Pramod Muthalik
-
ఏ కుక్క చచ్చిపోయినా.. ఆయనే బాధ్యుడా?
సాక్షి, బెంగళూరు : హిందూత్వ సంస్థ శ్రీరామ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముథాలిక్ ప్రముఖ పాత్రికేయురాలు గౌరీలంకేశ్ హత్యకేసును ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గౌరీలంకేశ్‌ను ఆయన కుక్కతో పోల్చారు. గౌరీలంకేశ్ హత్యపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని కొందరు తప్పుపడుతున్నారని, కర్ణాటకలో ఏ కుక్క చనిపోయినా ఆయన బాధ్యత వహించాలా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గౌరీలంకేశ్ హత్య విషయంలో శ్రీరామసేనకు ఎలాంటి సంబంధం లేదు. గౌరీలంకేశ్‌ను చంపేందుకు హిందూ సంస్థలు కుట్ర చేశాయని ప్రతి ఒక్కరూ అంటున్నారు. కానీ, కాంగ్రెస్ పాలనలో ఉన్న సమయంలో మహారాష్ట్రలో రెండు హత్యలు, కర్ణాటకలో రెండు హత్యలు జరిగాయి. ఈ ఘటనల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించడం లేదు. అందుకు బదులుగా ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన ఎందుకు మాట్లాడటం లేదు? అని అంటున్నారు. కర్ణాటకలో ఏ కుక్క చనిపోయినా.. మోదీ బాధ్యత వహించాలా’ అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో తాను నేరుగా గౌరీలంకేశ్‌ను కుక్కతో పోల్చలేదని ప్రమోద్ ముథాలిక్ వివరణ ఇచ్చారు. -
న్యాయం గుడ్డిదేగానీ మరీ ఇంతగా......
-
న్యాయం గుడ్డిదేగానీ మరీ ఇంతా......
సాక్షి, బెంగళూరు: మంగళూరులోని ఓ పబ్‌లో ఓ యువకుల బృందం దౌర్జన్యంగా యువతుల జుట్టు పట్టుకొని కొట్టడం, వారు కింద పడిపోవడం, పారిపోయేందుకు ప్రయత్నించడం లాంటి దశ్యాలు 2009, జనవరి 24వ తేదీన దేశవ్యాప్తంగా టీవీ ఛానళ్లలో విస్తృతంగా ప్రసారం అయ్యాయి. దెబ్బలు తిన్న మహిళలు పబ్‌కు మద్యం సేవించేందుకు వచ్చిన వినియోగదారులని, దౌర్జన్యంగా దెబ్బలు కొట్టిన వారంతా కర్ణాటకలో హిందూ సంస్థగా పేరుపొందిన ‘శ్రీరామ్ సేన’ సభ్యులని పోలీసులతోపాటు సమాజమూ గుర్తించింది. మహిళలు పబ్‌లకు వెళ్లడమంటే సంస్కృతిపై దాడి చేయడమేనని, అందుకనే వారికి తగిన శాస్తి జరిగిందంటూ శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ నాడు సంఘటనను సమర్థిస్తూ వ్యాఖ్యానించారు. ఈ దాడికి పాల్పడిందీ తామేనంటూ ఇటు శ్రీరామ్ సేన, అంటూ భజరంగ్ దళ్ సంస్థలు పోటా పోటీగా ప్రకటించుకున్నాయి. తమ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని, ఇందులో భజరంగ్ దళ్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ శ్రీరామ్ సేన జిల్లా కన్వీనర్ కుమార్ మాలేమర్ బహిరంగ ప్రకటన చేశారు. ఈ సంఘటనను జాతీయ మహిళా కమిషన్‌కు కూడా తీవ్రంగా పరిగణించడంతో పోలీసులు కేసు నమోదు చేసి 30 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ప్రమోద్ ముతాలిక్ కూడా ఉన్నారు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు ఆయన్ని పార్టీలోకి ఎలా తీసుకుంటారని బీజేపీ జాతీయ నాయకత్వం ప్రశ్నించడంతో బీజేపీ కర్ణాటక శాఖ వెంటనే ఆయన్ని పార్టీ నుంచి తొలగించింది. దాదాపు 9 ఏళ్ల అనంతరం ఈ సంఘటనపై మంగళూరులోని ఫస్ట్‌క్లాస్ కోర్టుకు చెందిన థర్డ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ (12.03.18) సోమవారం నాడు తీర్పు చెప్పారు. నిందితులు నిర్దోషులంటూ 30 పేజీల తీర్పును చదివారు. ‘ఈ కేసులో నిందితుల నేరాన్ని రుజువు చేసేందుకు దర్యాప్తు అధికారులు మహిళా వినియోగదారులను కోర్టు ముందు ప్రవేశపెట్టలేక పోయారు. చార్జిషీటులో వారిని సాక్షులుగా చూపలేదు. ఈ కేసులో మహిళా వినియోగదారులే బాధితులు. వారే మంచి సాక్షులు కూడా అవుతారు. వారిని దర్యాప్తు అధికారులు విచారించి ఉంటే నిజం బయటకు వచ్చేది. ఈ కేసులో ఫొటోలు, వీడియోలు చాలా ముఖ్యమైన సాక్ష్యాధారాలు. వాటిని దర్యాప్తు అధికారులు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టలేక పోయారు. ఇలాంటి సాక్ష్యాధారలు చూపక పోవడం ఈ కేసుకు ప్రాణాంతకంగా మారింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో చాలా జాప్యం జరిగింది. జాప్యానికి కారణాలు కూడా వివరించలేదు. ఓ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఓ జడ్జిమెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో జరిగే జాప్యం కూడా కేసు మరణానికి కారణం అవుతుంది. నేరం రుజువు కానందున ఈ కేసులో నిందితులంతా నిర్ధోషులే’ అంటూ కోర్టు తీర్పు చెప్పింది. ‘మమ్మల్ని వ్యతిరేకించిన వారికి, మమ్మల్ని గూండాలని దూషించిన వారికి ఈ తీర్పు ఓ సమాధానం’ అని తీర్పు పట్ల ప్రమాద్ ముతాలిక్ వ్యాఖ్యానించగా, న్యాయం గుడ్డిదని తెలుసుకానీ, మరింత గుడ్డిదని తెలియదని కొందర సామాజిక కార్యకర్తలు వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు పాఠం చదివితే చాలు, ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేకుండానే న్యాయం ఏమిటో పాఠకులకు బోధపడుతుంది. దర్యాప్తులో ఘోరంగా విఫలమైన దర్యాప్తు అధికారులను దోషిగా ఎందుకు ప్రకటించలేదో ఎందరికి అర్థం అవుతుంది? -
ఫోన్ లో బెదిరిస్తున్నారు: ముతాలిక్
హుబ్లీ: చంపుతామంటూ ఫోన్ లో తనకు బెదిరింపులు వస్తున్నాయని శ్రీరామ సేన నాయకుడు ప్రమోద్ ముతాలిక్ తెలిపారు. ఆమిర్ ఖాన్ వ్యాఖ్యల గురించి, ఇస్లాం గురించి మాట్లాడవద్దంటూ తనను ఫోన్ లో బెదిరించారని వెల్లడించారు. గతంలోనూ తనకు బెదింపులు వచ్చాయని చెప్పారు. అయితే ఇలాంటి బెదిరింపులకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. హిందూమత పరిరక్షణ కోసం పనిచేయకుండా తనను ఎవరూ ఆపలేరని అన్నారు. 2009లో మంగళూరులోని ఓ పబ్‌లో మహిళలపై శ్రీరామ్‌సేన దాడి చేయడంతో ముతాలిక్ వార్తల్లోకెక్కారు. అప్పటినుంచి సంచలన ప్రకటనలతో వివాదస్పదుడిగా మారారు. 'అత్యాచారానికి పాల్పడిన వారి చేతులు నరికేయండి. వారి కోర్టు ఖర్చులు మేమే భరిస్తాం' అంటూ గతంలో ఆయన పిలుపునిచ్చారు. గోవా ప్రభుత్వం గతేడాది శ్రీరామసేనపై నిషేధం విధించింది. కాగా, దేశంలో మత అసహనం పెరిగిపోతోందని వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ పై హిందుత్వ వాదులు మండిపడుతున్నారు. శివసేన నేతలయితే ఆమిర్ ఖాన్ ను చెంపదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. -
సీఎం ఇంటికి పందిమాంసం పంపిస్తాం...
బెంగళూరు: ‘సీఎం ఇంటికి ఒక కేజీ పందిమాంసం పంపిస్తాం, తినమనండి’ అంటూ శ్రీరామసేన వ్యవస్థాపకులు ప్రమోద్ ముతాలిక్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మండిపడ్డారు. విజయపురలో పర్యటన సందర్భంగా ఆయన నిన్న ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గొడ్డు మాంసం తింటానని సిద్ధరామయ్య అంటున్నారు, అయితే పంది మాంసం కూడా తింటారా? శ్రీరామసేన నుంచి ఒక కేజీ పందిమాంసం పంపిస్తాం తినమనండి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో గోరక్షణ చేస్తామని సిద్ధరామయ్య ప్రకటించారు. అయితే ఇప్పుడు మాత్రం గోరక్షణ అంశాన్ని గాలికొదిలేసి, గోమాంస భక్షణ పై అనవసర రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ సిద్ధరామయ్య పై ప్రమోద్ ముతాలిక్ విమర్శలు గుప్పించారు. -
సేనను నిషేధించడం వెనుక ఉద్దేశమేంటి?
పనాజి: వివాదస్పద హిందూ సంస్థ శ్రీరామసేనను గోవాలో నిషేధించడాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ తప్పుబట్టారు. డ్రగ్ లార్డ్స్, పబ్ మాఫియా ఆదేశాల మేరకు తమ సంస్థను నిషేధించారని ఆయన ఆరోపించారు. గోవాలో శ్రీరామసేనను నిషేధించడం వెనుక ఉద్దేశమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో అసలు శ్రీరామసేన లేదని, ఒక్క సభ్యుడు ఇందులో లేరని ఆయన వెల్లడించారు. గోవాలో తాము ఏమైనా దాడులు చేశామా అని ప్రశ్నించారు. అసాంఘిక శక్తులను రాష్ట్రంలోకి అనుమతిస్తూ, దేశభక్తులపై నిషేధం విధిస్తారా అని నిలదీశారు. నిషేధం ఎత్తివేత కోసం కోర్టును ఆశ్రయిస్తామని ముతాలిక్ చెప్పారు. శ్రీరామసేనను నిషేధిస్తున్నట్టు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ శాసనసభలో బుధవారం ప్రకటన చేశారు. -
గోవా క్లబ్బుల్లో పొట్టి స్కర్టులపై నిషేధం!!
గోవాలోని నైట్‌క్లబ్బుల్లో అమ్మాయిలు పొట్టి పొట్టి స్కర్టులు వేసుకురావడాన్ని నిషేధించాలని అక్కడ ప్రజాపనుల శాఖ మంత్రి సుదీన్ దావలికర్ కోరుతున్నారు. వాళ్లిలా పొట్టి స్క్రర్టులు వేసుకుని రావడం గోవా సంస్కృతికి ముప్పుగా మారిందని ఆయన పనజిలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా విలేకరులతో వ్యాఖ్యానించారు. ఎక్కడపడితే అక్కడ ఇలా పొట్టి స్కర్టులు వేసుకు రావడం గోవా సంస్కృతికి ఏమాత్రం సరిపోదని, ఇలాగే కొనసాగితే ఏమైపోవాలని.. తాము దీన్ని అంగీకరించేది లేదని మంత్రి అన్నారు. దీన్ని ఆపి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేకాదు.. అదే సమయంలో ఆ హోటల్లో ఓ అమ్మాయి అలాంటి పొట్టి స్కర్టు వేసుకొచ్చిందని చెబుతూ చూపించారు. ఆమె తల్లి కూడా అక్కడే ఉండటంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మంత్రిగారికి సూచించింది. శ్రీరామసేన (ఎస్ఆర్ఎస్) అధినేత ప్రమోద్ ముతాలిక్ కూడా ఆమధ్య ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆయన గోవాలో కూడా తమ సంస్థ శాఖను ప్రారంభించాలని అనుకుంటున్నారు. గోవాలో డ్రగ్స్, సెక్స్, నగ్నగ్వాలను నిరోధించి.. భారతీయ సంస్కృతిని కాపాడాలన్నది తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ముతాలిక్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని దావాలికర్ చెప్పారు. -
ప్రమోద్ ముతాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు : బాబ్రీ మసీదుతో పాటే వారణాసి, మధురైలోని మసీదులనూ కూల్చాల్చి ఉందని, అయితే ఆ లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదని శ్రీరామ సేన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈరోజు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఆ రెండు మసీదులు కూల్చివేసేందుకు శ్రీరామసేన ప్రణాళికను రచిస్తోందన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి కోబ్రాపోస్ట్ వెబ్సైట్ చెప్పింది అక్షరాల సత్యమని పేర్కొన్నారు. పథకం ప్రకారం జరిగిన ఆ ఘటనలో తాను కూడా సభ్యుడనన్నారు. సంఘ్ పరివార్ ముందస్తు పథకంలో భాగంగానే బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగిందని, దీనిని బీజేపీ తప్పక ఒప్పుకోవాల్సిందేనన్నారు. శ్రీరాముని సేవ కోసం తాను ఉరికంబం ఎక్కడానికైనా సిద్ధంగా ఉన్నానని, ఈ విషయంలో ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. -
ముతాలిక్ ఆహ్వానం ముమ్మాటికీ తప్పే:అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: ఓ మహిళపై దాడికి పాల్పడిన శ్రీరామ్‌సేన సంస్థ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ ను బీజేపీలోకి ఆహ్వానించడం మూమ్మాటికీ తప్పేనని ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. ఈ తరహా తప్పులు పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ముతాలిక్ పార్టీలోకి చేరిన మరుక్షణమే వివాదం నెలకొనడంతో పార్టీలో అలజడి మొదలైంది. దీంతో ముతాలిక్ ను పార్టీలో చేరిన కొన్ని గంటలకే తప్పించారు. ఈ తరహా ఘటనలు తిరిగి జరగకుండా చూసుకోవాలని ఆయన పార్టీ నేతలకు హితవు పలికారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించినప్పట్నుంచి దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. కొత్త వారిని పార్టీలో చేర్చుకోబోయే ముందు వారి గురించి క్షణ్ణంగా తెలుసుకోవాలన్నారు. ముతాలిక్ ను ఉద్దేశిస్తూ జైట్లీ ఏమన్నారంటే.. 2009 లో ఒక మహిళపై దాడి పాల్పడిన శ్రీరామ్ సేన్ అధ్యక్షుడు ముతాలిక్ ను బీజేపీలోకి ఆహ్వానించడం ఒక తప్పు. ఇది భారతీయ సంప్రదాయానికి వ్యతిరేకం. కర్ణాటకలో నిన్న జరిగిన ఈ పరిణామం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. ఈ తరహా తప్పులు ఇకనైనా పునారవృతం కాకుండా చూసుకోవాలి. -
'జస్వంత్ ను కాదని.. గుండాలకు బీజేపీ రెడ్ కార్పెట్'
జమ్మూ: బీజేపీ, జస్వంత్ సింగ్ వివాదంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తలదూర్చారు. సీనియర్ నేత జస్వంత్ సింగ్ కు టికెట్ నిరాకరించడంపై ఓమర్ అబ్దుల్లా తీవ్ర ధ్వజమెత్తారు. జస్వంత్ తోపాటు మరికొంత మంది జంటిల్మన్ నేతలకు టికెట్లు నిరాకరించి పార్టీలో గుండాలకు పెద్ద పీట వేస్తున్నారని ఓమర్ ఆరోపించారు. రాజీకీయాల్లో సంభవిస్తున్న ఇలాంటి సంఘటనల పట్ల భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని.. లేకపోతే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. జంటిల్మన్ లాంటి జస్వంత్ కు టికెట్ నిరాకరించి.. గుండాలాంటి ప్రమోద్ ముతాలిక్ కు రెడ్ కార్పెట్ వేశారు. బీజేపీ నిర్ణయాలు ప్రమాదకరంగా ఉన్నాయి అని ఓమర్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. పార్టీలోకి చేరిన వెంటనే శ్రీరామ్ సేన చీఫ్ ముతాలిక్ సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. జస్వంత్ సింగ్ కు బీజేపీ టికెట్ నిరాకరించడంపై సొంత పార్టీ నుంచే అనేక విమర్శలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. బర్మార్ లోకసభ నియోజకవర్గం నుంచి జస్వంత్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
'మంగుళూరు పబ్ ఘటనను మర్చిపోయారు'
బెంగళూరు: మంగుళూరు పబ్ ఘటనను ప్రజలు మర్చిపోయారని, ఆ సంఘటన దురదృష్టకరమని వివాదాస్పద శ్రీరామ్‌సేన సంస్థ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ అన్నారు. తనను బీజేపీలో చేర్చుకోవాలని కోరారు. తనకు ఇచ్చిన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం తీసుకన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాము నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతున్నామని తెలిపారు. బీజేపీ తనను అమావనించిందని వాపోయారు. ఇటువంటి చర్యలు తప్పుడు సందేశాలు పంపే అవకాశముందని అన్నారు. తనపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలకు తోసిపుచ్చారు. ప్రమోద్ ముతాలిక్ను ఆదివారం పార్టీలో చేర్చుకున్న కమలనాథులు.. విపక్షంతోపాటు, స్వపక్షం నుంచీ విమర్శలు రావడంతో గంటల వ్యవధిలోనే నిర్ణయం మార్చుకుని బయటకు పంపేశారు. 2009లో మంగళూరులోని ఓ పబ్‌లో మహిళలపై శ్రీరామ్‌సేన దాడి చేయడంతో ముతాలిక్ వార్తల్లోకెక్కారు. -
కేజ్రీవాల్ ఎవరినైనా కరుస్తారు: మొయిలీ
న్యూఢిల్లీ: బీజేపీలో ఇప్పుడు ఏకఛత్రాదిపత్యం నడుస్తోందని కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ విమర్శించారు. బీజేపీకి ఒకటే ఎజెండా ఉందని, అది ఆర్ఎస్ఎస్ అజెండా అని అన్నారు. జశ్వంత్ సింగ్ నిరాకరించిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ను బీజేపీలో చేర్చుకుని, బయటకు గెంటడాన్ని ఆయన తప్పుబట్టారు. బీజేపీలో స్థిరత్వం లోపించిందని, ఆ పార్టీ తీసుకునే నిర్ణయాల్లో పొంతన కుదరడం లేదని ఎద్దేవా చేశారు. గ్యాస్ ధర పెంపు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తనపై చేసిన ఆరోపణలు వాస్తవదూరమైనవి మొయిలీ కొట్టిపారేశారు. కేబినెట్ నిర్ణయాన్నే తాము అమలు చేశామని తెలిపారు. వీధిలో ఎవరినైనా కేజ్రీవాల్ కరవగలరంటూ ఘాటుగా విమర్శించారు. -
రమ్మన్నారు.. పొమ్మన్నారు!
హుబ్లీ/న్యూఢిల్లీ: పబ్‌లో మహిళలపై దాడి కేసులో అరెస్టయిన వివాదాస్పద శ్రీరామ్‌సేన సంస్థ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ (51) వ్యవహారంలో బీజేపీ నాలుక్కరుచుకుంది. ఆయనను ఆదివారం పార్టీలో చేర్చుకున్న కమలనాథులు.. విపక్షంతోపాటు, స్వపక్షం నుంచీ విమర్శలు రావడంతో గంటల వ్యవధిలోనే నిర్ణయం మార్చుకుని బయటకు పంపేశారు. ముతాలిక్ బీజేపీ కర్ణాటక చీఫ్ ప్రహ్లాద్ జోషి తదితరుల సమక్షంలో హుబ్లీలో తొలుత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత అంబికాసోనీ స్పందిస్తూ.. మహిళల హక్కులపై బీజేపీ వైఖరేమిటో ముతాలిక్ చేర్చుకోవడంతో బట్టబయలైందన్నారు. మహిళలపై దాడికి నేతృత్వం వహించిన ముతాలిక్ నేరస్తుడని సీపీఎం నేత బృందా కారత్ విమర్శించారు. ముతాలిక్ను చేర్చుకోవడంపై బీజేపీ నేత, గోవా సీఎం మనోహర్ పారికర్ అభ్యంతరం తెలిపారు. దీంతో ముతాలిక్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ చీఫ్ రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ ప్రహ్లాద్ జోషీని ఆదేశించారు. ముతాలిక్ను చేర్చుకోవడంపై రాష్ట్ర కమిటీ కేంద్ర నాయకత్వాన్ని సంప్రదించలేదు కనుక నిర్ణయాన్ని ఆమోదించలేదని బీజేపీ నేత నిర్మలా సీతారామన్ చెప్పారు. 2009లో మంగళూరులోని ఓ పబ్‌లో మహిళలపై శ్రీరామ్‌సేన దాడి చేయడంతో ముతాలిక్ వార్తల్లోకెక్కారు.