అమెజాన్ ఆధ్వర్యంలోని బ్లూ ఆరిజిన్(Blue Origin) స్పేస్ సర్వీస్ కంపెనీ తన మొదటి రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. జెఫ్ బెజోస్(Jeff Bezos) నేతృత్వంలోని ఈ సంస్థ ‘న్యూ గ్లెన్’ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను జనవరి 8న ప్రయోగించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రయోగం ఫ్లోరిడాలోని కేప్ కనావరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నిర్వహిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ సంస్థ స్థాపించిన 25 ఏళ్లకు మొదటి రాకెట్‌ను లాంచ్ చేస్తుండడం విశేషం. ఇప్పటికే ఎలన్ మస్క్ ఆధ్వర్యంలోని స్పేస్‌ఎక్స్ ప్రైవేట్ స్పేస్ సంస్థ అంతరిక్ష ప్రయోగాల్లో ఆధిపత్యం చలాయిస్తోంది. ఈ నేపథ్యంలో దానికి పోటీగా అమెజాన్ ఈ ప్రయోగం చేయడం రెండు సంస్థల మధ్య పోటీని తెలియజేస్తుంది. త్వరలో ప్రయోగించబోయే రాకెట్ లాంచ్‌కు సంబంధించి ‘నెక్ట్స్ స్టాప్ లాంచ్’ అని తెలియజేస్తూ జెఫ్ బెజోస్ ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.
ఆరు గంటల ప్రయోగం
బ్లూ ఆరిజిన్ న్యూ గ్లెన్ రాకెట్(New Glenn rocket)ను లండన్‌లోని కేప్ కెనవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి లాంచ్ చేయనున్నట్లు ‘స్పేస్ ఫ్లైట్ నౌ’ తెలిపింది. 2024 డిసెంబర్ 27న రాకెట్ హాట్-ఫైర్ పరీక్ష పూర్తయినట్లు తెలిపింది. రాకెట్ పనితీరును, పేలోడ్లను మోసుకెళ్లే సామర్థ్యాన్ని పరీక్షించే ఈ ప్రయోగం సుమారు ఆరు గంటల పాటు ఉంటుందని భావిస్తున్నారు. న్యూ గ్లెన్ విజయవంతమైతే, బ్లూ ఆరిజిన్‌ను ప్రైవేట్ రంగ అంతరిక్ష రేసులో ముందంజలో ఉంచుతుందని కంపెనీ విశ్వసిస్తుంది.
ఇదీ చదవండి: 130 బిలియన్ డాలర్లకు దేశీ ఫార్మా
స్పేస్ఎక్స్‌కు ముప్పు?
స్పేస్ఎక్స్ ఇటీవల పునర్వినియోగ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. స్పేస్ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 2024లోనే 132 ప్రయోగాలు చేసి 99 శాతం సక్సెస్ రేట్ సాధించింది. ఈ కంపెనీకు చెందిన స్టార్ లింక్‌కు పోటీగా బ్లూ ఆరిజిన్ నిలుస్తుందా లేదా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉంది. స్పేస్‌ఎక్స్‌తోపాటు లూనార్ ల్యాండర్ తయారీ కంపెనీలు, ప్రైవేట్ స్పేస్ స్టేషన్లు వంటి పోటీదారులతో పోటీ పడటానికి అమెజాన్ ప్రయత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment