న్యూయార్క్ : అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఫోన్‌ను సౌదీ రాజు హ్యాక్ చేసినట్టు గార్డియన్ పత్రిక వెల్లడించింది. 2018లో సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ నుంచి ఓ వాట్సాప్ మెసేజ్ రిసీవ్ చేసుకున్న అనంతరం జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ అయిందని పత్రిక పేర్కొంది. మహ్మద్ బిన్ సల్మాన్ వ్యక్తిగత వాట్సాప్ అకౌంట్ నుంచి వైరస్‌తో కూడిన వీడియో ఫైల్‌ను పంపడం ద్వారా 2018 నుంచి అమెజాన్ చీఫ్ ఫోన్‌కు సంబంధించిన డేటా చోరీకి గురైందని డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ పేర్కొందని గార్డియన్ కథనం వెల్లడించింది. జెఫ్ బెజోస్ ఫోన్ నుంచి ఎలాంటి డేటా చోరీకి గురైందనేది తెలియదని వ్యాఖ్యానించింది. జెఫ్ బెజోస్ ఆయన భార్య మెకంజీలు పాతికేళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతూ విడాకుల నిర్ణయాన్ని ప్రకటించిన ఏడాది తర్వాత ఈ కథనం వెల్లడవడం గమనార్హం.
మరోవైపు మాజీ టీవీ యాంకర్ లౌరెన్ సాంచెజ్‌తో జెఫ్ బెజోస్ వివాహేతర సంబంధంపై నేషనల ఎంక్వైరర్ బెజోస్ పంపిన టెక్స్ట్ మెసేజ్‌లను ఉటంకిస్తూ కథనాలు రాసిన క్రమంలో బెజోస్ ఫోన్ హ్యాక్ అయిన వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, ఎంక్వైరర్ జెఫ్ బెజోస్ ఎఫైర్‌ను బహిర్గతం చేయకముందే సౌదీ ప్రభుత్వం బెజోస్ ఫోన్ డేటాను సంగ్రహించిందని అమెజాన్ చీఫ్‌కు సెక్యూరిటీ కన్సల్టెంట్ గవిన్ బెకర్ అంచనా వేశారు. సౌదీతో ఎంక్వైరర్ వ్యాపార అనుబంధంతో పాటు సౌదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న విమర్శకుడి హత్యను బెజోస్‌కు చెందిన వాషింగ్టన్ పోస్ట్ విస్తృతంగా కవరేజ్ ఇచ్చిన క్రమంలో తాను ఈ అంచనాకు వచ్చానని గవిన్ బెకర్ పేర్కొన్నారు. 2018లో కాలమిస్ట్ జమల్ ఖషోగ్గి మరణానికి సౌదీ రాజుకు ప్రమేయమున్నసెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పాత్ర ఉందని వాషింగ్టన్ పోస్ట్ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment