ఇస్లామాబాద్ : సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్థాన్‌లో రెండు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈనెల 16,17 తేదీల్లో ఆయన పాక్‌లో పర్యటించి పలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల పర్యటన కాస్త ఆలస్యమైనట్లు తెలిసింది. శనివారం నుంచి ప్రారంభం కావాల్సిన ఆయన విదేశీ పర్యటన ఆదివారం నుంచి యథావిధిగా కొనసాగనుందని పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది.
సౌదీ రాజు వెంట పెద్ద ఎత్తున వ్యాపార ప్రతినిధులు ఇక్కడకు రానున్నారు. అయితే పర్యటనలో మార్పులు, ఆలస్యంపై పాక్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని సౌదీ రాజు సల్మాన్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. దాడి జరిగిన వెంటనే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. భారత ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు వచ్చే వారం సౌదీ రాజు తమ దేశ వ్యాపార ప్రతినిధులతో భారత్‌కు రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment