1994లో జెఫ్ బెజోస్ సీటెల్ గ్యారేజీలో స్థాపించిన ఒక చిన్న ఆన్‌లైన్ బుక్ స్టోర్ నేడు ట్రిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. ఆ సంస్థ పేరే 'అమెజాన్'. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగిన అమెజాన్.. సమావేశాల్లో ఎప్పుడూ ఓ కుర్చీ ఖాళీగానే ఉంటుంది. ఇంతకీ మీటింగులో ఖాళీ కుర్చీ ఎందుకు ఉంటుంది. దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
బిలినీయర్ జెఫ్ బెజోస్ నిర్వహించే ప్రతి సమావేశంలోనూ కనిపించే ఖాళీ కుర్చీ కస్టమర్లను గుర్తుకు తెస్తుంది. సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కస్టమర్లను దృష్టిలో ఉంచుకునే తీసుకోవడం జరుగుతుంది. కంపెనీ తన మొదటి ప్రాధాన్యతను కస్టమర్లకు ఇస్తున్నట్లు చెప్పడానికే అమెజాన్ కంపెనీ ఆ ఖాళీ కుర్చీని ఉంచుతుంది.
ఇక్కడ తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే.. అమెజాన్ కంపెనీ నిర్వహించే సమావేశాల్లో కేవలం ఆరు నుంచి ఎనిమిది మంది సభ్యులు మాత్రమే ఉంటారు. సమావేశంలో ఎక్కువమంది సభ్యులు ఉంటే సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి: 'రిటర్న్ టు ఆఫీస్.. ఇదో పెద్ద ప్లాన్': మాజీ ఉద్యోగి ఫైర్
దిగ్గజ కంపెనీలలో ఒకటిగా ఎదిగిన అమెజాన్ సంస్థలో నిర్వహించే సమావేశాలలో ఇప్పటికి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిషేధమే. సమావేశంలో పాల్గొనేవారు ఖచ్చితంగా తమ ప్రెజెంటేషన్లను పాయింట్ల రూపంలో లేదా మెమోల రూపంలో సమర్పించాల్సిందే. బహుశా ఇలాంటి విధానాన్ని పాటిస్తున్న పెద్ద కంపెనీ అమెజాన్ అనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment