక ఆర్టికల్‌లో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (హైదరాబాద్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(గోవా) శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. భారీ పరిమాణంలో మీథేన్ వాయువున్న ఐస్‌ముక్క లాంటి పదార్థాన్ని మీథేన్ హైడ్రేట్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇంధనంగా ఉపయోగిస్తున్న సహజవాయువులో కీలకమైనది మీథేన్ వాయువే. రాబోయే రోజుల్లో ఇంధన అవసరాలను భారీగా తీర్చేందుకు ఇది ఉపయోగపడగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భారత్ సముద్ర జలాల్లో గ్యా స్ హైడ్రేట్ నిక్షేపాల రూపంలో లక్షల కోట్ల ఘనపు మీటర్ల మీథేన్ గ్యాస్ ఉండొచ్చని కేంద్ర ఎర్త్ సైన్సెస్ శాఖ అంచనా. వీటి వెలికితీతకు 2012–17 మధ్యలో ప్రభుత్వం రూ. 143 కోట్ల వ్యయం చేసింది. -
రిలయన్స్ కేజీ–డీ6 క్షేత్రాల మూత!
న్యూఢిల్లీ: కృష్ణా–గోదావరి బేసిన్‌లోని ప్రధాన చమురు–గ్యాస్ క్షేత్రాల(కేజీ–డీ6)ను మూసివేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) సమాయత్తమవుతోంది. ఇక్కడ ఉత్పత్తి అంతకంతకూ దిగజారుతూ కొత్త కనిష్టాలకు పడిపోతుండమే దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. గతేడాది నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాల ప్రకటన అనంతరం ఇన్వెస్టర్లకు వెల్లడించిన సమాచారంలో ఈ అంశాలను ఆర్ఐఎల్ తెలిపింది. ‘కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేజీ–డీ6లోని ప్రధాన ఉత్పత్తి క్షేత్రాలను(డీ1, డీ3, ఎంఏ) వచ్చే కొద్ది నెలల్లో మూసివేయనున్నాం. ఇక్కడ కార్యకలాపాలను నిలిపివేసేందుకు(డీకమిషనింగ్) వీలుగా బ్యాంక్ గ్యారంటీలను కూడా సమర్పించాం’ అని వివరించింది. కొత్తగా మూడు మొదలు... కేజీ బేసిన్లో ఆర్ఐఎల్ ఇప్పటివరకూ 19 చమురు, గ్యాస్ నిక్షేపాలను కనుగొంది. ఇందులో ఒకే ఒక చమురు క్షేత్రమైన ఎంఏ నుంచి 2008 సెప్టెంబర్‌లో క్రూడ్ ఉత్పత్తిని మొదలుపెట్టింది. ఇక ధీరూభాయ్ 1, 3(డీ1, డీ3) క్షేత్రాల నుంచి గ్యాస్ ఉత్పత్తిని 2009 ఏప్రిల్‌లో ప్రారంభించింది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో కేజీ–డీ6లో రోజుకు 4.3 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎస్‌సీఎండీ) గ్యాస్ ఉత్పత్తి జరిగింది. 2017 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 4.9 ఎంఎస్‌సీఎండీల ఉత్పత్తి కంటే మరింత పడిపోయింది. 2010 మార్చిలో డీ1, డీ3 క్షేత్రాల్లో ఉత్పత్తి 69.43 ఎంఎస్‌సీఎండీల గరిష్టస్థాయిని తాకింది. కాగా, ఎంఏ చమురు క్షేత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్‌నాటికి మూసివేసే అవకాశం ఉందనేది సంబంధిత వర్గాల సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్షేత్రాలను మూసివేయాలంటే ఏడాది ముందు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా, కేజీ–డీ6 బ్లాక్‌లో కొత్తగా ప్రస్తుతం మూడు నిక్షేపాల వెలికితీత పనులు కొనసాగుతున్నాయని ఆర్ఐఎల్ తెలిపింది. ఈ మూడింటిపై(ఆర్–క్లస్టర్, శాటిలైట్ క్లస్టర్, ఎంజే క్షేత్రాలు) రూ.40,000 కోట్లను పెట్టుబడి పెడుతున్నట్లు పేర్కొంది. వీటినుంచి గరిష్టంగా 30–35 ఎంఎస్‌సీఎండీల గ్యాస్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, 2020 నుంచి ఉత్పత్తిని మొదలుపెట్టనున్నట్లు వివరించింది. ఆర్–క్లస్టర్లో బావుల తవ్వకం(డ్రిల్లింగ్) ఈ ఏడాది రెండో త్రైమాసికం(2018–19, క్యూ2)లో ప్రారంభిస్తామని వెల్లడించింది. -
కేజీ బేసిన్లో చమురు ఉత్పత్తి తగ్గింది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని మొత్తం గ్యాస్ ఉత్పత్తిలో 50 శాతానికి పైగా ఏపీలోని కృష్ణా – గోదావరి (కేజీ) బేసిన్ నుంచే ఉత్పత్తవుతున్నట్లు హైడ్రోకార్బన్స్ డైరెక్టర్ జనరల్ ఆంతనూ చక్రవర్తి తెలియజేశారు. ‘‘దేశంలో రోజుకు 80 మిలియన్ ఘనపుటడుగుల (ఎంఎంసీఎం) గ్యాస్ ఉత్పత్తవుతోంది. దీన్లో కేజీ బేసిన్లోనే రెండు కంపెనీల నుంచి 43–45 ఎంఎంసీఎం ఉత్పత్తవుతోంది. దీన్లో ఓఎన్జీసీ వాటా 15–18 ఎఎంసీఎం కాగా ప్రైవేట్ సంస్థది 25–30 ఎంఎంసీఎం ఉంటుంది. గతంలో ఈ రెండు కంపెనీలూ కేజీ బేసిన్ నుంచి రోజుకు 65 ఎంఎంసీఎం గ్యాస్ ఉత్పత్తి చేసేవి. కానీ, ఇప్పుడది తగ్గింది’’ అని ఆయన వివరించారు. ఉత్పత్తి తగ్గటానికి ఆయన పలు కారణాలను వెల్లడించారు. కేజీ బేసిన్లో ఒక్కోచోట 1,200–2 ,600 మీటర్ల లోతు నీళ్లుంటాయని అందుకే చమురు ఉత్పత్తి సవాల్‌గా మారుతోందని వ్యాఖ్యానించారు. హైడ్రోకార్బన్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీ (హెచ్ఈఎల్పీ) కింద ఓపెన్ ఆర్కేజ్ లైసెన్సింగ్ ప్రోగ్రామ్ (ఓఏఎల్‌పీ) వేలం జరిగింది. దేశంలోని 11 రాష్ట్రాల్లో 55 బ్లాక్స్‌కు వేలం నిర్వహించిన సందర్భంగా జాయింట్ సెక్రటరీ (ఎక్స్‌ప్లోరేషన్) దివాకర్ నాథ్ మిశ్రాతో కలిసి బుధవారమిక్కడ మీడియాతో ఆయన ఈ విషయాలు చెప్పారు. రూ.91 వేల కోట్ల పెట్టుబడులు.. 2021–2023 నాటికి కేజీ బేసిన్లో రెండు ప్రధాన చమురు, గ్యాస్ అన్వేషణ– ఉత్పత్తి కంపెనీల నుంచి సుమారు రూ.91 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని ఆంతనూ అంచనా వేశారు. ప్రస్తుతం ఓఏఎల్‌పీ వేలం నిర్వహిస్తున్న 55 బ్లాక్స్‌లో 5 బ్లాక్స్ (3 ఆన్‌ల్యాండ్, 2 ఆఫ్‌షోర్) కేజీ బేసిన్లోనే ఉన్నాయి. కాగా కేజీ బేసిన్ ఆన్‌ల్యాండ్ 28 వేల చ.కి.మీ., ఆఫ్‌షోర్ 2.02 లక్షల చ.కి.మీ. విస్తరించి ఉంటుంది. ఏప్రిల్ 3తో వేలం ముగుస్తుంది. మరో 15 రోజులు పొడిగించే అవకాశముంది. 2020 నాటికి తొలి చమురు ఉత్పత్తి.. ‘‘ప్రస్తుతం దేశంలో 70 శాతం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నదే. 2040 నాటికి దీన్ని 11 శాతానికి తగ్గించాలన్నది కేంద్రం లక్ష్యం. అందుకే 2016లో హైడ్రోకార్బన్ ఎక్స్‌ప్లోరేషన్ పాలసీని తీసుకొచ్చాం’’ అని అంతనూ తెలిపారు. ఇందులో భాగంగా గతేడాది మార్చిలో డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్స్ (డీఎస్ఎఫ్)–1 వేలం నిర్వహించామంటూ... ‘‘23 కంపెనీలతో 30 ఒప్పందాలు చేసుకున్నాం. ఇందులో 13 కంపెనీలు కొత్తవే. వీటి నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి రూ.9,300 కోట్లు, రాయల్టీగా రూ.5 వేల కోట్ల వాటా వస్తుంది. రాయల్టీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన వాటా ఉంటుంది’’ అని ఆయన వివరించారు. వచ్చే నెలలో డీఎస్ఎఫ్–2లో 60 బ్లాక్స్ వేలం ప్రారంభమవుతుందన్నారు. ఏటా చమురు డిమాండ్ 4.5–5 శాతం వృద్ధి.. ప్రస్తుతం దేశంలో 37 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు ఉత్పత్తి అవుతుండగా.. డిమాండ్ మాత్రం 100–120 మిలియన్ మెట్రిక్ టన్నులుందని, అలాగే రోజుకు 80 ఎంఎంసీఎఫ్ గ్యాస్ ఉత్పత్తి ఉండగా.. 140 ఎంఎంసీఎఫ్ డిమాండ్ ఉందని చెప్పారాయన. ఏటా 4.5–5 శాతం డిమాండ్ పెరుగుతోందని.. అదే విదేశాల్లో అయితే 1–1.5 శాతం వరకే పెరుగుదల పరిమితమవుతోందని ఆయన వివరించారు. -
జీఎస్పీసీ వాటాలు కొన్న ఓఎన్జీసీ
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి (కేజీ)లో గుజరాత్ రాష్ట్ర పెట్రోలియం కార్పొరేషన్‌కు (జీఎస్పీసీ) ఉన్న 80% వాటాలను ఓఎన్ జీసీ కొనుగోలు చేసింది. ఇందుకు రూ.7,738 కోట్లు చెల్లించింది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది మార్చిలోనే ఈ రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. దీనికి గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీంతో కొనుగోలును పూర్తి చేసినట్టు ఓ ఎన్జీసీ తాజాగా ప్రకటించింది. డీడీడబ్ల్యూలో మిగిలిన 20 శాతం వాటాలో 10% జియో గ్లోబల్ రీసోర్సెస్‌కు, 10 శాతం జులిలెంట్ ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ లిమిటెడ్‌కు ఉన్నాయి. ఇందులో జియో గ్లోబల్ 10 % వాటాను జీఎస్పీసీ కొనుగోలు చేయనుంది. -
ఏపీలో పెట్టుబడులు ఓఎన్జీసీ రుణపరపతికి ప్రతికూలం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని కేజీ బేసిన్లో చమురు, గ్యాస్ నిక్షేపాల వెలికితీత కోసం ప్రతిపాదిత రూ. 78,000 కోట్ల పెట్టుబడులు ఓఎన్జీసీ రుణపరపతిపై ప్రతికూల ప్రభావం ఉండగలదని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తెలిపింది. ప్రారంభ దశలో కంపెనీ రుణసమీకరణ ఒక్కసారిగా ఎగియగలదని పేర్కొంది. ఓఎన్జీసీ 2018– 2021 మధ్యలో మొత్తం రూ. 78,000 కోట్లలో రూ. 10,000 కోట్లు ఆన్‌షోర్ బ్లాక్లపైన, మిగతా రూ. 68,000 కోట్లు కేజీ బేసిన్‌లోని ఆఫ్‌షోర్ అసెట్స్పైన ఇన్వెస్ట్ చేయనుంది. చమురు, గ్యాస్ అసెట్స్ నుంచి మంచి ఆదాయాలు ఆర్జించడానికి సుదీర్ఘకాలం పట్టేస్తుందని, ఈ నేపథ్యంలో ఇంత భారీ పెట్టుబడి ప్రణాళికలు ఓఎన్జీసీ రుణపరపతికి ప్రతికూలమని మూడీస్ పేర్కొంది. -
ఆర్ఐఎల్ ఆస్తుల్లో 40వేల కోట్ల తరుగుదల
కేజీ డీ6పైనే రూ.20,114 కోట్లు... న్యూఢిల్లీ: అకౌంటింగ్ విధానంలో మార్పు దృష్ట్యా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) రూ.39,570 కోట్ల మేరకు తన ఆయిల్ అండ్ గ్యాస్ ఆస్తుల విలువను రద్దు (రైట్‌డౌన్) చేసింది. ఇందులో కేజీ బేసిన్‌లోని డీ6తోపాటు అమెరికా షేల్ గ్యాస్ ప్రాజెక్టులు సైతం ఉన్నాయి. 2016 ఏప్రిల్ 1 నుంచి ఆర్ఐఎల్ భారతీయ అకౌంటింగ్ ప్రమాణాల పరిధిలోని నూతన విధానానికి మళ్లింది. ఈ మార్పు నేపథ్యంలో తన చమురు, సహజవాయువుల నిల్వలను ఆర్ఐఎల్ తిరిగి ప్రకటించింది. 2016 మార్చి 31 నాటికి తన ఆయిల్, గ్యాస్ ఆస్తుల విలువలో రూ.39,750 కోట్ల తరుగుదలను చూపించింది. కేవలం ఒక్క కేజీ బేసిన్‌లోని డీ6 బ్లాక్‌కు సంబంధించే రూ.20,114 కోట్ల తరుగుదలను చూపించింది. ఈ వివరాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాల నివేదికలో ఆర్ఐఎల్ వెల్లడించింది. విలువ తరుగుదలకు ఆయిల్, గ్యాస్ ధరల పతనమే ప్రధాన కారణం. ఇక స్వాధీనం చేసిన బ్లాక్‌లు, ఫలితమివ్వని బావులు, విడిచిపెట్టిన బావులు వంటివి ప్రభావం చూపినట్టు ఆర్ఐఎల్ తెలిపింది. -
డెల్టా గుండెల్లో గునపం!
70వేల గ్యాస్ బావులు తవ్వేందుకు కార్పొరేట్ సంస్థల పథకం - ‘హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్’ విధానంలో కేజీ బేసిన్లో గ్యాస్, చమురు వెలికితీత - పశ్చిమగోదావరి, కృష్ణాలో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం ఏడు లక్షల ఎకరాలు సాగుకు దూరం - ఇంకా లక్షలాది ఎకరాలపై తీవ్ర ప్రభావం వాయు, జల, భూకాలుష్యం తీవ్రమయ్యే ప్రమాదం - జనజీవనంపై విషమ ప్రభావం అంటున్న పరిశోధనలు అమెరికా, పలు దేశాల్లో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌పై నిషేధం - ఇక్కడ అదే ముద్దంటోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టు చేపట్టే గ్రామాలకు కనీస సమాచారం లేదు - భీమవరంలో రేపు ప్రజాభిప్రాయ సేకరణ (ఆలమూరు రామ్‌గోపాల్‌రెడ్డి) దేశానికి ధాన్యాగారంగా భాసిల్లుతోన్న గోదావరి, కృష్ణా డెల్టాల్లో వరి సాగు కనుమరుగు కానుందా..? నలుగురికి అన్నం పెట్టిన రైతన్న ఇక ఉపాధి వెతుక్కుంటూ వలసపోవాల్సిన దుస్థితి దాపురించనున్నదా? అన్నపూర్ణగా విరాజిల్లుతోన్న డెల్టాల్లో పట్టెడన్నం కోసం ప్రజలు అలమటించాల్సిన పరిస్థితులు పొంచి ఉన్నాయా..? పచ్చని పైర్లతో ఆహ్లాదకరమైన వాతావరణంతో కనిపించే డెల్టాలు ఇక జన జీవనానికి పనికి రాకుండా పోతాయా..? అనే ప్రశ్నలకు అవుననే అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. గ్యాస్, చమురు ఉత్పత్తిలో కార్పొరేట్ సంస్థలకు సహజవనరులను దోచిపెడుతోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా మరో అడుగు ముందుకేసి సాంప్రదాయేతర ‘హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్’ పద్ధతిలో షేల్ గ్యాస్, చమురును వెలికితీయడానికి ఆమోదముద్ర వేశాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్జీసీ(ఆరుుల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్)ని ముందుపెట్టి పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి మండలం కాళ్ల, భీమవరం మండలం వీరవాసరం, కృష్ణా జిల్లాలో మండవల్లిలో తవ్వకాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాళ్ల, వీరవాసరం, మండవల్లి ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వలేదు. ప్రాజెక్టు చేపట్టే గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చట్టాలు చెబుతున్నా ఆ గ్రామాలను వదిలేసి భీమవరంలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమవుతున్నారు. మూడు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా 17 బావుల ద్వారా హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్కి ఓఎన్జీసీ తెరతీసింది. ఆ తర్వాత కృష్ణా, గోదావరి డెల్టాల్లో 70 వేల బావులను తవ్వి ద్వారా గ్యాస్, చమురు ఉత్పత్తి చేయడానికి కేంద్రం టెండర్లు పిలవనుంది. భూమిని, నీటిని అధికంగా వినియోగించుకునే ఈ విధానం వల్ల ఎన్నో ఉపద్రవాలు పొంచి ఉన్నారుు. అనేక దేశాలు ఈ విధానానికి గుడ్‌బై చెప్పాయి. ఎక్కడా వద్దన్నది ఇక్కడ ముద్దు.. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ విధానంలో తవ్వకాల వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చాలాకాలం కిందటే గుర్తించారు. అందుకే ఈ విధానంపై అనేక దేశాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఫ్రాన్స, బల్గేరియా, రుమేనియా, జర్మనీ, స్కాట్లాండ్ వంటి దేశాల్లో ఇప్పటికే ఆ విధానాన్ని నిషేధించారు. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌పై నిషేధం అంశాన్ని ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో ఇరు పక్షాలు ప్రచారాస్త్రంగా మార్చుకున్నాయి. అమెరికాలోని న్యూయార్క్, టెక్సాస్ రాష్ట్రాల్లో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ను నిషేధించారు. కానీ.. మన దేశంలో మాత్రం ఆ విధానాన్ని అమలుచేయడానికి శ్రీకారం చుట్టడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఉపద్రవాలు.. భయానక వాస్తవాలు.. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ వల్ల కృష్ణా, గోదావరి డెల్టాల్లో జనజీవనం అస్తవ్యస్తమవుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ► ఒక్కో బావికి కనీసం పది ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఈ లెక్కన. 70 వేల బావులకు ఏడు లక్షల ఎకరాల భూమి అవసరం అవుతుంది. బావులకు సమాంతరంగా భూగర్భంలో సొరంగాలు తవ్వడం వల్ల లక్షలాది ఎకరాల భూమిపై పరోక్షంగా ప్రభావం చూపుతుంది. దీని వల్ల పచ్చని పంట పొలాలు మాయం కావడం ఖాయం. దేశానికి అన్నపూర్ణగా భాసిల్లుతోన్న డెల్టాల్లో పట్టెడన్నం కోసం అలమటించాల్సిన దుస్థితి దాపురిస్తుంది. ► హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్తోభూగర్భజలాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక్కో బావికి సగటున ఆరు కోట్ల లీటర్ల నీళ్లు అవసరం అవుతారుు. 70 వేల బావులకు అవసరమైన నీటిని పరిగణనలోకి తీసుకుంటే.. కృష్ణా, గోదావరి డెల్టాల్లో భూగర్భం ఒట్టిపోవడం ఖాయం. ► అమెరికాకు చెందిన పర్యావరణ పరిరక్షణ సంస్థ(ఈపీఏ), నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అంచనాల ప్రకారం గ్యాస్, చమురు ఉత్పత్తి సమయంలో మిథేన్ లీకవుతూనే ఉంటుంది. సెకనుకు 0.6 గ్రాముల కార్బన్ లీకవుతుంది. దీని భూతాపాన్ని తీవ్రం చేస్తుంది. ఇది పంటల దిగుబడిని 80 శాతం మేర తగ్గించి వేస్తుంది. ► భూగర్భంలో అత్యధిక పీడనంతో అవశేష శిలలను ఛిద్రం చేయడం, భూగర్భ జలాలను లాగేయడం వల్ల భూకంపాలు వస్తాయని ఈపీఏ తేల్చింది. అమెరికాలోని టెక్సాస్‌లో రిక్టర్ స్కేలుపై 5.1, ఓక్లహోమాలో 3.0 తీవ్రత కలిగిన భూకంపాలు నమోదయ్యారుు. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ వల్ల అమెరికాలో 2013లో 109, 2014లో 585, 2015లో 907, 2016లో 611(అక్టోబరు వరకూ) భూకంపాలు నమోదవడం గమనార్హం. ► హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ పద్ధతిలో గ్యాస్, చమురును వెలికితీయడం వల్ల వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూకాలుష్యం పెరిగిపోతుంది. అత్యంత ప్రమాదకరమైన అణుధార్మిక లక్షణాలున్న రాడాన్ వాయువు వెలువడుతుంది. గర్భస్థ శిశువులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. శ్వాసకోస వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలుతారుు. ► అమెరికాలో 2012లో బంబెర్గర్, ఆస్వాల్డ్‌లు నిర్వహించిన పరిశోధనల్లో ఒళ్లుగగుర్పొడిచే వాస్తవాలు వెలుగు చూశారుు. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ చేసిన బావులకు కిలోమీటరు వ్యాసార్థంలో ఆవులు, దూడలు మరణించినట్లు తేలింది. గర్భస్రావాలు అధికమైనట్లు వెల్లడైంది. క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరిగినట్లు తేలింది. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ చేసిన పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నిర్వహించిన రక్తపరీక్షల్లో అత్యంత ప్రమాదకరమైన ఆర్శనిక్, బెంజీన్ అవశేషం ఫినాల్లో ఉన్నట్లు వెల్లడైంది. ఇది జనజీవనాన్ని ఛిద్రం చేసింది. అమెరికాలో ఉద్యమాలు రావడంతో టెక్సాస్, న్యూయార్క్ రాష్ట్రాల్లో ఈ విధానాన్ని నిషేధించారు. కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకే.. కేజీ బేసిన్లో ఇప్పటికే డీ-6 గ్యాస్ క్షేత్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్న రిలయన్స సంస్థ అక్రమంగా గ్యాస్‌ను తరలించి రూ.12,136 కోట్ల మేర కొల్లగొట్టినట్లు జస్టిస్ ఏపీ షా కమిషన్ తేల్చింది. ఆ మేరకు రిలయన్స నుంచి ఆ నిధులను వసూలు చేయాలని షా కమిషన్ చేసిన సూచనను కేంద్రం బుట్టదాఖలు చేసింది. అమెరికాలో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ పద్ధతిలో గ్యాస్, చమురు ఉత్పత్తిలో ప్రధాన వాటా రిలయన్సదే. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌పై అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే నిషేధం విధించడం.. రానున్న రోజుల్లో పూర్తి స్థారుులో నిషేధం విధించనున్న నేపథ్యంలో రిలయన్‌సకు భారీ దెబ్బ తగలనుంది. దాన్ని పూడ్చుకునేందుకే కేజీ బేసిన్‌పై కన్నేసిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇదేం ప్రజాభిప్రాయ సేకరణ..? ప్రాజెక్టులు చేపట్టే గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించాలని భూసేకరణ చట్టం-2013 స్పష్టీకరిస్తోంది. ఎన్జీటీ తీర్పులు ఇదే అంశాన్ని తేల్చిచెబుతున్నారుు. కానీ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆ చట్టాలను బుట్టదాఖలు చేస్తున్నారుు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల, వీరవాసరం, కృష్ణా జిల్లా మండవల్లిల్లో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్‌పై మంగళవారం భీమవరంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నియంత్రణ మండలి ఓ ప్రకటన జారీ చేసింది. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించి.. దీనిపై అభిప్రాయ సేకరణ చేయాల్సిన ప్రభుత్వం తద్భిన్నంగా వ్యవహరిస్తోండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల జీవితాలతో చెలగాటమా? హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ విధానంలో గ్యాస్, చము రు తవ్వకాలు జరపడమంటే ప్రజల జీవితాలతో చెలగాటమాడటమే. దేశానికి అన్నం పెడుతోన్న కృష్ణా, గోదావరి డెల్టాలు నాశనమౌతారుు. కృష్ణా, గోదావరి డెల్టాల్లో భూగర్భజలాలను తోడేస్తే సముద్రం నుంచి ఉప్పునీళ్లు ఎగదన్నడం ఖాయం. ప్రపంచంలో జర్మనీ, స్కాట్లాండ్, రుమేనియా, బల్గేరియా, ఫ్రాన్స వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానాన్ని నిషేధించారు. - కలపాల బాబూరావు, పర్యావరణవేత్త విధ్వంసం చేయడం అభివృద్ధా? జన జీవనాన్ని విధ్వంసం చేయడం అభివృద్ధా? మానవ జీవనాన్ని ప్రశ్నార్థకం చేసే హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ అవసరమా? కార్పొరేట్ శక్తులకు సహజ వనరులను దోచిపెట్టేందుకే ఈ విధానం అమలుకు పూనుకోవడం అన్యాయం. - రామకృష్ణంరాజు, కో-ఆర్డినేటర్, నేషనల్ అలయన్సఆఫ్పీపుల్స్ మూవ్మెంట్స్(ఎన్ఏపీఎం) కేజీ బేసిన్లో భారీ గ్యాస్, చమురు నిల్వలు.. భారతదేశంలో పశ్చిమ, తూర్పు, అండమాన్ సముద్ర తీరాల్లో కలిపి 1,894 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాలు ఉన్నట్లు ఓఎన్జీసీ గుర్తించింది. దేశంలో గ్యాస్హెడ్రేట్ సామర్థ్యాలను అన్వేషించటానికి, ప్రయోగాత్మకంగా ఉత్పత్తి పరీక్షల కోసం 2014లో అమెరికాకు చెందిన యూఎన్‌జీఎస్, జపాన్‌కు చెందిన జపనీస్ డ్రిల్లింగ్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఓఎన్జీసీ, యూఎన్‌జీఎస్, జపనీస్ డ్రిల్లింగ్ కంపెనీలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో గోదావరి-కృష్ణా బేసిన్లో 982, డీ-3, డీ-6, డీ-9 బ్లాకుల్లో 4320 చదరపు మైళ్ల విస్తీర్ణంలో అత్యంత సాంద్రత గల ఇసుక రిజర్వాయర్లలో 134 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్, ఆరుుల్ నిక్షిప్తమైనట్లు తేలింది. దీని విలువ రూ.33 లక్షల కోట్లుగా ఓఎన్జీసీ అంచనా వేసింది. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ అంటే.. భూ ఉపరితలానికి సుమారు నాలుగు వేల మీటర్ల లోతులో కఠినమైన అవశేష శిలావరణం కింద ఏర్పడిన ఇసుక రిజర్వాయర్లలో షేల్, గ్యాస్ హైడ్రేట్ల రూపంలో ఉండే గ్యాస్, చమురును బోరు బావులు తవ్వడం వంటి సాంప్రదాయ పద్ధతుల్లో వెలికితీయడం సాధ్యం కాదు.. ‘హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్’ విధానంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈ విధానంలో ఏం చేస్తారంటే.. కఠినమైన అవశేష శిలలు ఉండే వరకూ అంటే కనీసం నాలుగు వేల మీటర్ల లోతుకు భారీ బోరు బావి తవ్వుతారు. అవశేష శిల పొరకు సమాంతరంగా సొరంగం తవ్వుతారు. ఆ సొరంగంలో రంధ్రాలున్న గొట్టాలను అమర్చుతారు. ఈ గొట్టాల ద్వారా నీళ్లు, ఇసుక, 700 రకాల రసాయనాల మిశ్రమాన్ని 550 అట్మాస్పియర్లకుపైగా పీడనంతో పంపి.. అవశేష శిల పొరను ధ్వంసం చేస్తారు. తద్వారా శిల పొరల్లో ఏర్పడే చీలికల నుంచి గ్యాస్, చమురును వెలికితీస్తారు. -
కేజీ బేసిన్ పరిహారంపై ఓఎన్జీసీలో భిన్న స్వరాలు
♦ షా కమిటీ సిఫారసును సవాల్ చేద్దాం వద్దు... ఆమోదిద్దాం ♦ రెండుగా విడిపోయిన బోర్డు ♦ ఆర్ఐఎల్ పరిహారం ప్రభుత్వానికేనన్న షా కమిటీ న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్లో తమ క్షేత్రాల నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) బ్లాక్‌లకు తరలిపోయిన గ్యాస్‌కు సంబంధించి రూ.11వేల కోట్ల పరిహారం అడిగే విషయమై ఓఎన్జీసీ బోర్డు రెండుగా విడిపోయింది. దీనిపై ఏర్పాటైన జస్టిస్ ఏపీ షా కమిటీ గత నెలలో కేంద్రానికి నివేదిక సమర్పించడంతోపాటు, రిలయన్స్ అక్రమంగా తరలించుకుపోయిన గ్యాస్‌పై పరిహారం ప్రభుత్వానికే వెళుతుందని, ఓఎన్జీసీకి రాదంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. గ్యాస్ ప్రభుత్వానిదే కనుక పరిహారానికీ ప్రభుత్వమే అర్హురాలని తెలిపింది. తాజాగా ఇదే అంశంపై ఓఎన్జీసీ బోర్డులో రెండు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం కావడం గమనార్హం. భిన్న స్వరాలు:విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... బోర్డులోని ఒక వర్గం షా కమిటీ ప్రతిపాదనను సవాలు చేయాలని డిమాండ్ చేస్తోంది. వివాద పరిష్కారమై సంతృప్తి చెందకపోతే కోర్టును తిరిగి ఆశ్రయించవచ్చని ఢిల్లీ హైకోర్టు అవకాశం ఇచ్చింది కనుక కోర్టుకు వెళ్లాలని డిమాండ్ చేస్తోంది. ఇదే వర్గం మరో పాయింట్‌ను కూడా లెవనెత్తుతోంది. కేజీ డీ6 బ్లాక్‌కు ఆర్ఐఎల్ కూడా యజమాని కాదని, పెట్టుబడులపై రాబడి మీద నిర్ణీత శాతం మేర చెల్లిస్తోందన్న లాజిక్‌ను షా కమిటీ విస్మరించిందని వాదిస్తోంది. మరో వర్గం మాత్రం ప్రభుత్వంతో పోరాడడం సరికాదని, కేజీ బేసిన్లో గ్యాస్ ఆర్ఐఎల్ బేసిన్‌కు వెళుతోందన్న విషయాన్ని నిరూపించామని, షా కమిటీ సిఫారసులను ఆమోదించాలని కోరుతోంది. మరోవైపు పెట్రోలియం శాఖ ఆర్ఐఎల్ ఎంత పరిహారం చెల్లించాలన్న అంశాన్ని తేల్చాల్సిందిగా డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్)ను కోరింది. ఈ నేపథ్యంలో చివరికి ఈ అంశం ఏమని తేలుతుందో ఆసక్తికరంగా మారింది. పూర్వాపరాలు:కేజీ బేసిన్లో ఓఎన్జీసీకి చెందిన గోదావరి-పీఎంఎల్, కేజీ-డీడబ్ల్యూఎన్-98/2 బ్లాక్‌లు... ఆర్ఐఎల్కు కేజీ- డీడబ్ల్యూఎ - 98/3 లేదా డీ6 బ్లాక్ పక్కపక్కనే ఉన్నాయి. తమ బ్లాక్‌ల నుంచి ఆర్ఐఎల్ గ్యాస్ తరలించుకుపోతోందని ఓఎన్జీసీ తొలిసారిగా 2013లో గుర్తించి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. స్పందన లేకపోవడంతో ఓఎన్జీసీ 2014 మేలో ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదు చేసింది. దీనిలో ప్రభుత్వాన్ని పార్టీగా చేర్చింది. ఆర్ఐఎల్ కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించిన 2009 ఏప్రిల్ 1 నుంచి... 2015, మార్చి 31 మధ్య కాలంలో 11.122 బిలియన్ ఘనపు మీటర్ల మేర గ్యాస్ తరలిపోయినట్లు స్వతంత్ర అధ్యయన సంస్థ డీఅండ్‌ఎం సైతం గతేడాది నవంబర్‌లో ఇచ్చిన నివేదికలో తేల్చింది. అప్పటి సహజ వాయువు రేట్ల(యూనిట్‌కు 4.2 డాలర్లు) ప్రకారం దీని విలువ 1.7 బిలియన్ డాలర్లు. -
గ్యాస్ తరలింపు ముందుగా తెలియదు
♦ కేజీ బేసిన్లో రిలయన్స్‌తో వివాదంపై ♦ ఓఎన్జీసీ సీఎండీ డీకే షరాఫ్ న్యూఢిల్లీ: కేజీ బేసిన్లో తమ క్షేత్రాలకు ఆనుకుని ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) కేజీ-డీ6 క్షేత్రాల్లోకి గ్యాస్ తరలిపోతోందన్న విషయంపై తమకు ముందుగా ఎలాంటి సమాచారం లేదని కంపెనీ సీఎండీ డీకే షరాఫ్ పేర్కొన్నారు. అయితే, ఈ విషయం మాత్రం ఆర్ఐఎల్కు ముందుగానే తెలుసని చెప్పారు. గ్యాస్ తరలింపు వివాదంపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఏపీ షా కమిటీ.. ఓఎన్జీసీ గ్యాస్‌ను ఆర్ఐఎల్ లాగేసుకుందని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. 2009 నుంచి 2015 వరకూ ఈ విధంగా ఓఎన్జీసీ బ్లాక్‌ల నుంచి గ్యాస్ ఆర్ఐఎల్ క్షేత్రాల్లోకి తరలిపోయిందని... దీనికి ప్రతిగా ఆ కంపెనీకి నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా కేంద్ర పెట్రోలియం శాఖకు ఇటీవలే సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. ఇరు కంపెనీల క్షేత్రాలూ ఒకదానితో ఒకటి అనుసంధానమైన ఉన్నాయని, గ్యాస్ తమ క్షేత్రాల్లోకి వచ్చేస్తున్న విషయం ఆర్ఐఎల్కు ముందే తెలిసి ఉండొచ్చన్న వాదనను కమిటీ నిర్ధారించింది. అయితే, క్షేత్రాల అనుసంధానం సంగతి 2007లోనే ఓఎన్జీసీకి తెలిసినా కూడా 2013 వరకూ చడీచప్పుడులేకుండా ఉందని ఆర్ఐఎల్ చేసిన ఆరోపణలను కూడా కమిటీ తన నివేదికలో పొందుపరిచింది. ‘ఈ అంశం గురించి ఓఎన్జీసీకి ముందస్తుగా ఎలాంటి అవగాహన లేదు. విషయం తెలిసిన వెంటనే(2013లో) నియంత్రణ సంస్థల దృష్టికి తీసుకెళ్లడం ఇతరత్రా చర్యలు చేపట్టాం. అయితే, మాకు ముందుగా తెలియదన్న అంశాన్ని షా కమిటీకి మేం చెప్పినప్పటికీ నివేదికలో ప్రస్తావించినట్లు లేదు’ అని షరాఫ్ వివరించారు. కాగా, ఆర్ఐఎల్కు తోడేసిన గ్యాస్ విలువ రూ.11,000 కోట్లుగా టెక్నికల్ కన్సల్టెంట్ డీఅండ్‌ఎం లెక్కగట్టిన సంగతి తెలిసిందే. పరిహారం ప్రభుత్వానికే..!: గ్యాస్ తరలింపునపై నష్టపరిహారం ఓఎన్జీసీకి కాకుండా కేంద్ర ప్రభుత్వానికే ఆర్ఐఎల్ చెల్లించాల్సి వస్తుందని షా కమిటీ తన నివేదికలో పేర్కొనడం ఓఎన్జీసీకి మింగుడుపడని అంశం. ఓఎన్జీసీ క్షేత్రాల నుంచి అక్రమంగా ఆర్ఐఎల్ గ్యాస్‌ను తరలించుకున్నప్పటికీ.. సహజవాయువుపై ఆ కంపెనీకి ఎలాంటి యాజమాన్య లేదా నియంత్రణ హక్కులు లేవని.. అందుకే నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వమే డిమాండ్ చేయాల్సి వస్తుందని కమిటీ పేర్కొంది. అయితే, నష్టపరిహారంపై ఎవరికి హక్కులు ఉంటాయన్నది ఇప్పుడే చెప్పడం కష్టమని షరాఫ్ వ్యాఖ్యానించారు. షా కమిటీ పెట్రోలియం శాఖకు నివేదిక వచ్చిన మర్నాడే.. ఆర్ఐఎల్కు చెందిన రిలయన్స్ జియో పత్రికల్లో మొదటి పేజీల్లో ఇచ్చిన యాడ్లలో ప్రధాని మోదీ ఫొటో ప్రత్యక్షమైన తరుణంలో ప్రభుత్వం దీనిపై నిజంగానే చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారా అంటూ విలేకరులు అడగగా.. ఈ రెండింటికీ సంబంధం లేదని షరీఫ్ చెప్పారు. జీఎస్పీసీ కేజీ క్షేత్రంలో వాటా కొనుగోలు! కేజీ బేసిన్లో జీఎస్పీసీకి చెందిన దీన్‌దయాల్ క్షేత్రంలో వాటా కొనుగోలుకు ఓఎన్జీసీ ప్రయత్నిస్తోంది. చర్చలు కొనసాగుతున్నాయని.. ఈ బ్లాక్‌లో సహజవాయువు నిల్వలను అంచనా వేసేందుకు అమెరికా కన్సల్టెంట్ రైడర్ స్కాట్‌ను నియమించుకున్నట్లు షరాఫ్ తెలిపారు. 20% తగ్గనున్న గ్యాస్ ధర... దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న సహజవాయువు ధర అక్టోబర్‌లో 20 శాతం మేర తగ్గిపోయే అవకాశం ఉందని షరాఫ్ చెప్పారు. అంతర్జాతీయంగా గ్యాస్ రేట్లు పడిపోతుండటం, దేశీ గ్యాస్ ధర నిర్ణయాన్ని దీంతో అనుసంధానించడటమే దీనికి కారణమన్నారు. ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో ఆమోదించిన ఫార్ములా ప్రకారం ప్రస్తుతం యూనిట్(ఎంఎంబీటీయూ) ధర 3.06 డాలర్లు కాగా, ఈ అక్టోబర్ 1 నుంచి దాదాపు 2.5 డాలర్ల స్థాయికి తగ్గనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఓఎన్జీసీ, ఆర్ఐఎల్లకు చెందిన ప్రస్తుత క్షేత్రాలకు ఇది వర్తిస్తుందన్నారు. ప్రభుత్వ ఫార్ములా ప్రకారం ప్రతి ఆరు నెలలకు గ్యాస్ ధరను సవరించాల్సి ఉంటుంది. -
ఆర్ ఐఎల్ అదనపు వ్యయాల రికవరీకి బ్రేక్!
♦ కేజీ బేసిన్‌పై కాగ్ నివేదిక ♦ ఆచితూచి వ్యవహరించాలని సూచన న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి బేసిన్ డీ6 గ్యాస్ బ్లాక్‌లో 1.6 బిలియన్ డాలర్ల అదనపు వ్యయాల రికవరీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ చేస్తున్న ప్రయత్నాలకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తాజాగా బ్రేక్ వేసింది. బ్లాక్ నుంచి ఆయిల్, గ్యాస్ విక్రయం ద్వారా అదనపు వ్యయాల రికవరీకి అంగీకరించరాదని పార్లమెంటులో ప్రవేశపెట్టిన తన తాజా నివేదికలో పేర్కొంది. డిస్కవరీ ధ్రువీకరణకు జరిపిన పరీక్షలకు సంబంధించి డిమాండ్ చేస్తున్న అదనపు వ్యయ రికవరీల విషయాన్ని కూలంకషంగా పునఃపరిశీలించాలని సూచించింది. ఓఎన్జీసీ గ్యాస్ ఫ్లోపైనా దృష్టి... ముకేశ్ అంబానీ సంస్థ నియంత్రణలోని తూర్పు ఆఫ్‌షోర్ ఫీల్డ్స్‌లోకి ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీకి చెందిన గ్యాస్ ఫ్లోయింగ్ విషయాన్ని కూడా నివేదిక ప్రస్తావించింది. 2015 నవంబర్ డీగోల్యర్ అండ్ మెక్‌నాటన్ (డీఅండ్‌ఎం) నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్న విషయాన్ని గుర్తుచేసింది. ఈ సమస్యపై తదుపరి చర్యల సిఫారసుకు జస్టిస్ ఏపీ షా నేతృత్వంలో ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఒకవేళ డీఅండ్‌ఎం నివేదికను ప్రభుత్వం ఆమోదించి ఓఎన్జీసీకి పరిహారం చెల్లించాలని ఆర్ఐఎల్ను ఆదేశిస్తే.. కేజీ బేసిన్లో వ్యాపారం, లాభాలు ఇతర లావాదేవీల ఈ ప్రభావం ఉంటుందని కూడా కాగ్ విశ్లేషించింది. -
ఏపీలో భారీగా గ్యాస్ నిక్షేపాలు..
-
ఏపీలో భారీగా గ్యాస్ నిక్షేపాలు...
-
సహజ వాయువుల మహా ఖజానా.. ఆంధ్ర తీరం
మొత్తం విలువ..33 లక్షల కోట్లు... - కేజీ బేసిన్లో అపార సిరుల రాశి.. మంచు రూపంలో భారీ గ్యాస్ నిక్షేపాలు - ఆంధ్రప్రదేశ్ తీరంలో గుర్తింపు.. రిలయన్స్ గ్యాస్ క్షేత్రం కన్నా పది రెట్లు అధికం వాషింగ్టన్ : కృష్ణా-గోదావరి బేసిన్లో మరోసారి అపార సిరుల రాశి దొరికింది. మంచు రూపంలో నిక్షిప్తమై ఉన్న భారీ సహజవాయువు (గ్యాస్) వనరులను భారతదేశం కనుగొన్నది. శాస్త్రపరిభాషలో ‘గ్యాస్ హైడ్రేట్స్’గా పేర్కొనే ఈ నిక్షేపాలను బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరంలోని కేజీ బేసిన్ పరిధిలో కనుగొన్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ సారథ్యంలోని ఈ అన్వేషణలో పాల్గొన్న అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాలు అత్యంత సుసంపన్నమైనవని, వీటిని వెలికితీయవచ్చునని తెలిపింది. వీటిలో 134 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ నిక్షిప్తమై ఉన్నట్లు ప్రాధమిక అంచనాగా ఓఎన్జీసీ వర్గాలు తెలిపాయి. మొత్తం విలువ ప్రస్తుత ధరల ప్రకారం రూ. 33 లక్షల కోట్లుగా ఉండొచ్చని నిపుణుల అంచనా. ఇదే కేజీ బేసిన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కనుగొని, నిర్వహిస్తున్న గ్యాస్ క్షేత్రమే ఇప్పటివరకూ భారతదేశం కనుగొన్న అతిపెద్ద గ్యాస్ క్షేత్రం. అందులో 14 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ ఉన్నట్లు అప్పుడు అంచనా వేశారు. అంటే.. దానికన్నా పది రెట్లు అధికమైన గ్యాస్ నిక్షేపాలను తాజా అన్వేషణలో కనుగొన్నారు. కృష్ణా-గోదావరి బేసిన్లో మందపాటి ఇసుక రిజర్వాయర్లలో ఈ గ్యాస్ హైడ్రేట్ నిల్వలు ఉన్నాయని.. కాబట్టి వీటిని వెలికితీయటం సాధ్యమవుతుందని యూఎస్జీఎస్ ఎనర్జీ రిసోర్సెస్ ప్రోగ్రామ్ సమన్వయకర్త వాల్టర్ గైడ్రోజ్ సోమవారం వాషింగ్టన్లో వెల్లడించారు. పరిశోధన తర్వాతి దశలో ఈ గ్యాస్ హైడ్రేట్లను వెలికితీయటంపై పరీక్షలు నిర్వహించటం జరుగుతందని చెప్పారు. గ్యాస్ హైడ్రేట్.. మండే మంచు! సహజవాయువు (నాచురల్ గ్యాస్), నీరు కలిసిపోయి ప్రకృతి సిద్ధంగా గడ్డకట్టి మంచు రూపంలో ఉండటాన్ని గ్యాస్ హైడ్రేట్లుగా పరిగణిస్తారు. ఇవి ప్రపంచంలోని మహాసముద్రాల్లో.. ఖండాల అంచున, ధృవ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా గల గ్యాస్ హైడ్రేట్ సంపదలో గల గ్యాస్ పరిమాణం అంతా కలిపితే.. ఇప్పటివరకూ తెలిసిన అన్ని రకాల సంప్రదాయ గ్యాస్ వనరుల పరిమాణం కన్నా చాలా అధికంగా ఉంటుంది. గ్యాస్ హైడ్రేట్ల నుంచి గ్యాస్‌ను ఉత్పత్తి చేయటం సాధ్యమయ్యేదే అయినప్పటికీ.. ఆ నిక్షేపాలు ఉన్న ప్రాంతం, అవి ఏ రూపంలో ఉన్నాయి అనే అంశాల ఆధారంగా వెలికితీయటానికి చాలా సాంకేతిక సవాళ్లు ఉన్నాయి. అయితే.. ఇసుక రిజర్వాయర్లలో అధిక సాంద్రతల్లో ఉండే గ్యాస్ హైడ్రేట్లను ప్రస్తుతం అందుబాటులో ఉణ్న సాంకేతిక పరిజ్ఞానంతో వెలికితీయటం సాధ్యమేనని ఇంతకుముందలి అధ్యయానాల్లో గుర్తించారు. భారత్, అమెరికా, జపాన్ల భాగస్వామ్యం భారతదేశంలో పశ్చిమ, తూర్పు, అండమాన్ సముద్ర తీరాల్లో కలిపి 1,894 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాలు ఉన్నాయి. దేశంలోని గ్యాస్ హైడ్రేట్స్ సామర్థ్యాలను అన్వేషించటానికి, పైలట్ ఉత్పత్తి పరీక్షల కోసం క్షేత్రాలను గుర్తించటానికి భారత ప్రభుత్వం 2014లో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. జపాన్‌కు చెందిన జపనీస్ డ్రిల్లింగ్ కంపెనీ, జపాన్ ఏజెన్సీ ఫర్ మెరైన్-ఎర్త్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ సంస్థలు కూడా ఈ అన్వేషణలో భాగస్వాములయ్యాయి. భారత ప్రభుత్వ రంగ సంస్థ చమురు సహజవాయువు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) సారథ్యంలో ‘ఇండియన్ నేషనల్ గ్యాస్ హైడ్రేట్ ప్రోగ్రామ్ ఎక్స్‌పెడిషన్ 02’ పేరుతో మూడు దేశాల పరిశోధకులు ఈ అన్వేషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంతకుముందు భారత్, అమెరికాలు ఉమ్మడిగా చేపట్టిన అన్వేషణలో కూడా గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాలను కనుగొన్నారు. అయితే.. ఆ గ్యాస్ హైడ్రేట్ ఉన్న రూపాలను బట్టి దానిని ఇప్పుడు వెలికితీయటం సాధ్యంకాదని నిర్ధారించారు. రెండోసారి చేపట్టిన అన్వేషణలో.. ఇసుక రిజర్వాయర్లలో అత్యంత సాంద్రత గల గ్యాస్ హైడ్రేట్లను గుర్తించటంపై కేంద్రీకరించి.. కృష్ణా-గోదావరి బేసిన్లో వెలికితీయగల నిక్షేపాలను కనుగొన్నారు. ప్రపంచంలో అతి భారీ నిక్షేపాల్లో ఒకటి కృష్ణా-గోదావరి బేసిన్‌లోని 982, డి3, డి6, డి9 బ్లాకుల్లో ఈ గ్యాస్ హైడ్రేట్స్ నిక్షేపాలను గుర్తించినట్లు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ వర్గాలు తెలిపాయి. ఇవి రిలయన్స్ గ్యాస్ క్షేత్రమైన కేజీ-డి6 బ్లాక్‌కు 30 కిలోమీటర్లు నైరుతిగా ఉన్నాయి. కేజీ బేసిన్లో రిలయన్స్ గ్యాస్ ఇండస్ట్రీస్ 2002లో కనుగొన్న అతి భారీ గ్యాస్ క్షేత్రంలో ఉన్నట్లు పేర్కొన్న గ్యాస్ కన్నా.. తాజాగా ఇదే కేజీ బేసిన్లో కనుగొన్న గ్యాస్ హైడ్రేట్లు పది రెట్లు అధికంగా 134 లక్షల కోట్ల ఘనపుటడుగల మేర ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. రిలయన్స్ గ్యాస్ క్షేత్రంలో 14 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ ఉన్నట్లు అంచనా వేశారు. రిలయన్స్ సంస్థకు ప్రభుత్వం 1 ఎంబీటీయూ (మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్) గ్యాస్‌కు 3.7 డాలర్లు చొప్పున ధర నిర్ణయించింది. అదే ధర ప్రకారం ఈ గ్యాస్ హైడ్రేట్లలోని 134 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ విలువ దాదాపు రూ. 33 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ప్రపంచంలో ఇప్పటివరకూ గుర్తించిన అతి పెద్ద, అత్యంత సాంద్రతతో కూడిన గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాల్లో ఇది ఒకటని.. ప్రపంచ ఇంధన వనరుల సామర్థ్యానికి గల పరిమితులను తొలగించటానికి, వాటిని సురక్షితంగా ఉత్పత్తి చేసే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ఆవిష్కారం దోహదం చేస్తుందని యూఎస్‌జీసీ సీనియర్ శాస్త్రవేత్త టిమ్ కొలెట్ పేర్కొన్నారు. -
ఓఎన్జీసీ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: కేజీ బేసిన్ డీ5 ఆయిల్, గ్యాస్ బ్లాక్‌ల్లో ఆయిల్, గ్యాస్ వెలికితీత కోసం ప్రభుత్వ రంగ సంస్థ, ఓఎన్జీసీ 500 కోట్ల డాలర్లు(రూ.34,000 కోట్లు) పెట్టుబడులు పెడుతోంది. ఈ చమురు క్షేత్రాల నుంచి 2019 జూన్ కల్లా తొలి గ్యాస్ ఉత్పత్తి జరుగుతుందని, ఇక చమురు ఉత్పత్తి మార్చ్ 2020 కల్లా మొదలవుతుందని ఓఎన్జీసీ సీఎండీ డి.కె. సరాఫ్ చెప్పారు. బంగాళాఖాతంలోని కేజీ-డీడబ్ల్యూఎన్-98/2(కేజీ-డీ5)లోని 10 ఆయిల్, గ్యాస్ క్షేత్రాల్లో ఉత్పత్తి కోసం 507.6 కోట్ల డాలర్ల పెట్టుబడులకు ఓఎన్జీసీ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించారు. ప్రభుత్వ కొత్త ధరల విధానంలో కేజీ-డీ5 నుంచి చమురు, గ్యాస్ వెలికితీత ప్రయోజనకరమేనని, అందుకే ఈ పెట్టుబడుల ప్రణాళికలకు బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించారు. ఉత్పత్తి ప్రారంభమైన రెండేళ్లకు రోజుకు 77,305 బ్యారెళ్ల చమురును, 16.56 మిలియన్ స్టాండర్డ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తామని వివరించారు. ఈ క్షేత్రాల నుంచి వెలికితీసిన గ్యాస్‌ను ఫిక్స్డ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలోని ఓడలరేవు ఆన్‌షోర్ టెర్మినల్ ద్వారా బయటకు తేవాలనే ప్రతిపాదన ఉందని పేర్కొన్నారు. -
జూలై దాకా షా కమిటీ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: కేజీ బేసిన్లో గ్యాస్ ఉత్పత్తికి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీల మధ్య వివాదంపై ఏర్పాటైన షా కమిటీ గడువును జూలై దాకా పొడిగించినట్లు చమురు శాఖ అధికారి ఒకరు తెలిపారు. రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థ నికో రిసోర్సెస్ ఫిబ్రవరి 19న విచారణ కమిటీ ముందుకు వచ్చాయని, భారీ పరిమాణంలో పత్రాలు సమర్పించాయని వివరించారు. వీటిని అధ్యయనం చేయాల్సి ఉన్నందున గడువు పొడిగించాలని కమిటీ కోరిందని, దానికి అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. పొరుగున ఉన్న ఓఎన్జీసీ క్షేత్రం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు రూ. 11,000 కోట్ల విలువ చేసే గ్యాస్‌ను తోడేసిందని ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనే జస్టిస్ (రిటైర్డ్) ఏపీ షాతో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది చమురు శాఖ. -
డీజీహెచ్‌కు ఓఎన్జీసీ ‘కేజీ’ క్షేత్ర ప్రణాళిక ముసాయిదా
న్యూఢిల్లీ: కేజీ బేసిన్‌లోని డీ5 బ్లాకులో 2018-19 నాటికి చమురు, గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఓఎన్జీసీ) సంస్థ క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక (ఎఫ్డీపీ) ముసాయిదాను చమురు రంగ నియంత్రణ సంస్థ డీజీహెచ్‌కు సమర్పించింది. మొట్టమొదటిసారిగా కనుగొన్న నిక్షేపాల్లో రోజుకు 14 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ను, 77,000 బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేయొచ్చని భావిస్తున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కేజీ-డీ5 బ్లాకులోని 12 చమురు, గ్యాస్ నిక్షేపాలను మూడు క్లస్టర్లుగా ఓఎన్జీసీ విడగొట్టింది. ప్రస్తుతం చమురు నిక్షేపాలున్న క్లస్టర్ 2ఏ, గ్యాస్ నిక్షేపాలు ఉన్న 2బీలను అభివృద్ధి చేయడంపై సంస్థ దృష్టి పెట్టిందని, దానికి సంబంధించిన ఎఫ్డీపీనే డీజీహెచ్కి ఇచ్చినట్లు ఆయా వర్గాలు తెలిపాయి. -
గ్యాస్‌కు అధిక రేటు ఇవ్వాలి: బీపీ
న్యూఢిల్లీ: కేజీ బేసిన్‌తో పాటు తూర్పున ఇతరత్రా ఆఫ్‌షోర్ బ్లాక్‌లలో ఇంకా అభివృద్ధి చేయని క్షేత్రాల నుంచి గ్యాస్ వెలికి తీయాలంటే రేటు మరింత ఎక్కువగా ఉంటేనే గిట్టుబాటు అవుతుందని చమురు దిగ్గజం బీపీ.. కేంద్రానికి తెలిపింది. అలాగే, కేజీ-డీ6 వ్యయాలపై పెనాల్టీలపై ఆర్బిట్రేషన్ అంశం కూడా సత్వరం ఒక కొలిక్కి వచ్చేలా చూడాలని కోరింది. ప్రధాని నరేంద్ర మోదీ, చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో బుధవారం భేటీ అయిన బీపీ సీఈవో బాబ్ డడ్లీ ఈ అంశాలను వివరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆయన వెంట రాకపోవడం గమనార్హం. సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌కు ఇచ్చే ప్రీమియం రేటును కేజీ-డీ6తో పాటు ఎన్ఈసీ-25 క్షేత్రాలకు కూడా వర్తింపచేయాలని బీపీ కోరుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
‘గ్యాస్ కేటాయిస్తున్నారో లేదో చెప్పండి ?’
సాక్షి, హైదరాబాద్: కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్ గ్యాస్‌ను రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయిస్తున్నారో? లేదో ? చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భొసాలే, జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వెలికితీసిన గ్యాస్‌ను రాష్ట్రానికి కేటాయించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, కేజీ బేసిన్ గ్యాస్‌ను రాష్ట్రానికి కేటాయించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ జన పాలన పార్టీ అధ్యక్షుడు పాలెం శ్రీకాంత్‌రెడ్డి హైకోర్టులో గత ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
4 వారాల్లో సమాధానం ఇవ్వండి
న్యూఢిల్లీ: కృష్ణాగోదావరి బేసిన్లో గ్యాస్ అన్వేషణ విషయంలో కాగ్ తుది నివేదికపై 4 వారాల్లో సమాధానం తెలపాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), ఇతర ప్రతివాదులకు సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. కేసు తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది. డీ6 బావుల తవ్వకంలో కాంట్రాక్టర్లకు చెల్లింపులుసహా, పలు అవకతవకలు చోటుచేసుకున్నట్లు కాగ్ నివేదిక పేర్కొంది. ఆయా అంశాలకు సంబంధించి దాదాపు రూ.2,179 కోట్ల వ్యయాలను ఆర్ఐఎల్ మినహాయించుకోడానికి అనుమతి ఇవ్వవద్దని నివేదిక కోరింది. -
ప్రత్యామ్నాయ గ్యాస్‌తో సర్దుబాటు
హైదరాబాద్: గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లకు ఆర్ఎల్ఎన్జీ గ్యాస్‌ను పరస్పర బదిలీ పద్ధతిలో సర్దుబాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఏపీలో గ్యాస్ కొరతతో మూతపడ్డ మూడు పవర్ ప్లాంట్లకు గ్యాస్‌ను కేటాయించేందుకు అనుమతించింది. రెండు నెలల కిందట టీఎస్ జెన్కో చేసిన అభ్యర్థన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలోని జీవీకే, స్పెక్ట్రమ్, లాంకో, కోనసీమ, వేమగిరి గ్యాస్ ఆధారిత ప్లాంట్లలో మొత్తం 2499 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యముంది. సరిపడా గ్యాస్ అందుబాటులో ఉంటే ఇందులో నుంచి 53.89 శాతం (1346 మెగావాట్లు) విద్యుత్తు తెలంగాణకు పంపిణీ అయ్యే వీలుంది. ప్రస్తుతం కేజీ బేసిన్ నుంచి గ్యాస్ సరఫరా లేకపోవటంతో ఈ ప్లాంట్ల నుంచి తెలంగాణకు అందుతున్న విద్యుత్తు 150 మెగావాట్లకు మించటం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో రీ గ్యాసిఫైడ్ లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఆర్ఎల్ఎన్జీ) ధర గతంలో ఒక్కో యూనిట్‌కు 20 నుంచి 25 డాలర్లుండగా, ప్రస్తుతం 10 నుంచి 15 డాలర్లకు పడిపోయింది. గ్యాస్‌ను ద్రవ రూపంలోకి మార్చి బ్యారెళ్లలో దిగుమతి చేసుకొని తిరిగి ద్రవాన్ని గ్యాస్‌గా మార్చడమే ఆర్ఎల్ఎన్జీ. ప్రస్తుతం కేజీ బేసిన్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్‌లోని ఫెర్టిలైజర్ కంపెనీలకు గ్యాస్ సరఫరా అవుతోంది. అక్కడి నుంచి తూర్పు తీరంలో ఉన్న ఏపీకి గ్యాస్ సరఫరా చేసుకునేందుకు పైపులైన్లు లేవు. అందుకే ఆర్ఎల్ఎన్జీని అక్కడి కంపెనీలకు కేటాయించి కేజీ బేసిన్ నుంచి సరఫరా అవుతున్న గ్యాస్‌ను ఇక్కడ వినియోగించుకునేలా గ్యాస్ స్వాపింగ్ (పరస్పర గ్యాస్ కేటాయింపుల బదిలీ)కు అనుమతించాలని రాష్ట్ర ఇంధన శాఖ నెల రోజుల కిందట కేంద్రాన్ని అభ్యర్థించింది. మూడు గ్యాస్ ఆధారిత కేంద్రాలకు 2.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను అందించేందుకు కేంద్రం అంగీకరించింది. దీంతో దాదాపు 450 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. గ్యాస్ ప్లాంట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభమైతే తెలంగాణకు 242 మెగావాట్ల విద్యుత్తు అందే అవకాశముంది. -
'ఆ వాటా ఏపీకి దక్కాల్సిందే'
విజయవాడ: కేజీ బేసిన్ నుంచి రిలయన్స్ తరలించుకు పోతున్న గ్యాస్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రావల్సిన వాటాను దక్కించుకుంటే ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిలయన్స్ నుంచి వాటా రాబట్టలేక ప్రజలపై భారం మోపుతున్నారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్, పెట్రోల్ ఛార్జీల పెంపుపై ఉద్యమించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ధరలను పెంచుతున్నారంటూ దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో బాబు రాగానే జాబు ఇస్తానన్న చంద్రబాబు ఉన్న జాబులను పీకేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీలు ప్రజలకు నమ్మక ద్రోహం చేశాయని మధు విమర్శించారు. -
మరో 3 చమురు, గ్యాస్ నిక్షేపాలు: ఓఎన్జీసీ
న్యూఢిల్లీ: కొత్తగా మూడు చమురు, గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ప్రకటించింది. ఇవి కృష్ణా-గోదావరి బేసిన్, ముంబై సముద్ర క్షేత్రంలోనూ, కావేరీ బేసిన్‌లోను ఉన్నట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఓడలరేవు పట్టణానికి దాదాపు 43 కిలోమీటర్ల దూరంలో ఓఎన్జీసీకి చెందిన కేజీ బేసిన్ బ్లాకు ఉంది. ఇందులో జీడీ-11-1 బావిని దాదాపు 2,810 మీటర్ల లోతున తవ్వగా.. గ్యాస్ నిక్షేపాల ఆధారాలు లభ్యమైనట్లు ఓఎన్జీసీ తెలిపింది. సుమారు 36 మీటర్ల మేర గ్యాస్ ఉండొచ్చని అంచనాలు వేస్తున్నట్లు వివరించింది. మరోవైపు, 100 శాతం మేర మధ్యంతర డివిడెండ్ ప్రకటించనున్నట్లు తెలిపింది. దీని ప్రకారం రూ. 5 ముఖ విలువ గల షేరుకి రూ. 5 చొప్పున డివిడెండ్ ఇచ్చే ప్రతిపాదనకు సంస్థ బోర్డు ఆమోదముద్ర వేసింది. డివిడెండ్ రూపంలో మొత్తం రూ. 4,278 కోట్లు చెల్లించనుండగా, ఇందులో ప్రభుత్వ వాటా కింద రూ. 2,948 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ. 856 కోట్ల మేర డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కూడా కట్టనున్నట్లు సంస్థ తెలిపింది. -
కేజీ బేసిన్లో 45 బావుల తవ్వకానికి ఓఎన్జీసీ రెడీ!
హైదరాబాద్: ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ... ఆంధ్ర ప్రదేశ్‌లోని కేజీ బేసిన్లో 45 చమురు-గ్యాస్ బావుల తవ్వకానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.16,200 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు అంచనా. కంపెనీకి ఇక్కడున్న కేజీ-డీ5 బ్లాక్‌లోని ఉత్తర అన్వేషణ ప్రాంతం(ఎన్డీఏ)లో ఈ డెవలప్మెంట్ డ్రిల్లిం గ్ను చేపట్టడం కోసం అనుమతులివ్వాల్సిందిగా.. పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖను కూడా ఇప్పటికే కోరింది. ఇటీవల జరిగిన నిపుణుల కమిటీ సమావేశంలో ఈ ప్రణాళికలపై దృష్టి సారించినట్లు సమాచారం. కాగా, 2019కల్లా ఇక్కడ చమురు-గ్యాస్ ఉత్పత్తిని మొదలుపెట్టాలని ఓఎన్జీసీ భావిస్తోంది. ఏడాదికి గరిష్టంగా 4.5 మిలియన్ టన్నుల క్రూడ్(ముడి చమురు) ఉత్పత్తిని అంచనా వేస్తోంది. తీరానికి 25 కిలోమీటర్ల దూరంలో ప్రతిపాదిత డ్రిల్లింగ్ ప్రాంతాలు ఉన్నట్లు కంపెనీ చెబుతోంది. ఈ బ్లాక్‌లో మొత్తం 10 గ్యాస్ నిక్షేపాలను కూడా ఓఎన్జీసీ కనుగొంది. కాగా కేజీ-డీ5ను కంపెనీ ఉత్తర, దక్షిణ అన్వేషణ ప్రాంతాలు(ఎన్డీఏ, ఎస్డీఏ)గా విభజించింది. ఎన్డీఏలో కనీసం 9 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.55,800 కోట్లు) పెట్టుబడికి ఆస్కారం ఉందని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇక్కడి 7 క్షేత్రాల్లో 92.3 మిలియన్ టన్నుల చమురు, 97.5 బిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్ నిల్వలున్నాయనేది కంపెనీ అంచనా వేసినట్లు తెలిపారు. -
ఏసీబీకి దర్యాప్తు అధికారం లేదు
గ్యాస్ ధర నిర్ణయంలో అవకతవకల కేసు కోర్టుకు తెలియజేసిన ఢిల్లీ సర్కారు సాక్షి, న్యూఢిల్లీ: కేజీ బేసిన్లో లభించే గ్యాస్ ధర పెంపులో అవకతవకలకు సంబంధించి దర్యాప్తు జరిపే అధికారంఅవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)కి లేదని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. కేంద్రం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషతో ఏసీబీ ఈఅధికారాన్ని కోల్పోయిందని ఢిల్లీ ప్రభుత్వం,ఏసీబీ తరపున న్యాయస్థానానికి హాజరైన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తెలిపారు. ‘జూలై 23వ తేదీన కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన ప్రకారం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసే అధికారం ఏసీబీకి లేదు. అవినీతి కేసుల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులపై దర్యాప్తు జరిపే అధికారాన్ని ఈ నోటిఫికేషన్ ఏసీబీ పరిధి నుంచి తొలగించింది. ఢిల్లీ ప్రభుత్వ అధికారులు, ఉ ద్యోగులపై దర్యాప్తు జరిపే అధికారాన్ని మాత్రమే ఏసీబీకి మిగిల్చింది’ అని సింగ్ న్యాయస్థానానికి తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ నవంబర్ 8, 1993న జారీ చేసిన నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ సవరించింది. తాజా నోటిఫికేషన్ ఏసీబీ దర్యాప్తు అధికారాన్ని ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేసింది. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ నేపథ్యంలో తాజా సమాధానం ఇవ్వడానికి తనకు మరికొంత సమయం కావాలని ఏసీబీ... న్యాయస్థానాన్ని కోరింది. తాజా పరిణామాల నేపథ్యంలో కొత్తగా సమాధానాన్ని ఇవ్వడానికి ఏసీబీకి, ఢిల్లీ ప్రభుత్వానికి సమయాన్ని ఇస్తూ న్యాయమూర్తి వీకే శాలి నేతృత్వంలోని ధర్మాసనం కేసుపై విచారణను అక్టోబర్ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీ ప్రభుత్వం ఏసీబీ సమాధానాలకు రిలయెన్స్, ఇతరులు తదుపరి విచారణ తేదీలోగా సమాధానాలు సమర్పించాల్సి ఉంటుంది. ఫిర్యాదుదారుల తరపున న్యాయస్థానానికి హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ దాని దృష్ట్యా టెరిటోరియల్ జ్యురిస్డిక్షన్ పరంగా తన పరిధిలో జరిగిన అవినీతి కేసులపై దర్యాప్తు జరిపే అధికారం ఏసీబీకి ఉందని వాదించారు. గ్యాస్ ధర పెంపులో అవకతవకలు జరిగాయనే ఫిర్యాదుల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని అప్పటి ఢిల్లీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా ఏసీబీని ఆదేశించింది. తనపై అవినీతి ఆరోపణలు దురుద్దేశంతో కూడినవని, అటువంటి ఆరోపణలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసే అధికారం ఏసీబీకి లేదని, అందువల్ల ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని రిలయెన్స్ అంతకుముందు న్యామస్థానాన్ని కోరింది. అయితే గ్యాస్ధరల పెంపులో అవకతవకల కేసులో మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీతో పాటు రిలయెన్స్పైనా, ఇతరులపైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేసే అధికారం తనకు ఉందని ఏసీబీ న్యాయస్థానానికి తెలియజేసింది. అవమానకరమైన రాజీయే ఏసీబీ విచారణ పరిధి అంశంపై ఆప్ న్యూఢిల్లీ: ఏసీబీ పరిధి వ్యవహారంలో ఢిల్లీ ప్రభుత్వ వైఖరికి సంబంధించి బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తప్పుపట్టింది. ఇది అవినీతితో అవమానకరమైన రీతిలో రాజీపడడమేనని అభివర్ణించింది. రిలయన్స్ సంస్థతోపాటు యూపీఏ మాజీ మంత్రులను కాపాడే ప్రయత్నమని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించింది. ఏసీబీ అధికార పరిధుల విషయంలో బీజేపీ నియంత్రింత ఢిల్లీ ప్రభుత ్వం హైకోర్టుకు ఇచ్చిన జవాబు... అవినీతితో రాజీకి ఉదాహరణగా అభివర్ణించింది. ఉద్దేశపూర్వకంగానే ఏసీబీ అధికారాలకు కత్తెర వేస్తున్నారని ఆరోపించింది. అర్థరహితమైన వ్యవస్థగా ఏసీబీని మార్చేందుకు జరుగుతున్న కుట్రగా అభివ ర్ణించింది. రూ. 54 వేల కోట్ల ఈ భారీ కుంభకోణంలో యూపీఏ మాజీ మంత్రుల హస్తముందని ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించి సమగ్ర దర్యాప్తు అవసరమని ఏసీబీ తన 32 పేజీల అఫిడవిట్లో కోర్టుకు నివేదించిందని, ఇటువంటి పరిస్థితుల్లో దాని అధికారాలకు పరిమితులు విధించడం అర్థరహితమని పేర్కొంది. -
గళం విప్పిన ‘ప్రత్యేక కోనసీమ’
అమలాపురం : కోనసీమ ప్రత్యేక జిల్లా డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు రాజకీయ నేతలకు మాత్రమే పరిమితమైన ఈ డిమాండ్ జనబాహుళ్యంలోకి చొచ్చుకు వెళుతోంది. అన్నివర్గాల వారు కోనసీమను ‘ప్రత్యేక’ జిల్లా చేయాలని గళం విప్పుతున్నారు. ఉద్యమానికీ సై అంటున్నారు. మన్యసీమ పేరుతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దీని తరువాత కోనసీమ జిల్లాను ఏర్పాటు చేయాలనే నినాదం మరింత విస్తృతమవుతోంది. తూర్పుగోదావరి జిల్లాను రాజకీయంగా, ఆర్థికంగా శాసించే స్థాయిలో ఉన్న కోనసీమను ప్రత్యేక జిల్లా చేయాలనేది ఈ ప్రాంతవాసుల దశాబ్దాల నాటి కల. ప్రత్యేక జిల్లాగా ఏర్పడితేనే రైల్వేలైన్ వస్తుందని, పారిశ్రామికాభివృద్ధి జరిగి యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని స్థానికులు భావిస్తున్నారు. అయితే ఈ డిమాండ్‌ను గత ప్రభుత్వాలు చెవికెక్కించుకోలేదు. రాష్ట్ర విభజన తరువాత కొత్త జిల్లాల ఏర్పాటు తెరపైకి రావడంతో కోనసీమ జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరిగింది. వ్యవసాయ, మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు, ఇసుక రీచ్‌ల వల్ల జిల్లాకు వస్తున్న ఆదాయంలో కోనసీమ వాటా 40 శాతం వరకు ఉంటుందని అంచనా. కృష్ణా గోదావరి బేసిన్ (కేజీ) బేసిన్ ద్వారా ప్రముఖ చమురు సంస్థల కార్యకలాపాలు కోనసీమ కేంద్రంగానే జరుగుతున్నాయి. ఈ ప్రాంతం నుంచి రూ.1250 కోట్ల విలువైన ఆక్వా ఎగుమతులు విదేశాలకు జరుగుతాయి. ఇదే కాకుండా రూ.250 కోట్ల విలువైన వరి, కొబ్బరి, ఇతర వాణిజ్య పంటల ఎగుమతి జరుగుతోంది. ఇవి కాకుండా ఇసుక రీచ్‌ల ద్వారా కూడా ఇబ్బుడిముబ్బడిగా ఆదాయం వస్తోంది. జిల్లాలో సుమారు 51 లక్షల మంది జనాభా ఉండగా, కోనసీమలో సుమారు 15 లక్షల మంది వరకు ఉన్నారు. గతంలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, నియోజకవర్గ పునర్విభజనలో ఇవి ఐదుకు పరిమితయ్యాయి. ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో మండలమైన తాళ్లరేవు, కొత్తపేట నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఆలమూరు కోనసీమ ఆవలివైపు ఉన్నాయి. ప్రత్యేక దీవిగా ఉన్న ఈ ప్రాంతాన్ని జిల్లా చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అయితే పూర్తిగా ఒక పార్లమెంట్ నియోజకవర్గం కూడా కాని ఈ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయలేమని ఇతర ప్రాంత నేతలు వాదిస్తున్నారు. దీని వెనుక ఆదాయం కోల్పోతామనే భయమే ఎక్కువుగా ఉందని కోనసీమవాసుల వాదన. విభజన నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్నాయని, జిల్లాకు 25 వరకు స్థానాలు పెరిగే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. అంటే జిల్లాలో ఇప్పుడున్నదానికన్నా అదనంగా ఆరు పెరుగుతాయి. ఈ విధంగా చూస్తే కోనసీమలో మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో కోనసీమను ప్రత్యేక జిల్లా చేసే అవకాశాలున్నాయని కోనసీమ వాసులు చెబుతున్నారు. మన్యసీమతో... ప్రత్యేక కోనసీమకు ఊపురాష్ట్ర పునర్విభజ చట్ట సవరణ ద్వారా పోలవరం ముంపు ప్రాంతమైన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపిన విషయం తెలిసిందే. ఈ మండలాలను తూర్పులోని రంపచోడవరం డివిజన్, పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం డివిజన్ కలిపి మన్యసీమగా కొత్త జిల్లా ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రత్యేక కోనసీమ డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. దశాబ్దాలుగా ఉన్న కోనసీమ డిమాండ్‌ను పట్టించుకోకపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. అవసరమైతే ఉద్యమించాలని నిర్ణయానికి వచ్చారు. ఇప్పటివరకు రాజకీయ నేతల ప్రకటనలకే పరిమితమైన ఈ డిమాండ్ ఇప్పుడు ఉద్యమం రూపం దాలుస్తోంది. అన్నివర్గాలవారు దీనిపై గళమెత్తుతున్నారు. అమలాపురంలో ఆదివారం కోనసీమ ప్రత్యేక జిల్లా సాధనా సమితి ఆవిర్భవించింది. ఇప్పటి వరకు దీనిపై విడివిడిగా ఉద్యమిస్తున్న సంఘా లు ఏకతాటిపైకి వస్తున్నాయి. మన్యసీమ ఏర్పడిన తరువాత ఈ ఉద్యమం ఉద్ధృతమయ్యే అవకాశముంది. -
వేకువ విషాదానికి నేటితో నెల
కాకినాడ క్రైం : నగరంలో గెయిల్ గ్యాస్ విస్ఫోటం జరిగిన నెలరోజులు కావొస్తున్నా ఇంకా తొమ్మిది మంది కాకినాడ అపోలో, ట్రస్టు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు. వారిలో ఒకరి పరిస్థితి నేటికీ విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఘటనలో 21 మంది మృతి చెందగా కాకినాడలోని మూడు ఆస్పత్రుల్లో 18 మంది చికిత్స పొందారు. అయితే వారిలో స్వల్పగాయాలైన తొమ్మిది మందిని డిశ్చార్జ్ చేయగా, మరో తొమ్మిది మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ కృష్ణన్, అతడి భార్య మేఘన, వానరాశి దుర్గాదేవి, ఆమె కుమారులు ఎనిమిదేళ్ల మధుసూదన్, ఏడేళ్ల మోహన వెంకట కృష్ణ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రుద్రరాజు సూరిబాబును సాయిసుధ ఆస్పత్రి నుంచి అపోలోకు తరలించడంతో ఆయన కూడా అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బోణం పెద్దిరాజు, అతడి భార్య రత్నకుమారి, అక్క సత్యవతి ట్రస్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్యాస్ పైపులైన్ పేలిన ఘటన తలచుకుని క్షతగాత్రులతోపాటు వారి బంధువులు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. నగరం గ్రామానికి చెందిన వారైనప్పటికీ అక్కడి వెళ్లేందుకు వారు నిరాకరిస్తున్నారు. యూరియా, విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం మామిడికుదురు : గ్యాస్ పైప్‌లైన్ విస్ఫోటం నేపథ్యంలో జూలై ఒకటో తేదీ నుంచి కృష్ణా గోదావరి బేసిన్ (కేజీ బేసిన్) నుంచి సహజ వాయువు సరఫరా నిలిచిపోయింది. ఉభయ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కాకినాడలోని నాగార్జున ఎరువుల కర్మాగారంలోని రెండు ప్లాంట్లకు ప్రతి రోజూ సరఫరా అయ్యే 2.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా ఆగిపోయింది. దీని వల్ల రోజుకు ఐదు వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తికి బ్రేక్‌పడింది తద్వారా ఈ సంస్థకు రోజుకు రూ.రెండు కోట్ల నష్టం వాటిల్లుతోంది. కాకినాడ సమీపంలోని ఉప్పాడలోని స్పెక్ట్రమ్, విజయవాడ సమీపంలోని ల్యాంకో, విజ్జేశ్వరంలోని ఏపీ జెన్కో, వేమగిరి తదితర విద్యుత్ కేంద్రాలకు రోజుకు 20 లక్షల క్యూబిక్ మీటర్ల సహజ వాయువు సరఫరా అయ్యేది. దీంతో పాటు రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ సంస్థల నుంచి రోజుకు మరో పది లక్షలు క్యూబిక్ మీటర్లు వెరసి, మొత్తం 30 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా కూడా నిలిచింది. దీని వల్ల 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. శుక్రవారం నుంచి మినీ రిఫైనరీ కార్యాలయం ప్రధాన గేట్లకు తాళం వేయడంతో చమురు ఉత్పత్తుల సరఫరా నిలిచిపోయింది. రిఫైనరీలో మొత్తం 250 టన్నుల ముడి చమురు శుద్ధి అవుతోంది. దీని ద్వారా నాఫ్తా, సూపర్ కిరోసిన్, డీజిల్, టర్పంటెన్ ఆయిల్, రెడ్యూస్డ్ క్రూడాుుల్ను ఉత్పత్తి చేస్తున్నారు. దీనిని ప్రతి రోజూ 20 ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. మొక్కుబడి విచారణ ప్రమాదానికి గెయిల్ అధికారుల బాధ్యతారాహిత్యమే కారణమని ప్రభుత్వం ప్రకటించినా ఆ సంస్థపై తీసుకున్న చర్యలు శూన్యం. గెయిల్‌పై కేసు నమోదు చేసినా, సంబంధిత అధికారులను అరెస్టు చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికీ విచారణ నిర్వహిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అంతకు రెండు నెలల ముందు ఇదే ప్రాంతంలో గ్యాస్ లీకైనప్పుడు గెయిల్ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నా ఆ కోణంలో విచారణ నిర్వహించకపోవడంపై బాధితులు మండిపడుతున్నారు. పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హై పవర్ కమిటీ ప్రమాదం జరిగిన రెండో రోజు సంఘటన స్థలానికి వచ్చి అరగంటలో విచారణ పూర్తి చేసి వెళ్లిపోయింది. పెట్రోలియం శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్కే సింగ్ ఆధ్వర్యంలో ఓ బృందం పేలిన పైప్‌లైన్, సరఫరా అవుతున్న గ్యాస్ శాంపిళ్లను తీసుకుని ల్యాబ్‌కు పంపించారు. నివేదిక ఆధారంగా బాధితులను గుర్తిస్తామని చెప్పి చేతులు దులుపుకుంది. గెయిల్ సంస్థ తమ పైప్లైన్ల సామర్ధ్య పరిశీలన కోసం ఏర్పాటు చేసిన థర్డ్‌పార్టీ ఎంక్వైరీ ఇంజనీర్స్ ఇండియా విచారణ సైతం ఇంకా ప్రారంభం కానట్టు తెలిసింది. ఇంకా భయంతోనే... పేలుడు దుర్ఘటనలో నాతో పాటు మా కుమారుడు పెద్దిరాజు, కోడలు రత్నకుమారి, మనుమలు కల్యాణి, హర్షిత, శాంతకుమారి, మా కుమార్తె రేకపల్లి సత్యవతి(అమ్మాజీ) తీవ్రంగా గాయపడ్డారు. నాతో పాటు నా ముగ్గురు మనుమలు ఆస్పత్రి నుంచి ఈ నెల 22న డిశ్చార్జ అయ్యాం. కానీ నా కుమారుడు, కోడలు, కుమార్తె ఇంకా కాకినాడ ట్రస్టు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. నేను నగరం చేరగానే నా మనుమలు ముగ్గురూ ఇక్కడికి వచ్చేందుకు భయపడుతున్నారు. దీంతో వారిని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని వాళ్ల అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్లారు. నా గాయాలు ఇంకా తగ్గలేదు. - బోనం పళ్లాలమ్మ మమ్మల్ని ఆదుకోండి ఇంట్లో నిద్రిస్తున్న మా కుటుంబ సభ్యులంతా గ్యాస్ పైప్‌లైన్ విస్ఫోటంతో భయంతో పరుగులు తీశాం. ఆ సమయంలో నేను అదుపు తప్పి పడిపోయా. దాంతో నా కుడి చేయి విరిగింది. దీనిపై గెయిల్ అధికారులకు మొర పెట్టుకున్నా వారు పట్టించుకోలేదు సరికదా, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు. ప్రమాదం జరిగి నెల రోజులైనా పరిహారం ఇంకా అందలేదు. విరిగిన చేయికి వైద్యం చేయించుకునేందుకు డబ్బు బాగా ఖర్చయ్యింది. ఇప్పటికైనా గెయిల్ అధికారులు స్పందించి పరిహారం ఇప్పిస్తారని ఆశిస్తున్నాం. - వానరాశి వరలక్ష్మీ శేషవేణి -
గ్యాస్ విద్యుత్ ప్లాంట్లు మూతే!
ఆరు ప్లాంట్లలో ఐదేళ్లపాటు ఉత్పత్తి లేనట్టే 2019 వరకు వాటికి గ్యాస్ రాదని కేంద్రం స్పష్టీకరణ 1,985 మెగావాట్ల విద్యుత్ కోల్పోతున్న రెండు రాష్ట్రాలు ఫలితంగా ఇరు రాష్ట్రాలపై ఏడాదికి రూ.3,504 కోట్ల భారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లోని డీ-6 క్షేత్రంపై ఆధారపడిన 1,985 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు గ్యాస్ విద్యుత్ కేంద్రాల్లో మరో ఐదేళ్లపాటు ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం లేదు. 2019 వరకూ వాటికి గ్యాస్ వచ్చే పరిస్థితి లేదని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఇంధనశాఖలకు కేంద్రం సమాచారం పంపింది. అదేవిధంగా 2019 వరకూ కొత్తగా విద్యుత్ప్లాంట్లకు గ్యాస్ కేటాయింపులు ఉండవని కేంద్రం స్పష్టం చేసినట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఫలితంగా ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న మరో 5 వేల మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్‌ప్లాంట్లు (అనిల్ అంబానీ రిలయన్స్, ల్యాంకో, జీఎంఆర్, జీవీకే) నిరుపయోగంగా ఉండిపోనున్నాయి. గ్యాస్ రాకపోవడం వల్ల విద్యుత్‌ను మార్కెట్లో కొనుగోలు చేయాల్సి రానుండటంతో ఇరు రాష్ట్రాలపై ఏడాదికి రూ. 3,504 కోట్ల భారం పడనుంది. ఈ ప్లాంట్లు మూతపడటం వల్ల రోజుకు 4.8 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలు నష్టపోతున్నాయి. ఈ ప్లాంట్ల నుంచి రూ.4కే యూనిట్ విద్యుత్ వచ్చేది. మార్కెట్లో అయితే రూ.6 చెల్లించి కొనుగోలు చేయాల్సిందే. దీనివల్ల యూనిట్‌కు రూ.2 చొప్పున అదనపు భారం పడుతుంది. ఈ విధంగా ఏడాదికి రూ. 3,504 కోట్ల భారం ఇరు రాష్ట్రాల ప్రజలపై పడుతుందన్నమాట. గ్యాస్ ధరపై కిరికిరి! : పారిశ్రామికవర్గాల్లో ఉన్న ప్రచారం మేరకు దేశీయ ఉత్పత్తి గ్యాస్‌కు అంతర్జాతీయ గ్యాస్ ధరలనే ఇచ్చేవరకు ఇదే పరిస్థితి ఉండనుందని తెలుస్తోంది. కేజీ బేసిన్ గ్యాస్ ధరను కేంద్రం 2009లో నిర్ణయించింది. దీని ప్రకారం ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయు)కు డిస్కంలు 4.2 డాలర్లు చెల్లిస్తున్నాయి. ఈ ధరలను ఐదేళ్లకోసారి సవరిస్తామని కేంద్రం పేర్కొంది. దీనిపై గత యూపీఏ సర్కారు కసరత్తు పూర్తిచేసి ఒక ఎంబీటీయూ ధరను 8.4 డాలర్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. అయితే, దీని అమలుకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. మరోవైపు 2019 నుంచి అంతర్జాతీయ స్థాయి గ్యాస్ ధరలను అమలు చేస్తామని కూడా కేంద్రం ఇప్పటికే హామీ ఇచ్చింది. అంటే 2019 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే గ్యాస్ ధరను మనం చెల్లించాల్సి రానుంది. ప్రస్తుతం విదేశాల నుంచి తొలుత ట్యాంకుల్లో ద్రవరూప గ్యాస్‌ను దిగుమతి చేసుకుని, అనంతరం దానిని ఎల్ఎన్జీ టెర్మినల్ వద్ద గ్యాస్‌గా మారుస్తున్నారు. దీనిని ఆర్-ఎల్‌ఎన్‌జీగా వ్యవహరిస్తున్నారు. ఈ గ్యాస్ ధర ఒక ఎంబీటీయుకు ఏకంగా 20 డాలర్ల వరకు ఉంది. ఈ ధర 2019 నాటికి ఎంతకు చేరుకుంటే.. ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా విద్యుదుత్పత్తి ధర భారీగా పెరగనుంది. ఈ మొత్తం అంతిమంగా వినియోగదారులపైనే విద్యుత్ చార్జీల రూపంలో పడనుంది. ఆ ప్లాంట్లకు 15 తర్వాతే ‘గెయిల్’ గ్యాస్ గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఆగస్టు 15వరకు ఉత్పత్తి జరిగే అవకాశం లేదు. ఆగస్టు 15 తర్వాతే వాటికి గ్యాస్ సరఫరా చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖకు గెయిల్ తేల్చిచెప్పింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం లేఖ రాసింది. ఆగస్టు 15 నుంచి 30 వరకు విడతలవారీగా గ్యాస్ సరఫరాను పునరుద్ధరిస్తామని అందులో పేర్కొంది. ఓఎన్జీసీ, రవ్వ క్షేత్రాల గ్యాస్‌పై ఆధారపడి 1,269 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు విద్యుత్ ప్లాంట్లు నడుస్తున్నాయి. నగరం వద్ద గెయిల్ పైపులైను పేలుడు నేపథ్యంలో మరమ్మతులు చేయడం కోసం గెయిల్ సంస్థ గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. దీంతో ఈ ప్లాంట్లలో అప్పటి నుంచి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. -
ప్రాణాలకు ముప్పయినా ఖర్చు తప్పడమే ముఖ్యం
మలికిపురం :నేల పొరల నుంచి వెలికితీసే గ్యాస్‌కు వెల కట్టగలం. దాన్ని తరలించడానికి వేసే లోహపు పైపులకు ధర నిర్ణయించగలం. కానీ..దేశంలోని సంపదనంతా వెచ్చించినా పోయిన ఒక్క ప్రాణాన్ని తిరిగి పోయగలమా? అది మానవాళికి అసాధ్యం. అలాంటప్పుడు ప్రాణాలను ఎంత అపురూపంగా పరిగణించాలి? వాటికి ముప్పు వాటిల్లకుండా ఎంత ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి? దురదృష్టవశాత్తు కోనసీమలో కార్యకలాపాలు సాగిస్తున్న చమురు సంస్థలకు ఈ దృష్టే లోపించింది. అవి ధనానికిచ్చే ప్రాధాన్యాన్ని మానవ ప్రాణాలకు ఇవ్వడం లేదు. అందుకే కాలం చెల్లిన పైపులైన్లతో క్షణమైనా ఉత్పాతం జరిగే అవకాశం ఉందని తెలిసినా.. దండగమారి ఖర్చు అన్న వైఖరితో నిర్లక్ష్యం చేస్తున్నాయి. వారి నిర్లక్ష్యంపై కొరడా ఝుళిపించాల్సిన రాష్ట్ర ప్రభుత్వంలోనూ స్పందన కొరవడుతోంది. వారి తప్పిదాలకు మూల్యం అమాయకులు చెల్లించాల్సి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో శుక్రవారం 16 మందిని బలిగొన్న గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలుడుకు ప్రధాన కారణం.. కాలం చెల్లిన ఆ పైపులైన్‌ను మార్చకుండా మరమ్మతులతో కాలక్షేపం చేయడమే. తాటిపాక నుంచి విజయవాడకు 15 ఏళ్ల క్రితం వేసిన ఆ పైపులైన్ నిడివి 250 కిలోమీటర్ల పైనే. దీనితో కేజీ బేసిన్లో అనేక గెయిల్ పైప్‌లైన్లూ శిథిలావస్థకు చేరాయి. అయితే భారీ వ్యయంతో కొత్తగా లైన్లు వేయడం దండగ అనుకుంటున్న గెయిల్ పాత లైన్లతోనే నెట్టుకొస్తోంది. తాటిపాక-విజయవాడ పైపులైన్‌ను కొత్తగా వేయడానికి రూ.1000 కోట్లు పైనే ఖర్చవుతుంది. ఆ మొత్తం వెచ్చించడానికి ఇచ్ఛగించని గెయిల్ పైపులైన్ దుస్థితిని పసిగట్టేందుకు సెన్సర్లు కలిగి, రింగులా ఉండే ‘పిగ్’ అనే పరికరాన్ని వాడుతూ చేతులు దులుపుకొంటున్నారు. 18 అంగుళాల వెడల్పు గల తాటిపాక - విజయవాడ పైపులైన్లో రూ.40 కోట్ల విలువైన పిగ్‌ను వినియోగిస్తోంది. పైపులైన్లో గ్యాస్‌తో పాటు ఎంత దూరమైనా పయనించే పిగ్ ఎక్కడైనా దెబ్బ తిన్న భాగాలుంటే గుర్తిస్తుంది. ఆ సమాచారం మేరకు గెయిల్ అధికారులు పైపులైన్ దెబ్బతిన్న చోట కట్ చేసి మరమ్మతులు చేయిస్తున్నారే తప్ప, కొత్త పైపులైన్ వేయడం లేదు. 18 అంగుళాల పైపులైన్లో వాడే పిగ్ రూ.40 కోట్లు కాగా పది, 12 అంగుళాల పైపులైన్లలో వాడేది రూ.పది కోట్లుంటుంది. పిగ్‌లను వాడుతున్న కొద్దీ పైపులైన్ లోపాలను పసిగట్టడంలో వాటి సామర్థ్యం క్షీణిస్తుంది. అంటే కాలం చెల్లిన పైపులైన్లలో సామర్థ్యం తగ్గిన పిగ్‌లను వినియోగించినా లోపాలను గుర్తించే అవకాశం ఆట్టే ఉండదన్న మాట! అంటే..గెయిల్ తన ధనం ఖర్చు కాకుండా జనం ప్రాణాలతో చెలగాటమాడుతోందన్న మాట! ఈ చెలగాటానికి తక్షణం అడ్డుకట్ట వేయాలని కోనసీమవాసులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త పైపులైన్ వేసే వరకూ గ్యాస్ సరఫరాను నిలిపివేయాలంటున్నారు. అంతగా అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసుకోవాలే తప్ప.. తమ కంటికి కునుకునూ, ప్రాణాలకు హామీనీ, ఆస్తులకు భద్రతనూ కరువు చేసే పైపులైన్లను వినియోగించరాదంటున్నారు. -
కేజీ బేసిన్ ఓ మందుపాతరే..
దినదిన గండంగా కాలం వెళ్లదీస్తున్న ప్రజలు మొత్తం 900 కిలోమీటర్ల పైపులైన్లు ఏళ్లు గడుస్తున్నా మార్చని చమురు సంస్థలు అది 2012 జూలై 21వ తేదీ. ఉదయం 5 గంటలు. మలికిపురం మండలం శంకరగుప్తంలో ఉన్న అడవిపాలెం గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్(జీసీఎస్) ప్రాంతం. ఉదయం కొందరు నిద్రలేచి బయటకు వెళుతున్నారు. అదే సమయంలో సమీపంలో ఉన్న గ్యాస్ పైపులైన్ భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఆ ప్రాంతమంతా గ్యాస్ వ్యాపించింది. తీవ్ర స్థాయిలో గ్యాస్ వాసనవస్తుంటే.. దీనిని గమనించిన ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను ఎత్తుకుని ఆ ప్రాంతం వదిలి పరుగులు తీసింది. పొయ్యి వెలిగంచొద్దంటూ అరుస్తూ.. అందరినీ అప్రమత్తం చేసింది. ఆమెతో పాటు అక్కడున్న కూలీనాలీ చేసుకునే వందలాది మంది సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. స్థానికంగా ఉన్న గెయిల్ అధికారులు తాపీగా వచ్చి అదుపు చేశారు. ఆ రోజు సాయంత్రం వరకు ఆ ప్రాంతంలో పొయ్యి వెలిగించడానికి కూడా స్థానికులు భయపడ్డారు. అప్పట్లో ప్రాణాపాయం తప్పింది. అదే పరిస్థితి గురువారం ఉదయం 5 గంటల సమయంలో మామిడికుదురు మండలం నగరం మినీ రిఫైనరీ ఎదుట చోటుచేసుకుంది. ఏం జరిగిందో తెలుసుకోక ముందే తల్లీబిడ్డలు మంటల్లో చిక్కుకుని బూడిదగా మారారు. సంఘటన ప్రదేశంలోనే 13 మంది సజీవ దహనమయ్యారు. కొంత మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఓఎన్జీసీ, గెయిల్ చరిత్రలో ఇది అతి భయంకర, చేదు దుర్ఘటన. మలికిపురం/అమలాపురం : తరచూ కేజీ బేసిన్లో జరుగుతున్న ప్రమాదాలు ప్రజలను కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. భూగర్భం నుంచి చమురు నిక్షేపాలను వెలికి తీస్తున్నామని గర్వంగా చెప్పుకొనే ఆయా సంస్థలు.. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. మొత్తం 900 కిలోమీటర్లు కేజీ బేసిన్లో చమురు, సహజ వాయువులను ఓఎన్జీసీ, రిలయన్స్, రవ్వ జాయింట్ వెంచర్, ఆయిల్ ఇండియా తదితర సంస్థలు వెలికితీస్తున్నాయి. గ్యాస్, ముడిచమురును పైపులైన్ల ద్వారా రవాణాకు గెయిల్ వంటి సంస్థల ద్వారా ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. కోనసీమలో తీరం వెంబడి ఉన్న మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల్లో గ్యాస్ పైపులైన్లు విస్తరించి ఉన్నాయి. తీరప్రాంత మండలాలే కాకుండా అమలాపురం పట్టణంతో పాటు కోనసీమలోని అంబాజీపేట, అయినవిల్లి మండలాల్లో కూడా పైపులైన్లు ఉన్నాయి. అమలాపురం మీదుగా ఉన్న గ్యాస్ పైపులైన్ ప్రాంతంలో ఎన్నో ప్రధాన కట్టడాలు, కార్పొరేట్ స్కూళ్లు ఉన్నాయి. కేజీ బేసిన్లో మొత్తం 900 కిలోమీటర్ల మేరకు గ్యాస్ పైపులైన్లు విస్తరించి ఉన్నాయి. కోనసీమతో పాటు ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు వీటిని ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపం గెయిల్ పైపులైన్లను తరచూ పరిశీలిస్తూ నిర్వహణ సక్రమంగా ఉండాలి. కేజీ బేసిన్లో ఈ పైపులైన్ల నిర్వహణ సక్రమంగా లేదు. వీటిలో ప్యూర్ గ్యాస్ మాత్రమే వెళ్లాలి. కానీ నీరు, క్రూ డాయిల్‌తో కూడిన గ్యాస్ సరఫరా అవుతోంది. దీంతో తక్కువ కాలానికే పాడైపోతున్నాయి. పూర్తి నిర్లక్ష్యం గ్యాస్ పైపులైన్లు పాడైపోతున్నా.. వాటిని మార్చాల్సిన గెయిల్‌తో పాటు ఇతర సంస్థలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గ్యాస్ అమ్మకాల ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నా.. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నాయి మినహా మరమ్మతులను చేయించడం లేదు. పైపులైన్ల నిరా్మాణంలో నాణ్యత లోపం చాలా ఉంటోంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న పైపులైన్ల నిర్మాణంలో బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా, ఇష్టానుసారం కాంట్రాక్టులు ఇచ్చి, నాణ్యత లేని పైపులైన్లు వేయడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దోపిడీయే.. అభివృద్ధి శూన్యం ఆయిల్ నిక్షేపాలను తరలించుకుపోతున్న సంస్థలు ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు కంటితుడుపుగానే ఉన్నాయి. కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు గ్యాస్‌ను కేటాయిస్తున్నాయి. ఇక్కడ కనీసం రోడ్డు వేయడానికి నిధులు ఇవ్వరు. ఆ సంస్థ వాహనాలు తిరిగి పాడైపోతున్నా రోడ్లను ప్రభుత్వం వేయించాల్సి వస్తోంది. కుంగిన కోనసీమ ఓఎన్జీసీ, గెయిల్ కార్యకలాపాల వల్ల కోనసీమ మూడడుగులు కిందికి దిగిందని అధ్యయన బృందాలు ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన సదస్సులో తేల్చాయి. దీంతో సముద్రం నుంచి ఉప్పునీరు భూభాగం పైకి వస్తోందని ఆ బృందం స్పష్టం చేసింది. తగ్గిన పంట దిగుబడులు ఆయిల్, గ్యాస్ వెలికితీత వల్ల కోనసీమలో వ్యవసాయ దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయని రైతులు, వ్యవసాయ నిపుణులు తేల్చారు. ఇవి అపోహలంటూ భౌగోళిక శాస్త్రవేత్తలమంటూ కొందరు సదస్సులు పెట్టి ఆ సంస్థకు వత్తాసు పలుకుతున్నారు. కక్కుర్తి పడేది నాయకులే.. ఓఎన్జీసీ, గెయిల్ చర్యలకు వ్యతిరేకంగా ఇప్పటివరకు కొంత మంది రాజకీయ నాయకులు అనేక పోరాటాలు చేశారు. ప్రజలు ఉద్యమాలు చేసినా.. నాయకులు ప్రవేశించి నీరు గార్చేశారు. చిల్లర పైసలకు కక్కుర్తి పడి నాయకులు.. ప్రజా ఉద్యమాలను అణగదొక్కించిన సంఘటనలు కోనసీమలో అనేకం ఉన్నాయి. -
కేజీ బేసిన్లో కొత్త బావులపై ఓఎన్జీసీ దృష్టి
40 బావుల్లో వెయ్యి ఎంఎంసీఎండీ నిక్షేపాలు రూ. 440 కోట్లతో డ్రిల్లింగ్కు ప్రణాళిక సాక్షి ప్రతినిధి, కాకినాడ : కృష్ణా, గోదావరి బేసిన్లో కొత్తగా ఆఫ్‌షోర్ నుంచి చమురు, సహజవాయువు నిక్షేపాలను వెలికితీయవచ్చని ఓఎన్జీసీ గుర్తించింది. మూడు జిల్లాల్లో విస్తరించిన ఈ బేసిన్ పరిధిలో 40 కొత్త బావులను ఎంపిక చేసి, వాటి డ్రిల్లింగ్ ద్వారా రోజుకు వెయ్యి మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంసీఎండీ) ఆయిల్ లేదా చమురుతో కూడిన సహజ వాయువు లభిస్తుందని ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ డ్రిల్లింగ్ కోసం రూ.440 కోట్లు వెచ్చించాలనే నిర్ణయానికి వచ్చింది. గత కొంతకాలంగా ఈ బేసిన్లో నిర్వహిస్తున్న సెస్మిక్ సర్వే ఫలితాలను బట్టి అదనపు ఉత్పత్తి సాధ్యమవుతుందనే అంచనాకు వచ్చింది. డ్రిల్లింగ్ చేపట్టేందుకు పర్యావరణ అనుమతి కోసం శుక్రవారం రాజోలులో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనుంది. ఆ ప్రక్రియ పూర్తి కాగానే ఈ బేసిన్లో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధప్రాతిపదికన డ్రిల్లింగ్ నిర్వ హించనుంది. ఎకడెక్కడ ఎన్ని బావులు.. కృష్ణా జిల్లాలో ఐదు, తూర్పుగోదావరి జిల్లాలో 22, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 బావుల్లో నిక్షేపాలు ఉన్నట్టుగా ఓఎన్జీసీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. కృష్ణా జిల్లా కైకలూరులో మూడు, ముదినేపల్లి మండలం పెద్దకామనపల్లిలో ఒకటి, బంటుమిల్లి మండలం ముంజులూరులో ఒకటి, పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఏలేటిపాడులో రెండు, పెనుగొండ మండలం చిన్నంవారిపాలెంలో ఎనిమిది, అదే మండలం సిద్ధాంతంలో ఒకటి, నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరంలో ఒకటి, పెరవలి మండలం పి.వేమవరంలో ఒకటి, తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో మూడు, మండపేటలో ఐదు, సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో ఒకటి, మలికిపురం మండలం కేశనపల్లి వెస్ట్ పరిధిలో ఐదు, రాజోలు మండలం శివకోడు కమ్మపాలెం పరిధిలో ఏడు, అంబాజీపేట మండలం వ్యాఘ్రేశ్వరంలో ఒక బావిలో ఆయిల్, గ్యాస్ ఉన్నట్టు గుర్తించారు. గతంలో ఫలించిన అంచనాలు తూర్పు గోదావరిలో 22 బావుల్లో డ్రిల్లింగ్ కోసం రూ.242 కోట్లు, కృష్ణా జిల్లాలో ఐదు బావులకు రూ.55 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 13 బావులకు రూ.143 కోట్లు కేటాయించారు. 40 బావుల ద్వారా వెయ్యి మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు లేదా ఆయిల్‌తో కూడిన గ్యాస్ లభిస్తుందని ఓఎన్జీసీ అంచనా. ఇదే మాదిరి రెండేళ్ల క్రితం కేజీ బేసిన్ పరిధిలోని మూడు జిల్లాల్లో డ్రిల్లింగ్ చేపట్టగా అంచనాలు నిజమయ్యాయి. అప్పట్లో ఆ బావుల్లో రోజుకు 840 టన్నుల ఆయిల్, 3.8 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు గ్యాస్ లభిస్తుందనే అంచనాలు ఫలించాయి. ఈ సారి కూడా అదే స్థాయిలో చమురు, సహజవాయువు నిక్షేపాలు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. భూ సేకరణ కోసం... ఓఎన్జీసీ డ్రిల్లింగ్ కార్యక్రలాపాలు నిర్వహించేందుకు ప్రతి బావి కోసం ఐదు నుంచి ఆరు ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటికే ఆయా జిల్లాల యంత్రాంగాలకు ఓఎన్జీసీ ప్రతిపాదనలు పంపింది. పూర్తిస్థాయిలో చమురు అన్వేషణ చేపట్టి మూడు నుంచి నాలుగు నెలల్లో డ్రిల్లింగ్ పూర్తి చేయాలని భావిస్తోంది. -
ఓఎన్జీసీకి డీజీహెచ్ బాసట
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో గ్యాస్ వెలికితీత వివాదంలో ఓఎన్జీసీకి డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) బాసటగా నిల్చింది. దీనిపై అంతర్జాతీయ నిపుణులతో అధ్యయనం చేయించాలన్న ఓఎన్జీసీ డిమాం డ్కి మద్దతు పలికింది. తన ఆధీనంలో ఉన్న క్షేత్రాల్లో గ్యాస్ నిల్వలు, ఉత్పత్తి వివరాలను ఓఎన్జీసీకి తెలియజేయాలంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)ను డీజీహెచ్ ఆదేశించినట్లు సమాచారం. అలాగే, ఓఎన్జీసీ కూడా తన గ్యాస్ వివరాలను ఆర్‌ఐఎల్‌కి అందజేయాలని సూచించింది. కృష్ణా గోదావరి బేసిన్‌లోని డీ6 బ్లాకులో ఆర్ఐఎల్ తవ్విన కొన్ని బావులు, ఓఎన్జీసీకి కేటాయించిన గ్యాస్ క్షేత్రాలకు దగ్గర్లో ఉండటం తెలిసిందే. ఆర్ఐఎల్ ఇప్పటికే గ్యాస్ ఉత్పత్తి చేస్తుండగా.. ఓఎన్జీసీ ఇంకా తన క్షేత్రాల్లో ఉత్పత్తి మొదలుపెట్టలేదు. రెండు క్షేత్రాలూ పక్కపక్కనే ఉండటంతో ఆర్ఐఎల్ తమ క్షేత్రాల నుంచి కూడా గ్యాస్ తీస్తుండవచ్చని ఓఎన్జీసీ భావిస్తోంది. దీనిపై ఓఎన్జీసీ ఫిబ్రవరి 11న డీజీహెచ్కి ఫిర్యాదు చేయడంతో డీజీహెచ్ స్పందించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. -
ముఖేష్ అంబానీకి వ్యతిరేకంగా హైకోర్టులో వ్యాజ్యం