ఆ మాంసం సరిగి ఉడికించకుండా తింటే ఎలాంటి ఇన్ఫెక్షన్‌లు వస్తాయో వివరించాడు అమెరికా వైద్యుడు. సీటీ స్కాన్ తీసి మరీ వెల్లడించారు. మాంసం సరిగ్గా ఉడక్కపోతే దానిలో ఉండే పరాన్నజీవి ఎలాంటి ఇన్ఫెక్షన్‌లు కలిగిస్తుందో తెలిపారు. ఇంతకీ ఏ మాంసం గురించి అంటే..
కొందరూ పంది మాంసం ఇష్టంగా తింటారు. ముఖ్యంగా మన దేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా పందిమాంసం తింటుంటారు. అయితే ఈ మాంసాన్ని గనుక సరిగా ఉడికించపోతే అంతే సంగతులని చెబుతున్నారు వైద్యులు. మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తింటే ఎలాంటి రోగాలు వస్తాయో..?.. సిటీస్కాన్ చేసి మరి వివరించాడు అమెరికా వైద్యుడు డాక్టర్ సామ్ ఘాలి. సరిగా ఉడికించిన పంది మాంసం తిన్న రోగి కాళ్లలో పరాన్న జీవి ఎలాంటి ఇన్ఫెక్షన్‌లు కలిగిస్తుందో సీటీస్కాన్ తీసి మరి వెల్లడించారు.
అతడికి సిస్టోసెర్కోసిస్ ఉన్నట్లు నిర్థారించారు. దీన్ని వైద్య పరిభాషలో టేప్‌వార్మ్ ముట్టడి అని అంటారని చెప్పారు. అలాంటి ఇన్ఫెక్షన్‌ని నివారించాలంటే.. పంది మాంసాన్ని సరిగా ఉడికించి తినాలని అన్నారు. సిస్టిసెర్కోసిస్ అనేది టైనియా సోలియం లార్వా తిత్తుల వల్ల వస్తుందని అన్నారు. దీన్ని టేప్ వార్మ్(బద్దెపురుగులు) అని పిలుస్తారని చెప్పారు. అంటే పంది శరీరం పర్నాజీవిలా బద్దె పురుగులకు ఆశ్రయం ఇస్తుంది. అందువల్ల ఈ మాంసాన్ని తీసుకునేవాళ్లు బాగా ఉడికించి తీసుకోవాలి.
లేదంటే ఈ బద్దెపురుగులు తిత్తులుగా మారి పలు రకాల ఇన్ఫెక్షన్‌ల బారినపడేలా చేస్తుంది. ఈ తిత్తులు జీర్ణశయాంతర ప్రేగులలో పరిపక్వ వయోజన టేప్‌వార్మ్‌లుగా పరిణామం చెందుతాయి. ఈ పరిస్థితిని ఇంటెస్టినల్ టైనియాసిస్ అంటారు" అని డాక్టర్ ఘాలి వివరించారు. అంతేగాదు ఈ వయోజన టేప్‌వార్మ్‌లు గుడ్లను తొలగిస్తాయి, అవి మానవ మలంలోకి విసర్జించబడతాయని తెలిపారు. అందువల్లే రోగులు సిస్టిసెర్కోసిస్ సిండ్రోమ్ బారిన పడతారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment