
రియాద్: సౌదీ అరేబియా రాజును గద్దె దింపేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై అధికారులు ముగ్గురు యువరాజులను అరెస్ట్ చేశారు. రాజు సల్మాన్ తమ్ముడు అహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, దగ్గరి బంధువు మహమ్మద్ బిన్ నయేఫ్‌లు ఇందులో ఉన్నట్లు అమెరికా మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. శుక్రవారం ఉదయం యువరాజులు ముగ్గురిని వారి ఇళ్ల నుంచి అరెస్ట్ చేసినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. సౌదీ రాజు సల్మాన్‌తోపాటు ఆయన కొడుకు మహ్మద్ బిన్ సల్మాన్‌లను గద్దె దింపేందుకు కుట్ర పన్నినట్లు వీరిపై న్యాయస్థానంలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఆరోపణలు రుజువైతే నిందితులకు జీవితకాల ఖైదు లేదంటే మరణ శిక్ష పడే అవకాశం ఉంది. నయేఫ్‌తోపాటు ఆయన తమ్ముడు నవాఫ్ బిన్ నయేఫ్ కూడా అరెస్ట్ అయినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment