ముతాలిక్ ఆహ్వానం ముమ్మాటికీ తప్పే:అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: ఓ మహిళపై దాడికి పాల్పడిన శ్రీరామ్‌సేన సంస్థ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ ను బీజేపీలోకి ఆహ్వానించడం మూమ్మాటికీ తప్పేనని ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. ఈ తరహా తప్పులు పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ముతాలిక్ పార్టీలోకి చేరిన మరుక్షణమే వివాదం నెలకొనడంతో పార్టీలో అలజడి మొదలైంది. దీంతో ముతాలిక్ ను పార్టీలో చేరిన కొన్ని గంటలకే తప్పించారు. ఈ తరహా ఘటనలు తిరిగి జరగకుండా చూసుకోవాలని ఆయన పార్టీ నేతలకు హితవు పలికారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించినప్పట్నుంచి దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. కొత్త వారిని పార్టీలో చేర్చుకోబోయే ముందు వారి గురించి క్షణ్ణంగా తెలుసుకోవాలన్నారు.
ముతాలిక్ ను ఉద్దేశిస్తూ జైట్లీ ఏమన్నారంటే..
2009 లో ఒక మహిళపై దాడి పాల్పడిన శ్రీరామ్ సేన్ అధ్యక్షుడు ముతాలిక్ ను బీజేపీలోకి ఆహ్వానించడం ఒక తప్పు.
ఇది భారతీయ సంప్రదాయానికి వ్యతిరేకం.
కర్ణాటకలో నిన్న జరిగిన ఈ పరిణామం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు.
ఈ తరహా తప్పులు ఇకనైనా పునారవృతం కాకుండా చూసుకోవాలి.