న్యూఢిల్లీ: ఈక్విటీ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు)కు సైతం మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ (ఎంటీఎఫ్) అందించేందుకు బ్రోకర్లకు సెబీ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం గ్రూప్ 1 కింద ఉన్న కొన్ని స్టాక్స్‌కు మాత్రమే మార్జిన్ ట్రేడింగ్ సదుపాయాన్ని బ్రోకర్లు అందిస్తున్నారు. ఒక పెట్టుబడి సాధనంగా ఈటీఎఫ్‌లో ఉండే పారదర్శకత, వైవిధ్యం, తక్కువ వ్యయాల వంటి అనుకూలతలను పరిగణనలోకి తీసుకుని ఈటీఎఫ్ యూనిట్లను సైతం అర్హత కలిగిన సెక్యూరిటీగా పరిగణిస్తున్నట్టు సెబీ తెలిపింది.
అలాగే, ఎంటీఎఫ్‌కు తనఖాగా ఈ యూనిట్లను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. క్లయింట్లు బ్రోకర్లకు చెల్లించే ముందస్తు మార్జిన్ అన్నది నగదు, నగదు సమానం లేదా ఈక్విటీ ఈటీఎఫ్‌ల రూపంలో ఉండొచ్చని సెబీ తెలిపింది. ఇందుకు సంబంధించి బోర్డు ఆమోదంతో కూడిన ఒక విధానం ఉండాలని స్పష్టం చేసింది. అంటే ఒక విధంగా గ్రూప్1లో ఉన్న స్టాక్స్‌కు సమానంగా ఈక్విటీ ఈటీఎఫ్‌లను ఇక మీదట పరిగణించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment