తెలంగాణలో 17 కొత్త కంపెనీలకు అనుమతులు
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం(టీఎస్ ఐపాస్) ద్వారా 17 కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరుచేసింది. మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ సదరు కంపెనీలకు అనుమతి పత్రాలు అందజేయనున్నారు. ఐటీసీతోపాటు అనుమతులు కూడా మరికొన్ని కంపెనీలు పొందనున్నాయి. మొత్తం పదిహేడు కంపెనీలు కలిసి దాదాపు రూ.1500 కోట్ల పెట్టుబడులు పెడతాయని అంచనా. కాగా ఈ కంపెనీల ఏర్పాటు ద్వారా నాలుగు వేలమందికి ఉపాధి లభించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవలె ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్)ను హెచ్ఐసీసీలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హెటెక్స్లో పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈవోలతో ఆయన సమావేశమయ్యారు. వారిలో మైక్రోసాప్ట్, టాటా, ఐటీసీ, షాపూర్జీ-పల్లోంజీ, ఇన్పోసిస్ కంపెనీల ప్రతినిధులతో పాటు అమెరికా, కెనడా, స్వీడన్, గల్ఫ్ దేశాలకు చెందిన విదేశాంగ రాయబారులు పాల్గొన్న విషయం తెలిసిందే.