సౌదీ అరేబియా రాజుకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌! ఎందువల్ల వస్తుందంటే..? | Saudi Arabias King Salmans Lung Infection: What Causes And Treatment | Sakshi
Sakshi News home page

సౌదీ అరేబియా రాజుకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌! ఎందువల్ల వస్తుందంటే..?

Published Mon, May 20 2024 1:02 PM | Last Updated on Mon, May 20 2024 1:02 PM

Saudi Arabias King Salmans Lung Infection: What Causes And Treatment

సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ తీవ్ర స్వస్థతకు గురయ్యారు. జెడ్డాలోని అల్‌ సలామ్‌  ప్యాలెస్‌లోని రాయల్‌ క్లినిక్‌ సల్మాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ బారినపడ్డట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయన యాంటీబయాటిక్స్‌తో చికిత్స పొందుతున్నారని, తొందరలోనే కోలుకుంటారని పేర్కొంది. 

ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌  అంటే..
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ అనేది వైరస్లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లేదా పరాన్నజీవులు, శ్వాసనాళాలు లేదా ఊపిరితిత్తుల కణజాలాలకు వాపు, హాని కలిగించే పరిస్థితి. ఈ పరిస్థితి కారణంగా ఒకటి లేదా రెండ ఊపిరితిత్తులు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ సంకేతాలు ఎంలా ఉంటాంటే..

లక్షణాలు..

దగ్గు..
ఎడతెరిపి లేని దగ్గు ఊపిరితిత్తుల సంక్రమణకు సంకేతం. అలాగే స్పష్టంగా పసుపు, ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉండే శ్లేష్మం, జ్వరం. సాధారణంగా అయితే అధిక జ్వరం కనిపిస్తుంది.

శ్వాస ఆడకపోవుట..
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా..ఊపిరితిత్తుల్లో వాపు, ద్రవం పేరుపోవడానికి కారణమవుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. 

ఛాతి నొప్పి..
ఊపిరితిత్తు ఇన్ఫెక్షన్‌లో కూడా ఛాతీలో తీవ్ర నొప్పి కలుగుతుంది. ప్రత్యేకించి లోతైన శ్వాస తీసుకున్నా..దగ్గు తీసుకున్నా..ఛాతీలో పదునైన కత్తిపోటులా నొప్పిగా  ఉంటుంది. 

అలసట..
విపరీతంగా అలసిపోయినట్లు ఉండొచ్చు. 

గురక
ఇరుకైన వాయుమార్గాల కారణంగా ఊపిరి పీల్చుకునేటప్పుడు పెద్దగా శబ్దం రాడం. ఇది శ్లేష్మంగా కారణంగా ఏర్పడే వాపు లేదా అడ్డంకికి సంకేతం.

వేగవంతమైన శ్వాస
శరీరం తక్కువ ఆక్సిజన్‌ స్థాయిలకు ప్రతిస్పందించినప్పుడూ జరుగుతుంది.

గందరగోళం..
ఇది ఎక్కువగా పెద్దవారిలో కనిపిస్తుంది.

ఆకలి నష్టం..
అనారోగ్యంతో పోరాడటానికి శరీరానికి తగినంత శక్తి అవసరం కానీ ఈ ఊపిరితిత్తు ఇన్ఫెక్షన్‌ ఆకలిని తగ్గించేస్తుంది.

వికారం వాంతులు..
కొంతమందిలో లేదా పిల్లలకు వికారం, వాంతులు, అతిసారం వంటివి వచ్చే అవకాశం ఉంటుంది.

ఎందువల్ల వస్తుందంటే..

బాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు..
స్ట్రెప్టోకోకస్‌ న్యుమోనియా, మైకోప్లాస్మా న్యుమోనియా వంటివి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు ప్రాథమిక కారణాలు. దీని కారణంగా ఊపిరితిత్తులలో వాపు, ద్రవం చేరడం వంటివి జరుగుతాయి.

వైరల్‌ ఇన్ఫెక్షన్లు..
సార్స్‌ కోవీ-2తో సహా ఇన్ఫ్లు ఎంజా వైరస్లు, కరోనా వైరస్‌లు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు దారితీయొచ్చు. ఈ అంటువ్యాధులు తరుచుగా దగ్గు లేదా తుమ్ముల నుంచి శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తాయి.  

ఫంగల్ ఇన్ఫెక్షన్లు
పర్యావరణంలో శిలీంధ్ర బీజాంశాలను పీల్చడం వల్ల ఈ ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తుల్లో తలెత్తుంది. 

బలహీన రోగ నిరోధక వ్యవస్థ..
హెచ్‌ఐవీ లేదా ఎయిడ్స్‌, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ,  కేన్సర్‌ చికిత్సలు లేదా అవయవ మార్పిడి వంటి పరిస్థితుల కారణంగా ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 

(చదవండి: మామిడి పండ్ల వినియోగంపై ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ హెచ్చరిక! కెమికల్‌ ఫ్రీ పండ్లను ఎలా గుర్తించాలంటే..)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement