ప్రపంచంలోని కుబేరుల జాబితాలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి, అమెజాన్ ఫౌండర్ 'జెఫ్ బెజోస్' గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే 241 బిలియన్ డాలర్ల సంపదకు నాయకుడైన ఈయన జీతం ఎంత ఉంటుందనేది బహుశా ఎవ్వరికీ తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.
జెఫ్ బెజోస్ సంపద భారీగా ఉన్నప్పటికీ.. కంపెనీలో అతని వార్షిక వేతనం 80000 డాలర్లు (సుమారు రూ.67 లక్షలు) మాత్రమే అని సమాచారం. 1998 నుంచి కూడా అతని బేసిక్ శాలరీలో ఎలాంటి మార్పు లేదని తెలిసింది.
నేను సంస్థ వ్యవస్థాపకుడిని, కాబట్టి ఇప్పటికే కంపెనీలో పెద్ద వాటా కలిగి ఉన్నాను. ఇలాంటి సమయంలో ఎక్కువ జీతం తీసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదని నిర్ణయించుకున్నాను, అందుకే తక్కువ జీతం తీసుకుంటున్నా అని బెజోస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
కంపెనీలోని వాటాల ద్వారానే మిలియన్ల సంపాదిస్తున్నారు. 2023 - 24 మధ్య.. సంవత్సరంలో గంటకు 8 మిలియన్లు సంపాదించినట్లు సమాచారం. కంపెనీ సీఈఓగా వైదొలగిన తరువాత.. బెజోస్ తన అమెజాన్ స్టాక్‌లోని చాలా భాగాన్ని క్రమంగా విక్రయించారు. 2025 చివరి నాటికి 25 మిలియన్ షేర్లను విక్రయించాలని యోచిస్తున్నట్లు ఫార్చ్యూన్ నుంచి వచ్చిన ఒక నివేదిక ద్వారా తెలిసింది.
కంపెనీ నుంచే తనకు భారీ లాభాలు వస్తున్న సమయంలో.. తనకు సంస్థ నుంచి అదనపు ప్రోత్సాహకాలు అవసరం లేదని, అలాంటివి అందకుండా చూడాలని అమెజాన్ కమిటీని కోరినట్లు సమాచారం. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎక్కువ జీతం తీసుకుంటే.. అసౌకర్యంగా ఉంటుందని బెజోస్ వివరించారు.
ఇదీ చదవండి: గుకేశ్ ప్రైజ్‌మనీలో చెల్లించాల్సిన ట్యాక్స్ ఎంతంటే?
నిజానికి బిలియనీర్లు తక్కువ జీతం తీసుకుంటే.. తక్కువ పన్నులు చెల్లించాలి. ప్రోపబ్లిక 2021 నివేదిక ప్రకారం, బెజోస్ 2007, 2011లో ఫెడరల్ ఆదాయపు పన్ను చెల్లించలేదు. ఎందుకంటే ఈయన తన జీతం కంటే ఎక్కువ నష్టాలను చూపించారు. కాబట్టి ఆ సంవత్సరాల్లో భారీ ట్యాక్స్ చెల్లించకుండానే బయటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment