'రిటర్న్ టు ఆఫీస్.. ఇదో పెద్ద ప్లాన్' | Amazon Ex Employee Slams Company Return To Office Policy | Sakshi
Sakshi News home page

'రిటర్న్ టు ఆఫీస్.. ఇదో పెద్ద ప్లాన్': మాజీ ఉద్యోగి ఫైర్

Published Thu, Sep 19 2024 2:48 PM | Last Updated on Thu, Sep 19 2024 3:13 PM

Amazon Ex Employee Slams Company  Return To Office Policy

దిగ్గజ కంపెనీలన్నీ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడానికి 'రిటర్న్-టు-ఆఫీస్'  విధానం చేపడుతున్నాయి. అమెజాన్ కూడా ఈ ఫార్ములానే అనుసరిస్తోంది. ఈ విధానం ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికే.. అంటూ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)లో పనిచేసిన మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 'జాన్ మెక్‌బ్రైడ్' పేర్కొన్నారు.

2023 జూన్ వరకు అమెజాన్ కంపెనీలో ఒక ఏడాది పనిచేసిన మెక్‌బ్రైడ్.. సీఈఓ ఆండీ జాస్సీ ప్రకటనపై స్పందించారు. అమెజాన్ వర్క్‌ఫోర్స్ తగ్గింపు ప్రణాళిక ఐదు దశలుగా ఉందని వివరించారు. మొదటి దశలో 30000 మంది ఉద్యోగులను తొలగించారు. రెండవ దశలో రిటర్న్-టు-ఆఫీస్ విధానం అమలు చేయడం జరిగింది.

రిటర్న్-టు-ఆఫీస్ విధానం అమలు చేసిన తరువాత కొందరు ఉద్యోగులు.. తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. నేను (జాన్ మెక్‌బ్రైడ్) ఆఫీసుకు వెళ్ళడానికి 20 నిమిషాల ప్రయాణం చేయాల్సి ఉంది. ఇది ఉద్యోగం వదిలిపెట్టడానికి కారణమయింది. నాలాగే కొందరు ఉద్యోగులను వదులుకున్నారని వెల్లడించారు.

ఇదీ చదవండి: ఒక్కరికి మాత్రమే ఈ కొత్త కారు.. ధర ఎంతంటే?

నాల్గవ, ఐదవ దశలో వర్క్ ఫ్రమ్ హోమ్ తరువాత ఆఫీసులకు వచ్చిన ఉద్యోగులకు అప్పటికే పెండింగులో ఉన్న చాలా పనులను అప్పగించారు. దీంతో పనిభారం ఎక్కువైంది. ఇది మరికొందరు ఉద్యోగాలను వదిలిపోయేలా చేసింది. మొత్తం మీద కంపెనీలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించి.. మళ్ళీ లాభాలబాట పట్టాలని సంస్థ చేస్తున్న చర్య అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement