Oil production
-
కేజీ బేసిన్లో మరో బావి నుంచి ఉత్పత్తి
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిడెట్ (ఓఎన్జీసీ) ముడిచమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌కు చెందిన కేజీ-డీ5 బ్లాక్‌లో ఐదు నంబర్ బావి నుంచి ఉత్పత్తి ప్రారంభించినట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. దీనివల్ల రానున్న రోజుల్లో కంపెనీ ఆదాయం పెరగనుందని పేర్కొంది.ఓఎన్జీసీ తెలిపిన వివరాల ప్రకారం..కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్లో లోతైన సముద్ర ప్రాజెక్ట్‌లో ఐదో నంబర్ బావి నుంచి ఉత్పత్తి ప్రారంభించింది. ఈ ఏడాది జనవరిలో కేజీ-డీ5 బ్లాక్ నుంచి చమురు ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఇందులో నాలుగు బావుల నుంచి ఇప్పటి వరకు చమురు, గ్యాస్ వెలికి తీసేవారు. కానీ తాజాగా కేజీ-డీడబ్ల్యూఎన్-98/2 క్లస్టర్-2 అసెట్‌లో ఐదో చమురు బావిలో ఉత్పత్తి ప్రారంభమైనట్లు ఓఎన్జీసీ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. ఈ కొత్త బావి వల్ల ముడిచమురు, సహజ వాయువు ఉత్పత్తి పెరుగుతుందని తెలిపింది.ఇదీ చదవండి: ప్రభుత్వ కంపెనీలకు జరిమానా!ఇదిలా ఉండగా, కొత్త బావి నుంచి ఎంత మొత్తంలో చమురు ఉత్పత్తి చేస్తారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ బావి ద్వారా చేస్తున్న చమురు, గ్యాస్ ఉత్పత్తి వల్ల దిగుమతులు తగ్గే అవకాశం ఉన్నట్లు కంపెనీ తెలిపింది. దాంతో రానున్న రోజుల్లో సంస్థ లాభాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. -
కేజీ బ్లాక్ నుంచి ఓఎన్జీసీ చమురు ఉత్పత్తి ప్రారంభం
న్యూఢిల్లీ: సుదీర్ఘ జాప్యం తర్వాత కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లోని డీప్ సీ బ్లాక్ నుంచి ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) చమురు ఉత్పత్తిని ప్రారంభించింది. కంపెనీతో పాటు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ విషయం తెలిపారు. అయితే, ఉత్పత్తి చేస్తున్న పరిమాణాన్ని మాత్రం వెల్లడించలేదు. కేజీ–డీడబ్ల్యూఎన్–98/2 (కేజీ–డీ5) ప్రాజెక్టుతో తమ చమురు ఉత్పత్తి సామర్ధ్యం 11 శాతం, గ్యాస్ ఉత్పత్తి సామర్ధ్యం 15 శాతం పెరుగుతుందని ఓఎన్జీసీ తెలిపింది. 2022–23లో ఓఎన్జీసీ 18.4 మిలియన్ టన్నుల క్రూడాయిల్, రోజుకు 20 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేసింది. తాజాగా అందుబాటులోకి వచి్చన బ్లాక్‌లో చమురు ఉత్పత్తి గరిష్టంగా రోజుకు 45,000 బ్యారెళ్లు, గ్యాస్ ఉత్పత్తి 10 మిలియన్ క్యూబిక్ మీటర్ల స్థాయికి చేరగలదని మంత్రి తెలిపారు. అయితే, ఎప్పటికి ఆ స్థాయిని చేరవచ్చనేది వెల్లడించలేదు. కేజీ బేసిన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన కేజీ–6 బ్లాక్ పక్కనే కేజీ–డీ5 బ్లాక్ ఉంది. దీన్ని మూడు క్లస్టర్లుగా విడగొట్టి ముందుగా రెండో క్లస్టర్‌పై పనులు ప్రారంభించారు. వాస్తవ ప్రణాళికల ప్రకారం 2021 నవంబర్లోనే ఇందులో ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ పరిణామాలతో 2023 మే నెలకు, అటుపైన ఆగస్టుకు, తర్వాత డిసెంబర్‌కు వాయిదా పడుతూ వచి్చంది. -
కేజీ బేసీన్లో చమురు ఉత్పత్తి ప్రారంభం
న్యూఢిల్లీ: రాష్ట్రాల ఆధీనంలో ఉండే ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) డీప్ వాటర్ ప్రాజెక్టులో భాగంగా ఆదివారం చమురు ఉత్పత్తిని ప్రారంభించింది. తూర్పు తీరంలోని కృష్ణా గోదావరి బేసిన్లో ప్రధానమైన డీప్‌వాటర్ ప్రాజెక్ట్ నుంచి చమురు ఉత్పత్తిని ఓఎన్జీసీ మొదలుపెట్టింది. అయితే మొదటిసారి బంగాళాఖాతం సముద్ర తీరంలో కష్టతమరైన డీప్ వాటర్ KG-DWN-98/2 బ్లాక్ నుంచి చమురు ఉత్పత్తిని ప్రారంభించినట్లు కేంద్ర కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి మంత్రి హర్దీప్ సింగ్ పూరి ‘ఎక్స్’ ట్విటర్లో తెలిపారు. దీంతో దేశంలోని ఇంధన ఉత్పత్తి కృష్ణా గోదావరి బేసిన్ (KGB)లోని లోతైన సరిహద్దుల నుంచి పెరగటం ప్రారంభమైందని కేంద్ర మంత్రి తెలిపారు. बधाई भारत! #ONGCJeetegaToBharatJeetega! As India powers ahead as the fastest growing economy under leadership of PM @NarendraModi Ji, our energy production is also set to rise from the deepest frontiers of #KrishnaGodavari “First Oil” production commences from the complex &… pic.twitter.com/gN2iPSs0YZ — Hardeep Singh Puri (@HardeepSPuri) January 7, 2024 ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని తెలిపారు. చమురు ఉత్పత్తి కృష్ణగోదావరి బేసిన్లో లోతైన సరిహద్దుల నుంచి పెరగడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఉత్పత్తి రోజుకు 45,000 బ్యారెల్స్, 10 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత జాతీయ చమురు ఉత్పత్తికి 7 శాతం, జాతీయ సహజ వాయువు ఉత్పత్తికి 7 శాతం అదనంగా ఉత్పత్తిని సమకూర్చుతుందని తెలిపారు. చదవండి: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు -
సునాక్ ఇంటిపై నల్లవస్త్రం
లండన్: బ్రిటన్ ప్రధాని ఇంటిపై నల్లటి వ్రస్తాన్ని కప్పిన నలుగురు పర్యావరణ కార్యకర్తలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఉత్తర ఇంగ్లాండ్‌లో నార్త్ యార్క్‌షైర్ ప్రాంతంలోని రిచ్మండ్లో ఉన్న రిషి సునాక్ ఇంటిపై వారు నల్లటి వస్త్రం కప్పి తమ నిరసనను తెలియజేశారు. వీరు ‘గ్రీన్‌పీస్’ అనే పర్యావరణ పరిరక్షణ సంస్థలో సభ్యులుగా ఉన్నారు. సముద్రంలో చమురు, గ్యాస్ వెలికితీతను మరింత విస్తరిస్తూ సునాక్ ఇటీవల తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇలా నిరసన వ్యక్తం చేశారు. సునాక్ ఇంటిపైకి ఎక్కి 200 చదరపు మీటర్ల నల్ల వస్త్రాన్ని కప్పారు. అలాగే సునాక్ ఇంటి ముందు మరో ఇద్దరు కార్యకర్తలు ‘చమురు లాభాలు ముఖ్యమా? లేక మా భవిష్యత్తు ముఖ్యమా?’ అని ప్రశ్నిస్తూ బ్యానర్‌ను ప్రదర్శించారు. ఈ సమయంలో సునాక్ కుటుంబసభ్యులెవరూ ఆ ఇంట్లో లేరు. -
కేజీ బేసిన్లో ఓఎన్జీసీ చమురు ఉత్పత్తి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) కృష్ణా గోదావరి బేసిన్ (కేజీ బేసిన్)లోని కేజీ డీ5 ప్రాజెక్ట్ పరిధిలో చమురు ఉత్పత్తిని ఈ ఏడాది మే నెలలో ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. సహజ వాయువు ఉత్పత్తిని ఏడాది తర్వాత ప్రారంభిస్తామని ఓఎన్జీసీ డైరెక్టర్ (ఉత్పత్తి విభాగం) పంకజ్ కుమార్ వెల్లడించారు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే కేజీ డీ5 పరిధిలోని డీడబ్ల్యూఎన్–98/2 క్లస్టర్–2 క్షేత్రాల నుంచి గ్యాస్ ఉత్పత్తిని 2019 జూన్‌లోనే మొదలు పెట్టాలి. అదే విధంగా ఆయిల్ ఉత్పత్తిని 2020 మార్చిలో ఆరంభించాల్సి ఉంది. కానీ, ఈ లక్ష్యాలను ఓఎన్జీసీ చేరుకోలేకపోయింది. కరోనా మహమ్మారితో కాంట్రాక్టు, సరఫరా చైన్ సమస్యలను కారణాలుగా పేర్కొంటూ చమురు ఉత్పత్తిని 2021 నవంబర్‌కు వాయిదా వేసింది. ఆ తర్వాత 2022 మూడో త్రైమాసికానికి, ఇప్పడు మే నెలకు వాయిదా వేసుకుంది. గ్యాస్ ఉత్పత్తిని 2021 మే నెలకు వాయిదా వేసుకోగా, అది కూడా సాధ్యపడలేదు. ఆ తర్వాత 2023 మే నెలకు వాయిదా వేయగా, ఇప్పుడు 2024 మేలోనే గ్యాస్ ఉత్పత్తి సాధ్యమవుతుందని ఓఎన్జీసీ చెబుతోంది. ఫ్లోటింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశాం ఇప్పటికే సముద్ర జలాల్లో ఫ్లోటింగ్ (నీటిపై తేలి ఉండే) ఉత్పత్తి యూనిట్‌ను (ఎఫ్‌పీఎస్‌వో) ఏర్పాటు చేసినట్టు ఓఎన్జీసీ డైరెక్టర్ పంకజ్ కుమార్ తెలిపారు. చమురు ఉత్పత్తి మే నుంచి ప్రారంభిస్తామని ప్రకటించారు. ‘‘రోజువారీ 10,000 నుంచి 12,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి మొదలు పెడతాం. రెండు నుంచి మూడు నెలల్లో రోజువారీ 45,000 బ్యారెళ్ల గరిష్ట ఉత్పత్తికి తీసుకెళతాం. చమురుతోపాటు 2 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్ కూడా బయటకు వస్తుంది. వాస్తవంగా గ్యాస్ ఉత్పత్తిని 2024 మే నెలలో మొదలు పెడతాం. అప్పుడు రోజువారీగా 7–8 ఎంఎంఎస్‌సీఎండీ ఉత్పత్తి సాధ్యపడుతుంది’’అని వివరించారు. వాస్తవంగా వేసుకున్న ఉత్పత్తి అంచనాల కంటే ఇవి తక్కువ కావడం గమనించాలి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చమురు ఉత్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకుంటామని, అదే సమయంలో సహజ వాయువు ఉత్పత్తి పెరుగుతుందని పంకజ్ కుమార్ తెలిపారు. -
క్రూడ్ మళ్లీ 100 డాలర్లకు..!
న్యూఢిల్లీ: చమురు ధరలు మళ్లీ బ్యారెల్‌కు 100 డాలర్లను దాటిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) రోజువారీ 2 మిలియన్ బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తిని (అంతర్జాతీయ సరఫరాలో 2 శాతం) తగ్గించాలని తీసుకున్న నిర్ణయం ఇందుకు దారితీస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బ్రెంట్ బ్యారెల్ ధర 92 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఒపెక్ తాజా నిర్ణయం నవంబర్ నుంచి అమల్లోకి రానుంది. దీంతో అప్పటికి ధరలు పెరిగిపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒపెక్ నిర్ణయం మేరకు ఉత్పత్తిలో కోత 2023 డిసెంబర్ వరకు అమల్లో ఉండనుంది. ‘‘చమురు ధరల విషయంలో సానుకూల అంచనాలతో ఉన్నాం. శీతాకాలంలో గ్యాస్ నుంచి చమురుకు మళ్లడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతుంది. ఓఈసీడీ వ్యూహాత్మక చమురు నిల్వల విడుదల ముగింపు, చమురు ఉత్పత్తికి కోత విధించడానికి అదనంగా, రష్యా చమురు దిగుమతులపై యూరప్ విధించిన నిషేధం డిసెంబర్ 5 నుంచి అమల్లోకి రానుంది. దీంతో చమురు మార్కెట్ మరింత కఠినంగా మారనుంది’’అని యూబీఎస్‌కు చెందిన విశ్లేషకులు స్టానోవో, గోర్డాన్ అంచనా వ్యక్తం చేశారు. సాధారణంగా ఒపెక్ భేటీ ఆరు నెలలకు ఓసారి జరుగుతుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైతే అసాధారణ సమావేశాన్ని నిర్వహించే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. విపరిణామాలు.. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ధర ఇటీవలి 82 డాలర్ల కనిష్ట స్థాయి నుంచి 12 శాతం ఇప్పటికే పెరగడం గమనార్హం. ‘‘రోజువారీగా 2 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి కోత విధించాలన్న ఒపెక్ నిర్ణయం పలు ప్రతికూలతలకు దారితీస్తుంది. కొన్ని సభ్య దేశాలు ఈ లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా జీవన వ్యయం పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న వినియోగదారుడికి ఉపశమనం కల్పించాలన్న లక్ష్యంతో యూఎస్ ఉంది. మరి ఒపెక్ నిర్ణయం అమలైతే ఈ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది’’అని క్విల్టర్ చెవియొట్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ జామీ మడాక్ వివరించారు. ఓపెక్ సభ్య దేశం రష్యా అయితే మరింత తక్కువ ఉత్పత్తి చేస్తున్నట్టు కొందరు అనలిస్టులు చెబుతున్నారు. 8 లక్షల బ్యారెళ్ల మేర నికర సరఫరా మార్కెట్లో తగ్గుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ కమోడిటీస్ డైరెక్టర్ పాల్ హికిన్ అంచనా వేశారు. ఒపెక్ నిర్ణయం వచ్చే కొన్ని నెలలకు క్రూడ్‌కు బేస్ ధరను నిర్ణయించినట్టు చెప్పారు. ‘‘2020 మే నెలలో క్రూడ్ ధరలు మైనస్‌కు పడిపోయిన సమయంలో ఒపెక్ చమురు ఉత్పత్తికి భారీ కోత విధించింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉత్పత్తికి కోత పెట్టాలని ఒపెక్ నిర్ణయించడం మళ్లీ ఇదే. ఇప్పుడు బ్రెండ్ బ్యారెల్ కనీసం 90 డాలర్ల కంటే తగ్గకుండా ఉండాలని (బేస్) ఒపెక్ ప్లస్ దేశాలు భావిస్తుండొచ్చు. ఆయిల్ మార్కెట్ కొత కాలంగా బేరిష్ ట్రెండ్‌లో ఉన్నాయి. అమెరికా వ్యూహత్మక చమురు నిల్వల విడుదల అక్టోబర్‌తో ముగిసిపోతుంది. చైనా లాక్డౌన్లు, మొత్తం మీద డిమాండ్‌పై ప్రభావం చూపిస్తాయి. అలాగే, రష్యాపై ఆంక్షలు కూడా చమురు ధరలను నిర్ణయిస్తుంది’’అని పాల్ హికిన్ అంచనా వేశారు. -
ఆయిల్ రిఫైనరీలో భారీ ప్రమాదం.. 100 మంది కార్మికుల మృతి
సాక్షి, న్యూఢిల్లీ: నైజీరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న చమురు శుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. నైజీరియాలోని దక్షిణ రాష్ట్రమైన ఇమోలోని చమురు శుద్ధి కర్మాగారంలో ఈ దుర్ఘటన జరిగింది. సుమారు 100 మందికిపైగా కార్మికులు ప్రమాదంలో మరణించినట్టు తెలుస్తోంది. చమురు శుద్ధి కర్మాగారంలో పేలుడు సంభవించడం వల్లే ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న ఆయిల్ రిఫైనరీ నిర్వాహకుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. చదవండి👉🏼 58 ఏళ్ల తర్వాత ఫేస్బుక్ చేసిన మేలు కాగా, ఆఫ్రికాలో అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తిదారు అయిన నైజీరియాలో అనుమతిలేకుండా చమురు శుద్ధి కర్మాగారాలను నిర్వహించడం మామూలే! పైప్ లైన్ల నిర్వహణ లోపాల కారణంగా ప్రమాదాలు సాధరణమైపోయాయి. ఆయిల్ దొంగలు కూడా రిఫైనరీల పైప్లైన్లను ధ్వంసం చేసి భారీ ఎత్తున పెట్రోల్, డీజిల్‌ను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. ఈక్రమంలో ప్రమాదాలు జరిగి వందలాది అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఆయిల్ దందాలో అక్రమాలకు అడ్డుకట్టు వేసేందుకు మిలటీరిని రంగంలోకి దించామని, పటిష్ట చర్యలు చేపడుతున్నామని నైజీరియా ప్రభుత్వం చెబుతోంది. రోజూ 2 మిలియన్ల బ్యారెల్స్ చమురు ఉత్పత్తి చేస్తున్న నైజీరియాలో మెజారిటీ ప్రజలు బీదరికంలో మగ్గుతుండటం గమనార్హం. చదవండి👉 మొట్టమొదటిసారిగా.. యూఎస్‌లో పోర్నోగ్రఫీపై కోర్సు -
జయమ్మ విజయం.. కట్టె గానుగ ద్వారా తీసిన నూనె విదేశాలకు..
‘‘ఒక చోటే ఉంటున్నాం. చేసిన పనే చేస్తున్నాం. ఎదుగూ బొదుగు లేకుండా.. గానుగెద్దు జీవితంలా గడిపేస్తున్నాం..’’ అని చాలా మందిలో ఒక అసంతృప్తి ఉంటుంది. ఆరుపదుల వయసు దాటిన జయమ్మ జీవితంకూడా గతంలో ఇదే విధంగా ఉండేది. కానీ, గానుగ చక్రం పట్టుకొని ఆరుపదుల వయసులో విజయం వైపుగా అడుగులు వేస్తోంది జయమ్మ. చదువు లేకపోయినా, వయసు కుదరకపోయినా నవతరానికీ స్ఫూర్తిగా నిలుస్తున్న కోట్ల జయమ్మ స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా, గండీడ్ మండలం, జక్లపల్లి గ్రామం. గానుగ నూనె వ్యాపారాన్ని అంచెలంచెలుగా వృద్ధి చేస్తూ తనతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తుంది. ఆరోగ్యదాయిని పేరుతో ప్రాచీనకాలం గానుగ నూనె ప్రాచుర్యాన్ని ఎల్లలు దాటేలా చేస్తోంది. జయమ్మది వ్యసాయ కుటుంబం. భర్త పిల్లలతో కలిసి పొలం పనులు చేసుకోవడంతో పాటు పాల ఉత్పత్తిని కొనసాగించేది. జయమ్మ నాలుగేళ్ల క్రితం రొమ్ము క్యాన్సర్‌బారిన పడింది. జబ్బు నుండి కోలుకునే క్రమంలో తనకు కలిగిన ఆలోచనను అమలులో పెట్టిన విధానం గురించి జయమ్మ ఇలా చెబుతుంది.. ‘‘పట్నంలో క్యాన్సర్‌కి చికిత్స చేయించుకున్నాను. డాక్టర్లు పదిసార్లు్ల కీమోథెరఫీ చేయాలన్నారు. ఈ సమయంలో ఓ డాక్టర్ గానుగ నూనె వాడమని, ఆహారంలో మార్పులు కూడా చేసుకోమని చెప్పాడు. దీంతో మహబూబ్‌నగర్‌లో కరెంట్ గానుగ నుండి వంట నూనెలు తెచ్చి వాడుకునేవాళ్లం. అప్పుడే వచ్చింది ఆలోచన మేమే గానుగను ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని. కరెంట్‌తో నడిచేది కాకుండా ఎద్దులతో తిరిగే కట్టె గానుగ గురించి వెతికాం. మైసూరులో ఉందని తెలిసి, అక్కడికెళ్లి చూశాం. అలా మూడేళ్ల క్రితం ఎద్దుల కట్టె గానుగను ఏర్పాటు చేసి, నూనె తీయడం ప్రారంభించాం. పల్లి, కొబ్బర, ఆవిసె, కుసుమ, నువ్వులతో నూనె తీయడం ప్రారంభించాం. ఏడాది పాటు శిక్షణ... గానుగ ఏర్పాటు చేసిన తర్వాత పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం వాళ్లు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో, నేను చేస్తున్న పని వివరించాను. ఎలాగైనా అందరికీ మంచి గానుగ నూనె అందించాలి అని చెప్పాను. ఏడాది పాటు నెలకు కొన్ని రోజుల చొప్పున మార్కెటింగ్ గురించి కూడా శిక్షణ ఇచ్చారు. అప్పటి వరకు మా చుట్టుపక్కల వారికే గానుగ నూనె అమ్మేదాన్ని. శిక్షణ తర్వాత మరో ఐదు గానుగలను ఏర్పాటు చేశాను. 15 లక్షల రూపాయల పెట్టుబడితో షెడ్డు నిర్మించి కట్టెగానుగలను ఏర్పాటు చేసి నూనె ఉత్పత్తి పెంచాను. ఇతర రాష్ట్రాల నుంచి... వివిధ రకాల నూనెలను గానుగ ద్వారా తీసేందుకు అవసరమైన ముడి సరుకులకు ఒరిస్సా, కర్ణాటక నుంచి కూడా తెప్పిస్తాను. ప్రతి నెల ఆరు టన్నుల పల్లీలు, రెండు టన్నుల కొబ్బరి, మూడు టన్నుల కుసుమ, రెండు టన్నుల నువ్వులు తీసుకుంటున్నాను. వీటిలో గడ్డి నువ్వులు ఒరిస్సా నుండి, కుసుమ, కొబ్బరి కర్ణాటక నుండి, పల్లీలు, నువ్వులు మహబూబ్‌నగర్ నుండి దిగుమతి చేసుకుని నూనె తీస్తున్నాను’ అని వివరించింది జయమ్మ. కార్యక్రమాల ఏర్పాటు... గానుగలను ఏర్పాటు చేసిన తర్వాత 4 సార్లు 170 మందికి గానుగ నూనె తయారీపై శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది జయమ్మ. వారందరికీ వసతి, భోజన సదుపాయాలను కల్పించింది. ఆరోగ్యదాయిని పేరుతో వివిధ జిల్లాల్లో కొత్తగా ఎనిమిది గానుగలను ఏర్పాటు చేసేందుకు సహకరించింది. దీంతో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడ ఆరోగ్యదాయిని పేరుతో చేపడుతోంది. పాఠశాలకు వాటర్ ఫిల్టర్, పుస్తకాలు, కరెంటు సౌకర్యం కల్పించడం వంటివి కూడ చేపడుతూ జయమ్మ ఆదర్శంగా నిలుస్తుంది. ‘మరో నాలుగు గానుగలు ఏర్పాటు చేసి అమెరికాకు కూడా ఇక్కడి నూనెలు ఎగుమతి చేస్తా. కల్తీ నూనెలకు అడ్డుకట్ట వేసి స్వచ్చమైన నూనెను అందిచడమే లక్ష్యం’ అంటూ గానుగల నిర్వహణ చూడటంలో మునిగిపోయింది జయమ్మ. విదేశాలకు ఎగుమతి ‘ఇప్పుడు మా ఊరు జక్లపల్లి నుండి కట్టె గానుగ ద్వారా తీసిన నూనె విదేశాలకు కూడా ఎగమతి అవుతుంది. హైద్రాబాద్‌లోని ఓ సంస్థ సహకారంతో దుబాయ్, సింగపూర్, మలేషియాలకూ పంపుతున్నాం. మూడు నెలలకొకసారి దాదాపు 4 వేల లీటర్ల నూనెను ఎగుమతి చేస్తున్నాం. గానుగ తీసిన పిప్పిని పశువుల దాణాగా వాడుతున్నాం. పశువుల దాణాకు ఇక్కడ మంచి గిరాకీ ఉంది. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు కొరియర్ ద్వారా స్వచ్ఛమైన కల్తీలేని నూనెను పంపుతున్నాం. మా కుటుంబ సభ్యులతో పాటు మరో 15 మంది ఈ నూనె వ్యాపారం ద్వారా ఉపాధి పొందుతున్నారు’ అని వివరించింది జయమ్మ. చేతి నిండా పని గానుగ ఏర్పాటైనప్పటి నుండి ఇక్కడ పనిచేస్తున్నా. అంతకు ముందు వ్యవసాయ పనులకు వెళ్లేదాన్ని. కొన్నాళ్లు పని ఉండేది. కొన్నాళ్లు ఖాళీగా ఉండేదాన్ని. ఈ గానుగలు వచ్చాక చేతి నిండా పని దొరుకుతుంది. పని కోసం వెదుకులాడే అవసరం లేకుండా పోయింది. – లక్ష్మి, జక్లపల్లి – బోయిని గోపాల్, గండీడ్, మహబూబ్‌నగర్, సాక్షి -
చమురు ఉత్పత్తి పెంచి... యూరప్‌ను ఆదుకోండి
దోహా/ఇస్తాంబుల్: ‘‘చమురు ఉత్పత్తిని మరింతగా పెంచండి. ఇంధనం కోసం రష్యాపై ఆధారపడకుండా యూరప్ దేశాలను ఆదుకోండి. వాటి భవితవ్యం మీ చేతుల్లోనే ఉంది’’ అని ఒపెక్ దేశాలకు, ముఖ్యంగా ఖతర్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. ఖతర్‌లో జరుగుతున్న దోహా ఫోరాన్ని ఉద్దేశించి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తమ దేశాన్ని రష్యా సర్వనాశనం చేస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘మా రేవు పట్టణాలను నేలమట్టం చేసింది. దీంతో ఉక్రెయిన్ ఎగుమతులన్నీ నిలిచిపోయాయి. ఇది ప్రపంచమంతటికీ పెద్ద దెబ్బే. మమ్మల్ని లొంగదీయలేక రష్యా అణు బెదిరింపులకు దిగుతోంది. అదే జరిగితే ప్రపంచమంతటికీ పెనుముప్పే’’ అని హెచ్చరించారు. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభానికి చర్చలే పరిష్కారమని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అన్నారు. జెలెన్స్కీతో ఆయన ఫోన్లో మాట్లాడారు. -
ఆ పని చేస్తే నాకు నష్టం.. ఐనా పర్లేదు.. ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ధరలను అదుపులోకి తెచ్చేందుకు ఎలన్‌మస్క్ చేసిన సూచన అందరినీ ఆకట్టుకుంటోంది. నిత్యం విచిత్ర కామెంట్లతో స్వార్థానికి నిలువెత్తు రూపంగా కనిపించే ఎలన్ మస్క్ తన తీరుకి భిన్నంగా స్పందించాడేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. యుద్ధం ఎంటి వారినైనా మారుస్తుంది అనేందుకు మరో ఉదాహరణగా ఎలన్ మస్క్ నిలిచారు. ప్రపంచానికి గ్యాస్, క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తున్న దేశాల్లో రష్యా కీలకం. ఒపెక్ దేశాలను మినహాయిస్తే వెనిజువెలా, రష్యాల్లో అపారమైన బొగ్గు, గ్యాస్, ముడి చమురు నిల్వలు ఉన్నాయి. అయితే తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తడంతో ప్రపంచ దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. ఫలితంగా పది రోజుల వ్యవధిలోనే క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. సాధారణంగా పెట్రోడ్, డీజిల్ రేట్లు పెరిగితే.. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తారు. ఫలితంగా వాటికి డిమాండ్ పెరుగుతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ కార్త తయారీ కంపెనీగా టెస్లా ఉంది. ప్రస్తుత పరిస్థితులు టెస్లాకు మేలు చేసేవే. అయితే టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ మరోరకంగా ఆలోచించారు. చమురు, గ్యాస్ నిల్వలు ఉన్న దేశాలు తమ ఉత్పత్తిని పెంచాలంటూ ఎలన్ మస్క్ విజ్ఞప్తి చేశారు. ఈ సలహా ఇవ్వడం తనకు నచ్చకపోయినా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను మరింత చిక్కుల్లోకి పడేయకుండా ఉండాలంటే చమురు, గ్యాస్ ఉత్పత్తి పెంచక తప్పదంటూ ట్వీట్ చేశాడు. అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయాలు తీసుకోక తప్పదన్నాడు. Hate to say it, but we need to increase oil & gas output immediately. Extraordinary times demand extraordinary measures. — Elon Musk (@elonmusk) March 5, 2022 ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ముందు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 90 డాలర్ల దగ్గర ట్రేడయ్యింది. యుద్ధం మొదలవడం ఆలస్యం ఈ ధర పైకి ఏగబాకుతూ 120 డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత కాస్త నెమ్మదించినా.. ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు. చమురు ధరలు పెరిగితే దానిపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన అన్ని సెక్టార్లు ప్రభావితం అవుతాయి. ద్రవ్యోల్బణం ఎదురయ్యే దుస్థితి దాపురిస్తుంది. అందుకే ఎలన్‌మస్క్ .. తన లాభాలు పక్కన పెట్టి.. ప్రజల మేలు కోరి ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి పెంచాలనే సూచన చేశాడు. చదవండి: జాగ్రత్త! రష్యన్లు ఇలా దాడి చేయొచ్చు.. ఉక్రెయిన్లకు ఎలన్ మస్క్ సూచనలు -
కంపెనీలకు చమురు సెగ
కోవిడ్–19 సృష్టించిన విలయం నుంచి నెమ్మదిగా బయటపడుతున్న ప్రపంచ దేశాలు ఆర్థిక రికవరీ బాటలో సాగుతున్నాయి. దీంతో ఇటీవల బాండ్ల ఈల్డ్స్, డాలరు ఇండెక్స్ పుంజుకుంటోంది. మరోవైపు ముడిచమురు ధరలు సైతం బలపడుతున్నాయి. ఫలితంగా చమురు ఉత్పత్తి దేశాలు, కంపెనీలు లాభపడనుండగా.. దేశీయంగా పలు రంగాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22)లో పలు రంగాల కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పడవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. ముంబై: కొద్ది రోజులుగా ముడిచమురు ధరలు మండుతున్నాయి. తాజాగా విదేశీ మార్కెట్లో 14 నెలల గరిష్టానికి చేరాయి. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు, లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ ధరలు పెరగడంతో ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలు సైతం వేడిని పుట్టించనున్నాయి. నైమెక్స్ బ్యారల్ దాదాపు 66 డాలర్లకు చేరగా.. బ్రెంట్ 69 డాలర్లను అధిగమించింది. దీంతో దేశీయంగా పలు రంగాలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రతికూల ప్రభావం పడనుంది. అయితే చమురును ఉత్పత్తి చేయగల అప్‌స్ట్రీమ్ కంపెనీలు ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, కెయిర్న్, ఆర్ఐఎల్ లబ్ధి పొందే వీలుంది. అంతర్జాతీయ మార్కెట్ల ధరల ఆధారంగా ముడిచమురును విక్రయించేందుకు వీలుండటమే దీనికి కారణంకాగా.. చమురు శుద్ధి(రిఫైనింగ్) కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పడనుంది. ఇదేవిధంగా ముడిచమురు నుంచి లభించే పలు డెరివేటివ్స్ ధరలు పెరగడంతో పెయింట్లు, ప్లాస్టిక్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, కెమికల్స్ తదితర రంగాల లాభదాయకతను దెబ్బతీసే వీలుంది. చమురు జోరు ప్రపంచ ఆర్థిక రికవరీ, ఉత్పత్తిలో కోతల ఎత్తివేత తదితర అంచనాలతో ఈ ఏడాది రెండు నెలల్లోనే బ్రెంట్ చమురు 30 శాతం జంప్‌చేసింది. అయితే గత మూడేళ్లుగా స్తబ్దుగా ఉన్న చమురు ధరలతో దేశీయంగా లబ్ధి పొందుతూ వచ్చిన పలు రంగాలు దీంతో మార్జిన్ల సవాళ్లను ఎదుర్కొనే అవకాశముంది. చమురు డెరివేటివ్స్‌ను పెయింట్స్, టైర్ల తయారీలో కీలక ముడిసరుకుగా వినియోగించే సంగతి తెలిసిందే. పెయింట్స్, టైర్ల తయారీ ముడివ్యయాలలో 40–60 శాతం వాటాను ఇవి ఆక్రమిస్తుంటాయి. ఈ బాటలో ఎఫ్ఎంసీజీ, కెమికల్స్, సిమెంట్ తదితర రంగాలలోనూ చమురు డెరివేటివ్స్ కీలకపాత్ర పోషిస్తుంటాయి. చమురు ధరలు మండితే.. ఏటీఎఫ్ ధరలకు రెక్కలొస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఫలితంగా విమానయాన రంగంపై భారీగా భారం పడుతుంది. వెరసి ఎయిర్‌లైన్స్ కంపెనీలకు ఆర్థిక సవాళ్లు ఎదురయ్యే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. -
మార్కెట్లో ‘శాంతి’ ర్యాలీ!
ముంబై: ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశం అమెరికా.. చమురు ఉత్పత్తి పరంగా బలమైన ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం తేలికపడడం ప్రపంచవ్యాప్తంగా గురువారం ఈక్విటీ మార్కెట్లకు జోష్‌నిచ్చింది. గత వారం ఇరాక్‌లో ఇరాన్ సైనిక కమాండర్ సులేమానీని అమెరికా దళాలు చంపేసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆ నష్టాల్లో అధిక శాతం మేర గడిచిన రెండు రోజుల్లో మన ఈక్విటీ మార్కెట్లు తిరిగి పూడ్చుకున్నాయి. ప్రతీకార చర్య కింద ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసినా కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తీసుకోకపోవడం, తాము శాంతినే కోరుకుంటున్నామని చెప్పడం పరిస్థితిని కుదుటపరిచింది. ఫలితంగా గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 635 పాయింట్ల లాభాన్ని (1.55 శాతం) నమోదు చేసుకుంది. 41,482 పాయింట్ల గరిష్టస్థాయిని తాకి... చివరకు 41,452 వద్ద క్లోజయింది. అటు నిఫ్టీ సైతం 191 పాయింట్లు పెరిగి (1.58 శాతం) 12,216 వద్ద క్లోజయింది. ట్రంప్ ప్రకటనతో క్రితం రాత్రి యూఎస్ మార్కెట్లు కూడా లాభాలను నమోదు చేశాయి. తమ ఉపాధ్యక్షుడు లీ వచ్చే వారం వాషింగ్టన్‌ను సందర్శిస్తారని, అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై సంతకం చేస్తారంటూ చైనా చేసిన ప్రకటన కూడా ఇన్వెస్టర్లను రిస్క్ తీసుకునే దిశగా ప్రోత్సహించినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ► అధికంగా లాభపడిన షేర్లలో ఐసీఐసీఐ బ్యాంకు ముందుంది. ఆ తర్వాత ఎస్బీఐ, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్బ్యాంకు, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ► నష్టపోయిన షేర్లలో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా ఉన్నాయి. ► బీఎస్ఈ రియల్టీ, ఆటో, బ్యాంకెక్స్, ఇండస్ట్రియల్స్, ఫైనాన్స్, ఎనర్జీ సూచీలు లాభపడ్డాయి. ఐటీ సూచీ నష్టపోయింది. ► బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1.55 శాతం వరకు పెరిగాయి. ► షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ 2.31 శాతం వరకు గరిష్టంగా లాభపడ్డాయి. యూరోప్ మార్కెట్లు కూడా సానుకూలంగా ట్రేడింగ్ ఆరంభించాయి. ఒక్కరోజులో 2.25 లక్షల కోట్లు గురువారం నాటి మార్కెట్ ర్యాలీ పుణ్యమా అని ఒక్కరోజే ఇన్వెస్టర్ల వాటాల విలువ రూ.2.25 లక్షల కోట్ల మేర వృద్ధి చెందింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ బుధవారం ముగింపుతో పోలిస్తే.. రూ.2,25,554 కోట్లు పెరిగి మొత్తం రూ.1,57,06,155 కోట్లకు చేరుకుంది. మార్కెట్లపై క్యూ3 ఫలితాల ప్రభావం.. ‘‘వృద్ధిని పైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం బడ్జెట్లో చర్యలను ప్రకటిస్తుందన్న అంచనాలు, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు చల్లారడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఆర్థిక వృద్ధి కోసం ప్రభుత్వం ప్రకటించే విధానపరమైన చర్యలు, నిర్ణయాలు దీర్ఘకాలంలో ఈక్విటీలకు ప్రయోజనం కలిగిస్తాయి. అయితే, స్వల్పకాలానికి మాత్రం మార్కెట్లను మూడో త్రైమాసికం ఫలితాలు నిర్ణయిస్తాయి. తక్కువ బేస్(క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న గణాంకాలతో పోలిస్తే) కారణంగా డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్లో కొంత పురోగతి ఉంటుందని అంచనా’’ అంటూ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ తన అభిప్రాయాలను తెలియజేశారు. ‘‘ఈక్విటీ మార్కెట్లకు అసాధారణ రోజు. ఒకటిన్నర శాతానికి పైగా లాభపడ్డాయి. చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడడం మరింత ఉత్సాహాన్నిచ్చింది’’ అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. చల్లారిన పసిడి.. క్రూడ్ రూపాయికి 48 పైసలు లాభం న్యూయార్క్/న్యూఢిల్లీ: యుద్ధాన్ని కాంక్షించడంలేదంటూ అమెరికా–ఇరాన్ నుంచి వెలువడుతున్న సంకేతాలతో తిరిగి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షిత సాధనాలైన బంగారం, క్రూడ్ల నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు కనబడుతోంది. దీంతో అంతర్జాతీయంగా పసిడి, క్రూడ్ ధరలు గురువారమూ తగ్గాయి. ఈ ధోరణి భారత్ రూపాయి బలోపేతం కావడానికీ దోహదపడింది. బంగారం ఔన్స్ (31.1గ్రా) ధర అంతర్జాతీయ మార్కెట్ నైమెక్స్‌లో గురువారం ఈ వార్తరాసే 10.30 రాత్రి గంటల సమయానికి క్రితం ముగింపుతో పోల్చిచూస్తే, 10 డాలర్ల నష్టంలో 1,550 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. బుధవారం గరిష్టంతో పోల్చితే ఇది 62 డాలర్లు తక్కువ. ట్రేడింగ్ ఒక దశలో ఈ ధర 1,541 డాలర్ల కనిష్టాన్నీ తాకింది. ► నైమెక్స్ క్రూడ్ పావు శాతం తగ్గుదలతో 59.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ► డాలరుతో రూపాయి విలువ 48 పైసలు లాభపడి 71.21 వద్ద ముగిసింది. ► దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్– ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.377 నష్టంతో రూ.39,733 వద్ద ట్రేడవుతోంది. ‘‘యూఎస్–ఇరాన్ మధ్య ముదిరిన ఉద్రిక్తతలు ఒక్కసారిగా కనుమరుగయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్లు బలం చూపిస్తున్నాయి. బుధవారం రాత్రి అమెరికా మార్కెట్ బలంగా ముగియడం ఆసియాలోనూ కొనుగోళ్లకు దారితీసింది. ఇప్పుడు యూరోప్‌లోనూ బుల్లిష్ సెంటిమెంట్ కనిపిస్తోంది. యూఎస్, ఇరాన్ ఇప్పటికీ ఒకరిపట్ల మరొకరు విభేదంగా ఉన్నా, వివాదం ముదరకపోతే మంచి వాతావరణం కొనసాగే అవకాశమే ఉంటుంది’’ అని బ్రిటన్‌కు చెందిన సీఎంసీ మార్కెట్స్ అనలిస్ట్ డేవిడ్ మాడెన్ పేర్కొన్నారు. -
సౌదీ ఆరామ్‘కింగ్’!
దుబాయ్: సౌదీ అరేబియా చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కో స్టాక్ మార్కెట్ అరంగేట్రం అదిరిపోయింది. ఇష్యూ ధర 32 రియాల్స్‌తో పోలిస్తే 10 శాతం అప్పర్ సర్క్యూట్‌తో 35.3 రియాల్స్ ధరను (9.39 డాలర్లు –రూ.662) తాకింది. ఈ ధర వద్ద కంపెనీ విలువ 1.88 లక్షల కోట్ల డాలర్లు. మన రూపాయల్లో 132.5 లక్షల కోట్లు. గురువారం కూడా ఈ షేర్ మరో 10 శాతం పెరిగితే సౌదీ అరేబియా పాలకులు ఆశించిన 2 లక్షల కోట్ల డాలర్ల విలువ గల కంపెనీ అనే మైలురాయిని సాదీ ఆరామ్కో చేరనున్నదని అంచనా. సౌదీ ఆరామ్కో కంపెనీ తర్వాతి స్థానాల్లో ఉన్న ఇతర ఐదు చమురు కంపెనీల (ఎక్సాన్ మొబిల్, టోటల్, రాయల్ డచ్ షెల్, షెవ్రాన్, బీపీ) మొత్తం మార్కెట్ విలువ కన్నా కూడా సౌదీ ఆరామ్కో కంపెనీ విలువే ఎక్కువ కావడం విశేషం. వచ్చే ఐదేళ్ల పాటు ఏడాదికి 7,500 కోట్ల డాలర్ల చొప్పున డివిడెండ్‌ను ఇవ్వాలని ఈ కంపెనీ యోచిస్తోంది. ఐపీఓ, మార్కెట్ విలువలోనూ అగ్రస్థానం.... ఇటీవలే ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా 1.5 శాతం వాటా షేర్లను విక్రయించి 2,560 కోట్ల డాలర్లు (రూ.1,80,480 కోట్లు) సమీకరించి ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓగా ఈ కంపెనీ అవతరించింది. ఇప్పటివరకూ 2,500 కోట్ల డాలర్లతో అలీబాబా పేరిట ఉన్న అతి పెద్ద ప్రపంచ ఐపీఓ రికార్డ్‌ను సౌదీ ఆరామ్కో బ్రేక్ చేసింది. ఇక బంపర్ లిస్టింగ్‌తో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కూడా ప్రపంచ నెంబర్–1 కంపెనీగా సౌదీ ఆరామ్కో అవతరించింది. అంతే కాకుండా లిస్టెడ్ కంపెనీల పరంగా ప్రపంచంలోనే టాప్ 10 స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ఒకటిగా (తొమ్మిదవ స్థానాన్ని) సౌదీ అరేబియా స్టాక్ ఎక్సే్ఛంజ్ నిలిచేందుకు ఈ కంపెనీ తోడ్పడింది. ఇప్పటిదాకా లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ విలువను సాధించిన కంపెనీలు ప్రపంచంలో రెండే ఉన్నాయి. 1.19 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువతో యాపిల్, 1.15 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్‌తో మైక్రోసాఫ్ట్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీల తర్వాతి స్థానాల్లో గూగుల్ మాతృ కంపెనీ ఆల్ఫాబెట్ (92,600 కోట్ల డాలర్లు), ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ (86,200 కోట్ల డాలర్లు), సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ (57,200 కోట్ల డాలర్లు) నిలిచాయి. ► 1938లో ఒక చమురు బావితో సౌదీ ఆరామ్కో ప్రస్థానం మొదలైంది. ► ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత లాభదాయక, అతి పెద్దదైన చమురు కంపెనీగా మారింది. ► ప్రపంచవ్యాప్తంగా మొత్తం ముడి చమురు సరఫరాల్లో 10% ఈ సంస్థేదే. ► 2018లో కంపెనీ నికర లాభం 46% ఎగసి 11,110 కోట్ల డాలర్లకు పెరిగింది. 35,600 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. 13 రిలయన్స్‌లకు మించి... ఇక మన దేశంలో అత్యధిక మార్కెట్ క్యాప్ కంపెనీగా రూ.9,90,564 కోట్లతో(14,050 కోట్ల డాలర్లు) రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఒక విధంగా చెప్పాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి 13 కంపెనీలు కలిసినా... ఒక సౌదీ ఆరామ్కో కన్నా తక్కువే!! -
విద్యుత్‌తో నడిచే గానుగలపై 15 రోజుల శిక్షణ
ఆరోగ్య స్పృహతో పాటు గానుగ నూనెలకు గిరాకీ పెరుగుతున్నది. నూనె గింజల నుంచి ఆరోగ్యదాయక పద్ధతిలో వంట నూనెలను గ్రామస్థాయిలోనే ఉత్పత్తి చేయడానికి విద్యుత్‌తో నడిచే గానుగ(పవర్ ఘని)లు మంచి సాధనాలు. వీటి నిర్వహణలో మెలకువలపై ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ 16 ఏళ్లు నిండి, కనీసం 8వ తరగతి చదివిన రైతులు, యువతీ యువకులకు శిక్షణ ఇవ్వనుంది. గతంలో నెల రోజులు శిక్షణ ఇచ్చేవారు. తాజాగా 15 రోజుల స్వల్పకాలిక శిక్షణా కోర్సును రూపొందించారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో గల డా. బీఆర్ అంబేడ్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సంస్థలో శిక్షణ ఇస్తారు. ఫీజు రూ. 4,070. ప్రయాణ చార్జీలు అదనం. విద్యుత్‌తో నడిచే గానుగ గంటకు 15 కిలోల గింజల నుంచి నూనెను తీయవచ్చు. 40–45% వరకు నూనె వస్తుంది. శిక్షణ పొందిన వారు సబ్సిడీపై స్వయం ఉపాధి రుణాలు పొందొచ్చు. హైదరాబాద్‌లోని ఖాదీ కమిషన్‌లో ఎగ్జిక్యూటివ్ ఎం. హరిని సంప్రదించవచ్చు.. 95335 94597, 040–29704463. -
చమురు ఉత్పత్తి పెంచనున్న సౌదీ
వాషింగ్టన్: ఇరాన్‌పై ఆంక్షల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడకుండా సౌదీ అరేబియా ఉత్పత్తిని పెంచనుంది. ఈ దిశగా తను చేసిన విజ్ఞప్తిని సౌదీ అరేబియా రాజు సల్మాన్ అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇప్పుడే సౌదీ రాజు సల్మాన్‌తో మాట్లాడాను. పరిస్థితిని ఆయనకు వివరించాను. వెనిజులా, ఇరాన్లలో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా కొరతను తట్టుకునేలా ఉత్పత్తి పెంచాలని కోరాను. ఈ కొరత దాదాపు 20 లక్షల డాలర్లు ఉండొచ్చు. ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నా.. రాజు అంగీకారం తెలిపారు’ అని ట్రంప్ వెల్లడించారు. ఇటీవల.. చమురు ఉత్పత్తి ధరలు పెంచేందుకు ఒపెక్ దేశాలు నిర్ణయం తీసుకోవడంతోపాటు ఉత్పత్తిని పెంచాలని కూడా నిర్ణయించాయి. ఒపెకేతర దేశమైన రష్యా కూడా ఉత్పత్తిని పెంచేందుకు అంగీకరించింది. ‘ఒపెక్ దేశాల నిర్ణయంతో పెరగనున్న డిమాండ్‌కు సరైన ఉత్పత్తి ఉంటుందని భావిస్తున్నాం’ అని సౌదీ ఇంధన మంత్రి ఖలీద్ అల్ ఫలే పేర్కొన్నారు. -
భారత్‌లో ఆరామ్కో అరంగేట్రం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఉత్పత్తి సంస్థ, సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజ కంపెనీ, సౌదీ ఆరామ్కో భారత్‌లోని భారీ ఇంధన ప్రాజెక్ట్‌లో భాగస్వామి కాబోతోంది. అంతేకాకుండా భారత ఇంధన రిటైల్ రంగంలోకి కూడా ప్రవేశించనున్నది. మహారాష్ట్రలోని రత్నగిరిలో ప్రపంచంలోనే అతి పెద్ద రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను నిర్మించే కన్సార్షియమ్‌లో సౌదీ ఆరామ్కో భాగస్వామి కానున్నది. ఈ రత్నగిరి రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఆర్‌పీసీఎల్)ను 4,400 కోట్ల డాలర్లతో నిర్మించనున్నారు. ఈ రిఫైనరీ రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల చమురును ప్రాసెస్ చేస్తుంది. ఏడాదికి 18 మిలియన్ టన్నుల పెట్రోకెమికల్ ఉత్పత్తులను అందించనున్నది. ఈ కన్సార్షియమ్‌లో సౌదీ ఆరామ్కో కంపెనీకి 50 శాతం వాటా, ఇండియన్ ఆయిల్ కార్పొ, హిందుస్తాన్ పెట్రోలియమ్ కంపెనీ, భారత్ పెట్రోలియమ్ కార్పొలకు కలపి 50 శాతం చొప్పున వాటాలుంటాయి. భారత కంపెనీల 50 శాతం వాటాలో ఐఓసీకి సగం, మిగిలిన సగం మిగిలిన రెండు కంపెనీలకు ఉంటాయి. ఈ మేరకు ఈ కంపెనీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్తో కుదిరిన ఈ ఒప్పందంపై సౌదీ అరేబియా ఇంధన మంత్రి ఖలీద్ అల్– ఫలిహ్ సంతకాలు చేశారు. ఇక్కడ జరిగిన 16వ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఫోరమ్ మినిస్టీరియల్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ రిఫైనరీలో పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఈ రిఫైనరీకి అవసరమైన దాంట్లో సగం వరకూ ముడి చమురును కూడా సరఫరా చేస్తామని చెప్పారు. 2025 కల్లా పూర్తి 60 మిలియన్ టన్నుల ఈ రిఫైనరీ 2025 కల్లా పూర్తవుతుందని అంచనా. కాగా అబూ దాబి నేషనల్ ఆయిల్ కంపెనీని కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా చేయాలని ఆరామ్కో యోచిస్తోంది. తమ పెట్టుబడులకు ప్రాధాన్యత దేశంగా భారత్‌ను పరిగణిస్తున్నామని ఖలీద్ పేర్కొన్నారు. తమ కంపెనీకి క్రెడిట్ రేటింగ్ అధికంగా ఉందని, దీంతో ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన రుణాలు తక్కువ వడ్డీరేట్లకే లభించే అవకాశాలున్నాయని వివరించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రత్నగిరిలోని బాబుల్‌వాడిలో 14,000 ఎకరాల్లో ప్రధాన కాంప్లెక్స్‌ను నిర్మిస్తారు. భాగస్వామ్యం దాకా పురోగతి... భారత్, సౌదీ అరేబియాల మధ్య కొనుగోలుదారు, అమ్మకందారులుగా ఉన్న సంబంధం వ్యూహాత్మక భాగస్వామ్యం దాకా పురోగతి సాధించిందని భారత పెట్రోలియమ్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సందర్భంగా చెప్పారు. భారత ఇంధన రిటైల్ రంగంలోకి ప్రవేశించాలన్న ఆసక్తిని సౌదీ ఆరామ్కో వ్యక్తం చేసిందని, ఈ మేరకు నియమ నిబంధనలను సమీక్షిస్తామని పేర్కొన్నారు. అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలో అత్యధికంగా చమురు వినియోగిస్తున్న దేశం మనదే. -
చమురు ఉత్పత్తి కోత.. మరో 9 నెలలు
ఒపెక్ దేశాల నిర్ణయం న్యూఢిల్లీ: అధిక సరఫరా సమస్యను అధిగమించే దిశగా చమురు ఉత్పత్తిలో కోతను మరో తొమ్మిది నెలల పాటు కొనసాగించాలని క్రూడ్ ఉత్పత్తి దేశాల సమాఖ్య ఒపెక్, ఇతర దేశాలు నిర్ణయించాయి. ఒపెక్‌లోని సభ్య దేశాలతో పాటు రష్యా తదితర దేశాలు కూడా మార్చి దాకా కోతలను పొడిగించేందుకు అంగీకరించినట్లు ఇరాన్ పెట్రోలియం శాఖ మంత్రి బిజాన్ నామ్దర్ జాంగ్నె వెల్లడించారు. ఉత్పత్తిని తగ్గించడం నుంచి నైజీరియా, లిబియాకు మినహాయింపు ఉంటుంది. అలాగే ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరాన్ యథాపూర్వ ఉత్పత్తి స్థాయినే కొనసాగిస్తుందని బిజాన్ తెలియజేశారు. ఒపెక్‌లో సభ్యత్వం లేని ఇతర దేశాలేవీ కొత్తగా ఈ ఒప్పందంలో చేరబోవడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. చమురు సరఫరా పెరిగిపోయి ధర భారీగా పతనమైన నేపథ్యంలో ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఆ తర్వాత డిసెంబర్లో మరో 11 ఇతర దేశాలు కూడా ఈ డీల్‌లో భాగం కావడంతో మొత్తం ఉత్పత్తిలో కోత 1.8 మిలియన్ బ్యారెళ్లకు పెరిగింది. ఇది జనవరి నుంచి 6 నెలల పాటు అమల్లో ఉండాలి. దీనితో చమురు రేట్లు పెరిగినప్పటికీ.. అమెరికా నుంచి షేల్ గ్యాస్ ముంచెత్తడంతో నిల్వలు పెరిగి ధరల జోరు తగ్గింది. అయితే మూడేళ్ల పాటు అధిక ఉత్పత్తి కారణంగా పేరుకుపోయిన నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయని, అయినప్పటికీ ఈ ఏడాది ఆఖరు నాటిదాకా ఖాళీ కావని ఒపెక్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఒపెక్‌తో పాటు ఇతర దేశాలు కూడా మార్చ్ దాకా ఉత్పత్తి కోత నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి. ఉత్పత్తి కోత మరింత పెరుగుతుందన్న అంచనాలకు భిన్నంగా యథాతథ స్థితిని కొనసాగించాలని ఒపెక్ దేశాలు నిర్ణయించటంతో.. మార్కెట్ వర్గాలు ప్రతికూలంగా స్పందించాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ఒక దశలో 3.7 శాతం క్షీణించి 52.42 డాలర్ల వద్ద, నైమెక్స్ క్రూడ్ 4 శాతం తగ్గి 49.28 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. -
చమురు ఉత్పత్తికి బూస్ట్
►హైడ్రోకార్బన్స్ అన్వేషణకు కొత్త లైసెన్సింగ్ విధానం ►ఏటా రెండుసార్లు గ్యాస్, చమురు బ్లాక్‌ల వేలం ►జూలైలో తొలి విడత నిర్వహణ హ్యూస్టన్: దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తికి ఊతమిచ్చే దిశగా కేంద్రం కొత్త లైసెన్సింగ్ విధానాన్ని ప్రకటించింది. ఇకపై ఏడాదికి రెండు సార్లు ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్‌పీ) కింద చమురు, గ్యాస్ బ్లాక్‌ల వేలం నిర్వహించనున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తొలి విడత వేలం ఈ ఏడాది జులైలో నిర్వహించనున్నట్లు ఇంధన పరిశ్రమ దిగ్గజాల సదస్సు సీఈఆర్ఏవీక్లో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ఇప్పటిదాకా ఉన్న పాలసీ ప్రకారం లాభాల్లో వాటాల విధానం పాటిస్తుండగా.. ఓఏఎల్‌పీ కింద ఆదాయాల్లో వాటాల విధానం అమల్లోకి వస్తుంది. అలాగే, ఆపరేటర్లకు ధర, మార్కెటింగ్ పరమైన స్వేచ్ఛ లభిస్తుంది. హైడ్రోకార్బన్ ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్సింగ్ విధానం (హెల్ప్) కింద ఇటీవలే 31 చిన్న క్షేత్రాలను కేటాయించినప్పటికీ.. జులైలో పెద్ద క్షేత్రాలను వేలం వేయనుండటం 2010 తర్వాత తొలిసారి కానుంది. వ్యాపారాలకు, ఇన్వెస్టర్లకు అనువైన కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు, చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని 2020 నాటికి పది శాతం మేర తగ్గించుకునేందుకు తలపెట్టిన వ్యూహంలో భాగంగా కొత్త విధానాన్ని రూపొందించినట్లు ప్రధాన్ చెప్పారు. ‘కొత్త విధానంలో ఉత్పత్తిదారులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రభుత్వం పర్యవేక్షించబోదు. కేవలం ఆదాయాల్లో వాటాలు మాత్రమే పంచుకుంటుంది‘ అని ఆయన వివరించారు.