విశాఖపట్నం: పంది కిడ్నీ మనిషికి మార్పిడితో సత్ఫలితాలను ఇస్తుందని న్యూయార్క్‌లో గల లాంగోన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ వశిష్ట తాతపూడి అన్నారు. బీచ్‌రోడ్డు రాడిసన్ బ్లూలో ఏపీ సొసైటీ ఫర్ నెఫ్రాలజీ రాష్ట్ర సదస్సులో భాగంగా రెండో రోజు ఆదివారం అమెరికా నుంచి వర్చువల్‌గా ఆయన మాట్లాడారు. పిగ్ టు హ్యూమన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై మాట్లాడుతూ జన్యుపరంగా మార్పు చెందిన పంది కిడ్నీని మనిషికి మార్పిడి చేశామన్నారు. రెండు నెలల వరకు కిడ్నీ బాగా పనిచేసిందన్నారు.
ప్రస్తుతం ఉన్న అవయవాల కొరత భవిష్యత్తులో మరింత పెరగవచ్చని, అందువల్ల ఇటువంటి ప్రయోగాలు మరిన్ని చేయాల్సి ఉందని వివరించారు. అనంతరం శ్యామ్ బన్సల్, వివేక్ కూటే మాట్లాడుతూ కిడ్నీ మ్యాచింగ్ టెక్నిక్, జత చేసిన అవయవ మార్పిడిపై ప్రసంగించారు. డాక్టర్లు నికేష్ కామత్, గోపికా మీనన్, ఆశీష్‌కు ఉత్తమ సైంటిఫిక్ పేపర్ అవార్డులు అందజేశారు. సదస్సులో ఏపీ నలుమూలల నుంచి 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment