వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధంపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఏదైనా జరగవచ్చు’ అంటూ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఇరాన్‌పై దాడులు చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా.. ఇరాన్‌తో యుద్ధానికి వెళ్లే అవకాశాల గురించి ప్రశ్నించగా.. ఏదైనా జరగవచ్చు.. కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రష్యాపై ఉక్రెయిన్ క్షిపణులతో విరుచుకుపడటం అత్యంత ప్రమాదకరమైన విషయంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై ఆసక్తి నెలకొంది. ట్రంప్ హయాంలో ఇరాన్‌పై దాడులు తప్పవని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని పలువురు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇరాన్‌ను పలుమార్లు హెచ్చరించారు. ట్రంప్ మొదటి టర్మ్‌లో 2020లో ఇరాన్‌పై వైమానిక దాడులకు ఆదేశించాడు. ఈ దాడుల్లో భాగంగా టాప్ మిలిటరీ కమాండర్ ఖాసీం సులేమానీని హతమార్చారు. 2015లో ఇరాన్‌తో బరాక్ ఒబామా కుదుర్చుకున్న అణు బప్పందాన్ని సైతం ట్రంప్ విరమించుకున్నారు. అదే సమయంలో ఇరాన్‌పై ట్రంప్ ఆర్థిక ఆంక్షలను సైతం విధించారు.
మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్‌ను ప్రఖ్యాత టైమ్ మేగజైన్ ఈ ఏటి మేటి వ్యక్తిగా గుర్తించింది. ఈ గౌరవం ఆయనకు దక్కడం ఇది రెండోసారి. 2016లోనూ ట్రంప్ ‘పర్సన్ ఆఫ్ ఇయర్’ అయ్యారు. ఈ క్రమంలో ‘2024 పర్సన్ ఆఫ్ ఇయర్ ట్రంప్’ అని టైమ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ శామ్ జాకోబ్ చెప్పారు. ఈ సందర్భంగా ట్రంప్ గురువారం ఉదయం న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ఓపెనింగ్ బెల్ మోగించారు.
Trump to Time Magazine on the possibility of war with Iran: “Anything is possible.” pic.twitter.com/LKHA7tJU0p
— Open Source Intel (@Osint613) December 12, 2024
Comments
Please login to add a commentAdd a comment