అయోధ్య: బాబ్రీ మసీదు– రామ జన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టు తీర్పుమేరకు అయోధ్య జిల్లాలో రామమందిరానికి 22 కిలోమీటర్ల దూరంలో ధన్నీపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి సంబంధించిన తుది అనుమతులను అయోధ్య డివిజనల్ కమిషనర్ మంజూరుచేశారు.
అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ అధీనంలోని ఐదెకరాల ఆ స్థలాన్ని ఇండో–ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్)కు బదిలీచేసే అంశం రెండేళ్లుగా పెండింగ్‌లో ఉండటంతో మసీదు నిర్మాణం ఆలస్యమైంది. కొద్దిరోజుల్లో భూ బదిలీ పత్రాలను ఐఐసీఎఫ్‌కు అందిస్తామని అయోధ్య డివిజినల్ కమిషనర్ గౌరవ్ దయాళ్ శనివారం చెప్పారు. ఏప్రిల్ 21న నిర్మాణపనుల ప్రారంభ తేదీని ఖరారుచేస్తామని ఐఐసీఎఫ్ కార్యదర్శి అథర్ హుస్సేన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment