గోవాలోని నైట్క్లబ్బుల్లో అమ్మాయిలు పొట్టి పొట్టి స్కర్టులు వేసుకురావడాన్ని నిషేధించాలని అక్కడ ప్రజాపనుల శాఖ మంత్రి సుదీన్ దావలికర్ కోరుతున్నారు. వాళ్లిలా పొట్టి స్క్రర్టులు వేసుకుని రావడం గోవా సంస్కృతికి ముప్పుగా మారిందని ఆయన పనజిలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా విలేకరులతో వ్యాఖ్యానించారు. ఎక్కడపడితే అక్కడ ఇలా పొట్టి స్కర్టులు వేసుకు రావడం గోవా సంస్కృతికి ఏమాత్రం సరిపోదని, ఇలాగే కొనసాగితే ఏమైపోవాలని.. తాము దీన్ని అంగీకరించేది లేదని మంత్రి అన్నారు. దీన్ని ఆపి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.
అంతేకాదు.. అదే సమయంలో ఆ హోటల్లో ఓ అమ్మాయి అలాంటి పొట్టి స్కర్టు వేసుకొచ్చిందని చెబుతూ చూపించారు. ఆమె తల్లి కూడా అక్కడే ఉండటంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మంత్రిగారికి సూచించింది. శ్రీరామసేన (ఎస్ఆర్ఎస్) అధినేత ప్రమోద్ ముతాలిక్ కూడా ఆమధ్య ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆయన గోవాలో కూడా తమ సంస్థ శాఖను ప్రారంభించాలని అనుకుంటున్నారు. గోవాలో డ్రగ్స్, సెక్స్, నగ్నగ్వాలను నిరోధించి.. భారతీయ సంస్కృతిని కాపాడాలన్నది తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ముతాలిక్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని దావాలికర్ చెప్పారు.
గోవా క్లబ్బుల్లో పొట్టి స్కర్టులపై నిషేధం!!
Published Tue, Jul 1 2014 12:28 PM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM
Advertisement
Advertisement