మాంసాహారులు చేపలు, కోడి, మటన్ వంటివి తినేటప్పుడు పరిశుభ్రత పాటించాలి. అలాగే బాగా ఉడికించి తినాలి లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తుంటారు. అయితే ఒక అమ్మాయి పదేళ్లుగా పచ్చి మాంసమే తిని భయానక వ్యాధిని బారిన పడింది. పచ్చి మాంసం తింటేనే ఆ వ్యాధి బారిన పడతారని వైద్యుల చెబుతున్నారు. ఇంతకీ ఆ యువతికి వచ్చిన వ్యాధేంటీ? పచ్చి మాంస వల్లనే వచ్చిందా..?
అసలేం జరిగిందంటే..చైనాలోని డెకిన్ కౌంటీ యుబెంగ్ విలేజ్‌కు చెందిన యువతికి పచ్చి మాంసం తినే అలవాటు ఉంది. పదేళ్లుగా పంది మాంసాన్ని పచ్చిగానే తినేదట. దీని కారణంగా ఆమె అనారోగ్యం బారినపడి ఇబ్బందిపడింది. ఒక్క నిమిషం కూడా స్థిమితంగా ఉండలేని విధంగా ఉంది. చూడటానికి పైకి బాగానే ఉన్న ఏదో నిస్సత్తువ అవగాస్తున్నట్లుగా ఉండేది. దీంతో వైద్యులను సంప్రదించింది. వైద్య పరీక్షలు నిర్వహించి సిస్టిసెర్కోసిస్ అనే వ్యాధి బారిన పడినట్లు నిర్థారించారు.
అంతేగాదు వైద్యులు ఆమెకు ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ నిర్వహించి చూడగా.. ఆమె శరీరంలోని ఉన్న పరాన్నజీవుల సంఖ్యను చూసి కంగుతిన్నారు. ఆ యువతి శరీర భాగాలన్నింటిలో కళ్లు, కాళ్లు, చేతులు విడిచిపెట్టకుండా ఎక్కడపడితే అక్కడ టేప్‌వార్మ్ గుడ్లతో నిండి ఉండటాన్ని చూసి విస్తుపోయారు. దీంతో ఆమె ఆహారపు శైలి గురించి ప్రశ్నించగా తనకు యుక్త వయసు నుంచి పచ్చి పంది మాంసం తినే అలవాటు ఉందని వెల్లడయ్యింది.
ఇలా పచ్చిమాంసం తింటేనే భయానకమైన సిస్టిసెర్కోసిస్ అనే వ్యాధి బారినపడతారని అన్నారు వైద్యులు. ఈ వ్యాధి శరీరంలోని ఏ భాగానికైనా వస్తుందని అన్నారు. దీని కారణంగా ఉబ్బిన కళ్లు, రెటీనా నుంచి రక్తం, మూర్చ, ఇన్ఫెక్షన్‌లు వంటి సమస్యల ఎదర్కొంటారని చెప్పారు. అంతేగాదు దీని ప్రభావం మెదడుపై ఎక్కువగా ఉంటుందని చెప్పారు. పరిస్థితి విషమిస్తే మరణం కూడా సంభవిస్తుందని చెప్పుకొచ్చారు.
అలాకాకుండా శరీరంలోకి చేరిన ఈ పరాన్నజీవులు చనిపోతే ఇన్‌ఫ్లమేటరీ సమస్యలు, తీవ్రమైన అలెర్జీ లాంటి సమస్యలు వస్తాయన్నారు. ఇలా సిస్టిసెర్కోసిస్ బారినపడి ఏడాదికి ఐదు వేలకు పైగా మరణిస్తున్నట్లు వెల్లడించారు న్యూరాలజీ విభాగానికి చెందిన చీఫ్ ఫిజిషియన్ ప్రొఫెసర్ మెంగ్ కియాంగ్ వైద్యులు.
(చదవండి: 'స్లీప్‌మాక్సింగ్': నిద్రను కూడా కొనుక్కునే దుస్థితా..?)
Comments
Please login to add a commentAdd a comment