ప్రమోద్ ముతాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు | Pramod Muthalik controversial comments | Sakshi
Sakshi News home page

ప్రమోద్ ముతాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు

Published Sat, Apr 5 2014 9:23 PM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM

ప్రమోద్ ముతాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రమోద్ ముతాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు

బెంగళూరు :  బాబ్రీ మసీదుతో పాటే వారణాసి, మధురైలోని మసీదులనూ కూల్చాల్చి ఉందని, అయితే ఆ లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదని శ్రీరామ సేన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈరోజు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఆ రెండు మసీదులు కూల్చివేసేందుకు శ్రీరామసేన ప్రణాళికను రచిస్తోందన్నారు.

బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి కోబ్రాపోస్ట్ వెబ్‌సైట్ చెప్పింది అక్షరాల సత్యమని పేర్కొన్నారు. పథకం ప్రకారం జరిగిన ఆ ఘటనలో తాను కూడా సభ్యుడనన్నారు. సంఘ్ పరివార్ ముందస్తు పథకంలో భాగంగానే బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగిందని, దీనిని బీజేపీ తప్పక ఒప్పుకోవాల్సిందేనన్నారు.  శ్రీరాముని సేవ కోసం తాను ఉరికంబం ఎక్కడానికైనా సిద్ధంగా ఉన్నానని, ఈ విషయంలో ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement