king salman
-
ఆస్పత్రిలో చేరిన సౌదీ రాజు
రియాద్: సౌదీ అరేబియా రాజు కింగ్ సల్మాన్ బిన్ అబ్దులజీజ్(84) ఆస్పత్రిలో చేరారు. పిత్తాశయం వాపుతో బాధపడుతున్న ఆయన రాజధాని రియాద్‌లోని ఆస్పత్రిలో చేరినట్లు స్థానిక వార్తా సంస్థ సోమవారం వెల్లడించింది. రాజు సల్మాన్ సుమారు రెండున్నర సంవత్సరాల పాటు డిప్యూటీ ప్రీమియర్‌గా బాధ్యతలు చేపట్టారు. 50 సంవత్సరాలకు పైగా రియాద్ ప్రాంతానికి గవర్నర్‌గా పని చేశారు. 2012లో యువరాజుగా, 2015లో సౌదీ రాజుగా రాజ్యాధికారం చేపట్టారు. అయితే 2016లో ఆయన కొడుకు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను యువరాజుగా ప్రకటించినప్పటి నుంచీ సౌదీకి వాస్తవ పరిపాలకుడు ఆయనేనని పరిగణిస్తున్నారు. మహమ్మద్ బిన్ సల్మాన్.. దేశంలో అనేక సంస్కరణలకు కారణమయ్యారు. అలాగే 2017లో సౌదీ రాజు కుటుంబాన్ని నిర్బంధించి వివాదాస్పద నాయకుడిగానూ ముద్ర వేసుకున్నారు. జర్నలిస్ట్ ఖషోగ్గీని హత్య చేయించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాగే సౌదీ అరేబియా రాజును గద్దె దింపేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై అధికారులు ముగ్గురు యువరాజులను అరెస్ట్ చేశారు. రాజు సల్మాన్ తమ్ముడు అహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, దగ్గరి బంధువు మహమ్మద్ బిన్ నయేఫ్లు ఇందులో ఉన్నట్లు అమెరికా మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. (మా నాన్న హంతకులను క్షమిస్తున్నాం: సలా) -
సౌదీ అరేబియా పర్యటనలో ప్రధాని మోదీ
-
ఉగ్రవాదాన్ని ఖండించాల్సిందే!
రియాధ్: ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందేనని భారత్, సౌదీ అరేబియాలు స్పష్టం చేశాయి. సోమవారం రాత్రి రియాధ్ చేరుకున్న మోదీ.. మంగళవారం సౌదీ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌తో పాటు ప్రభుత్వంలోని విద్యుత్, ఇంధన, కార్మిక, వ్యవసాయ, జల నిర్వహణ.. తదితర శాఖల మంత్రులతో సమావేశమై చర్చలు జరిపారు. సౌదీ రాజు సల్మాన్‌తో ప్రధాని మోదీ భేటీ అనంతరం ఆ వివరాలను భారత విదేశాంగ శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి టీఎస్ తిరుమూర్తి మీడియాకు వెల్లడించారు. ఆయిల్ అండ్ గ్యాస్, తీర ప్రాంత భద్రత, టెక్నాలజీ, వాణిజ్యం, పెట్టుబడులు తదితర రంగాల్లో సహకారంపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయని తెలిపారు. మోదీ పర్యటన సందర్భంగా.. ఆ రంగాలతో పాటు డ్రగ్స్ రవాణా నియంత్రణ, వైమానిక సేవల సంబంధ ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయన్నారు. రెండు దేశాలదీ ఒకే సమస్య ఉగ్రవాదంపై పోరు సహా భద్రతకు సంబంధించిన అంశాల్లో భారత్, సౌదీ అరేబియాల మధ్య సహకారం విజయవంతంగా ముందుకు సాగుతోందని స్థానిక పత్రిక ‘అరబ్ న్యూస్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పేర్కొన్నారు. పొరుగు దేశాల కారణంగా రెండు దేశాలు ఒకేరకమైన భద్రతాపరమైన సమస్యను ఎదుర్కొంటున్నాయన్నారు. ‘ఆసియా దేశాల్లో సౌదీ అరేబియా, భారత్‌లు తమ పొరుగు దేశాల నుంచి ఒకే రకమైన భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి’ అని మోదీ ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. వ్యూహాత్మక భాగస్వామ్య మండలికి సంబంధించి ఒప్పందం కుదరడంతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయన్నారు. సౌదీ అరేబియాతో ద్వైపాక్షిక సంబంధాలకు భారత్ అత్యంత ప్రాముఖ్యతనిస్తుందన్నారు. 2016లో తన పర్యటన సహా ఇరుదేశాల నేతల పర్యటనలతో బంధం మరింత దృఢమైందన్నారు. -
చమురు ఉత్పత్తి పెంచనున్న సౌదీ
వాషింగ్టన్: ఇరాన్‌పై ఆంక్షల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడకుండా సౌదీ అరేబియా ఉత్పత్తిని పెంచనుంది. ఈ దిశగా తను చేసిన విజ్ఞప్తిని సౌదీ అరేబియా రాజు సల్మాన్ అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇప్పుడే సౌదీ రాజు సల్మాన్‌తో మాట్లాడాను. పరిస్థితిని ఆయనకు వివరించాను. వెనిజులా, ఇరాన్లలో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా కొరతను తట్టుకునేలా ఉత్పత్తి పెంచాలని కోరాను. ఈ కొరత దాదాపు 20 లక్షల డాలర్లు ఉండొచ్చు. ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నా.. రాజు అంగీకారం తెలిపారు’ అని ట్రంప్ వెల్లడించారు. ఇటీవల.. చమురు ఉత్పత్తి ధరలు పెంచేందుకు ఒపెక్ దేశాలు నిర్ణయం తీసుకోవడంతోపాటు ఉత్పత్తిని పెంచాలని కూడా నిర్ణయించాయి. ఒపెకేతర దేశమైన రష్యా కూడా ఉత్పత్తిని పెంచేందుకు అంగీకరించింది. ‘ఒపెక్ దేశాల నిర్ణయంతో పెరగనున్న డిమాండ్‌కు సరైన ఉత్పత్తి ఉంటుందని భావిస్తున్నాం’ అని సౌదీ ఇంధన మంత్రి ఖలీద్ అల్ ఫలే పేర్కొన్నారు. -
సౌదీ రాజుగా బిన్ సల్మాన్‌కు పట్టాభిషేకం!?
రియద్ : వచ్చేవారంలో సౌదీ రాజుగా మహమ్మద్ బిన్ సల్మాన్‌ను పట్టాభిషేకం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సౌదీ రాజుగా వ్యవహరిస్తున్న కింగ్ సల్మాన్ పదవి నుంచి దిగిపోయి కుమారుడు, ప్రస్తుత యువరాజుగా వ్యవహరిస్తున్న మహమ్మద్ బిన్ సల్మాన్‌కు పట్టంకడుతున్నట్లు బ్రిటన్ న్యూస్ ఏజెన్సీలు ప్రకటించాయి. బ్రిటన్ న్యూస్ ఏజెన్సీల ప్రకారం.. వచ్చేవారంలో 81 ఏళ్ల కింగ్ సల్మాన్.. పదవి నుంచి దిగిపోయి కుమారుడికి సింహాసనాన్ని అప్పగించనున్నారు. అయితే సింహాసనాన్ని కుమారుడికి వదులుకున్నా.. ‘మసీదుల సంరక్షకుడు’ అనే హోదాతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలో రాజు మరణించాకే యువరాజుకు పట్టం కట్టే సంప్రదాయాన్ని కింగ్ సల్మాన్ పక్కనపెట్టారు. సౌదీ అరేబియాలో అధికారమార్పు గురించి కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌదీలో సుమారు 40 మంది రాజకుటుంబ సభ్యుల మూకుమ్మడి అరెస్ట్‌లు జరిగాయనే వాదన వినిపిస్తోంది. మమమ్మద్ బిన్ సల్మాన్ అధికారంలోకి వస్తే మధ్యప్రాచ్యంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోయే అవకాశముందని నిపుణుల అంచనా వేస్తున్నారు. మహమ్మద్ బిన్ సల్మాన్.. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌తో కలిసి పనిచేసే అవకాశముందని తెలుస్తోంది. కాబోయో సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలపడం విశేషం. -
సౌదీలో దుస్సాహసం
సౌదీ అరేబియా రాజు సల్మాన్ కుమారుడు, యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ దుస్సాహసానికి పూనుకున్నారు. ఏకకాలంలో ఇంటా, బయటా సమస్యలు సృష్టిస్తూ నిప్పుతో చెలగాటమాడుతున్నారు. నాలుగు రోజుల క్రితం తన బంధుగణంలో 11మంది యువరాజులనూ, నలుగురు మంత్రులనూ అవినీతి ఆరోపణల సాకుతో బంధించారు. రాజకుటుంబంతోనే సంబంధాలున్న మరికొందరు మాజీ మంత్రులను, వ్యాపారులను కూడా అరెస్టు చేశారు. ఇద్దరు యువరాజులు అను మానాస్పద స్థితిలో మరణించారు. వీరిలో ఒకరిని దుండగులు కాల్చిచంపారు. మరొకరు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇదంతా గమని స్తున్న మరో యువరాజు బతుకు జీవుడా అనుకుంటూ తన ప్రైవేటు విమానంలో ప్రత్యర్థి దేశమైన ఇరాన్‌కు పారిపోయి అక్కడ ఆశ్రయం పొందాడు. ఒకపక్క దేశంలో ఇలా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న యువరాజు సల్మాన్ పొరుగునున్న యెమెన్‌లో బాంబుల మోత మోగిస్తున్నాడు. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో మంగళవారం 50మంది మరణించారు. రియాద్ విమానాశ్రయం లక్ష్యంగా క్షిపణి దాడి జరగడంతో సౌదీ రెచ్చిపోయింది. దాదాపు రెండేళ్లనుంచి యెమెన్‌లో తిరుగుబాటుదార్లపై సౌదీ సంకీర్ణ దళాలు దాడులు చేస్తున్నా ఫలితం దక్కకపోగా 10,000మంది పౌరులు మరణించారు. 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అక్కడి పౌరులకు నిత్యావసర సరుకులు, ఔషధాలు అందకుండా సంకీర్ణ సేనలు అడ్డుకుంటున్నాయి. యెమెన్ తిరుగుబాటుదార్లకు ఇరాన్ మద్దతునిస్తున్నదని సౌదీ అరేబియా ఆరోపిస్తోంది. ఈ పరిణామాలు చాలవన్నట్టు సౌదీ పర్యటనకొచ్చిన లెబనాన్ ప్రధాని సాద్ హరిరి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు అక్కడినుంచే ప్రకటించారు. రాజీనామా వెనక సౌదీ హస్తమున్నదని, తమ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టడమే ఆ చర్య ఉద్దేశమని లెబనాన్ అధ్యక్షుడు ఆరోపిస్తున్నారు. లెబనాన్‌లో ఏడాది నుంచి ఎంతో విజయవంతంగా సాగుతున్న సంకీర్ణ ప్రభుత్వానికి హరిరి నేతృత్వంవహిస్తున్నారు. హరిరి ప్రాతి నిధ్యం వహిస్తున్న పార్టీకి సౌదీ అండదండలున్నాయి. అయితే ఆ ప్రభుత్వంలో ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లాతోసహా పలు పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. సౌదీ అరేబియాలోని అంతర్గత పరిణామాలనూ, ఇరుగుపొరుగుతో దాని ఘర్ష ణలనూ వేర్వేరుగా చూడలేం. అక్కడ ప్రజాస్వామ్యం మచ్చుకైనా లేదు. ఉన్నది దాయాది కుటుంబస్వామ్యమే. అయితే పాలనలో పాలుపంచుకుంటున్న కుటుం బసభ్యుల మధ్య సమన్వయాన్ని సాధించి, వారికి మత నాయకులను కూడా జోడించి ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకునే విధానాన్ని రూపొందించారు. కొన్ని దశాబ్దాలుగా అదే సాగుతోంది. ఇరాన్‌తో ఘర్షణలు తలెత్తకుండా, పశ్చి మాసియాలో అశాంతి చెలరేగకుండా ఇది తోడ్పడింది. కానీ 2015లో అధికారాన్ని చేజిక్కించుకున్న రాజు సల్మాన్ అబ్దుల్ అజీజ్ దీన్నంతటినీ తారుమారు చేసే ప్రయత్నాలు మొదలెట్టారు. తన కుమారుడు యువరాజు సల్మాన్‌ను ఆర్నెల్లక్రితం వారసుడిగా ప్రకటించి అప్పటికే అతని దగ్గరున్న రక్షణ శాఖకు తోడు ఆర్ధిక శాఖ కూడా కట్టబెట్టారు. ఆంతరంగిక భద్రతా వ్యవహారాలను చూస్తున్న సీనియర్ ఉప ప్రధాని మహమ్మద్ బిన్ నయీఫ్ అల్ సౌద్ను తప్పించారు. ఆయన ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నాడంటున్నారు. ఖతర్‌తో గత జూన్‌లో తెగదెంపులు చేసు కోవడాన్ని నయీఫ్ తీవ్రంగా వ్యతిరేకించడం వల్లే ఆయనకు ఉద్వాసన పలికినట్టు అప్పట్లోనే కథనాలు వెలువడ్డాయి. పశ్చిమాసియాలో ఇరాన్ కాక తామే తిరుగులేని శక్తిగా ఎదగాలన్నది రాజు అజీజ్, యువరాజ్ సల్మాన్ల స్వప్నం. అయితే ఇరాన్‌తో కయ్యానికి దిగితే ఫలితం దక్కకపోగా తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని రాజ కుటుంబంలోని ఇతరులు హెచ్చరిస్తున్నారు. ఏకాభిప్రాయ సాధనతోనే ముందడు గేయాల్సి ఉండటంతో అజీజ్, సల్మాన్‌లకు ఎటూ పాలుబోవడం లేదు. అందుకే అవినీతి ఆరోపణల సాకుతో అందరినీ అరెస్టు చేశారు. ఈ పరిణామాల నుంచి ప్రపంచం దృష్టి మళ్లించడం కోసం దేశంలో సంస్కరణలు తీసుకొస్తున్నట్టు, మహి ళలకు కొన్ని హక్కులు కల్పిస్తున్నట్టు చూపుతున్నారు. అజీజ్, సల్మాన్ల ఎత్తులన్నీ చిత్తవుతున్నాయి. జిహాదీలను ఉపయోగించి సిరి యాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను పదవీభ్రష్టుణ్ణి చేయాలని చూస్తే ఆయన కాస్తా మరింత బలపడ్డారు. యెమెన్‌ను లొంగదీసుకోవాలనుకుంటే అది తారు మారైంది. ఇరాన్ అండదండలు పుష్కలంగా ఉన్న హౌతీ తిరుగుబాటుదార్లు కొరకరాని కొయ్యలుగా మారారు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక సౌదీ రాజ కుటుంబంలో పొరపొచ్చాలు మరింత పెరిగాయి. అరెస్టయిన యువ రాజుల్లో ఒకడైన తలాల్ అల్ వలీద్ ఒకప్పుడు డోనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడు. 1,700 కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత. ట్రంప్ వ్యాపారాలకు ఆర్ధికంగా సాయపడిన తలాల్... ఆయన అధ్యక్ష పదవికి పోటీపడటాన్ని గట్టిగా వ్యతిరేకించాడు. సౌదీ వ్యవహారాల్లో జోక్యాన్ని ఖండించాడు. అందుకే ట్రంప్ వెనకుండి ఈ అవినీతి వ్యతిరేకపోరాటాన్ని మొదలెట్టించారు. ఈ పరిణామాలన్నిటి వెనకున్న ఆంతర్యం తేటతెల్లమే. ఇరాన్‌ను చక్రబంధంలో బిగించి ఇజ్రాయెల్ సాయంతో పశ్చిమాసియాలో సౌదీ ఆధిపత్యాన్ని నెలకొల్పడం... దాని ద్వారా తాను లాభపడటం అమెరికా ఉద్దేశం. అయితే అమెరికా గూఢచార సంస్థ సీఐఏ మాజీ సీనియర్ అధికారి చెప్పినట్టు ఇరాన్‌ను లొంగదీసుకోవడం అసాధ్యం. భద్ర తామండలి ద్వారా అమెరికా దశాబ్దాలుగా అమలు చేయించిన ఆర్ధిక ఆంక్షలను తట్టుకుని అది నిలబడింది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ అది తిరుగులేని ఆర్ధిక శక్తి. దాని జోలికెళ్తే సౌదీ మాత్రమే కాదు... అమెరికా, ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. పశ్చిమాసియా తీవ్ర సంక్షోభంలో పడుతుంది. ప్రపంచ దేశాలకూ నష్టం వాటిల్లుతుంది. అందుకే ఈ ప్రమాదకర పోకడలకు అమెరికా స్వస్తి పలకాలి. ఆ ప్రాంత దేశాలు కలిసికట్టుగా వాటి భవితవ్యాన్ని రూపొందించుకునే అవకాశా న్నివ్వాలి. -
సౌదీ యువరాజు అరెస్ట్
దుబాయి: యూట్యూబ్‌లో వైరల్ అయిన వీడియో సౌదీ యువరాజు అరెస్ట్‌కు దారి తీసింది. యువరాజు ఓ వ్యక్తిపై వేధింపులకు పాల్పడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో సౌదీ రాజు సల్మాన్ ఆదేశాల మేరకు యువరాజును అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వ టీవీ పేర్కొంది. అధికారులు వెంటనే ఆ యువరాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ వివాదానికి కారణమైన వీడియోలో.. యువరాజు ఓ వ్యక్తి కణత వద్ద తుపాకీ ఉంచి బెదిరిస్తున్నట్లు ఉంది. అంతేకాదు, తలకు తీవ్రగాయాలై రక్తమోడుతుండగా ఆ వ్యక్తి యువరాజును వేడుకుంటున్నట్లుగా ఉంది. ఆపక్కనే ఉన్న టేబుల్‌పై 18 విదేశీ మద్యం బాటిళ్లతోపాటు, పెద్ద మొత్తంలో కరెన్సీ ఉంది. ఈ వీడియో హల్చల్ చేయటంతో రాజు స్పందించారు. ప్రస్తుతం యువరాజును విచారిస్తున్నారు. సౌదీలో మద్యం విక్రయం, తాగటం నేరం. -
సౌదీ వారసుడు మారాడు
క్రౌన్ ప్రిన్స్‌గా బిన్ సల్మాన్ రియాద్: సౌదీ అరేబియా రాచరిక వారసత్వ పరంపరలో ఊహించని మార్పు చోటుచేసుకుంది. రాజు సల్మాన్ తన కొడుకు, డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్ అయిన మహ్మద్ బిన్ సల్మాన్(31)ను యువరాజు(క్రౌన్ ప్రిన్స్)గా నియమించారు. దీంతో తన తరువాత సింహాసనాన్ని చేపట్టే అవకాశాన్ని కొడుకుకు కల్పించినట్లయింది. ఇప్పటిదాకా యువరాజు స్థానంలో ఉన్న సోదరుడి కుమారుడు మహ్మద్ బిన్ నయేఫ్(51)ను తప్పించడంతో పాటు ఆయన్ని డిప్యూటీ ప్రధాని, అంతర్గత భద్రత మంత్రిగా కూడా తొలగించారు. యువరాజుగా ఎంపికైన మహ్మద్ బిన్ సల్మాన్ ఇప్పటికే రక్షణ శాఖ మంత్రిగా, ఆర్థిక మండలి అధిపతిగా వ్యవహరిస్తున్నారు. బిన్ సల్మాన్ పదవీచ్యుతుడైన సోదరుడు నయేఫ్ చేతిని ముద్దాడుతూ ఆయన ముందు మోకారిల్లడం టీవీ చానెళ్లలో కనిపించింది. బదులుగా నయేఫ్, యువరాజు భుజం తడుతూ శుభాకాంక్షలు చెప్పారు. ఇక తాను విశ్రాంతి తీసుకుంటానని నయేఫ్ అన్నారు. దీనికి బిన్ సల్మాన్ స్పందిస్తూ... ఆయన సలహాల్లేకుండా తానేం చేయలేనన్నారు. కాగా, బిన్ సల్మాన్ అమెరికాలో పర్యటించడం ట్రంప్ సౌదీలో తన తొలి విదేశీ పర్యటన జరపడానికి మార్గం సుగమం చేసిందని భావిస్తున్నారు. -
రూ. 2 వేల కోట్లు.. ఎడాపెడా పంచేశారు!
ఒకవైపు యూరోపియన్ దేశాలు డబ్బు లేక అల్లాడుతూ పొదుపు చర్యలు పాటిస్తుంటే.. సౌదీ అరేబియాలో మాత్రం అక్కడి కొత్త రాజుగారు తన ప్రజలకు డబ్బులు విరివిగా పంచిపెడుతున్నారు. ఓ చిన్న రాజాజ్ఞ వేసి.. వందల కోట్ల డాలర్లను సామాన్య ప్రజలకు ఇచ్చేస్తున్నారు. తమ రాజు సల్మాన్ ఔదార్యం చూసి సౌదీ అరేబియా ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ దేశంలో వాళ్లంతా ప్రస్తుతం పార్టీలు చేసుకుంటున్నారని రియాద్‌కు చెందిన వ్యాపారవేత్త జాన్ చెప్పారు. సౌదీ రాజు ఇలా ఇస్తున్న బహుమతుల విలువ దాదాపు 2 వేల కోట్ల రూపాయలు ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఆఫ్రికాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన నైజీరియా వార్షిక బడ్జెట్ కంటే కూడా సౌదీ అరేబియాలో ఇప్పుడు ఎక్కువ డబ్బు ఉంది. గత నెలలో సౌదీ అరేబియా రాజుగా సింహాసనం అధిష్ఠించిన సల్మాన్.. ప్రభుత్వ సంస్థలను రద్దుచేసేస్తున్నారు, మంత్రులను పీకి పారేస్తున్నారు. అయితే మరోవైపు ప్రజలకు మాత్రం విరివిగా డబ్బులు పంచిపెట్టేస్తున్నారు.