సీఎం ఇంటికి పందిమాంసం పంపిస్తాం... | pramod muthalik takes on siddaramaiah | Sakshi

సీఎం ఇంటికి పందిమాంసం పంపిస్తాం...

Nov 4 2015 8:57 AM | Updated on Sep 3 2017 12:00 PM

సీఎం ఇంటికి పందిమాంసం పంపిస్తాం...

సీఎం ఇంటికి పందిమాంసం పంపిస్తాం...

‘సీఎం ఇంటికి ఒక కేజీ పందిమాంసం పంపిస్తాం, తినమనండి’ అంటూ శ్రీరామసేన వ్యవస్థాపకులు ప్రమోద్ ముతాలిక్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మండిపడ్డారు.

బెంగళూరు: ‘సీఎం ఇంటికి ఒక కేజీ పందిమాంసం పంపిస్తాం, తినమనండి’ అంటూ శ్రీరామసేన వ్యవస్థాపకులు ప్రమోద్ ముతాలిక్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మండిపడ్డారు. విజయపురలో పర్యటన సందర్భంగా ఆయన నిన్న ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గొడ్డు మాంసం తింటానని సిద్ధరామయ్య అంటున్నారు, అయితే పంది మాంసం కూడా తింటారా? శ్రీరామసేన నుంచి ఒక  కేజీ పందిమాంసం పంపిస్తాం తినమనండి.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో గోరక్షణ చేస్తామని సిద్ధరామయ్య ప్రకటించారు. అయితే ఇప్పుడు మాత్రం గోరక్షణ అంశాన్ని గాలికొదిలేసి, గోమాంస భక్షణ పై అనవసర రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ సిద్ధరామయ్య పై ప్రమోద్ ముతాలిక్ విమర్శలు గుప్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement