మియామి : 30 ఏళ్లుగా సౌదీ యువరాజుగా చెలామణి అవుతూ.. జనాలను మోసం చేసి దాదాపు 55 కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన వ్యక్తి గుట్టు రట్టయ్యింది. వివరాలు.. ఫ్లోరిడాకు చెందిన ఆంథోని గిగ్నాక్(48) తనను తాను సౌదీ యువరాజు.. ఖలీద్ బిన్ అల్ సౌద్‌గా పరిచయం చేసుకుని ఫ్లొరిడాలోని మియామీ ఫిషర్ ద్వీపంలో నివసిస్తూండేవాడు. నకిలీ డిప్లొమాటిక్ లైసెన్స్ ప్లేట్‌తో ఫెరారీలో తిరిగేవాడు. అతడి చుట్టూ నకిలీ డిప్లొమాటిక్ కాగితాలు పట్టుకొని పెద్ద సంఖ్యలో బాడీగార్డులు ఉండేవారు. తాను సౌదీ యువరాజునని.. వ్యాపార నిమిత్తం ఇలా వచ్చానని.. ఆసక్తి ఉన్నవారు తనతో కలిసి వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చని నమ్మబలికాడు.
ఇతని మాటలు నిజమేనని నమ్మిన జనాలు.. ఆంథోనికి బ్యాంకు ఖాతాలో డబ్బు వేయడమే కాక ఖరీదైన కానులను కూడా ఇచ్చేవారు. ఇలా జనాలను మోసం చేసి ఇప్పటి వరకు దాదాపు 8 మిలియన్ అమెరికన్ డాలర్లను( ఇండియన్ కరెన్సీలో రూ.55,66,36,800) వసూలు చేశాడు. ఈ మొత్తాన్ని ప్రైవేటు జెట్లు, బోట్ రేసింగ్‌లు, డిజైనర్ దుస్తులకు ఖర్చు చేస్తూ.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుండేవాడు. ఇలా దాదాపు 30 ఏళ్ల పాటు సాగిన ఆంథోని మోసం ఓ తప్పిదం కారణంగా బటయపడింది.
సాధరణంగా ముస్లింలు పంది మాంసాన్ని దగ్గరకు కూడా రానీవ్వరు. అలాంటిది ఆంథోని ఎలాంటి అభ్యంతరం లేకుండా పంది మాంసం తింటుండటంతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి అనుమానం వచ్చింది. దాంతో ఆంథోని మోసం బయటపడింది. జిగ్నాక్‌ను 2017 నవంబరులో పోలీసులు అరెస్టు చేశారు. విచారణ అనంతరం అతడికి 18 సంవత్సరాల జైలు శిక్ష పడింది.
Comments
Please login to add a commentAdd a comment