pork
-
పదేళ్లుగా ఆ అమ్మాయి అలానే మాంసం తినడంతో..!
మాంసాహారులు చేపలు, కోడి, మటన్ వంటివి తినేటప్పుడు పరిశుభ్రత పాటించాలి. అలాగే బాగా ఉడికించి తినాలి లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తుంటారు. అయితే ఒక అమ్మాయి పదేళ్లుగా పచ్చి మాంసమే తిని భయానక వ్యాధిని బారిన పడింది. పచ్చి మాంసం తింటేనే ఆ వ్యాధి బారిన పడతారని వైద్యుల చెబుతున్నారు. ఇంతకీ ఆ యువతికి వచ్చిన వ్యాధేంటీ? పచ్చి మాంస వల్లనే వచ్చిందా..?అసలేం జరిగిందంటే..చైనాలోని డెకిన్ కౌంటీ యుబెంగ్ విలేజ్‌కు చెందిన యువతికి పచ్చి మాంసం తినే అలవాటు ఉంది. పదేళ్లుగా పంది మాంసాన్ని పచ్చిగానే తినేదట. దీని కారణంగా ఆమె అనారోగ్యం బారినపడి ఇబ్బందిపడింది. ఒక్క నిమిషం కూడా స్థిమితంగా ఉండలేని విధంగా ఉంది. చూడటానికి పైకి బాగానే ఉన్న ఏదో నిస్సత్తువ అవగాస్తున్నట్లుగా ఉండేది. దీంతో వైద్యులను సంప్రదించింది. వైద్య పరీక్షలు నిర్వహించి సిస్టిసెర్కోసిస్ అనే వ్యాధి బారిన పడినట్లు నిర్థారించారు. అంతేగాదు వైద్యులు ఆమెకు ఎంఆర్ఐ, సీటీ స్కాన్ నిర్వహించి చూడగా.. ఆమె శరీరంలోని ఉన్న పరాన్నజీవుల సంఖ్యను చూసి కంగుతిన్నారు. ఆ యువతి శరీర భాగాలన్నింటిలో కళ్లు, కాళ్లు, చేతులు విడిచిపెట్టకుండా ఎక్కడపడితే అక్కడ టేప్‌వార్మ్ గుడ్లతో నిండి ఉండటాన్ని చూసి విస్తుపోయారు. దీంతో ఆమె ఆహారపు శైలి గురించి ప్రశ్నించగా తనకు యుక్త వయసు నుంచి పచ్చి పంది మాంసం తినే అలవాటు ఉందని వెల్లడయ్యింది. ఇలా పచ్చిమాంసం తింటేనే భయానకమైన సిస్టిసెర్కోసిస్ అనే వ్యాధి బారినపడతారని అన్నారు వైద్యులు. ఈ వ్యాధి శరీరంలోని ఏ భాగానికైనా వస్తుందని అన్నారు. దీని కారణంగా ఉబ్బిన కళ్లు, రెటీనా నుంచి రక్తం, మూర్చ, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యల ఎదర్కొంటారని చెప్పారు. అంతేగాదు దీని ప్రభావం మెదడుపై ఎక్కువగా ఉంటుందని చెప్పారు. పరిస్థితి విషమిస్తే మరణం కూడా సంభవిస్తుందని చెప్పుకొచ్చారు. అలాకాకుండా శరీరంలోకి చేరిన ఈ పరాన్నజీవులు చనిపోతే ఇన్ఫ్లమేటరీ సమస్యలు, తీవ్రమైన అలెర్జీ లాంటి సమస్యలు వస్తాయన్నారు. ఇలా సిస్టిసెర్కోసిస్ బారినపడి ఏడాదికి ఐదు వేలకు పైగా మరణిస్తున్నట్లు వెల్లడించారు న్యూరాలజీ విభాగానికి చెందిన చీఫ్ ఫిజిషియన్ ప్రొఫెసర్ మెంగ్ కియాంగ్ వైద్యులు.(చదవండి: 'స్లీప్‌మాక్సింగ్': నిద్రను కూడా కొనుక్కునే దుస్థితా..?) -
ఉడకని మాంసం తింటే ఏం జరుగుతుందో తెలుసా..!
ఆ మాంసం సరిగి ఉడికించకుండా తింటే ఎలాంటి ఇన్ఫెక్షన్లు వస్తాయో వివరించాడు అమెరికా వైద్యుడు. సీటీ స్కాన్ తీసి మరీ వెల్లడించారు. మాంసం సరిగ్గా ఉడక్కపోతే దానిలో ఉండే పరాన్నజీవి ఎలాంటి ఇన్ఫెక్షన్లు కలిగిస్తుందో తెలిపారు. ఇంతకీ ఏ మాంసం గురించి అంటే..కొందరూ పంది మాంసం ఇష్టంగా తింటారు. ముఖ్యంగా మన దేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా పందిమాంసం తింటుంటారు. అయితే ఈ మాంసాన్ని గనుక సరిగా ఉడికించపోతే అంతే సంగతులని చెబుతున్నారు వైద్యులు. మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తింటే ఎలాంటి రోగాలు వస్తాయో..?.. సిటీస్కాన్ చేసి మరి వివరించాడు అమెరికా వైద్యుడు డాక్టర్ సామ్ ఘాలి. సరిగా ఉడికించిన పంది మాంసం తిన్న రోగి కాళ్లలో పరాన్న జీవి ఎలాంటి ఇన్ఫెక్షన్లు కలిగిస్తుందో సీటీస్కాన్ తీసి మరి వెల్లడించారు. అతడికి సిస్టోసెర్కోసిస్ ఉన్నట్లు నిర్థారించారు. దీన్ని వైద్య పరిభాషలో టేప్‌వార్మ్ ముట్టడి అని అంటారని చెప్పారు. అలాంటి ఇన్ఫెక్షన్ని నివారించాలంటే.. పంది మాంసాన్ని సరిగా ఉడికించి తినాలని అన్నారు. సిస్టిసెర్కోసిస్ అనేది టైనియా సోలియం లార్వా తిత్తుల వల్ల వస్తుందని అన్నారు. దీన్ని టేప్ వార్మ్(బద్దెపురుగులు) అని పిలుస్తారని చెప్పారు. అంటే పంది శరీరం పర్నాజీవిలా బద్దె పురుగులకు ఆశ్రయం ఇస్తుంది. అందువల్ల ఈ మాంసాన్ని తీసుకునేవాళ్లు బాగా ఉడికించి తీసుకోవాలి. లేదంటే ఈ బద్దెపురుగులు తిత్తులుగా మారి పలు రకాల ఇన్ఫెక్షన్ల బారినపడేలా చేస్తుంది. ఈ తిత్తులు జీర్ణశయాంతర ప్రేగులలో పరిపక్వ వయోజన టేప్‌వార్మ్‌లుగా పరిణామం చెందుతాయి. ఈ పరిస్థితిని ఇంటెస్టినల్ టైనియాసిస్ అంటారు" అని డాక్టర్ ఘాలి వివరించారు. అంతేగాదు ఈ వయోజన టేప్‌వార్మ్‌లు గుడ్లను తొలగిస్తాయి, అవి మానవ మలంలోకి విసర్జించబడతాయని తెలిపారు. అందువల్లే రోగులు సిస్టిసెర్కోసిస్ సిండ్రోమ్ బారిన పడతారని చెప్పారు. (చదవండి: మిస్ యూనివర్స్ నైజీరియాగా దక్షిణాఫ్రికా బ్యూటీ!) -
మనిషికి పంది కిడ్నీ మార్పిడితో సత్ఫలితాలు
విశాఖపట్నం: పంది కిడ్నీ మనిషికి మార్పిడితో సత్ఫలితాలను ఇస్తుందని న్యూయార్క్‌లో గల లాంగోన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇన్స్టిట్యూట్కు చెందిన డాక్టర్ వశిష్ట తాతపూడి అన్నారు. బీచ్‌రోడ్డు రాడిసన్ బ్లూలో ఏపీ సొసైటీ ఫర్ నెఫ్రాలజీ రాష్ట్ర సదస్సులో భాగంగా రెండో రోజు ఆదివారం అమెరికా నుంచి వర్చువల్‌గా ఆయన మాట్లాడారు. పిగ్ టు హ్యూమన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై మాట్లాడుతూ జన్యుపరంగా మార్పు చెందిన పంది కిడ్నీని మనిషికి మార్పిడి చేశామన్నారు. రెండు నెలల వరకు కిడ్నీ బాగా పనిచేసిందన్నారు. ప్రస్తుతం ఉన్న అవయవాల కొరత భవిష్యత్తులో మరింత పెరగవచ్చని, అందువల్ల ఇటువంటి ప్రయోగాలు మరిన్ని చేయాల్సి ఉందని వివరించారు. అనంతరం శ్యామ్ బన్సల్, వివేక్ కూటే మాట్లాడుతూ కిడ్నీ మ్యాచింగ్ టెక్నిక్, జత చేసిన అవయవ మార్పిడిపై ప్రసంగించారు. డాక్టర్లు నికేష్ కామత్, గోపికా మీనన్, ఆశీష్కు ఉత్తమ సైంటిఫిక్ పేపర్ అవార్డులు అందజేశారు. సదస్సులో ఏపీ నలుమూలల నుంచి 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. -
టీ–17 పందులు సూపర్.. నెలకు లక్షకు పైగా నికరాదాయం!
తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించే సీమ పందుల పెంపకంపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న పందుల పరిశోధనా కేంద్రం ఎస్వీవీయూ టీ–17 రకం సీమ పందుల జాతిని అభివృద్ధి చేసింది. శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ ఈ జాతి పందులను పెంచుతున్న రైతులు అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. యువ రైతులు సైతం ఆసక్తి చూపుతుండటం విశేషం. పంది మాంసాన్ని ‘పోర్క్’ అంటారు. కండ (హమ్), వారు (బాకన్), సాసెజ్, నగ్గెట్స్, ప్యాట్టీస్, పోర్క్ పచ్చడి, బ్యాంబూ పోర్క్ల రూపంలో సీమ పంది ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నారు. వీటిలో మాంసకృత్తులు, విటమిన్లతో పాటు ఓలిక్ లినోలిక్ ఫాటీయాసిడ్స్ అధికంగా ఉంటాయి. పిల్లలు, వృద్ధులు, క్రీడాకారులకు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి సీమ పంది మాంసం ఉత్పత్తులు ఉపయోగపడతాయని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. పందుల పెంపకాన్ని లాభదాయకం చేయడంతో పాటు కొత్త పంది రకాల అభివృద్ధికి తిరుపతిలోని పరిశోధనా కేంద్రం గడిచిన ఐదు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తోంది. స్థానికంగా లభ్యమయ్యే వివిధ వ్యవసాయ ఉప ఉత్పత్తులను 10–15 శాతం వరకు పందుల దాణా తయారీకి వినియోగించి ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. పందులకు సంక్రమించే మేంజ్ అనే చర్మ వ్యాధికి డోరోమెక్టిన్ అనే ఔషధాన్ని కనిపెట్టారు. 20 శాతం మంది పోర్క్ తింటున్నారు దేశంలో 9 లక్షల మిలియన్ల పందులుంటే, ఆంధ్రప్రదేశ్‌లో 92 వేలున్నాయి. దేశంలో 22 శాతం మంది, రాష్ట్రంలో 11 శాతం మంది పందుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ మాంసాహారుల్లో పంది మాంసం తినే వారి సంఖ్య 18–20 శాతం ఉన్నారని అంచనా. ఏటా రూ.18 కోట్ల విలువైన 894 టన్నుల పంది మాంసం ఉత్పత్తులు మన దేశం నుంచి వియత్నాం, కాంగో, జర్మనీ వంటి దేశాలకు ఎగుమతవుతున్నాయి. ఒక పంది... 80 పిల్లలు... ఐదేళ్ల క్రితం విదేశీ జాతి పందులతో దేశవాళీ పందులను సంకరపరిచి ఎస్వీవీయూ టీ–17 (75 శాతం లార్జ్‌వైట్ యార్క్‌షైరు, 25 శాతం దేశవాళీ పంది) అనే కొత్త పంది జాతిని అభివృద్ధి చేశారు. వాడుకలో సీమ పందిగా పిలిచే వీటి పెంపకంపై రైతులు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. జీవిత కాలంలో ఈతకు 8 చొప్పున 10 ఈతల్లో 80 పిల్లలను పెడుతుంది. పుట్టినప్పుడు 1.12 కేజీలుండే ఈ పంది పిల్ల వధించే సమయానికి 85 కేజీల వరకు బరువు పెరుగుతుంది. పది ఆడ, ఒక మగ పందిని కలిపి ఒక యూనిట్‌గా వ్యవహరిస్తారు. కేంద్రం నుంచి అభివృద్ధి చేసిన పందులకు సంబంధించి 400 యూనిట్లను రైతులకు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఏపీలో రైతుల దగ్గర 20 వేల పైగా ఈ రకం పందులు పెరుగుతున్నాయి. ఒక యూనిట్ దేశవాళీ పందుల పెంపకం ద్వారా సగటున ఏటా రూ. 3–3.5 లక్షల ఆదాయం వస్తుంటే, ఈ రకం సీమ పందుల పెంపకం ద్వారా రూ. 6–7 లక్షల ఆదాయం వస్తుంది. మాంసం రూపంలో అమ్మితే రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. – పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి నెలకు రూ. లక్షకు పైగా నికరాదాయం నేనో సాప్ట్వేర్ ఉద్యోగిని. రెండేళ్లుగా పశుపోషణ చేస్తున్నా. గతేడాది తిరుపతి పందుల పరిశోధనా కేంద్రం నుంచి 15 పిల్లలతో పాటు 5 పెద్ద పందులను కొని పెంపకం చేపట్టా. హాస్టళ్లు, హోటళ్ల నుంచి సేకరించే పదార్థాలను పందులకు మేపుతున్నాం. చూడి/పాలిచ్చే పందులకు విడిగా దాణా పెడతున్నా. నెలకు రూ. 49,400 ఖర్చవుతోంది. మాంసం ద్వారా రూ.1.40 లక్షలు, పంది పిల్లల అమ్మకం ద్వారా రూ.13,500 ఆదాయం వస్తోంది. ఖర్చులు పోను నెలకు రూ.లక్షకు పైగా నికరాదాయం వస్తోంది. పందుల పెంపకం లాభదాయకంగా ఉంది. – సుంకర రామకృష్ణ, నూజివీడు, ఎన్టీఆర్ జిల్లా మార్కెటింగ్‌పై అవగాహన కల్పిస్తే... నేనో సాప్ట్వేర్ ఉద్యోగిని. పందుల పెంపకంపై ఆసక్తితో తిరుపతి పరిశోధనా కేంద్రంలో శిక్షణ పొందాను. ఈ పరిశ్రమ ఎంతో లాభసాటిగా ఉందని గ్రహించాను. త్వరలో పందుల పెంపకం యూనిట్ పెడుతున్నా. మార్కెటింగ్‌పై మరింత అవగాహన కల్పిస్తే యువత ఆసక్తి కనపరుస్తారు. –జి.మహేష్, గాజులమండ్యం, తిరుపతి జిల్లా పొరుగు రాష్ట్రాల రైతుల ఆసక్తి శాస్త్రీయ పద్ధతుల్లో సీమ పందుల పెంపకంపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాం. ఎస్వీవీయూ టీ–17 జాతి పందులకు మంచి డిమాండ్ ఉంది. పొరుగు రాష్ట్రాల రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. పెంపకంలో మెళకువలతో పాటు వీటికి సంక్రమించే వ్యాధులను గుర్తించి తగిన చికిత్స, నివారణా చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పంది మాంసం ఉత్పత్తుల్లో ఉండే పోషక విలువలపై వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ కే.సర్జన్‌రావు (99890 51549), పరిశోధనా సంచాలకులు, ఎస్వీవీయూ, తిరుపతి రైతులకు నిరంతర శిక్షణ తిరుపతిలో పందుల పరిశోధనా కేంద్రం ఏర్పాటై 50 ఏళ్లవుతోంది. తాజాగా విడుదల చేసిన ఎస్వీవీయూ టీ–17 రకం పంది జాతికి మంచి డిమాండ్ ఉంది. దేశవాళీ పందులతో పోల్చుకుంటే రెట్టింపు ఆదాయం వస్తుంది. వీటి పెంపకంపై ఆసక్తి గల యువతకు, రైతులకు ఏడాది పొడవునా శిక్షణ ఇస్తున్నాం. –డాక్టర్ ఎం.కళ్యాణ్ చక్రవర్తి (94405 28060), సీనియర్ శాస్త్రవేత్త, అఖిల భారత పందుల పరిశోధనా కేంద్రం, తిరుపతి -
ముంబైలో దారుణం..అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేసి..
ముంబై: ముంబైలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఒక సముహం ఒక వ్యక్తి కారుని ఢీ కొట్టి, అతనిపై కత్తితో దాడి చేశారు. దీంతో ఆప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సమీపంలోని సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఆ వీడియోలో ఒక పిక్ అప్ వ్యాన్ మరో వాహనాన్ని ఢీ కొట్టినట్లు కనిపించింది. ఆ తర్వాత ఒక గుంపు వాహనంలోని ఓ వ్యక్తిని బయటకు లాగి కత్తితో పదేపదే దాడి చేసి గాల్లో కత్తిని ఊపుతూ.. అక్కడ ఉన్న వారందర్నీ భయబ్రాంతులకు గురి చేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తిని ఎవరూ కాపడే ప్రయత్నం చేయనీయకుండా ఆ దుండగులు గాల్లో కాల్పులు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం దాడికి గురైన వ్యక్తిని హర్జిత్‌సింగ్‌గా గుర్తించారు పోలీసులు. నిందితులు దాడి అనంతరం ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కత్తిని, ఆ కారుని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివాదం పంది మాంస వ్యాపారంతో ముడిపడి ఉండవచ్చని అన్నారు. వారంతా పందిమాంస వ్యాపారులని చెప్పారు. ఐతే అదే వాహనంలోని ఇతర వ్యక్తులపై దుండగు దాడి జరగనట్లు సీసీటీవీ విజ్యువల్స్ చూపిస్తున్నాయని చెప్పారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: షాకింగ్ వీడియో: ఆడుకుంటూ బావిలో పడ్డ బాలుడు.. మూడు నిమిషాల్లోనే!) -
30 ఏళ్ల మోసం.. బయటపెట్టిన పంది మాంసం
మియామి : 30 ఏళ్లుగా సౌదీ యువరాజుగా చెలామణి అవుతూ.. జనాలను మోసం చేసి దాదాపు 55 కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన వ్యక్తి గుట్టు రట్టయ్యింది. వివరాలు.. ఫ్లోరిడాకు చెందిన ఆంథోని గిగ్నాక్(48) తనను తాను సౌదీ యువరాజు.. ఖలీద్ బిన్ అల్ సౌద్‌గా పరిచయం చేసుకుని ఫ్లొరిడాలోని మియామీ ఫిషర్ ద్వీపంలో నివసిస్తూండేవాడు. నకిలీ డిప్లొమాటిక్ లైసెన్స్ ప్లేట్‌తో ఫెరారీలో తిరిగేవాడు. అతడి చుట్టూ నకిలీ డిప్లొమాటిక్ కాగితాలు పట్టుకొని పెద్ద సంఖ్యలో బాడీగార్డులు ఉండేవారు. తాను సౌదీ యువరాజునని.. వ్యాపార నిమిత్తం ఇలా వచ్చానని.. ఆసక్తి ఉన్నవారు తనతో కలిసి వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చని నమ్మబలికాడు. ఇతని మాటలు నిజమేనని నమ్మిన జనాలు.. ఆంథోనికి బ్యాంకు ఖాతాలో డబ్బు వేయడమే కాక ఖరీదైన కానులను కూడా ఇచ్చేవారు. ఇలా జనాలను మోసం చేసి ఇప్పటి వరకు దాదాపు 8 మిలియన్ అమెరికన్ డాలర్లను( ఇండియన్ కరెన్సీలో రూ.55,66,36,800) వసూలు చేశాడు. ఈ మొత్తాన్ని ప్రైవేటు జెట్లు, బోట్ రేసింగ్‌లు, డిజైనర్ దుస్తులకు ఖర్చు చేస్తూ.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుండేవాడు. ఇలా దాదాపు 30 ఏళ్ల పాటు సాగిన ఆంథోని మోసం ఓ తప్పిదం కారణంగా బటయపడింది. సాధరణంగా ముస్లింలు పంది మాంసాన్ని దగ్గరకు కూడా రానీవ్వరు. అలాంటిది ఆంథోని ఎలాంటి అభ్యంతరం లేకుండా పంది మాంసం తింటుండటంతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి అనుమానం వచ్చింది. దాంతో ఆంథోని మోసం బయటపడింది. జిగ్నాక్‌ను 2017 నవంబరులో పోలీసులు అరెస్టు చేశారు. విచారణ అనంతరం అతడికి 18 సంవత్సరాల జైలు శిక్ష పడింది. -
'బీఫ్, ఫోర్క్ ఇంట్లోనో, షాదీఖానాలోనో తినండి'
హైదరాబాద్: బీఫ్, ఫోర్క్ ఏమైనా తినండి కానీ, ఇంట్లోనో, షాదీఖానాలోనో తినండని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. యూనివర్సిటీలో విద్యార్థులు ఉన్నది చదువుకునేందుకని తెలిపారు. యూనివర్సిటీలో రాజకీయాలు చేయడం సరికాదని ఆయన అన్నారు. మరో వైపు ఓయూ క్యాంపస్‌లో బీఫ్ ఫెస్టివల్, గోపూజలకు అనుమతి లేదని ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 10వ తేదీన 'బీఫ్ ఫెస్టివల్' తల పెట్టిన విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని కొన్ని వర్గాలు చెబుతుండగా... ఎలాగైనా అడ్డుకుని తీరుతామని మరో వర్గంవారు స్పష్టం చేస్తున్నారు. ఇందుకుగాను ఎవరికివారు మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. -
పోస్ట్‌మార్టం రిపోర్టు పట్టించింది
ముంబై: ముంబైలోని గణపతి పాటిల్ నగర్ లో దారుణం జరిగింది. క్షణికావేశంలో అన్నను దారుణంగా హత్య చేశాడు. కానీ దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోస్ట్ మార్టం నివేదిక అతడిని పట్టించింది. రాం, అనిల్ ఇద్దదూ అన్నదమ్ములు. రాం భార్య, కూతురు, సోదరుడితో కలిసి నివసిస్తున్నాడు. రాత్రి భోజనంలో పంది మాంసం విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య స్వల్ప వివాదం రేగింది. ఆగ్రహంతో అన్నపై దాడి చేసి తీవ్రంగా ఒకట్టాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అతణ్ని ఆసుపత్రికి తరలించకుండా చూస్తూ ఉరుకున్నాడు. చివరికి తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతూ రాం మరణించాడు. దీంతో తన అన్న ఆత్మహత్య చేసుకున్నాడంటూ తమ్ముడు అనిల్ తాపీగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మొదట ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. ఈ నివేదికలో అతడిది ఆత్మహత్య కాదు.. హత్య అని తేలింది. మృతుని తల వెనుకభాగంలో బలమైన గాయాలున్నాయని, దీంతో అది హత్యేనని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అనిల్ కుటుంబసభ్యులను విచారించారు. ఈ క్రమంలో రాం కూతురు అనిత తండ్రి, బాబాయిల మధ్య ఘర్షణ జరిగిందని తెలిపింది. బాబాయ్ అనిల్, తన తండ్రి తలపై తీవ్రంగా కొట్టాడని చెప్పింది. దీంతో నిందితుడు నేరాన్ని అంగీకరించక తప్పలేదు. -
సీఎం ఇంటికి పందిమాంసం పంపిస్తాం...
బెంగళూరు: ‘సీఎం ఇంటికి ఒక కేజీ పందిమాంసం పంపిస్తాం, తినమనండి’ అంటూ శ్రీరామసేన వ్యవస్థాపకులు ప్రమోద్ ముతాలిక్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మండిపడ్డారు. విజయపురలో పర్యటన సందర్భంగా ఆయన నిన్న ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గొడ్డు మాంసం తింటానని సిద్ధరామయ్య అంటున్నారు, అయితే పంది మాంసం కూడా తింటారా? శ్రీరామసేన నుంచి ఒక కేజీ పందిమాంసం పంపిస్తాం తినమనండి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో గోరక్షణ చేస్తామని సిద్ధరామయ్య ప్రకటించారు. అయితే ఇప్పుడు మాత్రం గోరక్షణ అంశాన్ని గాలికొదిలేసి, గోమాంస భక్షణ పై అనవసర రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ సిద్ధరామయ్య పై ప్రమోద్ ముతాలిక్ విమర్శలు గుప్పించారు.