
ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు చావుదెబ్బ
సైనికంగా, రాజకీయంగా, భావోద్వేగపరంగా విజయం
మోదీ మాట నిలబెట్టుకున్నారు: ప్రభుత్వ వర్గాలు
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌తో నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణలో సైనికంగా, రాజకీయంగా, మానసిక భావోద్వేగపరంగా భారత్ పూర్తిగా పైచేయి సాధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం అభిప్రాయపడ్డాయి. పాకిస్తాన్ గడ్డ పైనుంచి భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు సాగిస్తే శిక్ష తప్పదన్న స్పష్టమైన సంకేతాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారని తెలిపాయి. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు, కీలక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేయడం తెలిసిందే.
లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన తొమ్మిది స్థావరాలు నామరూపాల్లేకుండా పోయాయి. ముష్కరులను మట్టిలో కలిపేస్తామన్న మాటను మోదీ నిలబెట్టుకున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉగ్రవాదుల ఇళ్లల్లో దూరి మరీ బుద్ధి చెప్తామని హెచ్చరించినట్టుగానే పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కశీ్మర్ (పీఓకే)లో సైన్యం చేసిన దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదులూల ఉన్నారు. ముష్కరులను వారి సొంత గడ్డపైనే దెబ్బకొట్టడంలో విజయం సాధించామయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
‘సింధూ’ ఒప్పందం నిలిపివేతపై పాక్ హాహాకారాలు
పాక్ ఉగ్రవాదులను వారి సొంత దేశంలోనే మట్టుబెట్టడగలమన్న సంగతి ఆపరేషన్ సిందూర్ ద్వారా తేలిపోయింది. ఇది భారతీయులకు భావోద్వేగభరిత విజయంగా పరిగణిస్తున్నారు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా చావుదెబ్బ కొట్టగలమని సైన్యం నిరూపించింది. పహల్గాం దాడి తర్వాత సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేసింది. దానిపై పాక్ హాహాకారాలు చేసినా పట్టించుకోలేదు. 1960 నుంచి నిరాటంకంగా కొనసాగుతూ వచ్చిన ఒ ప్పందం ఒక్కసారిగా ఆగిపోవడం పాక్‌కు మింగుడుపడడం లేదు. ప్రపంచ దేశాలకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. ఇది భారత్‌కు అతిపెద్ద రాజకీయ విజయమని నిపుణులు పేర్కొంటున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపేదాకా ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తామని పాకిస్తాన్‌కు భారత్ తేల్చిచెప్పింది.