వాషింగ్టన్: ఇరాన్‌పై ఆంక్షల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడకుండా సౌదీ అరేబియా ఉత్పత్తిని పెంచనుంది. ఈ దిశగా తను చేసిన విజ్ఞప్తిని సౌదీ అరేబియా రాజు సల్మాన్ అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇప్పుడే సౌదీ రాజు సల్మాన్‌తో మాట్లాడాను. పరిస్థితిని ఆయనకు వివరించాను. వెనిజులా, ఇరాన్‌లలో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా కొరతను తట్టుకునేలా ఉత్పత్తి పెంచాలని కోరాను. ఈ కొరత దాదాపు 20 లక్షల డాలర్లు ఉండొచ్చు. ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నా.. రాజు అంగీకారం తెలిపారు’ అని ట్రంప్ వెల్లడించారు. ఇటీవల.. చమురు ఉత్పత్తి ధరలు పెంచేందుకు ఒపెక్ దేశాలు నిర్ణయం తీసుకోవడంతోపాటు ఉత్పత్తిని పెంచాలని కూడా నిర్ణయించాయి. ఒపెకేతర దేశమైన రష్యా కూడా ఉత్పత్తిని పెంచేందుకు అంగీకరించింది. ‘ఒపెక్ దేశాల నిర్ణయంతో పెరగనున్న డిమాండ్‌కు సరైన ఉత్పత్తి ఉంటుందని భావిస్తున్నాం’ అని సౌదీ ఇంధన మంత్రి ఖలీద్ అల్ ఫలే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment