భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మెట్రో, పది లక్షల ఉద్యోగాలు, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామంటూ హామీల వర్షం కురిపించారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో కలిసి అరుణ్ జైట్లీ బీజేపీ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. శనివారం బీజేపీ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రాజకీయాల అజెండాను మార్చేసింది. ప్రజల కనీస జీవన ప్రమాణాలు పెంచడమే తమ అజెండా అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో అరుణ్ జైట్లీ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం గుపించారు. ‘2003 వరకూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ ఏడాది ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అప్పుడు ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే పట్టణాల్లో కూడా తాగు నీరు, రోడ్లు, కరెంట్ వంటి కనీస సౌకర్యాలు లేవు’ అని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే మౌళిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తామన్నారు. గ్వాలియార్, జబల్‌పూర్ నగరాలకు మెట్రో రైలు సౌకర్యం తీసుకోస్తామని హామీ ఇచ్చారు. ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికలకు స్కూటీ ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో మిని స్మార్ట్ సిటిని నిర్మిస్తామన్నారు.
ఈ నెల 28న మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11న ఫలితాలు ప్రకటిస్తారు. 2003 నుంచి మధ్యప్రదేశ్‌లో బీజేపీ పార్టీనే అధికారంలో ఉంది. నాలుగో సారి అధికారం కోసం ఆ పార్టీ శ్రమిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment