జోధ్‌పూర్: షూటింగ్ నిమిత్తం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మాల్టా, సౌదీ అరేబియాలకు వెళ్లడానికి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు అనుమతినిచ్చింది. విదేశాలకు వెళ్లాలనుకున్న ప్రతిసారి తప్పనిసరిగా తమ అనుమతి తీసుకోవాలని సూచించింది. అనుమతి నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా జిల్లా సెషన్స్ కోర్టుకు పెట్టుకున్న విజ్ఞప్తిపై జడ్జి చంద్రకుమార్ శనివారం విచారణ చేపట్టారు. కోర్టు అనుమతి తీసుకోవటంలో ఇబ్బందులేంటని సల్మాన్ తరఫు లాయర్లను జడ్జి ప్రశ్నించారు. జింకలను వేటాడిన కేసులో వాదనలు కొనసాగుతున్నందున అనుమతి ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment