ముంబై: ముంబైలోని గణపతి పాటిల్ నగర్ లో దారుణం జరిగింది. క్షణికావేశంలో అన్నను దారుణంగా హత్య చేశాడు. కానీ దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోస్ట్ మార్టం నివేదిక అతడిని పట్టించింది.
రాం, అనిల్ ఇద్దదూ అన్నదమ్ములు. రాం భార్య, కూతురు, సోదరుడితో కలిసి నివసిస్తున్నాడు. రాత్రి భోజనంలో పంది మాంసం విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య స్వల్ప వివాదం రేగింది. ఆగ్రహంతో అన్నపై దాడి చేసి తీవ్రంగా ఒకట్టాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అతణ్ని ఆసుపత్రికి తరలించకుండా చూస్తూ ఉరుకున్నాడు. చివరికి తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతూ రాం మరణించాడు. దీంతో తన అన్న ఆత్మహత్య చేసుకున్నాడంటూ తమ్ముడు అనిల్ తాపీగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే మొదట ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. ఈ నివేదికలో అతడిది ఆత్మహత్య కాదు.. హత్య అని తేలింది. మృతుని తల వెనుకభాగంలో బలమైన గాయాలున్నాయని, దీంతో అది హత్యేనని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అనిల్ కుటుంబసభ్యులను విచారించారు. ఈ క్రమంలో రాం కూతురు అనిత తండ్రి, బాబాయిల మధ్య ఘర్షణ జరిగిందని తెలిపింది. బాబాయ్ అనిల్, తన తండ్రి తలపై తీవ్రంగా కొట్టాడని చెప్పింది. దీంతో నిందితుడు నేరాన్ని అంగీకరించక తప్పలేదు.