అతి చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన డీ గుకేశ్‌కు దేశ ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్, టెక్ సీఈఓ సుందర్ పిచాయ్ శుభాకాంక్షలు తెలిపారు. 58 ఎత్తుల్లోప్రత్యర్థి ఆటకు చెక్ పెట్టిన గుకేశ్ ప్రైజ్ మనీ కింద సుమారు రూ.11 కోట్లు పొందనున్నారు. అయితే ఇందులో ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది? చివరగా చేతికి వచ్చేది ఎంత అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
వరల్డ్ చెస్ పెడరెషన్ (ఫిడే) ప్రకారం.. చెస్ ఛాంపియన్‌షిప్ మొత్తం ప్రైజ్ మనీ రూ.20.75 కోట్లు. ఒక గేమ్ గెలిచిన వారికి రూ.1.68 కోట్లు ఇస్తారు. ఇలా గుకేష్ మూడు గేమ్స్ గెలిచాడు. ఈ లెక్కన మొత్తం రూ.5.04 కోట్లు గుకేష్ సొంతమయ్యాయి. రెండు గేమ్స్ గెలిచిన డింగ్‌కు రూ. 3.36 కోట్లు దక్కాయి. అంటే మొత్తం ఛాంపియన్‌షిప్ ప్రైజ్ మనీతో ఇద్దరు ఆటగాళ్లు రూ.8.40 కోట్లు కైవసం చేసుకోగా.. మిగిలిన రూ.12.35 కోట్లను ఇద్దరికీ సమానంగా పంచుతారు. ఇలా గుకేశ్‌కు రూ.11 కోట్ల కంటే ఎక్కువ ప్రైజ్ మనీ అందుతుంది.
గుకేశ్‌కు వచ్చిన ప్రైజ్ మనీతో 30 శాతం లేదా రూ.4.67 కోట్లు ట్యాక్స్ కింద కట్ చేస్తారు. ఈ లెక్కన మొత్తం పన్నులు చెల్లించిన తరువాత గుకేష్ చేతికి అంతేది రూ.6.33 కోట్లు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గెలిచింది గుకేష్ కాదు, ఆర్ధిక శాఖ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
ఇది టీడీఎస్.. అంటే ట్యాక్స్ డిటెక్టెడ్ బై సీతారామన్ అని మరికొందరు చెబుతున్నారు. ఆట ఆడకుండానే.. ఆదాయపన్ను శాఖ గెలిచిందని ఇంకొకరు అన్నారు. ఆటగాళ్లపై విధించే ట్యాక్స్‌లను తగ్గించాలని చాలామంది నెటిజన్లు చెబుతున్నారు.
ఐపీఎల్ వేలంలో కూడా..
ఇటీవల జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా క్రికెటర్ 'రిషబ్ పంత్' ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్.. 27 కోట్ల రూపాయలకు పలికినప్పటికీ, పన్నులు వంటివి పోగా అతని చేతికి వచ్చే డబ్బు చాలా తగ్గుతుంది. పంత్ ఐపీఎల్ వేతనంలో కొంత శాతం ట్యాక్స్ రూపంలో పోతుంది. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.8.1 కోట్లు చేరుతుంది. అంటే పంత్ చేతికి వచ్చే డబ్బు రూ. 18.9 కోట్లన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment