
భార్యలకన్నా భర్తల ఆదాయాలే ఎక్కువగా ఉండే సందర్భాలు చాలానే చూశాం. కానీ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం విచిత్రంగా హోం మినిస్టర్ల (భార్యల) ఆదాయమే భర్తలకన్నా ఎక్కువగా ఉంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మొదలుకుని.. ఎమ్మెల్యేల వరకు చాలా మంది విషయాల్లో వారి ఇంటి మహాలక్ష్మి పర్సే చాలా బరువుగా కనబడుతోంది. ఇందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు.
బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులూ ఈ జాబితాలో ఉన్నారు. ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఈసీకి సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా ఈ వివరాలు బయటకొచ్చాయి. ఇందులో సీఎం చౌహాన్ ఆస్తి రూ.19.7 లక్షలు కాగా.. ఆయన భార్య సాధనా సింగ్ ఆస్తి రూ.37.94లక్షలుగా పేర్కొన్నారు. కొందరు మంత్రుల ఆదాయం కన్నా భార్యల ఆదాయం మూడురెట్లుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment