permissions granted
-
‘అయోధ్య’ మసీదు నిర్మాణానికి తుది అనుమతులు
అయోధ్య: బాబ్రీ మసీదు– రామ జన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టు తీర్పుమేరకు అయోధ్య జిల్లాలో రామమందిరానికి 22 కిలోమీటర్ల దూరంలో ధన్నీపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి సంబంధించిన తుది అనుమతులను అయోధ్య డివిజనల్ కమిషనర్ మంజూరుచేశారు. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ అధీనంలోని ఐదెకరాల ఆ స్థలాన్ని ఇండో–ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్)కు బదిలీచేసే అంశం రెండేళ్లుగా పెండింగ్‌లో ఉండటంతో మసీదు నిర్మాణం ఆలస్యమైంది. కొద్దిరోజుల్లో భూ బదిలీ పత్రాలను ఐఐసీఎఫ్‌కు అందిస్తామని అయోధ్య డివిజినల్ కమిషనర్ గౌరవ్ దయాళ్ శనివారం చెప్పారు. ఏప్రిల్ 21న నిర్మాణపనుల ప్రారంభ తేదీని ఖరారుచేస్తామని ఐఐసీఎఫ్ కార్యదర్శి అథర్ హుస్సేన్ చెప్పారు. -
‘నిబంధనలకు లోబడే లోకేష్ పాదయాత్ర జరగాలి’
సాక్షి, చిత్తూరు: టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టబోయే యువ గళం పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జిల్లా ఎస్పీ రిషాంత్ స్పష్టం చేశారు. సోమవారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనలకు లోబడే పాదయాత్ర జరగాలని నారా లోకేష్, టీడీపీ క్యాడర్‌కు సూచించారు. ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని ఎస్పీ రిషాంత్ సూచించారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 27వ తేదీ నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. మరోవైపు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా వేధిస్తోందంటూ యెల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసుకుంటోంది టీడీపీ. -
ఈటీఎఫ్‌లకూ మార్జిన్ ట్రేడింగ్ సదుపాయం
న్యూఢిల్లీ: ఈక్విటీ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు)కు సైతం మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ (ఎంటీఎఫ్) అందించేందుకు బ్రోకర్లకు సెబీ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం గ్రూప్ 1 కింద ఉన్న కొన్ని స్టాక్స్‌కు మాత్రమే మార్జిన్ ట్రేడింగ్ సదుపాయాన్ని బ్రోకర్లు అందిస్తున్నారు. ఒక పెట్టుబడి సాధనంగా ఈటీఎఫ్‌లో ఉండే పారదర్శకత, వైవిధ్యం, తక్కువ వ్యయాల వంటి అనుకూలతలను పరిగణనలోకి తీసుకుని ఈటీఎఫ్ యూనిట్లను సైతం అర్హత కలిగిన సెక్యూరిటీగా పరిగణిస్తున్నట్టు సెబీ తెలిపింది. అలాగే, ఎంటీఎఫ్‌కు తనఖాగా ఈ యూనిట్లను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. క్లయింట్లు బ్రోకర్లకు చెల్లించే ముందస్తు మార్జిన్ అన్నది నగదు, నగదు సమానం లేదా ఈక్విటీ ఈటీఎఫ్‌ల రూపంలో ఉండొచ్చని సెబీ తెలిపింది. ఇందుకు సంబంధించి బోర్డు ఆమోదంతో కూడిన ఒక విధానం ఉండాలని స్పష్టం చేసింది. అంటే ఒక విధంగా గ్రూప్1లో ఉన్న స్టాక్స్‌కు సమానంగా ఈక్విటీ ఈటీఎఫ్‌లను ఇక మీదట పరిగణించనున్నారు. -
Shraddha murder case: నార్కో పరీక్షలకు కోర్టు అనుమతి
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడైన అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు నార్కో పరీక్షలు నిర్వహించడానికి గురువారం ఢిల్లీ కోర్టు అనుమతిచ్చింది. ఇందుకోసం మరో అయిదు రోజులు పోలీసు కస్టడీని పొడిగించింది. మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ శుక్లా నార్కో పరీక్షలకు నిర్వహించడానికి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అఫ్తాబ్ విచారణ జరిగినప్పుడు కోర్టు వెలుపల భారీ సంఖ్యలో నిరసనకారులు చేరుకొని వెంటనే అతనిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. దీంతో అఫ్తాబ్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి తెచ్చినందుకు తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్‌ను గొంతు నులిపి హత్య చేసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా కోసి, ఫ్రిజ్‌లో ఉంచి కొన్ని రోజుల పాటు దాచి తర్వాత అఫ్తాబ్ ఆ ముక్కలను పారేయడం తెలిసిందే. హత్యాయుధం దొరక్కపోవడంతో పోలీసులు నార్కో పరీక్షలకు అనుమతి కోరారు. ముఖాన్ని కాల్చేసి.. పోలీసుల విచారణలో అఫ్తాబ్ అమీన్ ఒళ్లు జలదరించే విషయాలు బయటపెడుతున్నాడు. సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి ఎన్నో హేయమైన చర్యలకు దిగాడు. ఆమె ముఖం ఎవరూ గుర్తు పట్టకుండా కాల్చినట్టుగా పోలీసుల ఎదుట అంగీకరించాడు. కట్టెలా బిగుసుకుపోయిన మృతదేహం కొయ్యడానికి వీలుగా వేడినీళ్లలో బ్లీచింగ్ పౌడర్ కలిపి వేశానని, అప్పుడే శవాన్ని కొయ్యగలిగానని పోలీసులు దగ్గర చెప్పినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో నెలకి 20వేల లీటర్ల వరకు నీళ్లు ఉచితమైనా అతని ఫ్లాట్‌కి నీటి బిల్లు రూ.300 పైగా రావడానికి కారణాలను కనుగొన్నారు. మృతదేహాన్ని కోస్తున్నప్పుడు చప్పుడు బయటకు వినిపించకుండా నీళ్ల పైపులు తిప్పి ఉంచాడని, ఇంట్లో మరకలు కనిపించకుండా తరచూ ఫ్లాట్‌ని కడిగేవాడని పోలీసులు విచారణలో తేలింది. వారిద్దరి మధ్య తరచూ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గొడవలు అవుతూ ఉండేవని తెలుస్తోంది. -
40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ పంట ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సర్కారు నిర్ణయించింది. ప్రాజెక్టులు పూర్తవుతుండటం, సాగు విస్తీర్ణం పెరగడంతో ప్రభుత్వం గోదాముల నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ 40 లక్షల మెట్రిక్ సామర్థ్యం కలిగిన గోదాములను అన్ని జిల్లాల్లో నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసింది. త్వరలో డీపీఆర్‌ను ముఖ్యమంత్రికి అందజేసే అవకాశం ఉంది. దానిపై తుది నిర్ణయం తీసుకున్నాక నిర్మాణానికి అవసరమైన రుణం తీసుకుంటారు. ఈ గోదాముల నిర్మాణానికి సుమారు రూ.2,500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుత సామర్థ్యం 24.75 లక్షల మెట్రిక్ టన్నులు... పంటలకు గిట్టుబాటు ధర వచ్చేదాకా రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యం నిల్వ చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టింది. తెలంగాణ వచ్చే నాటికి కేవలం 4.17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములుంటే, ఆ తర్వాత వాటి సామర్థ్యాన్ని 24.75 లక్షల మెట్రిక్ టన్నులకు విస్తరించింది. ప్రస్తుతం 1,250 గోదాములు ఉన్నాయి. అయితే సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతుండటం, ప్రధానంగా కాళేశ్వరం జలాలు పంట పొలాలకు చేరుతుండటంతో రాష్ట్రంలో వరిసాగు విపరీతంగా పెరుగుతోంది. ఇతర పంటలూ గణనీయంగా సాగవుతున్నాయి. మంచి వర్షాలు కురవడంతో గత ఖరీఫ్‌లో సాధారణానికి మించి సాగైంది. మున్ముందు పంటల దిగుబడి మరింత పెరగనుంది. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పండుతున్న వ్యవసాయ ఉత్పత్తులను సేకరించడం, నిల్వ చేయడం, వాటిని అమ్మడం క్లిష్టంగా మారింది. అంతా సజావుగా సాగాలంటే గోదాముల్లో నిల్వ సామర్థ్యం పెరగాల్సిందేనని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు. సామర్థ్యం సరిపోక పోవడంతో... ప్రస్తుతం ప్రభుత్వం గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సహా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. అయితే అంత మొత్తంలో ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న కాలంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుందని సర్కారు భావించింది. అందుకే గోదాముల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. సాగు పెరిగితే ఎరువులు, విత్తనాలు కూడా పెద్ద మొత్తంలో అవసరం అవుతాయి. వీటి నిల్వకు కూడా గోదాముల కొరత వేధిస్తోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)లో తగినంత గోదాముల సామర్థ్యం లేదు. దీంతో విత్తనాలు, ఎరువులు కూడా నిల్వ చేసుకునేలా గోదాముల నిర్మాణం చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ప్రైవేటు గోదాముల్లో నిల్వచేసి, అవి నిండిన తరువాతే ప్రభుత్వ గోదాములను నింపేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ గోదాములు నిండిన తర్వాతనే ధాన్యాన్ని ప్రైవేటు గోదాముల్లో నింపుతున్నారు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ గోదాములు నూటికి నూరు శాతం నిండిపోతున్నాయి. -
ఇసుక రవాణాకు గ్రీన్‌సిగ్నల్
జిల్లాలో భవన నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా అధికారులు అనుమతులు చకచకా ఇచ్చేస్తున్నారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుక కావాలంటూ దరఖాస్తు చేసుకుంటే చాలు.. వెంటనే రెవెన్యూ, మైనింగ్ అధికారులు నిర్మాణాలను పరిశీలించి అనుమతులు చేతికిచ్చేస్తున్నారు. దీంతో ఇసుక రవాణాదారులు రీచ్‌ల వద్ద బారులు తీరుతున్నారు. రీచ్‌లలో ఉచితంగానే ఇసుక దొరకతుండడంతో భవన నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. సాక్షి, నెల్లూరు: జిల్లాలో పర్యావరణ అనుమతులు ఉన్న 14 ఇసుక రీచ్‌లను అధికారులు గుర్తించి ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చేశారు. జిల్లాలోని నెల్లూరురూరల్ మండలం సజ్జాపురం రీచ్ 1,2లో 5,375 హెక్టార్లకు గాను 46,168 క్యూబిక్ మీటర్లు ఇసుక తవ్వకాలకు, పొట్టేపాళెంలోని నాలుగు రీచ్‌లలో 18,367 హెక్టార్లకు గాను 1,83,670 క్యూబిక్ మీటర్ల ఇసుక, గొల్ల కందుకూరులో రీచ్‌లో 3,840 హెక్టార్లకుగాను 38,042 క్యూబిక్ మీటర్ల ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని మినగల్లు రీచ్‌లో 2,792 హెక్టార్లలో 27,924 క్యూబిక్ మీటర్లు ఇసుక, ఆత్మకూరు మండలంలోని అప్పారావుపాళెం 1,2 రీచ్‌లలో 27,049 హెక్టార్లకుగాను 1,72,,496 క్యూబిక్ మీటర్లు ఇసుక రవాణా, అనంతసాగరం మండలంలోని లింగంగుంటలో 1,570 హెక్టార్లలో 15,700 క్యూబిక్ మీటర్లు ఇసుక, అదే మండలంలోని పడమటి కంభంపాడులో 4,451 హెక్టార్లలో 44,517 క్యూబిక్ మీటర్లు, విడవలూరు మండలంలోని ముదివర్తిలో 2,509186 దరఖాస్తులకు అనుమతులు జిల్లాలోని భవన నిర్మాణాలకు సంబంధించి 186 దరఖాస్తులకు ఇసుక రవాణాకు రెవెన్యూ, మైనింగ్ అధికారులు అనుమతులిచ్చారు. మరో 70 వరకు దరఖాస్తులు రాగా పరిశీలన నిమిత్తం పెండింగ్‌లో ఉన్నాయి. స్థానికంగా పేదలకు అవసరమయ్యే ఇసుక తోలకాలకు సంబంధించి ఎడ్లబండ్లకు స్థానికంగానే రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారన్నారు. ఇప్పటికే దాదాపు 500 వాహనాలకు ఇసుక రవాణా చేసుకునేందుకు అనుమతులు ఇచ్చేశారు. అపార్ట్మెంట్లు, మేనకూరు సెజ్, షార్ కేంద్రం, శ్రీసిటీలో జరిగే భారీ నిర్మాణాలకు మాత్రం రెవెన్యూ, మైనింగ్ అధికారుల పరిశీలన చేసి ఆపై జిల్లా కలెక్టర్ ద్వారా అనుమతి ఇస్తున్నారు. కలెక్టర్ సైతం ఇసుక దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా అనుమతులు చకచకా ఇస్తుండడంతో ఇసుక కొరత లేకుండా సరఫరా జరుగుతోంది. హెక్టార్లలో 25,091 క్యూబిక్ మీటర్లు ఇసుక, పొదలకూరు మండలంలోని విరువూరులో 4,694 హెక్టార్లలో 46,945 క్యూబిక్ మీటర్లు ఇసుక రవాణా కు అనుమతులు ఇవ్వడంతో ఇసుక రవాణా వేగవంతంగా జరుగుతోంది.ఉచితంగా ఇసుక సరఫరా జిల్లాలో 14 రీచ్‌ల నుంచి ఇసుక రవాణాకు అనుమతులిచ్చాం. ఇసుక రవాణా అనుమతులను పారదర్శకంగా ఇచ్చాం. ఎక్కడా కూడా అనుమతులకు నగదు వసూళ్లు చేసినట్లు ఒక్క ఆరోపణ కూడా రాలేదు. అనుమతులు చకచకా ఇచ్చేయడంతో ఇసుక కొరత లేకుండా రవాణా సాగుతోంది. అపార్ట్మెంట్ల నిర్మాణాలకు మాత్రం తప్పక పరిశీలన చేసి అనుమతులు ఇస్తున్నాం. త్వరలో నూతన పాలసీ వస్తుంది. ప్రస్తుతం జిల్లాలో ఆరు రీచ్‌లకు ఇసుక రవాణాకు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. – వెంకటేశ్వరరెడ్డి, మైనింగ్ ఏడీ -
ప్రతీ విదేశీయానానికి అనుమతి తప్పనిసరి
జోధ్‌పూర్: షూటింగ్ నిమిత్తం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మాల్టా, సౌదీ అరేబియాలకు వెళ్లడానికి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు అనుమతినిచ్చింది. విదేశాలకు వెళ్లాలనుకున్న ప్రతిసారి తప్పనిసరిగా తమ అనుమతి తీసుకోవాలని సూచించింది. అనుమతి నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా జిల్లా సెషన్స్ కోర్టుకు పెట్టుకున్న విజ్ఞప్తిపై జడ్జి చంద్రకుమార్ శనివారం విచారణ చేపట్టారు. కోర్టు అనుమతి తీసుకోవటంలో ఇబ్బందులేంటని సల్మాన్ తరఫు లాయర్లను జడ్జి ప్రశ్నించారు. జింకలను వేటాడిన కేసులో వాదనలు కొనసాగుతున్నందున అనుమతి ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. -
కాళేశ్వరానికి మరో కీలక అనుమతి
ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) నుంచి కీలక అనుమతులు లభించాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో అనుమతులు జారీ చేస్తున్నట్లు టీఏసీ తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర, భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావులు అనుమతులు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనుమతులు మంజూరు చేసినందుకు గానూ కేంద్ర జల వనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. -
'వర్షిం'చిన ముడుపులు !
అనంతపురం న్యూసిటీ: నగరంలోని వర్ష ఆస్పత్రి తిరిగి తెరుచుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. గత నెల 21న నగరంలోని వర్ష ఆస్పత్రిలో రక్తమార్పిడి, వివిధ కారణాలను చూపుతూ డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్ పంచనామా చేసి ఆస్పత్రిని సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే వైద్యాధికారులే తిరిగి ఆస్పత్రి తెరిచేందుకు అనుమతులివ్వడం విమర్శలకు దారితీస్తోంది. దీని వెనుక భారీగా ముడుపుల బాగోతం నడిచాయన్న ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. రాత్రికి రాత్రే కమిటీలు వర్ష ఆస్పత్రి సీజ్ జిల్లాలోనే ఇది పెద్ద సంచలనమైంది.డీఎంహెచ్ఓ తీసుకున్న నిర్ణయంతో నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆస్పత్రి నిర్వహణలో చాలా లోపాలున్నాయి, ఎటువంటి సురక్షిత ప్రమాణాలు లేవని డీఎంహెచ్ఓ తేల్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 2న ఆస్పత్రి నిర్వాహకురాలు డాక్టర్ సుప్రజాచౌదరి, ఇద్దరు వ్యక్తులు డీఎంహెచ్ఓ కార్యాలయంలోని డెమో ముందు కూర్చుని వివరణ ఇచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా ఈ నెల 13న డీఎంహెచ్ఓ ఆస్పత్రిని తనిఖీ చేసేందుకు ఐదు మంది సభ్యులతో వెళ్లారు. ఈ విషయాలను బయటకు పొక్కనీయకుండా డీఎంహెచ్ఓ, డెమో జాగ్రత్త పడ్డారు. వాస్తవంగా ఈ నెల 11న కమిటీ వేశామని వైద్య ఆరోగ్యశాఖాధికారి చెబుతున్నా.. కమిటీ లిస్టులో మాత్రం తేదీని ఈ నెల 7 అని పెన్‌తో రాశారు. దీన్ని బట్టి పక్కా ప్లాన్‌తోనే వర్ష ఆస్పత్రిని ఓపెన్ చేసేందుకునే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పరోక్షంగా సహకరించారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. నిర్వాహకులకే తాళాలు ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు వారి సమక్షంలోనే తిరిగి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు ఓపెన్ చేసుకునేందుకు నిర్వాహకుల చేతికే తాళాలివ్వడం పలు విమర్శలు తావిస్తోంది. ఇదే విషయాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్‌ను సాక్షి ఆరా తీస్తే డెమో వెళ్లారని సమాధానం ఇచ్చారు. డెమో ఉమాపతిని ఆరా తీస్తే ఆర్డర్ ఇచ్చాం వారే ఓపెన్ చేసుకోవాలని చెప్పామన్నారు. ప్రాక్టీస్‌కు అనుమతివ్వలేదు వర్ష ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేసుకునేందుకు ఇంకా అనుమతివ్వలేదు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేశాం. వారి నుంచి రిపోర్టు వచ్చాకే ప్రాక్టీస్‌కు అనుమతిస్తాం. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్,డీఎంహెచ్ఓ -
తెలంగాణలో 17 కొత్త కంపెనీలకు అనుమతులు
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం(టీఎస్ ఐపాస్) ద్వారా 17 కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరుచేసింది. మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ సదరు కంపెనీలకు అనుమతి పత్రాలు అందజేయనున్నారు. ఐటీసీతోపాటు అనుమతులు కూడా మరికొన్ని కంపెనీలు పొందనున్నాయి. మొత్తం పదిహేడు కంపెనీలు కలిసి దాదాపు రూ.1500 కోట్ల పెట్టుబడులు పెడతాయని అంచనా. కాగా ఈ కంపెనీల ఏర్పాటు ద్వారా నాలుగు వేలమందికి ఉపాధి లభించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలె ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్)ను హెచ్ఐసీసీలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హెటెక్స్‌లో పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈవోలతో ఆయన సమావేశమయ్యారు. వారిలో మైక్రోసాప్ట్, టాటా, ఐటీసీ, షాపూర్జీ-పల్లోంజీ, ఇన్పోసిస్ కంపెనీల ప్రతినిధులతో పాటు అమెరికా, కెనడా, స్వీడన్, గల్ఫ్ దేశాలకు చెందిన విదేశాంగ రాయబారులు పాల్గొన్న విషయం తెలిసిందే.