
రియాద్: సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌పై హత్యాయత్నం జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని పలు అరబ్ మీడియా సంస్థలు సైతం ప్రచురించాయన్నది సదరు సోషల్ మీడియా పోస్టుల సారాంశం. అయితే ఈ విషయంపై అక్కడి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
మరోవైపు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌పై హత్యాయత్న ప్రయత్నం జరిగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. దీంతో.. ఆయన పేరు ఎక్స్ ఖాతాలోట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
కారు బాంబు ఉపయోగించి మహ్మద్ బిన్ సల్మాన్‌పై హత్యాయత్యానికి ప్రయత్నించగా ఆయన సురక్షితంగా బయటపడ్డారన్నది ఆ వైరల్ కథనాల సారాంశం. ఇక ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు కూడా సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్‌గా మారుతున్నాయి. ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ కథనాలకు కాసేపట్లో ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment