'జస్వంత్ ను కాదని.. గుండాలకు బీజేపీ రెడ్ కార్పెట్'
'జస్వంత్ ను కాదని.. గుండాలకు బీజేపీ రెడ్ కార్పెట్'
Published Mon, Mar 24 2014 3:53 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
జమ్మూ: బీజేపీ, జస్వంత్ సింగ్ వివాదంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తలదూర్చారు. సీనియర్ నేత జస్వంత్ సింగ్ కు టికెట్ నిరాకరించడంపై ఓమర్ అబ్దుల్లా తీవ్ర ధ్వజమెత్తారు. జస్వంత్ తోపాటు మరికొంత మంది జంటిల్మన్ నేతలకు టికెట్లు నిరాకరించి పార్టీలో గుండాలకు పెద్ద పీట వేస్తున్నారని ఓమర్ ఆరోపించారు. రాజీకీయాల్లో సంభవిస్తున్న ఇలాంటి సంఘటనల పట్ల భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని.. లేకపోతే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
జంటిల్మన్ లాంటి జస్వంత్ కు టికెట్ నిరాకరించి.. గుండాలాంటి ప్రమోద్ ముతాలిక్ కు రెడ్ కార్పెట్ వేశారు. బీజేపీ నిర్ణయాలు ప్రమాదకరంగా ఉన్నాయి అని ఓమర్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. పార్టీలోకి చేరిన వెంటనే శ్రీరామ్ సేన చీఫ్ ముతాలిక్ సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. జస్వంత్ సింగ్ కు బీజేపీ టికెట్ నిరాకరించడంపై సొంత పార్టీ నుంచే అనేక విమర్శలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. బర్మార్ లోకసభ నియోజకవర్గం నుంచి జస్వంత్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
Advertisement
Advertisement