కేజీ బేసీన్‌లో చమురు ఉత్పత్తి ప్రారంభం | ONGC Commences First Oil Production from KG Basin Flagship Deep-Water Project | Sakshi
Sakshi News home page

కేజీ బేసీన్‌లో చమురు ఉత్పత్తి ప్రారంభం

Published Mon, Jan 8 2024 10:50 AM | Last Updated on Mon, Jan 8 2024 11:09 AM

ONGC Commences First Oil Production from KG Basin Flagship Deep Water - Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్రాల ఆధీనంలో ఉండే ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్‌ ఉత్పత్తి సంస్థ ఆయిల్, నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) డీప్ వాటర్‌ ప్రాజెక్టులో​ భాగంగా ఆదివారం ​చమురు ఉత్పత్తిని ప్రారంభించింది. తూర్పు తీరంలోని కృష్ణా గోదావరి బేసిన్‌లో ప్రధానమైన డీప్వాటర్ ప్రాజెక్ట్ నుంచి చమురు ఉత్పత్తిని ఓఎన్‌జీసీ మొదలుపెట్టింది.

అయితే మొదటిసారి బంగాళాఖాతం సముద్ర తీరంలో కష్టతమరైన డీప్‌ వాటర్‌ KG-DWN-98/2 బ్లాక్ నుంచి చమురు ఉత్పత్తిని ప్రారంభించినట్లు కేంద్ర కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి మంత్రి హర్దీప్ సింగ్ పూరి ‘ఎక్స్‌’ ట్విటర్‌లో తెలిపారు. దీంతో దేశంలోని ఇంధన ఉత్పత్తి  కృష్ణా గోదావరి బేసిన్‌ (KGB)లోని లోతైన సరిహద్దుల నుంచి పెరగటం ప్రారంభమైందని కేంద్ర మంత్రి తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని తెలిపారు. చమురు ఉత్పత్తి కృష్ణగోదావరి బేసిన్‌లో లోతైన సరిహద్దుల నుంచి పెరగడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఉత్పత్తి రోజుకు 45,000 బ్యారెల్స్, 10 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత జాతీయ చమురు ఉత్పత్తికి 7 శాతం, జాతీయ సహజ వాయువు ఉత్పత్తికి 7 శాతం అదనంగా ఉత్పత్తిని సమకూర్చుతుందని తెలిపారు.

చదవండి: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement