Saudi Arabia King
-
సౌదీ అరేబియా రాజుకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్! ఎందువల్ల వస్తుందంటే..?
సౌదీ అరేబియా రాజు సల్మాన్ తీవ్ర స్వస్థతకు గురయ్యారు. జెడ్డాలోని అల్ సలామ్ ప్యాలెస్‌లోని రాయల్ క్లినిక్ సల్మాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బారినపడ్డట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయన యాంటీబయాటిక్స్‌తో చికిత్స పొందుతున్నారని, తొందరలోనే కోలుకుంటారని పేర్కొంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అంటే..ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అనేది వైరస్లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లేదా పరాన్నజీవులు, శ్వాసనాళాలు లేదా ఊపిరితిత్తుల కణజాలాలకు వాపు, హాని కలిగించే పరిస్థితి. ఈ పరిస్థితి కారణంగా ఒకటి లేదా రెండ ఊపిరితిత్తులు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సంకేతాలు ఎంలా ఉంటాంటే..లక్షణాలు..దగ్గు..ఎడతెరిపి లేని దగ్గు ఊపిరితిత్తుల సంక్రమణకు సంకేతం. అలాగే స్పష్టంగా పసుపు, ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉండే శ్లేష్మం, జ్వరం. సాధారణంగా అయితే అధిక జ్వరం కనిపిస్తుంది.శ్వాస ఆడకపోవుట..శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా..ఊపిరితిత్తుల్లో వాపు, ద్రవం పేరుపోవడానికి కారణమవుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఛాతి నొప్పి..ఊపిరితిత్తు ఇన్ఫెక్షన్లో కూడా ఛాతీలో తీవ్ర నొప్పి కలుగుతుంది. ప్రత్యేకించి లోతైన శ్వాస తీసుకున్నా..దగ్గు తీసుకున్నా..ఛాతీలో పదునైన కత్తిపోటులా నొప్పిగా ఉంటుంది. అలసట..విపరీతంగా అలసిపోయినట్లు ఉండొచ్చు. గురకఇరుకైన వాయుమార్గాల కారణంగా ఊపిరి పీల్చుకునేటప్పుడు పెద్దగా శబ్దం రాడం. ఇది శ్లేష్మంగా కారణంగా ఏర్పడే వాపు లేదా అడ్డంకికి సంకేతం.వేగవంతమైన శ్వాసశరీరం తక్కువ ఆక్సిజన్ స్థాయిలకు ప్రతిస్పందించినప్పుడూ జరుగుతుంది.గందరగోళం..ఇది ఎక్కువగా పెద్దవారిలో కనిపిస్తుంది.ఆకలి నష్టం..అనారోగ్యంతో పోరాడటానికి శరీరానికి తగినంత శక్తి అవసరం కానీ ఈ ఊపిరితిత్తు ఇన్ఫెక్షన్ ఆకలిని తగ్గించేస్తుంది.వికారం వాంతులు..కొంతమందిలో లేదా పిల్లలకు వికారం, వాంతులు, అతిసారం వంటివి వచ్చే అవకాశం ఉంటుంది.ఎందువల్ల వస్తుందంటే..బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు..స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా, మైకోప్లాస్మా న్యుమోనియా వంటివి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు ప్రాథమిక కారణాలు. దీని కారణంగా ఊపిరితిత్తులలో వాపు, ద్రవం చేరడం వంటివి జరుగుతాయి.వైరల్ ఇన్ఫెక్షన్లు..సార్స్ కోవీ-2తో సహా ఇన్ఫ్లు ఎంజా వైరస్లు, కరోనా వైరస్లు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు దారితీయొచ్చు. ఈ అంటువ్యాధులు తరుచుగా దగ్గు లేదా తుమ్ముల నుంచి శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లుపర్యావరణంలో శిలీంధ్ర బీజాంశాలను పీల్చడం వల్ల ఈ ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తుల్లో తలెత్తుంది. బలహీన రోగ నిరోధక వ్యవస్థ..హెచ్ఐవీ లేదా ఎయిడ్స్, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, కేన్సర్ చికిత్సలు లేదా అవయవ మార్పిడి వంటి పరిస్థితుల కారణంగా ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. (చదవండి: మామిడి పండ్ల వినియోగంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరిక! కెమికల్ ఫ్రీ పండ్లను ఎలా గుర్తించాలంటే..) -
సౌదీ యువరాజుపై హత్యాయత్నం అంటూ కథనాలు
రియాద్: సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌పై హత్యాయత్నం జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని పలు అరబ్ మీడియా సంస్థలు సైతం ప్రచురించాయన్నది సదరు సోషల్ మీడియా పోస్టుల సారాంశం. అయితే ఈ విషయంపై అక్కడి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.మరోవైపు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌పై హత్యాయత్న ప్రయత్నం జరిగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. దీంతో.. ఆయన పేరు ఎక్స్ ఖాతాలోట్రెండింగ్లో కొనసాగుతోంది.కారు బాంబు ఉపయోగించి మహ్మద్ బిన్ సల్మాన్‌పై హత్యాయత్యానికి ప్రయత్నించగా ఆయన సురక్షితంగా బయటపడ్డారన్నది ఆ వైరల్ కథనాల సారాంశం. ఇక ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు కూడా సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్‌గా మారుతున్నాయి. ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ కథనాలకు కాసేపట్లో ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. -
G20 Summit: అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామి
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా దేశ రాజధానికి విచ్చేసిన సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్అజీజ్ అల్–సౌద్‌తో సోమవారం ప్రధాని మోదీ విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు ఉదయం ఆయనకు రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సాదర స్వాగతం పలికారు. తర్వాత ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో సల్మాన్ బిన్, మోదీ ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ మాట్లాడారు. ‘ ఈ ప్రాంతంతోపాటు ప్రపంచ సుస్థిరతకు, సంక్షేమానికి భారత్–సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో కీలకం. భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగిస్తున్న దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఒకటి. రెండు దేశాలు కాలానుగుణంగా సత్సంబంధాలను సుదృఢం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి’ అని మోదీ అన్నారు. సోమవారం ఇండియా–సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి తొలి భేటీలో ద్వైపాక్షిక బంధంపై ఇద్దరు అగ్రనేతలూ సమీక్ష జరిపారు. రక్షణ, ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజారోగ్యం, ఆహార భద్రత, సంస్కృతి, సంక్షేమం తదితర అంశాలు మండలి తొలి భేటీలో చర్చకొచ్చాయని విదేశాంగ శాఖ కార్యదర్శి అరీందర్ బాగ్చీ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. ‘దేశాల దగ్గరి బంధాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు అనువైన కొన్ని మార్గాలను అన్వేషించాం. ఇకపై మా భాగస్వామ్యం నూతనోత్సాహంతో కొత్త మలుపు తీసుకోనుంది. గ్రిడ్ల అనుసంధానం, పునరుత్పాదక ఇంధన వనరులు, సెమీ కండక్టర్లు, సరకు రవాణా గొలసు తదితర కీలక అంశాలపైనా చర్చలు జరిపాం. చర్చలు ఫలప్రదంగా సాగాయి.’ అని మోదీ వ్యాఖ్యానించారు. సంక్షిష్ట అంశాల్లో భాగస్వామ్యం పెంపుకోసం.. ఇరు దేశాల మధ్య సంక్లిష్టంగా మారిన కొన్ని అంశాల్లో సందిగ్ధతను తొలగించుకునేందుకు ఇండియా–సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని నెలకొల్పాలని 2019 ఏడాదిలో నిర్ణయించారు. జీ20 సదస్సు తర్వాత భారత్‌లో సల్మాన్ బిన్ అధికారిక పర్యటన కొనసాగిస్తున్నారు. ‘ భారత్‌కు రావడం ఆనందంగా ఉంది. జీ20 సదస్సుకు విజయవంతంగా నిర్వహించినందుకు భారత్‌కు నా అభినందనలు. విశ్వ శ్రేయస్సు కోసం జీ20 సదస్సులో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మోదీతో చర్చలు ఫలవంతంగా సాగాయి. మా రెండు దేశాల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇకమీదటా కలిసి పనిచేస్తాం’ అని సల్మాన్ వ్యాఖ్యానించారు. మధ్య ప్రాచ్యంలో భారత్‌కు సౌదీ అరేబియా దేశం అత్యంత కీలకమైంది. గత కొన్నేళ్లలో ఈ రెండు దేశాల మధ్య మరింత మెరుగైన సత్సంబంధాలు ఏర్పడ్డాయి. రక్షణ, భద్రత సంబంధ అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం జీవితకాల గరిష్టానికి చేరుకున్న వేళ సల్మాన్ బిన్ భారత్‌లో పర్యటించడం గమనార్హం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్–సౌదీ వాణిజ్య వ్యాపారం విలువ ఏకంగా 52.75 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం. భారత్‌కు సౌదీ నాలుగో అతిపెద్ద వాణిజ్యభాగస్వామిగా కొనసాగుతోంది. 13 లక్షల సైన్యానికి సారథి అయిన నాటి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎం నరవాణె 2020 డిసెంబర్లో సౌదీలో పర్యటించారు. భారత సైన్యాధ్యక్షుడు ఒకరు సౌదీలో పర్యటించడం ఇదే తొలిసారి. -
అదే జరిగితే ఎక్కువ సంతోషించేది మేమే.. అజిత్ దోవల్
జెదాహ్: ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి సౌదీ అరేబియాలో జరుగుతున్న రెండ్రోజుల సమావేశాల్లో పాల్గొన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుతూ యుద్ధ సమసిపోతే అంతకంటే సంతోషం మరొకటి ఉండదని అన్నారు. సౌదీ అరేబియా వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహించగా మొత్తం 40 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించేందుకే వీరంతా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రష్యాను ఆహ్వానించకపోవడం విశేషం. భారత దేశం తరఫున అధికార ప్రతినిధిగా హాజరైన అజిత్ దోవల్ రెండు దేశాల మధ్య సంధిని కుదిర్చే విషయంలో తామెల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామని తెలిపారు. అజిత్ దోవల్ మాట్లాడుతూ.. భారతదేశం తరపున మేము తరచుగా రష్యా, ఉక్రెయిన్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తూ.. దౌత్యాన్ని కుదర్చడానికి తమవంతుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నామన్నారు. ఇప్పటికే యుద్ధాన్ని ఆపడానికి అనేక దేశాలు తమకు తోచిన ప్రతిపాదనలు తెరపైకి తీసుకు రాగా వాటిలో కొన్ని మాత్రమే రెండు దేశాలకూ ఆమోదయోగ్యమైనవి ఉన్నాయని అన్నారు. అలా కాకుండా రెండు దేశాలకూ సమ్మతమైన, శాశ్వతమైన, సమగ్ర పరిష్కారం కోసం భారతదేశం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన అంతర్జాతీయ చట్టాల్లోని నియమ నిబంధనలను భారత్ గౌరవిస్తుందని దాని ప్రకారమే రెండు దేశాల మధ్య సంధి కుదిర్చే ప్రయాత్నం చేస్తామని.. అదే జరిగితే తమకంటే ఎక్కువగా సంతోషించేవారు ఎవ్వరూ ఉండరని అన్నారు. అంతకుముందు జపాన్‌లో జరిగిన జీ7 సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జిలెన్‌స్కీని కలిసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామని ఆయనకు ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: చికాగోలో రోడ్లపై తిరుగుతున్న హైదరాబాదీ మహిళకు ఉపశమనం -
Hyderabad: నెహ్రూ జూపార్కులోనే ఓ చీతా ఉంది తెలుసా!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చీతాల విషయంగా చర్చ జరుగుతోంది. అవి ఎలా ఉంటాయి, వాటి ప్రత్యేకతలేమిటన్న దానిపై అందరిలో ఆసక్తి మొదలైంది. అయితే మన హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్కులోనే ఓ చీతా ఉంది. కావాలనుకుంటే వెళ్లి చూడొచ్చు కూడా. 2012లో సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సౌద్ నెహ్రూ జూపార్కులో జరిగిన ఓ సదస్సుకు హాజరయ్యారు. జూలో ఏర్పాట్లను చూసి ముచ్చటపడిన ఆయన జత చీతాలు, జత సింహాలను బహుమతిగా ఇస్తున్నట్టు ప్రకటించారు. 2013లో అవి నెహ్రూ జూపార్కుకు చేరుకున్నాయి. 2016లో ఆడ చీతా ఈబా అనారోగ్యంతో చనిపోయింది. అబ్దుల్లాగా పిలిచే మగ చీతా ప్రస్తుతం జూలో ఉంది. ప్రధాని మోదీ ఈ నెల 17న మధ్యప్రదేశ్‌లో చీతాలను విడుదల చేసిన సందర్భంగా.. నెహ్రూ జూపార్కులోని చీతా ఎన్‌క్లోజర్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. కాగా సౌదీ యువరాజు బహుమతిగా ఇచ్చిన రెండు చీతాలు పెంపుడు జంతువులేనని.. సౌతాఫ్రికా నుంచి చిన్న పిల్లలను తెచ్చి పెంచుకున్న ఆయన తర్వాత నెహ్రూ జూపార్కుకు బహుమతిగా ఇచ్చారని జూపార్కు వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ హకీం తెలిపారు. ఆరు పిల్లలు పెట్టిన సింహాలు సౌదీ యువరాజు బహుమతిగా ఇచ్చిన ఆఫ్రికన్ సింహాలు మదన్, అభిషలకు నెహ్రూ జూపార్కులోనే ఆరు పిల్లలు పుట్టాయి. జూపార్క్‌లో ఆసియా సింహాల ఎన్‌క్లోజర్ పక్కనే ఈ ఆఫ్రికన్ సింహాల ఎన్‌క్లోజర్ ఉంది. చదవండి: చీతాల మేత కోసం చీతల్! తీవ్రదుమారం -
ఆస్పత్రిలో చేరిన సౌదీ రాజు
రియాద్: సౌదీ అరేబియా రాజు కింగ్ సల్మాన్ బిన్ అబ్దులజీజ్(84) ఆస్పత్రిలో చేరారు. పిత్తాశయం వాపుతో బాధపడుతున్న ఆయన రాజధాని రియాద్‌లోని ఆస్పత్రిలో చేరినట్లు స్థానిక వార్తా సంస్థ సోమవారం వెల్లడించింది. రాజు సల్మాన్ సుమారు రెండున్నర సంవత్సరాల పాటు డిప్యూటీ ప్రీమియర్‌గా బాధ్యతలు చేపట్టారు. 50 సంవత్సరాలకు పైగా రియాద్ ప్రాంతానికి గవర్నర్‌గా పని చేశారు. 2012లో యువరాజుగా, 2015లో సౌదీ రాజుగా రాజ్యాధికారం చేపట్టారు. అయితే 2016లో ఆయన కొడుకు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను యువరాజుగా ప్రకటించినప్పటి నుంచీ సౌదీకి వాస్తవ పరిపాలకుడు ఆయనేనని పరిగణిస్తున్నారు. మహమ్మద్ బిన్ సల్మాన్.. దేశంలో అనేక సంస్కరణలకు కారణమయ్యారు. అలాగే 2017లో సౌదీ రాజు కుటుంబాన్ని నిర్బంధించి వివాదాస్పద నాయకుడిగానూ ముద్ర వేసుకున్నారు. జర్నలిస్ట్ ఖషోగ్గీని హత్య చేయించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాగే సౌదీ అరేబియా రాజును గద్దె దింపేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై అధికారులు ముగ్గురు యువరాజులను అరెస్ట్ చేశారు. రాజు సల్మాన్ తమ్ముడు అహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, దగ్గరి బంధువు మహమ్మద్ బిన్ నయేఫ్లు ఇందులో ఉన్నట్లు అమెరికా మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. (మా నాన్న హంతకులను క్షమిస్తున్నాం: సలా) -
సౌదీ రాజ కుటుంబంలో కరోనా కలకలం
-
సౌదీ రాజుకు వ్యతిరేకంగా కుట్ర
రియాద్: సౌదీ అరేబియా రాజును గద్దె దింపేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై అధికారులు ముగ్గురు యువరాజులను అరెస్ట్ చేశారు. రాజు సల్మాన్ తమ్ముడు అహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, దగ్గరి బంధువు మహమ్మద్ బిన్ నయేఫ్లు ఇందులో ఉన్నట్లు అమెరికా మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. శుక్రవారం ఉదయం యువరాజులు ముగ్గురిని వారి ఇళ్ల నుంచి అరెస్ట్ చేసినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. సౌదీ రాజు సల్మాన్‌తోపాటు ఆయన కొడుకు మహ్మద్ బిన్ సల్మాన్‌లను గద్దె దింపేందుకు కుట్ర పన్నినట్లు వీరిపై న్యాయస్థానంలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఆరోపణలు రుజువైతే నిందితులకు జీవితకాల ఖైదు లేదంటే మరణ శిక్ష పడే అవకాశం ఉంది. నయేఫ్తోపాటు ఆయన తమ్ముడు నవాఫ్ బిన్ నయేఫ్ కూడా అరెస్ట్ అయినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. -
జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ చేసిన సౌదీ రాజు
న్యూయార్క్ : అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఫోన్‌ను సౌదీ రాజు హ్యాక్ చేసినట్టు గార్డియన్ పత్రిక వెల్లడించింది. 2018లో సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ నుంచి ఓ వాట్సాప్ మెసేజ్ రిసీవ్ చేసుకున్న అనంతరం జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ అయిందని పత్రిక పేర్కొంది. మహ్మద్ బిన్ సల్మాన్ వ్యక్తిగత వాట్సాప్ అకౌంట్ నుంచి వైరస్‌తో కూడిన వీడియో ఫైల్‌ను పంపడం ద్వారా 2018 నుంచి అమెజాన్ చీఫ్ ఫోన్‌కు సంబంధించిన డేటా చోరీకి గురైందని డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ పేర్కొందని గార్డియన్ కథనం వెల్లడించింది. జెఫ్ బెజోస్ ఫోన్ నుంచి ఎలాంటి డేటా చోరీకి గురైందనేది తెలియదని వ్యాఖ్యానించింది. జెఫ్ బెజోస్ ఆయన భార్య మెకంజీలు పాతికేళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతూ విడాకుల నిర్ణయాన్ని ప్రకటించిన ఏడాది తర్వాత ఈ కథనం వెల్లడవడం గమనార్హం. మరోవైపు మాజీ టీవీ యాంకర్ లౌరెన్ సాంచెజ్‌తో జెఫ్ బెజోస్ వివాహేతర సంబంధంపై నేషనల ఎంక్వైరర్ బెజోస్ పంపిన టెక్స్ట్ మెసేజ్‌లను ఉటంకిస్తూ కథనాలు రాసిన క్రమంలో బెజోస్ ఫోన్ హ్యాక్ అయిన వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, ఎంక్వైరర్ జెఫ్ బెజోస్ ఎఫైర్‌ను బహిర్గతం చేయకముందే సౌదీ ప్రభుత్వం బెజోస్ ఫోన్ డేటాను సంగ్రహించిందని అమెజాన్ చీఫ్‌కు సెక్యూరిటీ కన్సల్టెంట్ గవిన్ బెకర్ అంచనా వేశారు. సౌదీతో ఎంక్వైరర్ వ్యాపార అనుబంధంతో పాటు సౌదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న విమర్శకుడి హత్యను బెజోస్‌కు చెందిన వాషింగ్టన్ పోస్ట్ విస్తృతంగా కవరేజ్ ఇచ్చిన క్రమంలో తాను ఈ అంచనాకు వచ్చానని గవిన్ బెకర్ పేర్కొన్నారు. 2018లో కాలమిస్ట్ జమల్ ఖషోగ్గి మరణానికి సౌదీ రాజుకు ప్రమేయమున్నసెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పాత్ర ఉందని వాషింగ్టన్ పోస్ట్ రాసింది. చదవండి : భారత్‌కు అమెజాన్ చీఫ్ మరో బహుమతి.. -
భారత్ నుంచి హజ్ కోటా పెంపు!
ఒసాకా: భారత్ నుంచి ఏటా హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్యను 1.7 లక్షల నుంచి 2 లక్షలకు పెంచనున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ–20 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా హజ్ కోటా పెంపుపై ఇరువురు చర్చించుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, ఉగ్రవాద నిర్మూలన తదితర అంశాలపై చర్చించారు. విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. హజ్ కోటాను 1.7 లక్షల నుంచి 2 లక్షలకు పెంచుతామని మహ్మద్ బిన్ సల్మాన్.. మోదీకి హామీ ఇచ్చి నట్లు విజయ్ తెలిపారు. ఇరు దేశాల మధ్య పర్యా టకం పెంపొందించేందుకు విమాన సేవలు పెంచేం దుకు ఇరువురు మరోసారి సమావేశం అయ్యేందుకు సుముఖం వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది సౌదీ అరేబియాలో జరగబోయే ఓ అంతర్జాతీయ సదస్సుకు మోదీని ఆహ్వానించారని, ఇందుకు మోదీ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. మక్కా కు ఒంటరిగా వెళ్లే మహిళలను లాటరీ లేకుండానే వెళ్లేందుకు వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. పురుషుల్లేకుండానే ఒంటరిగా వెళ్లే మహిళలను గతేడాది 1,300 మందిని అనుమతించారు. -
సౌదీ రాజును అవమానపరిచిన ఇమ్రాన్!
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై సోషల్ మీడియాలో విపరితమైన విమర్శలు వస్తున్నాయి. ఆయన సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్‌ను అవమానపరిచారని నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్ ప్రొటోకాల్‌ను కూడా ఉల్లఘించారని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గత వారం సౌదీ ప్రభుత్వం మక్కాలో అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరైన ఇమ్రాన్ సౌదీ రాజు వద్దకు వెళ్లి ఆయనతో కరచాలనం చేశారు. అనంతరం వీరిద్దరి మధ్య సంభాషణ సాగింది. సౌదీ రాజుతో పక్కనే ట్రాన్స్‌లేటర్ ఇమ్రాన్ చెప్పే సందేశాన్ని ఆయనకు వివరిస్తున్నారు. అయితే చివర్లో ఇమ్రాన్ చెప్పిన మాటలు ట్రాన్స్‌లేటర్ రాజుకు వివరించలోపే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సౌదీ రాజుతో మాట్లాడేటప్పుడు ఇమ్రాన్ బాడీ లాంగ్వేజ్ సరిగా లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇమ్రాన్ ప్రవర్తన కారణంగా ఆ తర్వాత సౌదీ, పాక్‌ల మధ్య జరగాల్సిన సమావేశం రద్దయిందని పలువురు పోస్ట్‌లు పెడుతున్నారు. 57 దేశాలు సభ్యత్వం ఉన్న ఓఐసీ ప్రపంచంలోని ముస్లింల కోసం పనిచేస్తున్నట్టు ప్రకటించుకుంది. -
30 ఏళ్ల మోసం.. బయటపెట్టిన పంది మాంసం
మియామి : 30 ఏళ్లుగా సౌదీ యువరాజుగా చెలామణి అవుతూ.. జనాలను మోసం చేసి దాదాపు 55 కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన వ్యక్తి గుట్టు రట్టయ్యింది. వివరాలు.. ఫ్లోరిడాకు చెందిన ఆంథోని గిగ్నాక్(48) తనను తాను సౌదీ యువరాజు.. ఖలీద్ బిన్ అల్ సౌద్‌గా పరిచయం చేసుకుని ఫ్లొరిడాలోని మియామీ ఫిషర్ ద్వీపంలో నివసిస్తూండేవాడు. నకిలీ డిప్లొమాటిక్ లైసెన్స్ ప్లేట్‌తో ఫెరారీలో తిరిగేవాడు. అతడి చుట్టూ నకిలీ డిప్లొమాటిక్ కాగితాలు పట్టుకొని పెద్ద సంఖ్యలో బాడీగార్డులు ఉండేవారు. తాను సౌదీ యువరాజునని.. వ్యాపార నిమిత్తం ఇలా వచ్చానని.. ఆసక్తి ఉన్నవారు తనతో కలిసి వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చని నమ్మబలికాడు. ఇతని మాటలు నిజమేనని నమ్మిన జనాలు.. ఆంథోనికి బ్యాంకు ఖాతాలో డబ్బు వేయడమే కాక ఖరీదైన కానులను కూడా ఇచ్చేవారు. ఇలా జనాలను మోసం చేసి ఇప్పటి వరకు దాదాపు 8 మిలియన్ అమెరికన్ డాలర్లను( ఇండియన్ కరెన్సీలో రూ.55,66,36,800) వసూలు చేశాడు. ఈ మొత్తాన్ని ప్రైవేటు జెట్లు, బోట్ రేసింగ్‌లు, డిజైనర్ దుస్తులకు ఖర్చు చేస్తూ.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుండేవాడు. ఇలా దాదాపు 30 ఏళ్ల పాటు సాగిన ఆంథోని మోసం ఓ తప్పిదం కారణంగా బటయపడింది. సాధరణంగా ముస్లింలు పంది మాంసాన్ని దగ్గరకు కూడా రానీవ్వరు. అలాంటిది ఆంథోని ఎలాంటి అభ్యంతరం లేకుండా పంది మాంసం తింటుండటంతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి అనుమానం వచ్చింది. దాంతో ఆంథోని మోసం బయటపడింది. జిగ్నాక్‌ను 2017 నవంబరులో పోలీసులు అరెస్టు చేశారు. విచారణ అనంతరం అతడికి 18 సంవత్సరాల జైలు శిక్ష పడింది. -
సౌదీ రాజు పాక్ పర్యటన వాయిదా
ఇస్లామాబాద్ : సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్థాన్‌లో రెండు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈనెల 16,17 తేదీల్లో ఆయన పాక్‌లో పర్యటించి పలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల పర్యటన కాస్త ఆలస్యమైనట్లు తెలిసింది. శనివారం నుంచి ప్రారంభం కావాల్సిన ఆయన విదేశీ పర్యటన ఆదివారం నుంచి యథావిధిగా కొనసాగనుందని పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. సౌదీ రాజు వెంట పెద్ద ఎత్తున వ్యాపార ప్రతినిధులు ఇక్కడకు రానున్నారు. అయితే పర్యటనలో మార్పులు, ఆలస్యంపై పాక్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని సౌదీ రాజు సల్మాన్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. దాడి జరిగిన వెంటనే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. భారత ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు వచ్చే వారం సౌదీ రాజు తమ దేశ వ్యాపార ప్రతినిధులతో భారత్‌కు రానున్నారు. -
ఖషోగ్గీ హంతకులెవరు?
అసమ్మతి ఎక్కడ తలెత్తినా అణిచేయడం, విచారణ లేకుండా ఏళ్ల తరబడి జైల్లో పెట్టడం, కొన్ని సందర్భాల్లో చంపేయడం ఒక అలవాటుగా చేసుకున్న సౌదీ అరేబియా... దేశం వెలుపల కూడా అదే బాణీ కొనసాగించి అడ్డంగా దొరికిపోయింది. పైగా తనకు అసలే పడని టర్కీ భూభాగంపై ఈ దుర్మార్గానికి ఒడిగట్టడం వల్ల అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడవలసి వచ్చింది. సౌదీ అరేబియాకు చెందిన పాత్రికేయుడు జమాల్ ఖషోగ్గీని సౌదీ నుంచి ప్రత్యేకించి వచ్చిన 15మంది సభ్యుల హంతక ముఠా చంపి, ఆయన శరీరాన్ని ముక్కలు చేసి గుట్టు చప్పుడు కాకుండా మాయం చేసింది. మొదట్లో ఖషోగ్గీ గురించి తమకేమీ తెలియదని బుకాయించిన సౌదీ ఇప్పుడి ప్పుడే దారికొస్తోంది. ఈ పాపం తమ దేశం నుంచి వెళ్లినవారి పనేనని అది ఒప్పుకోవచ్చునని మీడియా కథనాలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ప్రస్తుత సౌదీ పాలకుడు యువరాజు సల్మాన్ అత్యంత ఆప్తుడు. అందుకే మొదట్లో ట్రంప్ అయోమయంలో పడ్డారు. తొంద రపడి మాట్లాడటం సరికాదంటూ తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఖషోగ్గీ బహుశా మర ణించే ఉంటాడని, అది రుజువైతే సౌదీ నేతలకు చిక్కులు తప్పవని ఇప్పుడు చెబుతున్నారు. అంతేకాదు, వచ్చేవారం సౌదీ రాజధాని రియాద్‌లో జరగనున్న కీలకమైన పెట్టుబడుల సదస్సుకు వెళ్లొద్దని దేశంలో ఒత్తిళ్లు రావడంతో అంగీకరించక తప్పలేదు. అమెరికాతో పాటు తాము కూడా సదస్సును బహిష్కరిస్తున్నామని బ్రిటన్ తెలిపింది. ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ సైతం ఇలాగే ప్రకటించాయి. సౌదీలో ఏం జరిగినా పాశ్చాత్య దేశాలు పట్టనట్టు ఉండేవి. భౌగోళికంగా పశ్చిమాసియా వాటికి అత్యంత కీలకమైన ప్రాంతం కావడం ఇందుకొక కారణం. అలాగే గల్ఫ్ దేశాల్లో అపారంగా ఉన్న చమురు నిక్షేపాలు వాటికి అవసరం. అందుకే అక్కడ నియంతృత్వ పోకడలున్నా, మానవ హక్కుల ఉల్లంఘన సాగుతున్నా అమెరికా మొదలుకొని ఏ అగ్రరాజ్యమూ నోరెత్తదు. ఏడాదిక్రితం అధికారం పగ్గాలు అందుకున్న యువరాజు సల్మాన్ సౌదీ విజన్–2030 పేరిట డాక్యుమెంటు విడు దల చేసి దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసేందుకు, అభ్యర్థులుగా నిలిచేందుకు మహిళలకు అవకాశం ఇచ్చారు. అలాగే మొన్న జూన్‌లో మహిళలు వాహనాలు నడిపేందుకు అనుమతినిచ్చారు. వీటన్నిటినీ చూపి ప్రిన్స్ సల్మాన్ గొప్ప సంస్కర్తగా పాశ్చాత్య దేశాలు కీర్తించాయి. కానీ నిరుడు అవినీతి వ్యతిరేక చర్యల పేరిట గంపగుత్తగా యువరాజులను, మంత్రులను, వ్యాపారులను ఎడాపెడా అరెస్టు చేసి జైళ్లలో పెడితే ఈ దేశాలు నోరెత్తలేదు. మహిళా ఉద్యమనేతలను అరెస్టుచేసి వారిలో అనేకులను మరణదండన పేరిట అడ్డుతొలగించుకోవడానికి ప్రిన్స్ సల్మాన్ ప్రయత్నిస్తున్నాడు. అన్నిటికన్నా ఘోరమేమంటే నిరుడు సౌదీ పర్యటనకొచ్చిన లెబనాన్ ప్రధాని సాద్ హరిరిని రెండు వారాలు బంధించి లెబనాన్‌కు వ్యతిరేకంగా ఆయనతో ప్రకటనలు ఇప్పించారు. చివరికాయన ఆ దేశం చక్రబంధంలోంచి బయటపడి నిజాలేమిటో బయటి ప్రపంచానికి చాటాడు. మొన్న మార్చిలో సౌదీ మహిళా హక్కుల కార్యకర్త లౌజైన్ అల్–హత్ను అబూదాబీలో అపహరించి విమానంలో సౌదీ తరలించి కటకటాల వెనక్కు నెట్టారు. తనకు నచ్చని దేశాలను ధూర్త దేశాలుగా ముద్రేసి ఆ దేశాలపై ఏకపక్షంగా దాడులకు దిగడం అమెరికాకు అలవాటు. తన అనుకూలురు ఏం చేసినా, ఎంత అనాగరికంగా ప్రవర్తిస్తున్నా దానికి పట్టదు. మూడేళ్లుగా సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యెమెన్‌లో బాంబు దాడులు చేస్తున్నాయి. తిరుగుబాటుదార్లను అణిచే పేరిట సాధారణ పౌరు లను పొట్టనబెట్టుకుంటున్నాయి. అయినా ఎవరూ ప్రశ్నించకపోవడాన్ని యువరాజు సల్మాన్ అలు సుగా తీసుకున్నారు. బహుశా అందుకే తన ప్రత్యర్థి దేశమైన టర్కీకి హంతకముఠాను పంపే స్థాయికి తెగించారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ నియంత పోకడల్లో యువరాజు సల్మాన్‌కి ఏమాత్రం తీసిపోరు. ఆయన కూడా అసమ్మతివాదులను రకరకాల సాకులతో జైళ్లపాలు చేస్తు న్నారు. అయితే వారిద్దరికీ బద్ధవైరం. తాను కత్తిగట్టిన ఖతార్‌కు టర్కీ మద్దతుగా నిలుస్తున్నదన్న దుగ్ధ సౌదీకి ఉంది. అలాగే దేశం విడిచిపారిపోయిన తన వ్యతిరేకులకు అది ఆశ్రయమిస్తున్నదన్న ఆగ్రహం ఉంది. సరిగ్గా ఈ సమయంలో ఖషోగ్గీ వ్యవహారం బయటికొచ్చింది. ఇంతకూ ఖషోగ్గీ సౌదీలో సాగుతున్న రాచరికానికి వ్యతిరేకి కాదు. కాకపోతే సల్మాన్ అను సరిస్తున్న విధానాలు మారాలని ఆయన వాదించేవారు. అలాగే యెమెన్‌లో సాగిస్తున్న అధర్మ యుద్ధాన్ని మానుకోవాలని సూచించేవారు. ఇలా విమర్శించడం యువరాజుకు నచ్చలేదు. ఆయన గారికి తన రాతలు ఆగ్రహం తెప్పిస్తున్నాయని, దేశంలో ఉంటే ప్రమాదమని భావించి ఖషోగ్గీ నిరుడు అమెరికా వెళ్లిపోయారు. తన ప్రియురాల్ని పెళ్లాడటానికి నిర్ణయించుకుని అందుకవసర మైన పత్రాల కోసం ఆయన ఈ నెల మొదట్లో టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌కు వెళ్లడం, ఆ తర్వాత 15మంది వ్యక్తులు ఆ కార్యాలయంలోకి ప్రవేశించడం సీసీటీవీ దృశ్యాల్లో నమో దైంది. అనంతరం ఆ 15మంది అక్కడినుంచి నిష్క్రమించిన దృశ్యాలున్నాయి తప్ప ఖషోగ్గీ జాడ లేదు. ఇదే టర్కీకి పెద్ద ఆయుధమైంది. ఇప్పుడు దేశాల మధ్య సంబంధాలకు లాభాలు, ప్రయో జనాలే పునాది. విలువల గురించి ఎవరికీ పట్టింపు లేదు. ఈ ఉదంతంపై ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విమర్శలతో అమెరికా ఇప్పటికైతే కఠినంగా వ్యవహరిస్తామని చెబుతోంది. కానీ పూర్తిగా నమ్మడానికి లేదు. అది మున్ముందు టర్కీ, సౌదీలకు రాజీ కుదిర్చి దీన్ని కప్పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. విలువలు వదిలి నిరంకుశ, అనాగరిక వ్యవస్థల్ని భుజాన వేసుకుని ఊరేగే దేశాలు న్నంత కాలం ఖషోగ్గీలాంటివారు మాయమవుతూనే ఉంటారు. అందుకే ఈ కేసులోని సూత్ర ధారులకూ, పాత్రధారులకూ శిక్ష పడేవరకూ అందరూ అప్రమత్తంగా ఉండాలి. -
ఖషోగ్గీ ఎమయ్యాడో తెలీదు: సౌదీ రాజు
దుబాయ్: వాషింగ్టన్ పోస్ట్ కంట్రిబ్యూటర్ జమాల్ ఖషోగ్గీ కనిపించకుండా పోవడంపై సౌదీ అరేబియాపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో రాజు సల్మాన్ రంగంలోకి దిగారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. ఖషోగ్గీ ఏమమయ్యాడో తమకు తెలియదని చెప్పారు. సౌదీ పౌరుడైన ఖషోగ్గీ అమెరికాలోఉంటూ సౌదీపై వాషింగ్టన్ పోస్ట్‌లో విమర్శనాత్మక కథానాలు రాసేవారు. ఈ నెల 2న టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ ఎంబసీలోపలికెళ్లిన తర్వాత ఆయన కనిపించకుండా పోవడం, ఆయనను సౌదీనే హత్య చేసిందని ఆరోపణలు రావడం తెల్సిందే. సౌదీలో రాజకుటుంబానికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే వ్యతిరేక పోస్ట్‌లు కూడా వస్తున్నప్పటికీ వాటిని సౌదీ ప్రభుత్వం వెంటనే తొలగిస్తోందని తెలుస్తోంది. ఇస్తాంబుల్‌లోని సౌదీ ఎంబసీలో ఖషోగ్గీ అదృశ్యంపై టర్కీ పోలీసులు అక్కడ సోదాలు చేశారు. -
చమురు ఉత్పత్తి పెంచనున్న సౌదీ
వాషింగ్టన్: ఇరాన్‌పై ఆంక్షల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడకుండా సౌదీ అరేబియా ఉత్పత్తిని పెంచనుంది. ఈ దిశగా తను చేసిన విజ్ఞప్తిని సౌదీ అరేబియా రాజు సల్మాన్ అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇప్పుడే సౌదీ రాజు సల్మాన్‌తో మాట్లాడాను. పరిస్థితిని ఆయనకు వివరించాను. వెనిజులా, ఇరాన్లలో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా కొరతను తట్టుకునేలా ఉత్పత్తి పెంచాలని కోరాను. ఈ కొరత దాదాపు 20 లక్షల డాలర్లు ఉండొచ్చు. ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నా.. రాజు అంగీకారం తెలిపారు’ అని ట్రంప్ వెల్లడించారు. ఇటీవల.. చమురు ఉత్పత్తి ధరలు పెంచేందుకు ఒపెక్ దేశాలు నిర్ణయం తీసుకోవడంతోపాటు ఉత్పత్తిని పెంచాలని కూడా నిర్ణయించాయి. ఒపెకేతర దేశమైన రష్యా కూడా ఉత్పత్తిని పెంచేందుకు అంగీకరించింది. ‘ఒపెక్ దేశాల నిర్ణయంతో పెరగనున్న డిమాండ్‌కు సరైన ఉత్పత్తి ఉంటుందని భావిస్తున్నాం’ అని సౌదీ ఇంధన మంత్రి ఖలీద్ అల్ ఫలే పేర్కొన్నారు. -
రూ. 2 వేల కోట్లు.. ఎడాపెడా పంచేశారు!
ఒకవైపు యూరోపియన్ దేశాలు డబ్బు లేక అల్లాడుతూ పొదుపు చర్యలు పాటిస్తుంటే.. సౌదీ అరేబియాలో మాత్రం అక్కడి కొత్త రాజుగారు తన ప్రజలకు డబ్బులు విరివిగా పంచిపెడుతున్నారు. ఓ చిన్న రాజాజ్ఞ వేసి.. వందల కోట్ల డాలర్లను సామాన్య ప్రజలకు ఇచ్చేస్తున్నారు. తమ రాజు సల్మాన్ ఔదార్యం చూసి సౌదీ అరేబియా ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ దేశంలో వాళ్లంతా ప్రస్తుతం పార్టీలు చేసుకుంటున్నారని రియాద్‌కు చెందిన వ్యాపారవేత్త జాన్ చెప్పారు. సౌదీ రాజు ఇలా ఇస్తున్న బహుమతుల విలువ దాదాపు 2 వేల కోట్ల రూపాయలు ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఆఫ్రికాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన నైజీరియా వార్షిక బడ్జెట్ కంటే కూడా సౌదీ అరేబియాలో ఇప్పుడు ఎక్కువ డబ్బు ఉంది. గత నెలలో సౌదీ అరేబియా రాజుగా సింహాసనం అధిష్ఠించిన సల్మాన్.. ప్రభుత్వ సంస్థలను రద్దుచేసేస్తున్నారు, మంత్రులను పీకి పారేస్తున్నారు. అయితే మరోవైపు ప్రజలకు మాత్రం విరివిగా డబ్బులు పంచిపెట్టేస్తున్నారు. -
సౌదీ రాజు అబ్దుల్లా మృతి
రియాద్: సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్(90) మరణించారు. డిసెంబర్ నుంచి న్యుమోనియాతో బాధపడుతూ కొన్నాళ్లుగా కృత్రిమ శ్వాసపై ఉన్న ఆయన స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంటకు తుది శ్వాస విడిచారు. శుక్రవారం మధ్యాహ్న ప్రార్థనల అనంతరం ఆయన మృతదేహాన్ని సౌదీ రాజధాని రియాదలోని ఇమామ్ టర్కీ బిన్ అబ్దుల్లా మసీదులో ఖననం చేశారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్ తదితర దేశాల అధినేతలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అబ్దుల్లా మృతితో ఆయన సవతి సోదరుడు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్(79) సౌదీ అరేబియా తదుపరి రాజుగా బాధ్యతలు స్వీకరించారు. వారి మరో సోదరుడు ముఖ్రిన్ బిన్ ను యువరాజుగా రాజకుటుంబం ప్రకటించింది. అబ్దుల్లా, సల్మాన్, ముఖ్రిన్.. ఈ ముగ్గురు సౌదీ రాజ్యాన్ని స్థాపించిన రాజు అబ్దుల్ అజీజ్(ఇబన్ సౌద్) కుమారులు. ఇస్లాం జన్మస్థలమైన సౌదీ అరేబియాలో ముస్లింలంతా ఐక్యంగా ఉండాలని రాజుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సల్మాన్ పిలుపునిచ్చారు. 2012 నుంచి సల్మాన్ యువరాజుగా, రక్షణ మంత్రిగా వ్యవహరించారు. 1996 నుంచే అనధికారిక రాజు.. 2005లో సౌదీ రాజుగా అధికారికంగా నియమితుడైనప్పటికీ.. 1996 నుంచే అబ్దుల్లా దేశ పాలనాబాధ్యతలను నిర్వర్తించారు. 1996లో నాటి రాజు ఫాద్ గుండెపోటుకు గురవడంతో అబ్దుల్లా పాలనాపగ్గాలను చేపట్టారు. అంతకుముందు 1982నుంచి ఆయన సౌదీ యువరాజుగా ఉన్నారు. ముస్లిం సంప్రదాయ వాదం బలంగా ఉన్న సౌదీని సంస్కరణలతో ఆధునికత దిశగా తీసుకెళ్లేందుకు అబ్దుల్లా విశేష కృషి చేశారు. అగ్రరాజ్యం అమెరికాకు మధ్యప్రాచ్యంలో విశ్వసనీయ నేస్తంగా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనకు భారత్ అంటే అభిమానం. భారత్‌ను ఆయన తన రెండో గృహమని కూడా ప్రకటించారు. 2006లో భారత గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రణబ్, మోదీ నివాళులు.. అబ్దుల్లా మృతికి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, కేరళ సీఎం చాందీ సంతాపం వ్యక్తం చేశారు. భారత్ ఒక మంచి స్నేహితుడిని కోల్పోయిందని ప్రణబ్ పేర్కొన్నారు. కొన్నిరోజుల క్రితమే ఆ దేశ యువరాజుతో అబ్దుల్లా ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశానని మోదీ గుర్తు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా సంతాపం తెలిపారు.