wall street journal
-
అమెరికా విలేఖరికి 16 ఏళ్ల జైలు శిక్ష
యెకటేరిన్‌బర్గ్ (రష్యా): అమెరికా కోసం రహస్య పత్రాలు సేకరిస్తూ గూఢచర్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ప్రఖ్యాత వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు చెందిన 32 ఏళ్ల రిపోర్టర్ ఇవాన్ గెర్‡్షకోవిచ్కు రష్యా న్యాయస్థానం 16 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీనిని పూర్తిగా కల్పిత సాక్ష్యాలతో సృష్టించిన తప్పుడు కేసుగా అమెరికా అభివర్ణించింది. శుక్రవారం రష్యాలోని సెవెర్డ్లోవోస్క్ ప్రాంతీయ కోర్టు జడ్జి ఆండ్రీ మినియేవ్ ఈ తీర్పు చెప్పారు. తీర్పుకు ముందు నీవేమైనా చెప్పేది ఉందా? అని జడ్జి ప్రశ్నించగా లేదు అని ఇవాన్ సమాధానమిచ్చారు. ఇవాన్‌కు 18 ఏళ్ల శిక్ష విధించాలని ప్రభుత్వ లాయర్లువాదించగా జడ్జి 16 ఏళ్ల శిక్ష వేశారు. శిక్ష ఖరారుపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ‘‘ జర్నలిస్ట్, అమెరికన్ పౌరుడు అయినందుకే ఇవాన్‌ను బంధించి జైలుపాలుచేశారు. ఐరాస కూడా ఇదే మాట చెప్పింది. అతడిని విడిపించేందుకు అమెరికా తన ప్రయత్నాలు ఇకమీదటా కొనసాగిస్తుంది. పాత్రికేయ వృత్తి నేరం కాబోదు’ అని అన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక అమెరికా జర్నలిస్ట్‌ను రష్యా అరెస్ట్చేయడం ఇదే తొలిసారి. యురాల్వగోన్జవోడ్ సిటీలో రష్యా యుద్ధట్యాంకుల తయారీ, రిపేర్ల రహస్య సమాచారాన్ని ఇవాన్ సేకరిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడని ఆరోపిస్తూ 2023 మార్చి 29న ఇవాన్‌ను అరెస్ట్చేయడం తెల్సిందే. -
Wall Street Journal: ఇజ్రాయెల్‌పై దాడికి సిద్ధమైన ఇరాన్!
వాషింగ్టన్: సిరియా రాజధాని డమాస్కస్‌లోని తమ రాయబారి కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడితో పట్టరాని ఆవేశంతో ఊగిపోతున్న ఇరాన్ వచ్చే 48 గంటల్లో ఇజ్రాయెల్‌పై దాడికి తెగబడే ప్రమాదం పొంచి ఉంది. ఎంబసీపై దాడిలో ఆర్మీ జనరళ్లు, సైన్యాధికారుల మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమవుతోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. దాడి చేస్తే రాజకీయ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతొల్లా అలీ ఖమేనీ చెబుతున్నాసరే ఆ దేశం తన నిర్ణయంపై వెనకడుగు వేసే పరిస్థితి లేదని కథనం వెల్లడించింది. నిజంగా దాడి జరిగితే పశి్చమాసియాలో యుద్ధజ్వాలలు ఊహించనంతగా ఎగసిపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్ దాడి చేస్తే ప్రతిదాడికి ఇజ్రాయెల్ ఇప్పటికే రెడీ అయిపోయిందని తెలుస్తోంది. యుద్ధ సంసిద్దతపై వార్ కేబినెట్, రక్షణ శాఖ అధికారులతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ శుక్రవారం సమావేశం నిర్వహించారు. హమాస్‌తో ఇప్పట్లో ఆగని యుద్ధంలో తలమునకలైన ఇజ్రాయెల్.. ఇరాన్‌తోనూ కయ్యానికి కాలు దువ్వడంపై పశి్చమదేశాలు ఆందోళన చెందుతున్నాయి. డమాస్కస్‌పై దాడి ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ చెబుతుండగా ఇంతవరకూ ఈ విషయంలో ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఏప్రిల్ ఒకటోతేదీ నాటి ఆ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఇద్దరు సైనిక జనరళ్లు సహా ఏడుగురు అధికారుల మరణమే ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. యుద్ధవాతావరణం నెలకొనడంతో ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్‌కు వెళ్లొద్దని తమ పౌరులకు అమెరికా, ఫ్రాన్స్ దేశాలు హెచ్చరికలు జారీచేశాయి. ఉద్రిక్తతను మరింత పెంచొద్దని ఇరాన్‌కు నచ్చజెప్పాలని టర్కీ, చైనా, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఫోన్సంభాషణలో కోరారు. ఇరాన్ విషయంలో మీకు పూర్తి మద్దతు ఇస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యావ్ గాలంట్‌తో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు. ఇజ్రాయెల్, ఇరాన్‌లకు వెళ్లకండి పౌరులకు భారత సర్కార్ ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: తాము చెప్పే వరకూ ఇజ్రాయెల్, ఇరాన్‌లకు ప్రయాణాల పెట్టుకోవద్దని పౌరులకు భారత విదేశాంగ శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం అడ్వైజరీని విడుదలచేసింది. ఇప్పటికే ఆ దేశాల్లో ఉంటే భారతీయ ఎంబసీల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. నిర్మాణరంగంలో కారి్మకులుగా భారత్ నుంచి ఇకపై ఎవరినీ ఇజ్రాయెల్‌కు పంపబోమని భారత్ శుక్రవారం స్పష్టంచేసింది. -
USA presidential election 2024: ఒపీనియన్ పోల్‌లో ట్రంప్ ముందంజ
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఎవరిదన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ ఏర్పడింది. మాజీ ప్రత్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మళ్లీ పోటీ పడుతున్నారు. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయం ఏమిటన్నదానిపై వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక ఓపీనియన్ పోల్ నిర్వహించింది. ఏడు కీలక రాష్ట్రాల్లో సర్వే చేయగా, ఏకంగా ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ వైపు మొగ్గు కనిపించింది. తదుపరి అధ్యక్షుడిగా ట్రంప్‌ను ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విధానాల పట్ల జనం అసంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో వెల్లడయ్యింది. -
ఎలాన్ మస్క్‌కు ఏమైంది? ఆ మందులు ఎందుకు వాడుతున్నట్లు?
ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ డిప్రెషన్ వంటి మానసిక సమస్యతో బాధపడుతున్నారంటూ పలు సంచలన నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా, రోజూవారీ ఒత్తిళ్ల నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు మస్క్ పార్టీలకు వెళ్తుంటారు. ఆ సమయంలో మానసిక సమస్య నుంచి బయటపడేందుకు కెటామైన్ (డిప్రెషన్ తగ్గించుకునేందుకు వినియోగించుకునే మెడిసిన్) అనే మందును ఎక్కువ డోస్‌లో తీసుకుంటున్నారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది. అంతేకాదు, డిప్రెషన్ నుంచి తాను బయటపడేందుకు తక్కువ మోతాదులో కెటామైన్‌ను తీసుకుంటున్నట్లు మస్క్ తన స్నేహితులకు చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. ఆ రిపోర్ట్‌ను ఊటంకించేలా.. మస్క్ డిప్రెషన్ నుంచి కోలుకునేలా కెటామైన్ ఎలా ఉపయోగపడుతుందనే తదితర అంశాలపై ట్విట్ చేశారు. ఆ ట్విట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Depression is overdiagnosed in the US, but for some people it really is a brain chemistry issue. But zombifying people with SSRIs for sure happens way too much. From what I’ve seen with friends, ketamine taken occasionally is a better option. — Elon Musk (@elonmusk) June 27, 2023 డిప్రెషన్ అనేది బ్రెయిన్ సంబంధిత సమస్య. యుఎస్‌లో ఈ మానసిక సమస్యతో బాధపడే వారు ఎక్కువగా ఉన్నారు. ఈ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు కెటామైన్ ఉపయోగించుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా మంది జాంబిఫైయింగ్ బారిన పడేందుకు అవకాశం ఉన్న సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్ (ssri) అనే మెడిసిన్‌ను తీసుకుంటున్నారని ట్వీట్లో మస్క్ తెలిపారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ (wsj) నివేదికల ప్రకారం.. మస్క్ ఆరోపిస్తున్నట్లుగా మత్తెక్కించే కెటామైన్ అనే డ్రగ్‌ను తీసుకునే కల్చర్ సిలికాన్ వ్యాలీ ఎగ్జిక్యూటీవ్‌లలో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మార్కెట్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని వ్యాపారంలో పనితీరు మెరుగు పరుచుకోవడంతో పాటు సృజనాత్మకత కోసం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సిలికాన్ వ్యాలీలో కార్యకలాపాలు నిర్వహించే ప్రముఖ కంపెనీల్లో సీఈవోలు, ఫౌండర్లు కెటామైన్, మ్యాజిక్ మష్రూమ్‌లు, లైసెర్జిక్ యాసిడ్ డైథైలామైడ్ (ఎల్ఎస్డీ) మత్తు పదార్ధాల్ని తీసుకున్నట్లు డబ్ల్యూఎస్‌జే ప్రస్తావించింది. వారిలో గూగుల్ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ 'మ్యాజిక్ మష్రూమ్'లను తీసుకున్నట్లు డబ్ల్యూఎస్‌జే నివేదించింది. ఈ మ్యూజిక్ మష్రూమ్‌లలో శరీరాన్ని మత్తెక్కించే సైలోసిబిన్ (psilocybin) అనే రసాయనం ఉంటుంది. 2018లో పాడ్‌కాస్ట్ జరిగే సమయంలో ఇలా సంచలనాత్మక కామెంట్లతో నిత్యం నెటిజన్ల నోళ్లలో నానే ఎలాన్ మస్క్‌కు తాజా ట్విట్లు కొత్తవేం కావనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. 2018లో జో రోగన్ పోడ్కాస్ట్ ఎపిసోడ్లో గంజాయి తాగి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ఈ సంఘటన తర్వాత తనకు, స్పేస్ఎక్స్ ఉద్యోగులకు రెగ్యులర్ డ్రగ్ టెస్ట్‌లు జరుగుతున్నాయని ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. కెటామైన్ వినియోగం.. అమెరికాలో అనుమతి కెటామైన్ డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఉపయోగించే మెడిసిన్. అమెరికాలో దీని వినియోగంపై నియంత్రణ ఉంది. వ్యాధిగ్రస్తులు వైద్య నిపుణులు ఆధ్వర్యంలో పొడిగా, ద్రవ రూపంలో, మాత్రల రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. జాంబిఫైయింగ్ అంటే? మస్క్ చెబుతున్నట్లుగా..సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్ అనే మెడిసిన్ వినియోగంతో జాంబిఫైయింగ్ అనే వ్యాధి సోకుతుంది. లాలాజలం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌తో బాధపడే వారు ఇష్టం వచ్చినట్లుగా మీద పడి కొరుకుతుంటారని హెల్త్‌కేర్ నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 ముఖేష్ అంబానీ - ఎలాన్ మస్క్‌ల మధ్య పంతం!,ఎవరి మాట నెగ్గుతుందో? -
‘మోదీకి ప్రశ్న.. సబ్రీనాపై వేధింపులు సరికాదు’
వాష్టింగ్టన్: అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోదీకి.. భారత్‌లో మైనారిటీల హక్కుల సంరక్షణపై ప్రశ్న గుప్పించిన మహిళా జర్నలిస్ట్ వేధింపులు ఎదుర్కొందట. ఈ విషయం తమకూ తెలుసున్న అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్.. ఆ వేధింపులను ఖండిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోదీ-అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో.. వాల్‌స్ట్రీట్ జర్నల్ జర్నలిస్ట్ అయిన సబ్రీనా ‘భారత్ లో ముస్లింలు, ఇతర మైనారిటీల పట్ల పక్షపాతంపై మీరేమంటారు.. ఇండియాలో మైనారిటీల హక్కులను కాపాడేందుకు మీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. దీనికి జవాబిస్తూ.. ఈ ప్రశ్న తనను సర్ ప్రైజ్ చేసిందని అన్నారు. మనమంతా ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని, ప్రజాస్వామ్యమే మన ఆత్మ అని, పక్షపాతానికి ప్రజాస్వామ్యంలో చోటులేదని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆన్ లైన్ లో వేధింపులు ఎదుర్కొంటోందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఆరోపించగా.. వైట్ హౌస్ ఉన్నతాధికారి జాన్ కిర్బీ స్పందించారు. సబ్రీనా సిద్దిఖీ సైబర్ వేధింపులకు గురవుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిర్బీ తెలిపారు. జర్నలిస్టులపై ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి రకమైన దాడి అయినా ఖండించాల్సిందేనన్నది అమెరికా ఉద్దేశమని పేర్కొన్నారు. ఇలా వేధింపులకు గురిచేయడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణి పనికిరాదని వ్యాఖ్యానించారు. కిర్బీ ప్రకటన తర్వాత.. వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరైన్ జీన్ పెర్రీ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. కిర్బీ ప్రకటనతో తానూ ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. Prime Minister Modi completely destroyed the motivated question on steps being taken to ‘protect’ rights of Muslims and other minorities. In his response he didn’t mention Muslims or any other denomination, spoke about Constitution, access to Govt resources based on eligibility… pic.twitter.com/mPdXPMZaoI — Amit Malviya (@amitmalviya) June 22, 2023 సబ్రీనా సిద్ధిఖీ పాక్ మూలాలున్న వ్యక్తి. ఆమె తల్లిదండ్రులు పాకిస్థాన్‌కు చెందిన వాళ్లే అయినా.. తండ్రి మాత్రం భారత్‌లో జన్మించారు. సబ్రీనా మాత్రం అమెరికాలో జన్మించారు. నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన ఆమె.. భర్తతో కలిసి వాషింగ్టన్లో ఉంటున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె రిపోర్టింగ్ పనితీరు గురించి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2019 వరకు గార్డియన్ కోసం పని చేసిన ఆమె.. ఆ తర్వాత వాల్ స్ట్రీట్జర్నల్కు పని చేస్తూ వస్తున్నారు. గతంలో హఫ్పింగ్టన్పోస్ట్, బ్లూమ్బర్గ్లోనూ ఆమె పని చేశారు. నాలుగేళ్ల కిందట ముహమ్మద్ అలీ సయ్యద్ జాఫ్రీ అనే వ్యక్తిని ఆమె పెళ్లాడారు. వీళ్లకు సోఫీ అనే పాప ఉంది. As President of SAJA, I want to add that @SabrinaSiddiqui asked a fair question, one PM Modi's team and anyone keeping track of news should have expected. His response and how Indian journalists haven't had the opp to ask him this in 9 years is what we should talk about more. https://t.co/SwTkfq95Sg — Mythili Sampathkumar (@MythiliSk) June 26, 2023 ఇదీ చదవండి: దేశంలో ఏం జరుగుతుందో తెలియాలా? -
ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన రాజకీయ పార్టీ అదే!
ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ బీజేపీ అని రచయిత వాల్టర్ రస్సెల్ మీడ్ తన వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో అభిప్రాయపడ్డారు . పైగా దీన్ని చాలా తక్కువ మందే అవగతం చేసుకోగలరని వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో పేర్కొన్నారు. బీజేపీ 2014, 2019 వరుస విజయాలతో అధికారాన్ని చేజిక్కించుకున్న పార్టీ అదే గెలుపును 2024లో రిపీట్ చేసి విజయపథంలోకి దూసుకుపోతుందని చెప్పారు. భారత్ అగ్రగామి ఆర్థిక శక్తగా ఎదుగుతుందని, జపాన్‌తోపాటు అమెరికా వ్యూహ రచనలో అగ్రగామిగా నిలుస్తుందని తన జర్నల్ ప్రచురణలో పేర్కొన్నారు. భవిష్యత్తులో పెరుగుతున్న చైనా శక్తిని సమతుల్యం చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు వంటి వాటితో సంబంధం లేకుండానే భారత్‌లోని బీజేపీ తనదైన శైలిలో దూసుకుపోతోంది. భారతీయేతరులందరికీ బీజేపీ రాజకీయ, సాంస్కృతిక చరిత్ర నుంచి అభివృద్ధి చెందుతుందన్న విషయం తెలియదని రచయిత మీడ్ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు అస్పష్టమైన సామాజిక ఉద్యమంలా ఉండే బీజేపీని సామాజిక ఆలోచనాపరులు, కార్యకర్తలు తమ కృషితో ఆధునికరణకు తగట్టుగా విలక్షణమైన హిందూ మార్గాన్ని రూపొందించి ఎన్నికల్లో గెలుపును అందుకుని ఆధిపత్యం వహించే స్థాయికి ఎదిగేలా చేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. చైనా కమ్యూనిస్ట్ వలే బిలియన్ల కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న దేశాన్ని ప్రపంచ సూపర్ పవర్‌గా ఎదిగేలా చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇజ్రాయెల్‌లోని లికుడ్ పార్టీ మాదిరిగానే బీజేపీ కూడా కాస్మోపాలిటన్ , పాశ్చాత్య కేంద్రీకృత సాంస్కృతిక, రాజకీయ ప్రముఖుల ఆగ్రహానికి గురైనప్పటికీ వాక్చాత్యుర్యం, సంప్రదాయవాద విలువలతో కూడిన ఆర్థిక వైఖరిని మిళితం చేస్తోందని మీడ్ అన్నారు. భారత్‌లోని ఈశాన్య ప్రాంతంలో క్రైస్తవులు అధికంగా ఉన్నరాష్ట్రలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి విజయకేతనం ఎగరువేయగలిగిందని తెలిపారు.. అంతేగాదు భారత్‌లో అతిపెద్ద రాష్ట్రమైన ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం షియా ముస్లింలు నుంచి బలమైన మద్దతు పొందినట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు నుంచి మతపరమైన విద్య వరకు అన్ని పనులను ఆయా వర్గాల నుంచి వచ్చిన వాలంటీర్లచే నిర్వహించేలా చేసి ప్రజల శక్తిని తనపై కేంద్రీకరించేలా చేసుకుని విజయం సాధించింది బీజేపి అని రచయిత మీడ్ తన జర్నల్ వివరించారు. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో సహా అంతా మెదీ వారసులుగానే మాట్లాడతారని అన్నారు. ఏదీ ఏమైన అట్టడుగున ఉన్న ఉద్యమానికి చెందిన నాయకత్వం అత్యంత శక్తిమంతంగా ఎదగాలని ఆ స్థానాన్ని నిలబెట్టకోవాలని బలంగా కోరుకుంటోందని రూడ్ తన వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: మనీష్ సిసోడియాకు మరోసారి చుక్కెదురు..బెయిల్ విచారణ వాయిదా..) -
అనారోగ్య అగ్రరాజ్యం.. బయటపడిన అమెరికా డొల్లతనం
అమెరికా అనగానే మనలో చాలామంది పులకించిపోతారు. అది అకారణమైనా సకారణమైనా అగ్ర రాజ్యాన్ని బలంగా నమ్ముతారు. అందుకు కొన్ని సత్యాలు, కొన్ని అర్ధసత్యాలు, మరిన్ని అసత్యాలు కారణం కావచ్చు. అలాంటి దేశాన్ని ‘అనారోగ్య దేశం’ అనటం నమ్మశక్యం కాదు. అంతగా దాని ప్రతిష్ఠ నెలకొని ఉంది. అయితే అక్కడ కొన్ని అంశాల్లో ప్రగతి తక్కువేమీ కాదు. వాటిలో జీవన ప్రమాణాలు పెరగడం, ఎక్కువ మందికి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటం, పొగత్రాగడం తగ్గటం, వివాహపూర్వ గర్భిణీలు తగ్గడం, జాతుల మధ్య వివక్ష అంతరాలు తగ్గడం లాంటివి ముఖ్యమైనవి. వీటిని పరిశీలించినప్పుడు సాధారణంగా ఆశావహ అంచనాతో అమెరికా అన్ని విధాలా ఆరోగ్యకరమైన దిశగా పయనిస్తోంది అనుకుంటాము. కానీ గత రెండు దశాబ్దాల పరిణామాలను నిశితంగా గమనిస్తే వీటిలో వాస్తవం ఉన్నట్లు కనిపించదు. కోవిడ్–19 నేపథ్యంలో బయటపడిన అమెరికా డొల్లతనం, ఇటీవలి ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ లోని గణాంక వివరాలు ఇందుకు తార్కాణం. అమెరికాలో శిశుమరణాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. 2019లో కోవిడ్–19 ముందు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో– ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) దేశాల్లో అమెరికా స్థానం చాలా దేశాల కన్నా ఈ విషయంలో అథమ స్థితిలో ఉంది. అమెరికన్ల జీవన ప్రమాణం జర్మనీ కన్నా 2.5 ఏళ్లు, కెనడా కన్నా 3.2 ఏళ్లు, ఫ్రాన్స్ కన్నా నాలుగు సంవత్సరాలు తక్కువగా ఉంది. యూరో పియన్ యూనియన్, ఆసియాకు చెందిన ఓఈసీడీ దేశాల్లోకన్నా తక్కువగా... 33వ స్థానంలో ఉంది. కోవిడ్ మృత్యుహేల అమెరికాలోని పరిస్థితులను మరింత దిగజార్చింది. కోవిడ్ మరణాలు అన్ని సంపన్న దేశాల్లో కన్నా అక్కడ ఎక్కువగా నమోద య్యాయి. అమెరికాలో ప్రతి లక్ష మందికి 332 మరణాలు సంభవించగా ఫ్రాన్స్‌లో ఇవి 240, జర్మనీలో 194, కెనడాలో 128. అలాగే అమెరికాలో జీవన ప్రమాణం 2021లో 76.4కి పడిపోయింది. ఇది 1996 తర్వాత అతి తక్కువ. దీనితో అక్కడ ఓ పాతిక సంవత్సరాల ప్రగతి తుడిచిపెట్టుకు పోయినట్లయింది. ఇదే సమయంలో అక్కడ మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుదల మరో రకపు ప్రతికూలత సూచిస్తోంది. అక్కడి పౌర సమాజంలో అధిక సంఖ్యాకులలో గల ఊబకాయం అనేక రకాల రుగ్మతలకు కారణంగా పరిగణిస్తున్నారు. జీవన ప్రమాణాలు ఉండవలసిన స్థాయిలో ఉండకపోవడానికి ఇదొక కారణంగా పేర్కొంటున్నారు. 2000 నుండి 2020 సంవత్సరం వరకూ ఊబకాయులు 30.5 శాతం నుండి 41.9 శాతానికి పెరిగారు. ఊబకాయం అనేక వ్యాధులకు కారకం. వాటిలో ముఖ్యమైనది చక్కెర వ్యాధి. మొత్తంగా అమెరికాలోని ఈ పరిస్థితులను గమనించినప్పుడు... అక్కడి గొప్పదైన సంపద, వైద్య సాంకేతికత, అత్యంత ఎక్కువ ఆరోగ్య సంరక్షణ తలసరి వ్యయం, ప్రజారోగ్య వ్యవస్థ వంటి సమస్తం సంక్షోభంలో ఉండి అత్యంత పేలవంగా పనితీరు కనపరుస్తూ ఉన్నట్లు స్పష్టమౌతుంది. మెరిసేదంతా బంగారం కాదనే నానుడిని అమెరికా ప్రస్తుత పరిస్థితి నిరూపిస్తోంది. (క్లిక్ చేయండి: జీవ వైవిధ్యం రక్షణ లక్ష్యాలు నెరవేరేనా?) – బి. లలితానంద ప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ -
Ned Davis Research: ముంచుకొస్తున్న మాంద్యం
ప్రపంచాన్ని మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి. వచ్చే ఏడాదికల్లా ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసేలా కన్పిస్తోంది. కరోనా దెబ్బ నుంచి కోలుకోకముందే వచ్చిపడ్డ రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తదితరాలతో ఆర్థిక వృద్ధి క్రమంగా కుంటుపడుతూ ప్రధాన దేశాలన్నీ మాంద్యం వైపు అడుగులేస్తున్నాయి.... (డి.శ్రీనివాసరెడ్డి) ప్రపంచం ఆర్థిక మాంద్యం బారిన పడటం ఖాయమని ఫ్లోరిడాకు చెందిన నెడ్ డేవిస్ రీసెర్చ్ చెబుతోంది. మాంద్యాన్ని అంచనా వేయడంలో ఈ సంస్థ అందెవేసిన చేయి. దాని లెక్క ప్రకారం వచ్చే ఏడాదికల్లా ప్రపంచం మాంద్యం గుప్పెట్లో చిక్కేందుకు 98.1 శాతం ఆస్కారముంది. వాల్‌స్ట్రీట్ జర్నల్ జూలైలో చేసిన సర్వేలో మాంద్యం తప్పదని 49 శాతం ఆర్థికవేత్తలు పేర్కొనగా అక్టోబర్‌లో వారి సంఖ్య 63 శాతానికి పెరిగింది! 12 నెలల్లోపే అమెరికా మాంద్యం కోరల్లో చిక్కడం ఖాయమని సర్వే తేల్చింది. వర్ధమాన దేశాలపై ఇది సుదీర్ఘ ప్రభావమే చూపవచ్చని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్ఫాస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా, యుద్ధం, వాతావరణ విపరణామాలు ప్రపంచాన్ని అంధకారంలోకి నెడుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎండీ క్రిస్టలినా జార్జివా హెచ్చరించారు. కుంటినడకన ఆర్థికం... చాలా దేశాల్లో జీడీపీ వృద్ధిరేటు నానాటికీ పడిపోతోంది. 2022లో ప్రపంచ ఆర్థిక పురోగతి రేటు 6.1 శాతముంటే 2023 నాటికి ఏకంగా సగానికి సగం పడిపోయి 3.2 శాతానికి పరిమితం కావచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. సంపన్న దేశాల ఆర్థిక వృద్ధి కూడా నేల చూపులే చూస్తోంది. యూరప్ జీడీపీ 1.2 శాతానికి, బ్రిటన్ కేవలం 0.3, ఫ్రాన్స్ 0.7కు పరిమితం కావచ్చని అంచనా. సవరించిన వృద్ధి రేట్ల ప్రకారం చూసినా అమెరికా 1 శాతం, చైనా 3.2 శాతంతో సరిపెట్టుకునేలా ఉన్నాయి. 2016తో పోలిస్తే ప్రపంచ జీడీపీ 23 శాతం పెరగాలన్నది అంచనా కాగా కరోనా, యుద్ధం తదితరాల దెబ్బకు 17 శాతానికే పరిమితమైంది. ఇలా పడిపోయిన ఉత్పాదకత విలువ ఏకంగా 17 లక్షల కోట్ల డాలర్లు. అంటే ప్రపంచ ఆదాయంలో ఏకంగా 20 శాతం! ఎందుకీ దుస్థితి...? కరోనా, యుద్ధం నేపథ్యంలో విపరీతంగా పెరిగిపోయిన ధరలకు కళ్లెం వేసేందుకు ఈ ఏడాది ఏకంగా 90 దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేశాయి. ఈ దెబ్బకు ఉత్పాదకత తగ్గడంతో పెట్టుబడులు, వినియోగం పడిపోయి మాంద్యం ముంచుకొస్తోంది. ధరల అదుపు కోసమని పదేపదే వడ్డీ రేట్లు పెంచితే మాంద్యం బారిన పడక తప్పదని జార్జ్ వాషింగ్టన్ వర్సిటీ ప్రొఫెసర్ పావ్లిన్ టియెన్ అన్నారు. అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపుతో 90 దేశాల కరెన్సీ విలువలు పతనమయ్యాయి. గతేడాది 125.7గా ఉన్న ఆహారోత్పత్తుల ధరల సూచీ ఈ ఏడాది 146.94 పాయింట్లకు పెరిగింది. మాంద్యం దెబ్బకు కంపెనీలు నియామకాలకు కత్తెర వేస్తున్నాయి. అమెరికాలో నిరుద్యోగిత వచ్చే డిసెంబర్ నాటికి 3.7 శాతానికి, 2023 జూన్‌కల్లా 4.7కు పెరుగుతుందని అంచనా. మాంద్యమంటే... మామూలు పరిభాషలో వరుసగా రెండు త్రైమాసికాలు గనక జీడీపీ తిరోగమనంలో సాగితే ఆ దేశంలో మాంద్యంలోకి జారుకున్నట్టు పరిగణిస్తారు. ఇవీ సంకేతాలు... ► సుదీర్ఘంగా సాగేలా కన్పిస్తున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ► డాలర్ ముందు కుదేలవుతున్న అన్ని దేశాల కరెన్సీలు ► చుక్కలనంటుతున్న ద్రవ్యోల్బణం ► వడ్డీరేట్లను పెంచేస్తున్న అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు ► నియామకాలు బాగా తగ్గిస్తున్న కార్పొరేట్ సంస్థలు ► నానాటికీ మందగిస్తున్న ప్రపంచ ఆర్థిక వృద్ధి మనకూ తిప్పలే... మన జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది 6.8 శాతం ఉంటుందని, 2023లో 6.1 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇది మెరుగేనని కితాబిచ్చింది. కానీ మాంద్యం ఎఫెక్ట్ భారత్‌పైనా గట్టిగానే ఉంటుందని అంచనా. అమెరికాకు మన ఎగుమతులు 2011 10.1 శాతముంటే ఇప్పుడు 18.1 శాతానికి పెరిగాయి. మన సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో ఏకంగా 54.8 శాతం అమెరికాకే వెళ్తున్నాయి. అగ్రరాజ్యం మాంద్యంలో చిక్కితే వీటిపై గట్టి ప్రభావమే పడుతుంది. మన విదేశీ మారక నిల్వలు వరుసగా తొమ్మిదో వారమూ తిరోగమన దిశలో ఉన్నట్టు అక్టోబర్ 7నాటి నివేదికలో రిజర్వ్ బ్యాంకే పేర్కొంది. అమెరికాతో భారత వాణిజ్య లోటు 3.8 శాతానికి ఎగబాకుతుందని అంచనా! -
టిక్‌టాక్‌తో చిత్ర విచిత్రంగా కన్ను కొట్టేస్తున్నారు
టిక్ టాక్ ప్రపంచ దేశాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆ ఆకర్షణే భారత్ మినహా మిగిలిన దేశాలకు చెందిన పిల్లల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా లాక్ డౌన్ కారణంగా టిక్ టాక్ వినియోగంతో అనారోగ్యానికి గురై పిల్లలు ఆస్పత్రి పాలవుతున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. భారత కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్‌పై నిషేదం విధించింది. కానీ మిగిలిన దేశాల్లో ఆ యాప్ వినియోగంలో ఉండడం, ఆ యాప్‌ను ఉపయోగించి పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. టిక్ టాక్ వినియోగిస్తున్న వారిలో 'టూరెట్ సిండ్రోమ్' అనే సమస్య ఉత్పన్నమవుతున్నట్లు తేలింది. ముఖ్యంగా పిల్లల నాడీ వ్యవస్థపై ప్రభావం, చిత్ర విచిత్రంగా కన్ను కొట్టడం, ఎక్స్ ప్రెషన్స్, సౌండ్స్ చేయడం లాంటి రుగ్మతలు ఎక్కువయ్యాయి. ఇటీవల జర్మనీకి చెందిన పలు ఆస్పత్రులకు ఈ తరహా సమస్యలతో బాధపడే యువతీ యువకులు ట్రీట్మెంట్ కోసం వస్తున్నారని వాల్‌స్ట్రీట్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. జాతీయ, అంతర్జాతీయ పలు మెడికల్ రిపోర్ట్‌ల ప్రకారం..లాక్ డౌన్‌కు ముందు టిక్ టాక్ వినియోగించడం వల్ల అనారోగ్యానికి గురై ట్రీట్మెంట్ కోసం నెలకు ఒకరు లేదా ఇద్దరు వచ్చే వాళ్లు. కానీ ఇప్పుడు వారి సంఖ్య 10 మంది నుంచి 20 మందికి పెరిగినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. టూరెట్ సిండ్రోమ్‌కు ట్రీట్మెంట్ చేయడంలో 25 ఏళ్ల అనుభవం ఉన్న జర్మనీలోని హనోవర్‌కు చెందిన డాక్టర్ కిర్‌స్టెన్ ముల్లర్ మాట్లాడుతూ..''టీనేజర్స్,యువతీ యువకులు ఎక్కువ మంది టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారు. వారిలో టూరెట్ సిండ్రోమ్ వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలు ఎక్కువైనట్లు తెలిపారు. ఈ రుగ్మత ఎక్కువగా అబ్బాయిల్ని ప్రభావితం చేస్తుంది. అనారోగ్య సమస్యలు యవ్వనంలో ఉన్నప్పుడు మొదలవుతాయి. తరువాత కాలక్రమేణా అభివృద్ధి చెందుతాయని"అన్నారు.అయితే మరికొంత మంది డాక్టర్లు టీనేజర్స్ ఎదురవుతున్న సమస్య టూరెట్ సిండ్రోమ్ కాదని అంటున్నారు. ఫంక్షనల్ మూవ్మెంట్ డిజార్డర్ అని చెబుతున్నారు. అదిగమించడం ఎలా టిక్ టాక్ వల్ల ఎదురయ్యే సమస్యలకు ట్రీట్మెంట్ చేయవచ్చని తెలుస్తోంది. పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒకవేళ వారు వీడియోలు చేస్తుంటే ఏ తరహా వీడియోలు చూస్తున్నారో తల్లిదండ్రులు గుర్తించాలని అంటున్నారు. ప్రతిరోజు అదే పనిగా టిక్‌టాక్ వీడియోలు చేస్తుంటే తల్లిదండ్రులు వైద్య నిపుణుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. చదవండి: Apple Fired Janneke Parrish: లీకుల పేరుతో ఉద్యోగులపై ఆపిల్ వేటు -
Facebook: ఫేస్బుక్లో ఇష్టమొచ్చినట్లు డర్టీ పోస్టులు
సోషల్ మీడియాలో విచ్చలవిడి కంటెంట్ కట్టడి కోసం ఐటీ చట్టంలో కఠినమైన నిబంధనలు తీసుకొచ్చింది మన ప్రభుత్వం. ఇది ఒక కోణం. అలాగే ప్రతీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు స్వతహాగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అయితే సోషల్ మీడియాలో దిగ్గజంగా అభివర్ణించే ఫేస్బుక్ తన సొంత రూల్స్‌ను పక్కనపెట్టేస్తోంది. యూజర్లను ‘హైప్రొఫైల్’ కోణంలో విభజించి.. వివక్ష ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో వాళ్లు ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నా.. చూస్తూ ఊరుకుంటోంది. హైప్రొఫైల్ సెలబ్రిటీలు, నటులు, రాజకీయ నాయకులు, ఉన్నత వర్గాలకు చెందిన కొంతమంది యూజర్లు.. తమ ఇష్టమొచ్చినట్లు ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు. వీటిలో న్యూడిటీ, హింస, చైల్డ్ ఎబ్యూజ్, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, ఇతరులను ఇబ్బందిపెట్టే విధంగా.. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కంటెంట్ ఎక్కువగా ఉంటోంది. ఈ లెక్కన ఫేస్బుక్ రూల్స్ ప్రకారం నడుచుకోవడం వాళ్లు లేదు. అయినా ఫేస్బుక్ వాళ్ల అకౌంట్లపై చర్యలు తీసుకోవడం లేదు. సాకర్ ఆటగాడు నైమర్.. తన ఫేస్బుక్లో నగ్నంగా ఉన్న ఓ మహిళ ఫొటోను పోస్ట్ చేశాడు. ఆమె అతనిపై అత్యాచార ఆరోపణలు చేసేంది. అందుకే ప్రతీకారంగా ఆ పని చేశాడు. ఈ విషయంలో అకౌంట్ రద్దుపై ఎలాంటి చర్యలు తీసుకోని ఫేస్బుక్.. కంటితుడుపు చర్యగా ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. ఇది హై ప్రొఫైల్ సెలబ్రిటీల విషయంలో ఫేస్బుక్ వ్యవహరిస్తున్న తీరుకు ఒక ఉదాహరణ మాత్రమే. క్లిక్: జుకర్‌బర్గ్‌పై ట్రంప్ బూతుపురాణం క్వాలిటీ కంట్రోల్ మెకానిజంలో ఫేస్బుక్ దారుణంగా విఫలం అవుతోందని, ఫేస్‌బుక్‌ను డర్టీగా మార్చేసిందన్నది తాజా ఆరోపణ. క్రాస్‌చెక్(Xcheck) పేరుతో ప్రతీ ఏటా విడుదలయ్యే రిపోర్ట్ ఆధారంగా సోమవారం వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. 2020లో లక్షల మంది బ్లూటిక్ మార్క్ ఉన్న సెలబ్రిటీల అకౌంట్లను, రాజకీయ నాయకుల అకౌంట్లను పరిశీలించినట్లు ఆ కథనం వెల్లడించింది. అయితే ఈ కథనాన్ని కొట్టిపడేసిన ఫేస్బుక్ ప్రతినిధి ఆండీ స్టోన్.. ఫేస్బుక్ రూల్స్ అందరికీ ఒకేలా వర్తించడం లేదన్న విషయంతో ఏకీభవించారు. వైట్ లిస్ట్ పేరుతో కొందరు ప్రముఖులకు ఫేస్బుక్ నుంచి మినహాయింపులు ఇస్తుందన్న క్రాస్ చెక్ నివేదిక.. ఆ ప్రముఖుల్లో హిలరీ క్లింటన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాటి పేర్లను సైతం ప్రస్తావించడం విశేషం. చదవండి: వాట్సాప్ మెసేజ్‌లను చదివేస్తున్న ఫేస్బుక్ -
జుకర్‌బర్గ్‌కు కాంగ్రెస్ మళ్లీ లేఖ
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ మరోసారి లేఖ రాసింది. సంస్థకు చెందిన భారతీయ విభాగం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ పదేపదే వస్తున్న ఆరోపణలపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ఆ సంస్థ సీఈవో జుకర్‌బర్గ్‌ను ప్రశ్నించింది. ఫేస్బుక్ ఉద్యోగులు, అధికార బీజేపీ మధ్య సంబంధాలున్నాయన్న ఆరోపణలపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఈ విషయం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇదే అంశంలో ఆగస్టు 17వ తేదీన కూడా జుకర్‌బర్గ్‌కు లేఖ రాసిన విషయం గుర్తు చేశారు. కొందరు బీజేపీ నేతల విద్వేష పూరిత ప్రసంగాల విషయంలో నిబంధనలను ఫేస్బుక్ వర్తింపజేయలేదంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో వచ్చిన కథనంపై దర్యాప్తు చేయించాలంటూ అప్పట్లో కోరామన్నారు. ‘ఆగస్టు 27వ తేదీన టైమ్ మ్యాగజీన్లో వచ్చిన తాజా కథనంలో ఫేస్బుక్ ఇండియా– అధికార బీజేపీ మధ్య క్విడ్–ప్రొ–కో లింకులున్నాయన్న ఆరోపణలకు సంబంధించి మరింత సమాచారంతోపాటు ఆధారాలు కూడా ఉన్నాయి. 17వ తేదీన మేం రాసిన లేఖపై ఎలాంటి చర్యలు తీసుకున్నదీ వివరంగా తెలపాలని తాజా లేఖలో ఫేస్‌బుక్‌ను కోరాం’అని వేణుగోపాల్ వివరించారు. కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా, ఏఐసీసీ డేటా అనలిస్టిక్స్ విభాగం చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. పార్లమెంటరీ కమిటీ సూచించే చర్యలను ఫేస్బుక్ అమలు పరిచే వరకు, విచారణ పూర్తయ్యేవరకు ఫేస్బుక్ ‘పేమెంట్ ఆపరేషన్స్’కు అనుమతి ఇవ్వరాదన్నారు. భారత విభాగం ఉద్యోగులపై చేపట్టిన దర్యాప్తులో తేలిన విషయాలను ఫేస్బుక్ బహిర్గతం చేయాలని కూడా వారు కోరారు. టైమ్ మ్యాగజీన్ కథనంతో బీజేపీ–వాట్సాప్ సంబంధాలు మరోసారి బయటపడ్డాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘వాట్సాప్‌కు 40 కోట్ల మంది భారతీయ వినియోగదారులున్నారు. ఈ యాప్ కూడా చెల్లింపుల వేదికగా మారాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు మోదీ ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటుంది. ఇదే అదనుగా వాట్సాప్పైనా బీజేపీ అదుపు సాధించింది’అని ట్విట్టర్లో రాహుల్ పేర్కొన్నారు. టైమ్ మ్యాగజీన్ కథనాన్ని జత పరిచారు. -
సోషల్ మీడియా వేదికగా మతవిద్వేషం
ముంబై: సోషల్ మీడియా వేదికగా బీజేపీ దేశంలో మత విద్వేషాన్ని వ్యాపింపచేస్తోందని శివసేన ఆరోపించింది. ఈ మేరకు పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్బుక్ చూసీచూడనట్లుగా వదిలేస్తోందనే వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం రాజకీయ వేడిని రగిలించిన సంగతి తెలిసిందే. దీనిపై శివసేన స్పందించింది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని బీజేపీ గత ఎన్నికల్లో ఎంతో లాభపడటమే కాక.. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మత విద్వేశాన్ని వ్యాప్తి చేసి రాజకీయంగా బలపడిందని ఆరోపించింది. బీజేపీపై ఫేస్బుక్ చర్యలు తీసుకోకపోవడం పట్ల శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఫేస్బుక్ వేదికగా ఎవరైనా సరే దేశాన్ని విభజించడానికి ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తే.. వారు ఏ పార్టీకి చెందినవారు అనే దానితో సంబంధం లేకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీ అయినంత మాత్రాన కళ్లుమూసుకుని కూర్చోకూడదు’ అంటూ శివసేన తీవ్రంగా విమర్శించింది. (విద్వేషంపై ఉదాసీనత) అంతేకాక ‘బీజేపీ నాయకులు ఈ సోషల్ మీడియా వేదికలను సమాజాన్ని అనుసంధానించడానికి బదులు ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి వినియోగిస్తున్నారు. ఈ వేదికలు రాజకీయ పార్టీల కనుసన్నల్లో మెలుగుతాయి. 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ సోషల్ మీడియా సైన్యం బీజేపీకి ఎంతో సహకరించింది. అందువల్లే మోదీ నాయకత్వంలోని బీజేపీ విజయం సాధించింది’ అని తెలిపింది. అంతేకాక ‘గత ఏడు సంవత్సరాలలో సత్యాన్ని వక్రీకరించి.. అబద్దాన్ని వాస్తవాలుగా చూపిస్తూ.. బహిరంగంగా ప్రచారం చేశారు. రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలు, పుకార్లు ప్రచారం చేశారని’ శివసేన ఆరోపించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీద సోషల్ మీడియాలో చాలా కాలం వరకు మీమ్స్, జోకులు ప్రచారంలో ఉన్నాయని సామ్నా ఎత్తి చూపింది. అయితే ఇప్పుడు అదే వేదిక మీద మోదీ, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌పై ఆగ్రహం వ్యక్తం అవుతోందన్నది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. శివసేన వ్యాఖ్యలు హాస్యాస్పాదంగా ఉన్నాయన్నది. (బీజేపీకి వత్తాసు : ఫేస్బుక్ క్లారిటీ) -
ఫేస్బుక్ తీరుతో దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్న కాంగ్రెస్
-
విద్వేషంపై ఉదాసీనత
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ఫేస్బుక్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేసింది. భారత్‌లోని బీజేపీకి చెందిన కొందరు నేతల విద్వేషపూరిత పోస్టులపై ఫేస్బుక్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ అమెరికా ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’లో వచ్చిన కథనంపై ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించిన విషయం తెలిసిందే. ఈ కథనంపై రాజకీయ దుమారం రేపడంతో సోమవారం ఫేస్బుక్ స్పందించింది. హింసను ప్రేరేపించే విద్వేష పూరిత అంశాలను అడ్డుకుంటున్నామని, రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాన్ని పాటిస్తున్నామని వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా, తనను కొందరు ఆన్లైన్లో తీవ్రంగా బెదిరిస్తున్నారనీ, ప్రాణహాని ఉందంటూ ఆ సంస్థ ఉన్నతాధికారిణి ఒకరు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్బుక్ చూసీచూడనట్లుగా వదిలేస్తోందంటూ ఇటీవల వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ఒక కథనం వెలువడింది. మత విద్వేష వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలున్న తెలంగాణకు చెందిన ఒక బీజేపీ ఎమ్మెల్యేపై శాశ్వత నిషేధం విధించాలని తీసుకున్న నిర్ణయం భారత్‌లోని తమ ఉన్నతాధికారి జోక్యం కారణంగా ఆగిపోయిందని ఫేస్బుక్ ఉద్యోగులు కొందరు తెలిపారంటూ ఆ కథనంలో పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం స్పందించారు. ‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ భారత్‌లో ఫేస్బుక్, వాట్సాప్‌లను నియంత్రిస్తున్నాయి. వీటి ద్వారా తప్పుడు వార్తలను, విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తున్నాయి’అని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ ప్రతినిధి సుప్రియా శ్రీనాతే సోమవారం మీడియాతో మాట్లాడుతూ..ప్రపంచంలో ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్‌లో.. విద్వేషాన్ని ప్రేరేపించే వ్యక్తులు లేదా వేదికలను వదలకూడదు. ఫేస్బుక్ నిష్క్రియాపరత్వం ఫలితంగా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతుంది. అభ్యంతరకర అంశాలు ఆ సంస్థ దృష్టికి వచ్చినప్పటికీ కొనసాగించడంతోపాటు ఎలాంటి చర్య తీసుకోకపోవడం హాస్యాస్పదం, ఘోరం’అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని కోరారు. ఇతర దేశాల్లో వదంతులు సృష్టించే, విద్వేషాలను పెంచే పోస్టులను తొలగించే ఫేస్బుక్.. భారత్‌లో మహిళలపై వేధింపులు, కొన్ని వర్గాలను, మతాలను లక్ష్యంగా చేసుకుని పెట్టే పోస్టులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ విధంగా ఒక్కో దేశానికి ఒక్కో నిబంధనను ఫేస్బుక్ అమలు చేయడం సరికాదని తెలిపారు. ఫేస్‌బుక్‌తోపాటు వాట్సాప్‌లోనూ వదంతుల వ్యాప్తి, విద్వేషపూరిత సమాచారంపై అదుపూ లేదన్నారు. ఫేస్బుక్–బీజేపీ కుమ్మక్కు: సీపీఎం విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఫేస్బుక్ ఉద్దేశపూర్వకంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ వాల్‌స్ట్రీట్ కథనంలో వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీపీఎం డిమాండ్ చేసింది. అధికార పార్టీ నేతలకు ఫేస్బుక్లో పెట్టుబడులున్నాయనీ, కేంద్రంతో ఆ సంస్థ కుమ్మక్కయిందని సీపీఎం పొలిట్ బ్యూరో ఆరోపించింది. ఈ వ్యవహారంపై వెంటనే జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. నాకు ప్రాణహాని ఉంది: ఫేస్బుక్ అధికారిణి తనకు ప్రాణహాని ఉందని, చంపుతామని బెదిరిస్తూ కొందరు ఆన్లైన్లో పోస్టులు పెడుతున్నారంటూ ఫేస్బుక్ సంస్థ సౌత్ అండ్ సెంట్రల్ ఏసియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంఖి దాస్ ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్ వ్యవహారంపై ఒకపక్క రాజకీయ దుమారం చెలరేగుతుండగా ఆదివారం ఆమె ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. ‘నా జీవితాన్ని నాశనం చేస్తామని, నన్ను చంపుతామంటూ ఆన్లైన్లో నా ఫొటో పెట్టి మరీ బెదిరిస్తున్నారు. వార్తా కథనాన్ని సాకుగా చూపుతూ నా ప్రతిష్టను దెబ్బతీసేలా, నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆన్లైన్ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్నారు. వీటి కారణంగా నాతోపాటు నా కుటుంబసభ్యుల భద్రత ప్రమాదంలో పడింది’అని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు బాధ్యతలను సైబర్ విభాగానికి అప్పగించినట్లు ఢిల్లీ పోలీస్ విభాగం అదనపు పీఆర్వో అనిల్ మిట్టల్ తెలిపారు. మరింత చేయాల్సి ఉంది: ఫేస్బుక్ వాల్‌స్ట్రీట్ కథనంపై చెలరేగిన రాజకీయ దుమారం నేపథ్యంలో ఫేస్బుక్ ప్రతినిధి స్పందించారు. ‘విద్వేష ప్రసంగాలను, హింసను ప్రేరేపించే అంశాలను మేం అడ్డుకుంటున్నాం. ఏ రాజకీయ పార్టీ లేదా నేతతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాం. ఈ విషయంలో చేయాల్సింది ఇంకా ఉందని మాకు తెలుసు. ఈ ప్రక్రియ నిష్పక్షపాతంగా, కచ్చితత్వంతో ఉండేలా ఆడిట్ చేపట్టాం. ఇది కొనసాగుతుంది’అని తెలిపారు. -
ఫేస్‌బుక్‌ను బీజేపీ నియంత్రిస్తోంది: రాహుల్
న్యూఢిల్లీ: బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్బుక్ చూసీచూడనట్లుగా వదిలేస్తోందనే వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం రాజకీయ వేడిని పుట్టించింది. ‘విద్వేషపూరిత ప్రసంగాల నిబంధనల విషయంలో భారత రాజకీయ నాయకులతో ఫేస్బుక్ రాజీపడుతోంది. వివాదాస్పద రాజకీయ నాయకుడిపై నిషేధం విధించడానికి ఫేస్బుక్ ఎగ్జిక్యూటివ్ నిరాకరించారు. బీజేపీ నేతల ఉల్లంఘనలను చూసీచూడనట్లు వదిలేస్తోంది. వారిపై చర్యలకు దిగితే భారత్‌లో కంపెనీ వ్యాపారావకాశాలు దెబ్బతింటాయని ఆయన భావిస్తున్నారు. బీజేపీవైపు ఫేస్బుక్ మొగ్గుచూపుతోంది’అని ఈ సామాజిక మాధ్యమ సంస్థ ప్రస్తుత, మాజీ ఉద్యోగులను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో రాసింది. ఈ కథనాన్ని ట్విట్టర్లో పోస్ట్చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై ధ్వజమెత్తారు. ‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ భారత్‌లో ఫేస్బుక్, వాట్సాప్‌లను నియంత్రిస్తున్నాయి. వీటి ద్వారా తప్పుడు వార్తలను, విదేష్వాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తున్నాయి. చివరకు అమెరికా మీడియా నిజాన్ని బయటపెట్టింది’అని రాహుల్ ట్వీట్ చేశారు. విద్వేష ప్రసంగాల విషయంలో ఏం చేయదలచుకున్నారో ఫేస్బుక్ చెప్పాలన్నారు. -
హెచ్1బీ వీసా రద్దుకు ట్రంప్ ఆలోచన
వాషింగ్టన్: హెచ్1బీ సహా పలు వర్క్ వీసాల జారీని నిలిపేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రచురించింది. కరోనా సంక్షోభం కారణంగా దేశంలో పెద్ద ఎత్తున నిరుద్యోగం ప్రబలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ ఆలోచిస్తున్నారని వెల్లడించింది. పలువురు ఉన్నతాధికారులను ఉటంకిస్తూ వెలువడిన ఆ కథనం ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. (‘ట్రంప్.. తిరిగి బంకర్లోకి వెళ్లు’) ఆ నిర్ణయం అమల్లోకి వస్తే.. కొత్తగా హెచ్1బీ, లేదా ఇతర వర్క్ వీసా వచ్చినవారు అమెరికా వెలుపల ఉంటే, వారికి కూడా దేశంలోకి అనుమతి ఉండదు. అయితే, ఇప్పటికే హెచ్1బీ, ఇతర వీసాలపై అమెరికాలో ఉన్నవారికి ఎలాంటి సమస్య ఉండదు. నిపుణులైన విదేశీయులకు అమెరికాలోని సంస్థలు అమెరికాలో ఉద్యోగ అవకాశం కల్పించేదే హెచ్1బీ వీసా. భారతీయుల్లో చాలామంది ఈ వీసా సాధించాలని కలలు కంటుంటారు. భారత్, చైనాల నుంచి వేలాది మంది వృత్తి నిపుణులను టెక్నాలజీ సంస్థలు ఈ వీసాపై అమెరికాకు తీసుకువస్తుంటాయి. కరోనా సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోయి, ఇండియాకు తిరిగొచ్చిన భారతీయులకు ట్రంప్ తీసుకోనున్న నిర్ణయం అశనిపాతం కానుంది. హెచ్1బీతో పాటు, హెచ్2బీ, జే1, ఎల్1 వీసాలను కూడా రద్దు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే, దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని, పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని వైట్‌హౌజ్ అధికార ప్రతినిధి హోగన్ గిడ్లీ స్పష్టం చేశారు. ఇలాంటి నిర్ణయం అమెరికా సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, సంస్థలకు అవసరమైన నిపుణులైన ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని హెచ్చరిస్తూ ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్‌నకు యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ సీఈఓ థామస్ డోనోహూ ఒక లేఖ రాశారు. (జార్జ్ ఫ్లాయిడ్ సోదరుడి ఆవేదన) -
సౌదీ రాజుకు వ్యతిరేకంగా కుట్ర
రియాద్: సౌదీ అరేబియా రాజును గద్దె దింపేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై అధికారులు ముగ్గురు యువరాజులను అరెస్ట్ చేశారు. రాజు సల్మాన్ తమ్ముడు అహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, దగ్గరి బంధువు మహమ్మద్ బిన్ నయేఫ్లు ఇందులో ఉన్నట్లు అమెరికా మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. శుక్రవారం ఉదయం యువరాజులు ముగ్గురిని వారి ఇళ్ల నుంచి అరెస్ట్ చేసినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. సౌదీ రాజు సల్మాన్‌తోపాటు ఆయన కొడుకు మహ్మద్ బిన్ సల్మాన్‌లను గద్దె దింపేందుకు కుట్ర పన్నినట్లు వీరిపై న్యాయస్థానంలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఆరోపణలు రుజువైతే నిందితులకు జీవితకాల ఖైదు లేదంటే మరణ శిక్ష పడే అవకాశం ఉంది. నయేఫ్తోపాటు ఆయన తమ్ముడు నవాఫ్ బిన్ నయేఫ్ కూడా అరెస్ట్ అయినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. -
ఒక్క శీర్షిక... దేశ బహిష్కరణ!
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు చెందిన ముగ్గురు విలేకరులను చైనా ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరించింది. ఫిబ్రవరి 3 వ తేదీన ప్రచురితమైన ఒపీనియన్ పీస్‌లో చైనాను ‘ఆసియా ఖండపు నిజమైన రోగి’గా అభివర్ణిస్తూ వాల్‌స్ట్రీట్ శీర్షిక పెట్టింది. దీనిపై చైనీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘శీర్షిక’పై స్పందించిన చైనా విదేశాంగ శాఖ వాల్‌స్ట్రీట్ బ్యూరో చీఫ్ జోష్ చిన్, రిపోర్టర్ చావో డెంగ్‌ను దేశం వదిలి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. వీరిరువురు అమెరికా పౌరులు కాగా వీరితో పాటు ఆస్ట్రేలియాకు చెందిన రిపోర్టర్ ఫిలిఫ్ వెన్ను కూడా 5 రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ విషయం గురించి చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జన్షాంగ్ మాట్లాడుతూ.. వాల్‌స్ట్రీట్ పత్రిక వివక్షను చూపుతూ అలాంటి శీర్షికను పెట్టిందని, బాధ్యతరహితంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. చైనా ప్రజలు ఈ విషయాన్ని హర్షంచడంలేదని, దీనిని చైనాపై చేస్తున్న దాడిగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన వాల్‌స్ట్రీట్ సీఈఓ మాట్లాడుతూ అభిప్రాయాన్ని తెలిపే సిబ్బంది, వార్తలు అందించే సిబ్బంది వేరుగా ఉంటారని తెలిపారు. ఆ వార్తతో జర్నలిస్టులకు సంబంధం లేదని వారి బహిష్కరించడం విచారకరమన్నారు. దీనిపై మరోసారి పునరాలోచించాల్సిందిగా విదేశాంగశాఖ మంత్రిని అభ్యర్ధించనున్నట్లు తెలిపారు. ఇక కోవిడ్-19(కరోనా వైరస్) కారణంగా చైనాలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఇలాంటి వార్త రాయడం పట్ల ఆ దేశ ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చైనా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు ఒకేసారి ముగ్గురు జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించడం ఇదే ప్రథమం. -
టిక్‌టాక్‌తో యువతకు ఐసిస్ వల
యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్ గ్రూప్ (ఐసిస్) రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతుంది. యువత విశేషంగా వాడుతున్న టిక్‌టాక్ ద్వారా వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. 500 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉన్న టిక్‌టాక్‌ను వేదికగా చేసుకుని 16 - 24 సంవత్సరాల వయసున్న యువతకు ఐసిస్ వల వేస్తున్నట్టు వెల్లడైంది. చిన్న చిన్న వీడియోలను పోస్ట్ చేసి యువతను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఐసిస్ సంబంధిత అకౌంట్ల నుంచి ఈ వీడియోలు పోస్ట్ చేసినట్టు గుర్తించిన టిక్‌టాక్ ఈ ఖాతాలను తొలగించినట్టు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ తెలిపింది. సిరియా నుంచి అమెరికా తన దళాలను వెనక్కి తీసుకోవడంతో పోరాటాన్ని ఉధృతం చేయాలని ఐసిస్ భావిస్తోంది. ఇందులో భాగంగా యువతను పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేసేందుకు టిక్‌టాక్‌ను వేదికగా వాడుకుని ప్రచారం చేస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న రెండు డజన్ల ఖాతాలను గుర్తించి శాశ్వతంగా తొలగించినట్టు టిక్‌టాక్ ప్రకటించింది. ఐసిస్ సాగిస్తున్న ప్రచారం తమ కంపెనీ నియమాలకు విరుద్ధమని, ఉగ్రవాద వీడియోలను తమ మాధ్యమంలో స్థానం లేదని స్పష్టం చేసింది. అయితే అత్యధిక యూజర్లను కలిగియున్న భారత్‌లోనూ టిక్‌టాక్ పెను సవాళ్లు ఎదుర్కొంటుంది. హింసను ప్రేరేపించే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సైబర్ వేధింపులు వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే టిక్‌టాక్‌ను కేంద్ర ప్రభుత్వం పలుసార్లు హెచ్చరించడంతో పాటు కొన్ని వారాలపాటు నిషేధించింది. టిక్‌టాక్ మాధ్యమంగా #ఆరెస్సెస్, #రామమందిరం, #హిందూ, #బీజేపీ వంటి హాష్ ట్యాగ్‌లను ఉపయోగించి కొందరు హిందు అతివాదులు విద్వేషపూరిత వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఒక్క భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్ సవాళ్లు ఎదుర్కొంటొంది. ఇరవైకి పైగా దేశాలలో టిక్‌టాక్ వినియోగదారులు ఉన్నారు. -
ఇకపై ఫేస్బుక్లో వార్తలు
శాన్ఫ్రాన్సిస్కో: ఇకపై ఫేస్బుక్లో మిత్రులు, బంధువుల పోస్టులతో పాటు వార్తలు సైతం కనిపిస్తాయి. ఫేస్బుక్ అధికారికంగా తెస్తున్న ఈ వార్తలను ప్రత్యేక ఫీడ్ (ట్యాబ్)లో ఉంచనుంది. వార్తలను వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెందిన పబ్లిషర్ న్యూస్ కార్ప్ నుంచి వచ్చేలా చర్యలు తీసుకోనుంది. రానున్న కొద్ది వారాల్లో దీనికి సంబంధించిన అప్డేట్ రానుంది. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ కో ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. జర్నలిజం విలువను గుర్తించినందుకు ఫేస్‌బుక్‌కు క్రెడిట్ దక్కుతుందని న్యూస్ కార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ థామ్సన్ అన్నారు. ఈ వార్తాసంస్థతో ఉన్న ఒప్పంద విలువ మాత్రం బయటకు రాలేదు. ఫీడ్‌లో ఏ వార్తలు టాప్‌లో ఉండాలో ఒక బృందం నిర్ణయిస్తుంది. ఇటీవలి కాలంలో ఫేస్బుక్లో ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతూ పలువురి ప్రాణాలు బలిగొంటున్న సంగతి తెలిసిందే. ఇటువంటి ఫేక్ న్యూస్‌ను అధికారిక వార్తా సంస్థల ద్వారా వచ్చే వార్తలతో అడ్డుకట్ట వేయవచ్చని పలువురు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ వంటి ప్రముఖ సామాజిక మాధ్యమాల ధాటికి వార్తా సంస్థలకు వినియోగదారులు రోజురోజుకూ కొంత తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సమస్యలకు ఇది పరిష్కారమార్గమని కూడా నిపుణులు చెబుతున్నారు. ఫేస్బుక్లో యూజర్ ఇంటరెస్ట్ ఆధారంగానే పలు పోస్టులు వచ్చినట్లు.. యూజర్ ఇంటరెస్ట్ ఆధారంగానే వార్తలు కూడా ప్రత్యేక ఫీడ్(ట్యాబ్)లో కనిపించనున్నాయి. -
5 లక్షల గూగుల్ ప్లస్ ఖాతాల డేటా లీక్?
కాలిఫోర్నియా: ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌కు చెందిన సామాజిక మాధ్యమం గూగుల్ ప్లస్‌లోని 5 లక్షల ఖాతాల సమాచారం లీకై ఉండొచ్చని తాజా సమాచారం. గూగుల్ ప్లస్‌లో తలెత్తిన ఓ సాంకేతిక సమస్య కారణంగా 2015 నుంచి 2018 మార్చి మధ్య కాలంలో ఈ సమాచారం లీక్ అయ్యుంటుందని తెలుస్తోంది. అలాగే దాదాపు 10 నెలలపాటు సాధారణ వినియోగదారులు గూగుల్ ప్లస్‌ను వినియోగించకుండా సేవలను కంపెనీ ఉపసంహరిస్తోంది. అయితే గూగుల్ ప్లస్ కార్పొరేట్ సేవలు మాత్రం కొనసాగుతాయి. గూగుల్ ప్లస్‌లో ఉండిన సాంకేతిక లోపాన్ని తెలుసుకుని వినియోగదారుల సమాచారాన్ని ఎవరైనా దొంగిలించి ఉంటారని తాము భావించడం లేదనీ, ఈ లోపం గురించి ఎవరికీ తెలీదని గూగుల్ తెలిపింది. విచారణ సంస్థలకు భయపడి గూగుల్ ఈ సమాచారాన్ని దాచేస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. -
ఆ ఆటో దిగ్గజంలోనూ ఉద్యోగాలు కట్
మిచిగాన్ : టెక్ దిగ్గజంలోని ఉద్యోగాల కోత ఇప్పుడు ఆటో కంపెనీలకు పాకినట్టుంది. ఫోర్డ్ మోటార్ కంపెనీ కూడా తమ స్టాఫ్ కు కోత పెట్టాలని ప్లాన్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 10 శాతం తగ్గించుకోవాలని ఫోర్డ్ మోటార్ భావిస్తున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసింది. లాభాలను పెంచడానికి తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఫోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ ఫీల్డ్స్, స్టాక్ ధర వెనుకబాటును, లాభాల పెంపుకోసం తీవ్రంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు ఈ రిపోర్టు పేర్కొంది. ఈ వారంలోనే ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగాల కోత ఉంటుందని వాల్ స్ట్రీట్ తెలిపింది. ముఖ్యంగా టార్గెట్ శాలరీ ఉద్యోగులను ఇంటికి పంపించేస్తారని న్యూస్ పేపర్ పేర్కొంది. అయితే గంట లెక్కన పనిచేసే ఫ్యాక్టరీ వర్కర్లపై ఏ మేరకు ప్రభావం ఉంటుందో ఇంకా స్పష్టం కాలేదని ఈ జర్నల్ వెల్లడించింది. అలాన్ ములల్లిని రీప్లేస్ చేస్తూ ఫోర్డ్ సీఈవోగా మార్క్ ను నియమించిన దగ్గర్నుంచి కంపెనీ షేర్లు 36 శాతం పడిపోయాయి. ఆయన అవలంభిస్తున్న వ్యూహాలపై కంపెనీ బోర్డు సభ్యులు కూడా తీవ్రంగా ప్రశ్నలు సంధిస్తున్నారు. మార్క్ ఎక్కువగా వందల కోట్ల కొద్దీ మొత్తాన్ని ఎలక్ట్రిక్ ఆటోలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రైడ్-షేరింగ్ ఎక్స్ పర్మెంట్లపైనే వెచ్చిస్తున్నారు. దీంతో కంపెనీ సంప్రదాయ వ్యాపారం నష్టాల్లో కొనసాగుతుందని బోర్డు సభ్యులు మండిపడుతున్నట్టు తెలుస్తోంది. అసలకే నెమ్మదించిన అమెరికా మార్కెట్లో తన ప్రత్యర్థి జనరల్ మోటార్స్ కంపెనీతో పోటీపడటం కంపెనీకి క్లిష్టతరంగా మారింది. ఫోర్డ్ తన మార్చి క్వార్టర్ ఫలితాల్లోనూ 42 శాతం పడిపోగా, జనరల్ మోటార్స్ లాభాలను నమోదుచేసింది. ఈ ప్రభావం ఉద్యోగులపై వేటుకు దారితీస్తుందని మార్కెట్ వర్గాలంటున్నాయి. ఫోర్డ్ కంపెనీలో 201000 మంది ఉద్యోగులుండగా.. వారిలో 1,01,000 మంది నార్త్ అమెరికాలోనే ఉన్నారు. -
నోట్ 7 పేలుడుకు అసలు కారణమిదే!
సియోల్ : శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గెలాక్సీ నోట్ 7 ఆ కంపెనీ కొంపమొచ్చింది. బ్యాటరీ పేలుళ్లతో ఒక్కసారిగా దాని పేరు, పత్రిష్ట, మరోవైపు నుంచి లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. రీకాల్ చేసి కొత్త ఫోన్లు మార్కెట్లోకి తీసుకొచ్చినా పేలుళ్ల సమస్య మాత్రం ఆ కంపెనీని వీడలేదు. దీంతో మొత్తానికే గెలాక్సీ నోట్7 అమ్మకాలు, ఉత్పత్తి నిలిపివేసి అసలు కారణమేమిటా? అని శోధించడం ప్రారంభించింది. ఎట్టకేలకు ఈ పేలుళ్ల కారణాన్ని శాంసంగ్ పట్టేసిందట. గెలాక్సీ నోట్7 ఫోన్లకు సరిపడ పరిమాణంలో లేని బ్యాటరీలను ఫిక్స్ చేయడం వల్లనే అవి ఓవర్‌హీట్ అయి పేలుతున్నాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ శుక్రవారం రిపోర్టు చేసింది. సోమవారం రోజు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను దక్షిణ కొరియా దిగ్గజం ప్రజల ముందుకు తీసుకురానుంది. ఈ నేపథ్యంలో సంబంధిత వర్గాల సమాచారం మేరకు శాంసంగ్ కనుగొన్న కారణాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించేసింది. కంపెనీకి సమస్య తీసుకొచ్చిన బ్యాటరీల పరిమాణం సరిగ్గా లేదని, దీనివల్ల అవి ఓవర్‌హీట్ అవుతున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కంపెనీ తీసుకొచ్చిన ఈ నోట్7 డివైజ్‌లు పేలుళ్ల బారిన పడి, వినియోగదారులకు చిరాకు తెప్పించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో కంపెనీ నోట్7 ఫోన్లను రీకాల్ చేయడం ప్రారంభించింది. 2.5 మిలియన్ యూనిట్లను రీకాల్ చేస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. రీప్లేస్మెంట్లో కొత్త ఫోన్లను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ శాంసంగ్‌ను పేలుళ్ల సమస్య వదలేదు. ఈ నేపథ్యంలో మొత్తానికే నోట్7ను ఆపివేస్తే బాగుంటుందని శాంసంగ్ నిర్ణయించింది. పేలుళ్ల బ్యాటరీలను కంపెనీకి బ్యాటరీల సప్లయర్‌గా ఉన్న ఓ సంస్థ సరఫరా చేస్తుందని శాంసంగ్ చెబుతోంది. తమ తప్పేమి లేదంటూ వాదిస్తోంది. కానీ ఆ సప్లయర్ పేరును మాత్రం శాంసంగ్ వెల్లడించడం లేదు. అయితే ఆ కంపెనీ ఈ దక్షిణ కొరియా దిగ్గజానికి చెందినదేనని, శాంసంగ్ ఎస్డీఐగా పలువురు పేర్కొంటున్నారు. ఈ కంపెనీ శాంసంగ్‌కు అవసరమైన బ్యాటరీలను రూపొందిస్తోంది. సంస్థకు చెందిన మొత్తం ఉత్పత్తిని పూర్తిగా సంస్కరిస్తుందని, మరో సమస్య తలెత్తకుండా క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్‌ను సంస్కరించనున్నామని శాంసంగ్ వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. -
పాకిస్థాన్‌కు అమెరికా పత్రిక హెచ్చరిక
ఇటీవలి కాలంలో భారతదేశం వైపు అమెరికా మొగ్గు చూపుతున్నట్లే కనిపించినా, మరోవైపు పాకిస్థాన్‌కు కూడా సాయం చేస్తూనే ఉంటుంది. అలాంటిది అమెరికాలోని ప్రఖ్యాత పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ తొలిసారిగా పాకిస్థాన్‌ను హెచ్చరిస్తూ ఓ కథనం ప్రచురించింది. భారత ప్రధాని నరేంద్రమోదీ స్నేహహస్తం చాస్తున్నారని, దాన్ని నిరాకరిస్తే మాత్రం పాక్ ఓ పనికిమాలిన దేశంగా మిగిలిపోతుందని తెలిపింది. భారతదేశం వ్యూహాత్మకంగానే సహనం పాటిస్తోందని, కానీ దాన్ని అలుసుగా తీసుకుంటే నష్టపోయేది పాకిస్థానేనని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. మోదీ ప్రస్తుతానికి సహనం పాటిస్తున్నారని, కానీ ఇస్లామాబాద్ ఈ వైఖరి ఎక్కువకాలం అవలంబించడం సరికాదని, అలా చేస్తే ఇప్పుడు ఉన్నదానికంటే పనికిరాని దేశంగా పాక్ మిగిలిపోతుందని చెప్పింది. సరిహద్దుల్లో ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరాను పాక్ కొనసాగిస్తే, భారత ప్రధానమంత్రి దానికి గట్టిగా సమాధానం చెప్పగలరని తెలిపింది. ఉగ్రవాద విషయంలో భారత్ నైతిక విలువలను ఎప్పుడూ పాటిస్తూనే ఉందని, కానీ ఆ విషయాన్ని గట్టిగా చెప్పడానికి గతంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ధైర్యం చేయలేకపోయాయని ఆ కథనం పేర్కొంది. ఆ వ్యూహాత్మక మౌనం వల్ల పాకిస్థాన్ ఎన్నిసార్లు దాడులకు పాల్పడినా.. ఆ ఉగ్రవాదానికి ఎప్పుడూ బాధ్యురాలిగా చేయలేదని కూడా తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎలాంటి సైనిక చర్య తీసుకోకూడదన్న ప్రధాని మోదీ నిర్ణయాన్ని అమెరికన్ పత్రిక ప్రశంసించింది. దానికి బదులు పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరిని చేసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది. 1960 నాటి సింధు నదీజలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను తప్పించడం లాంటి చర్యల ద్వారా పాక్‌ను అణగదొక్కే ప్రయత్నాలపై ఆలోచిస్తున్నారని కథనంలో వివరించింది. ఉడీ ఉగ్రదాడి తర్వాత భారత విధాన నిర్ణేతలకు తీవ్రస్థాయిలో కోపం, చికాకు వచ్చాయని, దాంతో తక్షణం సైనిక చర్య తీసుకోవాలన్న ఒత్తిడులు కూడా వచ్చాయని ఆ పత్రిక చెప్పింది. భారీ సైనిక దాడి చేస్తే ప్రజల్లో ఉన్న ఆవేశం కూడా కొంతవరకు తగ్గుతుందని.. కానీ దానివల్ల భారత ప్రభుత్వ రాజకీయ, ఇతర ప్రయోజనాలు నెరవేరుతాయో లేదో మాత్రం అనుమానమేనని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. -
మీడియా సంస్థలతో ఫేస్బుక్ భారీ డీల్
ఆన్ లైన్ వార్తలో ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, మీడియా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. 500లక్షల డాలర్లకు పైగా విలువైన డీల్స్ ను మీడియా కంపెనీలతో, సెలబ్రిటీలతో కుదుర్చుకున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టు నివేదించింది. తన లైవ్ స్ట్రీమింగ్ సర్వీస్ ల్లో వీడియోలను సృష్టించడానికి, లైవ్ సర్వీసులను పెంచుకోవడానికి మీడియా కంపెనీలతో ఫేస్ బుక్ ఈ డీల్స్ ను కుదుర్చుకుందని తెలుస్తోంది. సీఎన్ ఎన్, న్యూయార్క్ టైమ్స్, వోక్స్ మీడియా, టేస్ట్ మేడ్, మాషేబుల్, హాఫ్పింగ్ టన్ పోస్టు వంటి సంస్థలతో సుమారు 140 డీల్స్ పై సంతకాలు చేసిందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అదేవిధంగా కమెడియన్ కెవిన్ హార్ట్, సెలబ్రిటీ చెఫ్ గోర్డన్ రామ్సే, వెల్ నెస్ గురు దీపక్ చోప్రా, ఎన్ఎఫ్ఎల్ క్వార్టర్ బ్యాక్ రస్సెల్ విల్సన్ వంటి సెలబ్రిటీలతో భాగస్వామ్యంపై ఫేస్ బుక్ సంతాకాలు చేసిందని పేర్కొంది. భాగస్వామ్య విస్తృతి సమితిని తాము పెంచుకోవాలనుకుంటున్నామని, దీంతో సంస్థ నిర్వర్తించే పనులపై వివిధ ఆర్గనైజేషన్ల నుంచి ఫీడ్ బ్యాక్ పొందుతామని ఫేస్ బుక్ గ్లోబల్ ఆపరేషన్స్, మీడియా పార్టనర్ షిప్ వైస్ ప్రెసిడెంట్ జస్టిన్ ఓసోఫ్ స్కే తెలిపారు. యూజర్లకు తాము అందించలేకపోతున్నా సర్వీసులపై కూడా దృష్టిసారించవచ్చని పేర్కొన్నారు. వాల్ స్ట్రీట్ నివేదించిన రిపోర్టు ప్రకారం ఆన్ లైన్ పబ్లిషర్ బుజ్ ఫీడ్ తో 30.5లక్షల డాలర్లతో ఎక్కువ విలువ కల్గిన డీల్ కుదుర్చుకుందని, తర్వాత స్థానాల్లో న్యూయార్క్ టైమ్స్(30.3లక్షల డాలర్లు), సీఎన్ఎన్ తో (25లక్షల డాలర్ల) డీల్స్ ఉన్నాయి.