సాక్షి, చిత్తూరు: టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టబోయే యువ గళం పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జిల్లా ఎస్పీ రిషాంత్ స్పష్టం చేశారు. సోమవారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనలకు లోబడే పాదయాత్ర జరగాలని నారా లోకేష్, టీడీపీ క్యాడర్‌కు సూచించారు.
ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని ఎస్పీ రిషాంత్ సూచించారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 27వ తేదీ నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. మరోవైపు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా వేధిస్తోందంటూ యెల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసుకుంటోంది టీడీపీ.
Comments
Please login to add a commentAdd a comment